నా బ్లాగును గత పదేళ్ళ నుంచీ కరెక్ట్ గా ఫాలో అవుతుంటే మీకొక నైపుణ్యం ఇప్పటికి వచ్చేసి ఉంటుంది. అదేంటంటే - ఒక జాతకాన్ని మీరంతట మీరే చెప్పగలుగుతారు. ఒకరు పుట్టిన సమయం లేకున్నా సరే, జస్ట్ జననతేదీ ఉంటే చాలు, అతని జాతకాన్ని చాలావరకూ చదవవచ్చు అనేది మీరీ పాటికి నా పోస్టులను బట్టి గ్రహించే ఉంటారు. ఒకరి జననతేదీ మనకు తెలిస్తే చాలు అతని కేరెక్టర్ ఎలాంటిదో అతి తేలికగా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం ఇస్తున్నది ఆశారాం బాపూ జాతకం. ఈయన 17-4-1941 న పాకిస్తాన్లో పుట్టాడు. ఇతని జాతకంలోని గ్రహయోగాలను బట్టి ఇతను నిజంగా రేపులు చేసి ఉంటాడా లేదా నేను చెప్పనక్కరలేదు. మీరే చెప్పండి మరి !!
ఈ జాతకాన్ని అర్ధమయ్యేలా చేసే గ్రహయోగాలు ఇవీ !
లగ్నాన్ని లెక్కలోకి తీసుకోకండి. ఎందుకంటే జననసమయం తెలియదు గనుక.
సూర్యుడు, కుజుల ఉచ్చస్థితి.
బుధుడు నీచస్థితి.
నీచబుధునితో కలసి గురువును సూచిస్తున్న కేతువు.
నీచశనితో కలసి ఉన్న శుక్రుడు. పూర్తిగా అస్తంగతుడైన శుక్రుడు.
అక్కడే ఉన్న గురువు.
చంద్రుని నుంచి పంచమంలో రవి, బలహీనశుక్ర, నీచశని, గురువులు. లోతైన విశ్లేషణలోకి పోకుండా పైపైన గ్రహాల స్థితులు మాత్రం ఇచ్చాను. అర్ధం చేసుకుంటే ఇవి చాలు ! మరి అర్ధమైందా విషయం ?
బ్రహ్మజ్ఞాని అయినవాడు రేప్ చేసినా తప్పు లేదని వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ అన్నట్లు అతని కారు డ్రైవరూ, బాడీ గార్డూ మొదలైన డ్యూటీలు చేసిన ఒకతను కోర్టులో వాజ్మూలం ఇచ్చాడు. ఈ మొత్తం గోలలో నిజానిజాలేమిటో మనకు తెలియదు గాని, కోర్టు ఆశారాం బాపూను దోషిగా నిర్దారించినందువల్ల అది నిజమేనని భావిస్తూ కొన్ని మాటలు చెప్పదలచుకున్నాను.
ఈ మాటతో నేనూ ఏకీభవిస్తున్నాను. నిజమే ! బ్రహ్మజ్ఞాని అయినవాడు రేప్ చేసినా వాడికి ఏమీ పాపం అంటదు. అది తప్పు కాదు. భగవద్గీత కూడా ఇదే భావాన్ని 'చంపినా అతడు చంపనివాడే' అంటూ ఇంకో రకంగా చెప్పింది.
కానీ విషయం ఈ ఒక్క స్టేట్మెంట్ తో ఆగిపోదు. ఇది సగం మాత్రమె. ఇందులో ఇంకో సగం స్టేట్మెంట్ బాకీ ఉంది. అదేంటంటే, నిజంగా బ్రహ్మజ్ఞాని అయినవాడు, తనకు ఉరిశిక్ష పడినప్పుడు కూడా, తనను ఉరికంబం ఎక్కిస్తున్నపుడు కూడా, మెడకు ఉరి బిగిస్తున్నపుడు కూడా, చివరకు ఉరి తీస్తున్నపుడు కూడా మనస్సులో ఏ విధమైన చలనమూ లేకుండా అదే ప్రశాంతతతో అదే నిర్లిప్తతతో అదే నిబ్బరంతో ఉండగలిగితే - అప్పుడు మాత్రమె ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. తను ఇంకొకరిని చంపుతున్నపుడు మాత్రమె కాదు, తనను ఇంకొకరు చంపుతున్నపుడు కూడా అదే చిరునవ్వుతో అదే సమదృష్టితో అదే స్థిరచిత్తంతో ఉంటె, అదీ బ్రహ్మజ్ఞానం. అంతేకాని ఊరకే నాలుగు శ్లోకాలు బట్టీ పట్టి, టీవీల్లో ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన బ్రహ్మజ్ఞానం రాదు - రాబోదు.
రమణ మహర్షికి కేన్సర్ వచ్చింది. రామకృష్ణునికి కేన్సర్ వచ్చింది. వాళ్ళేమీ చలించలేదు. సుఖంలో ఎలా ఉన్నారో బాధలో కూడా అలాగే చెదరకుండా ఉన్నారు. రమణ మహర్షి చేతికి వచ్చిన కేన్సర్ పుండు ఒకరోజున పగిలి దానినుంచి భయంకరంగా రక్తం కారుతున్నది. దానిని చూచిన భక్తులు భరించలేక ' భగవాన్ ! ఏంటిది? ఇలా రక్తం కారుతోంది? మీరీ బాధను ఎలా భరిస్తున్నారు?' అని ఏడుస్తూ అడిగితే దానికి మహర్షి నవ్వుతూ - 'దానికేమి? నా దగ్గరికి మీరెలా వచ్చారో అదీ అలాగే వచ్చింది. ఉండనివ్వండి. చూడండి! చేతికి మాణిక్యాలూ కెంపులతో హారం పెట్టుకున్నట్లు ఎంత సుందరంగా ఎర్రగా ఉందో?' అన్నారట ! ఆ అడిగినవారికి బంగారం మీదా కెంపుల మీదా మోజు ఉండి ఉంటుంది. అందుకే మహర్షి అలా చమత్కరించారు. శ్రీరామకృష్ణులకు గొంతు కేన్సర్ వచ్చింది. ఆహారం తినలేకపొతున్నారు. ద్రవపదార్ధాలు కూడా మ్రింగలేకున్నారు. ఆహారం స్వీకరించి నెలరోజులైంది. చిక్కి ఎముకలగూడుగా మారిపోయారు. ఆ బాధ చూచి భరించలేక ఏడుస్తున్న భక్తులతో - "ఎందుకు ఏడుస్తున్నారు? ఈ ఒక్క నోటితో తినకపోతే ఏమైంది? మీ అందరి నోళ్ళతో తింటున్నాను కదా?' అని నవ్వుతూ అన్నారాయన! అసలేమిటా స్థితి!! మనబోటి మానవమాత్రుల ఊహకైనా అందుతుందా ఆ స్థితి? తన గుడారంలోకి చెప్పకుండా వచ్చాడని సదాశివబ్రహ్మేంద్ర సరస్వతీ స్వామి చేతిని నరికేశాడు ముస్లిం సేనాపతి. స్వామికి దేహస్ప్రుహ లేదు. నరికింది తనను కాదు అన్నట్లు నిర్లిప్తంగా చూచి రక్తం కారుతున్న సగం చేతితో అలా నడుచుకుంటూ శిబిరంలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆయన ! వారు నిజమైన బ్రహ్మజ్ఞానులు !! అంతేగాని ఏసీ ఆశ్రమాలలో ఉంటూ, రాజభోగాలు అనుభవిస్తూ, మాయ మాటలు చెబుతూ జనాన్ని మోసం చేస్తున్న నేటి దొంగగురువులు ఆ మాటకు ఏమాత్రం తగరు.
ఆశారాం బాపూ ఈ మాట అన్నది నిజమే అయితే, మరి కోర్టులో జడ్జి తీర్పు వెలువరిస్తున్నపుడు కన్నీటి పర్యంతమైపోయి, 'ఏదో ఒకటి చెయ్యండి. నన్ను బయటపడేయ్యండి ' అంటూ లాయర్లను ప్రాధేయపడవలసిన అవసరం లేదు. అక్కడే అతని డొల్లతనం బయట పడుతున్నది. బ్రహ్మజ్ఞాని అయినంత మాత్రాన అనైతిక ప్రవర్తన ఉండదు. నిజమైన బ్రహ్మజ్ఞాని నీతిగా ఉంటాడు. చెప్పినదే చేస్తాడు. చేసేదే చెబుతాడు. మాయమాటలూ, నాటకాలూ అతని వద్ద ఉండవు. శ్రీ రామకృష్ణులన్న మాట ఒకటి నాకు ఈ సందర్భంలో గుర్తుకు వస్తున్నది. 'సంగీతంలో ప్రజ్ఞ ఉన్నవాడు అపస్వరం పలకడు. నాట్యంలో ప్రజ్ఞ ఉన్నవాడు తప్పటడుగు వెయ్యడు' అన్నారాయన. ఎంత గొప్ప మాట !
ఆదిశంకరుల జీవితంలోనూ, త్రిలింగస్వామి జీవితంలోనూ జరిగిన ఒక సంఘటన ఉన్నది. వారు ఒకరోజున సారాయి త్రాగారని శిష్యులు కూడా సారాయి త్రాగడం మొదలు పెట్టారట. ఒకరోజున మరుగుతున్న సీసం తీసుకుని సారాయిని త్రాగినట్లే వారు త్రాగారట. అది చూచి శిష్యులు బిత్తరపోయి, ఆ పని చెయ్యలేక, బుద్ధి తెచ్చుకున్నారని ఒక కధ చెబుతారు.
బ్రహ్మజ్ఞానం అనేది సారాయి త్రాగినప్పుడు మాత్రమె కాదు, కరిగిన సీసాన్ని త్రాగినప్పుడు కూడా కనిపించాలి. అలాగే రేప్ చేసినప్పుడు మాత్రమె కాదు, తనకు ఉరి పడినప్పుడు కూడా అది కనిపించాలి. అప్పుడు ఒప్పుకోవచ్చు అది నిజమైన బ్రహ్మజ్ఞానమే అని.
సత్యమేమంటే - బ్రహ్మజ్ఞాని అయినవాడికి రేప్ చెయ్యాలన్న ఆలోచన అసలు రాదు. రేప్ సంగతి అలా ఉంచితే, ఒక అమ్మాయి ఇష్టపడి తనవద్దకు వచ్చినా అతనా పని చెయ్యడు గాక చెయ్యడు. ఎందుకని?
బ్రహ్మజ్ఞానికి ద్వంద్వం ఉండదు. తను తప్ప వేరొకటి అతనికి ఈ సృష్టిలో ఎక్కడా కనపడదు. ఎటు చూచినా తాను తప్ప వేరేది కనపడని వాడు ఇక అంత చండాలంగా ఎలా ప్రవర్తించగలడు? అది జరిగే పని కాదు.
"ప్రపంచ భోగాలంటే విరక్తి లేనివాడు, చెడు ప్రవర్తన కలిగినవాడు, శాంతి లేనివాడు, నిశ్చలమైన మనస్సు లేనివాడు - ఇలాంటి వాడు ఎన్నటికీ జ్ఞానాన్ని పొందలేడు". అని వేదమే చెబుతున్నది.
నేను వ్రాసిన 'శ్రీవిద్యారహస్యం' అనే పుస్తకంలో 'మాయ గురువులు- మాయను దాటించే గురువులు' అనే అధ్యాయంలో ఇదే పాయింట్ ఎన్నోచోట్ల వ్రాశాను. నేటి గురువులలో చాలామంది మాయగురువులే అని నొక్కి మరీ చెప్పాను. ఈ విషయం ప్రతిరోజూ రుజువౌతూనే ఉన్నది.
ఆశారాం బాపూకు ఇండియాలోనే 200 ఆశ్రమాలున్నాయట. వాటిని నమ్మి ఆయా ఊర్లలో ఎన్ని వేలమంది ఇతనికి మూర్ఖభక్తులుగా ఉన్నారో ఇప్పుడు వారి గతి ఏమిటో ఆ దేవునికే ఎరుక !!
కలియుగంలో మాయశిష్యులు ఎక్కువ అందుకే మాయ గురువులూ ఎక్కువే. 'మహిమలు చేసే దొంగ బాబాలనూ, మాయమాటలు చక్కగా చెప్పే దొంగ గురువులనూ నమ్మితే అధోగతే, నమ్మకండి!' అని నేను దాదాపు పదేళ్ళనుంచీ చెబుతున్నాను. ఇది సత్యం అని ప్రతిరోజూ రుజువౌతున్నది. రేప్ అనేది ఎవడు చేసినా తప్పే ! అందులోనూ ప్రపంచానికి ఆదర్శంగా ఉండాల్సిన గురువులు చేస్తే అది మామూలు తప్పు కాదు ! క్షమించరానంత ఘోరమైన తప్పు !!
ప్రపంచం మాయ అని వేదాంతం అంటుంది. నేటి ఆధ్యాత్మిక ప్రపంచం కూడా అంతకంటే పెద్దమాయ అని అనుభవం చెబుతున్నది. సత్యాన్వేషి అయినవాడు ఇలాంటి దొంగ స్వాముల, దొంగ గురువుల మాయలో పడరాదు. పడితే వాడి పని అధోగతే అన్నది అసలైన సత్యం !! ఊరకే మాటలు చెప్పినంత మాత్రాన బ్రహ్మజ్ఞానం వస్తుందా పిచ్చి కాకపోతే?
మొన్న 22 తేదీన ఒక పోస్ట్ వ్రాస్తూ ధనూరాశి సహజ నవమ స్థానంగా ధార్మిక సంస్థలకు. దేవాలయాలకు, గురువులకు సూచిక కాబట్టి అందులో శనికుజుల సంచారం వల్ల ఈ రంగాలకు దెబ్బలు తగులుతాయని వ్రాశాను. ఇది వ్రాసి మూడు రోజులు కూడా గడవక ముందే, వివాదాస్పద గురువు ఆశారాం బాపూ కు రేప్ కేసులో యావజ్జీవ జైలుశిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది. ఇది స్పష్టంగా శనికుజయోగం ఇచ్చిన తీర్పే.
రజనీష్
ఆశారాం బాపూ యొక్క వివాదాస్పద చరిత్రలోకి నేను పోదలచుకోలేదు. అది నాకనవసరం. గురువులపైన శనికుజుల ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రమే నేనిక్కడ మాట్లాడదలచుకున్నాను. శనీశ్వరుడు రాశిచక్రాన్ని చుట్టి రావడానికి 30 ఏళ్ళు పడుతుందనేది అందరికీ తెలిసినదే. శని కుజులు సరిగ్గా 30 ఏళ్ళ క్రితం ధనూరాశిలో ఇదే పరిస్థితిలో ఉన్నారు. సమాజం మీదా మనుషులమీదా గ్రహప్రభావం అనేది నిజమే అయితే, అప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉండాలి. అవేమిటో గమనిస్తే మనుషులపైన గ్రహప్రభావం ఎంత స్పష్టంగా ఉంటుందో అర్ధమౌతుంది. ప్రపంచం చేత ఎంతో గౌరవించబడే సోకాల్డ్ మహనీయులు కూడా గ్రహశక్తుల ముందు కీలుబోమ్మలేనన్నది స్పష్టం.
30 ఏళ్ళ క్రితం మార్చ్ - 1988 శనికుజులు ధనూరాశిలో
సరిగ్గా 30 ఏళ్ళ క్రితం 13-2-1988 నుంచి 28-3-1988 వరకూ శని కుజులు ధనూరాశిలో సంచరించారు. విచిత్రం !! ఇదే సమయంలో వివాదాస్పద గురువు ఓషో రజనీష్ జీవితంలో చివరి దశ జరిగింది. ఆయన 1990 జనవరిలొ చనిపోయాడు. విచిత్రంగా అప్పుడు కూడా ధనూరాశిలో శని కుజుల సంయోగం జరిగింది. నిజానికి 30 ఏళ్ళ క్రితం ఇదే సమయంలో పూనా ఓషో ఆశ్రమం అనేక లుకలుకలలో చిక్కుకుని ఉన్నది. అమెరికాలో ఆశ్రమం పెడదామని వెళ్ళిన ఆయన చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయి, అమెరికా ప్రభుత్వం చేత వెనక్కు పంపబడ్డాడు. 1985 లొ వెనక్కు వచ్చిన ఆయన అప్పటినుంచీ పూనా ఆశ్రమంలోనే ఉంటూ వచ్చాడు. కానీ 1988 ఇదే సమయంలో పూనా ఆశ్రమంలో అనేక రాజకీయాలు, శిష్యుల మధ్యన గొడవలు, అధికారం కోసం కుట్రలు జరిగాయి. రజనీష్ ఆరోగ్యం అప్పటికే బాగా క్షీణించింది. ఇంక కొద్ది నెలలలో ఆయన చనిపోతాడని తెలుసుకున్న శిష్యులు వేల కోట్ల రూపాయల ఆయన ఆస్తులకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో వారి మధ్యన ఎన్నో గొడవలు జరిగాయి. ఒక స్టేజిలో రజనీష్ ను పోలీసులు అరెస్ట్ చెయ్యబోయారు కూడా. ఇలాంటి గొడవలన్నీ సరిగ్గా 30 ఏళ్ళ క్రితం పూనాలో జరిగాయి. ఇవి కూడా స్పష్టంగా ధనూరాశిలో శనికుజుల ప్రభావమే.
అంతేకాదు. ఇంకా కొన్ని పోలికలున్నాయి. రజనీష్ ఆశ్రమంలో, ఇష్టపడిన వారి మధ్యన ఫ్రీ సెక్స్ అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉండేది. అంతేకాదు అక్కడ స్మగ్లింగ్, డ్రగ్స్ వంటి నేరాలు కూడా జరుగుతూ ఉండేవి. ప్రస్తుతం ఆశారాం బాపూ ఆశ్రమంలో జరిగినవి కూడాసెక్స్ నేరాలే. పూనా ఆశ్రమంలో రజనీష్ సన్నిహితులు ఇన్నర్ సర్కిల్ వారికి కూడా ఈ నేరాలతో సంబంధాలున్నాయి. ప్రస్తుతం కూడా ఆశారాం బాపూ కుమారుడు నారాయణ సాయి కూడా ఇంకో రేప్ కేసులో దోషిగా ఉన్నాడు. ఇంతకు ముందు కూడా ఇతని మీద ఇలాంటి ఆరోపణలున్నాయి. ఇంకా మిగిలిన కోణాలు దర్యాప్తులో బయటపడొచ్చు.
రజనీష్ ఆశ్రమం కూడా ఇండియాకు పశ్చిమ తీరంలోనే ఉంది. ఆశారాం బాపూ కూడా గుజరాత్ వాడే. పశ్చిమతీర రాష్ట్రాలలోనే ఆయనకు మంచి అనుచరగణం ఉన్నది. ఈ కోణం కూడా గమనించదగ్గదే. రజనీష్, ఆశారాం ఇద్దరూ కూడా గడ్డాలు పెంచుకుని దాదాపు ఒకలాగే కనిపిస్తారు. ఈ కోణాన్ని కూడా గమనించాలి.
జనవరి 1990 రజనీష్ మరణ సమయంలో శని కుజులు ధనూరాశిలో
కనుక గ్రహప్రభావం అనేది, అది జరిగిన ప్రతిసారీ దాదాపుగా ఒకే రకమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది అనేది స్పష్టం. కాకపోతే మారిన పరిస్థితుల దృష్టా వ్యక్తులు మారవచ్చు, ప్రాంతాలు మారవచ్చు, సంఘటనలు మారవచ్చు. కానీ ట్రెండ్ అనేది మాత్రం ఒకలాగే ఉంటుంది. హ్యూమన్ డ్రామా చాలా విచిత్రంగా అవే సన్నివేశాలతో రకరకాల చోట్ల రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న తర్వాత, మనుషుల మీద గ్రహప్రభావం ఏమాత్రమూ ఉండదని తెలివైనవాళ్ళు ఎవరైనా ఎలా అనగలరు?
మానవ జీవితం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో గ్రహచలనం కూడా అంతే సంక్లిష్టంగా ఉంటుంది. ఈ రెంటికీ సంబంధాలను గమనిస్తూ అర్ధం చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన విశ్వలీల మనకు అర్ధమౌతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సినీ పరిశ్రమలోనూ రాజకీయప్రపంచంలోనూ దుమారం పుట్టిస్తున్న 'కాస్టింగ్ కోచ్' వివాదంలో అసలు విషయం మరుగునపడిపోయి, ఎవరు ఎవర్ని దూషించారు? అలా ఎందుకు అనాలి? అనే విషయం తెరమీదకు తేబడింది. ఈ వివాదం దారిమళ్ళిన తుఫాన్ లాగా ఎటెటో పోతున్నది. రకరకాల శక్తులు రంగప్రవేశం చేసి దీనిని ఇష్టంవచ్చినట్లు మార్చేస్తున్నాయి. ఈ సందర్భంగా గ్రహప్రభావాన్నిమరొక్కసారి గమనిద్దాం.
20-4-2018 న శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించినప్పటికి రెండు రోజుల ముందే శనీశ్వరుడు వక్ర స్థితిలోకి వచ్చేశాడు. అంటే నాడీ జ్యోతిష్య సూత్రాల ప్రకారం ఆయన ప్రస్తుతం వృశ్చిక రాశిలోకి వచ్చినట్లు లెక్క. కనుక మళ్ళీ శని శుక్రులమధ్యన సమసప్తక స్థితి ఏర్పడింది. ఇది మంచి సూచన కాదు. పైగా శత్రుక్షేత్రం అయిన వృశ్చికంలో శనీశ్వరుడు శాంతిగా ఏమీ ఉండలేడు. కనుక ఈ సమాజంలో జరుగుతున్న లైంగిక నేరాలు ఆరోపణలు తగ్గకపోగా ఇంకా పెరుగుతాయని చెప్పాలి. పైగా, ఇంతకు ముందులేని కుట్రలు కుతంత్రాలు ఈ మొత్తం వ్యవహారంలో చోటుచేసుకుంటాయి.
అధికార సూచకుడైన సూర్యుడు ఉచ్చస్తితిలో ఉన్నందువల్ల ఉన్నతాధికారులకు రాజకీయ నాయకులకు కూడా ఈ విషయంలో పాత్ర ఉందని స్పష్టంగా తెలుస్తుంది. దీనికి వత్తాసుగా బుద్ధి కారకుడైన బుధుడు నీచస్థితిలో ఉండటం వల్ల, ఈ పరస్పర ఆరోపణలు చేసుకునేవారికి బుద్ది అనేది లోపిస్తుంది. వక్రబుద్ధితో రకరకాలైన నీచారోపణలు చేసుకోవడం ఇందుకే జరుగుతున్నది. ఇదంతా బుధుడు తన నీచస్థితిలోనుంచి బయటపడి రాశి మారేటంతవరకూ అంటే, ఇంకొక రెండు వారాలు కొనసాగుతుంది.
ఇకపోతే ధనూరాశిలో శనికుజుల కలయిక వల్ల దేవాలయాలకూ, ధార్మిక సంస్థలకూ గురువులకూ ప్రమాదాల ముప్పు పొంచి ఉందని తేలికగా అర్ధమౌతున్నది. ఎందుకంటే, ధనుస్సు సహజ నవమస్థానంగా దేవాలయాలకూ ధార్మిక సంస్థలకూ గురువులకూ సూచిక. నిన్న రాత్రి ఈ పోస్ట్ ప్రతిని తయారు చేస్తున్న సమయంలోనే అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో ఉన్న పరాశక్తి ఆలయంలో హోమం జరుగుతున్నపుడు అగ్నిప్రమాదం జరిగి దేవాలయాన్ని నాలుగురోజులపాటు మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. త్వరలో మన దేశంలో కూడా ఇలాంటి వార్తలు వినబోతున్నాం.
10-5-2018 న బుధుడు మేషరాశిలోకి మారేవరకూ మన రాష్ట్రంలోని సినిమా/ రాజకీయ రంగంలో ఈ కుట్రలు ఆరోపణలు తప్పవు. అలాగే 15-5-2018 న సూర్యుడు వృషభ రాశికి, శుక్రుడు మిధునరాశికి మారేవరకూ ప్రమాదాలు, సెక్స్ నేరాలు, ఆరోపణలు ఉంటూనే ఉంటాయి. యూ ట్యూబ్, ఫేస్ బుక్, ట్విటర్ లలో ఈ వినోదం కొనసాగుతూనే ఉంటుంది. గమనించండి.
చాలామంది ఈ లోకాన్ని విమర్శిస్తూ, లోకం పాడైపోయిందనీ చెత్తలోకమనీ అంటూ ఉంటారు. ఇది నాకు నచ్చదు. లోకం ఏం చేసింది? అది మంచిదే.
అయినా లోకం అంటే వాళ్ళ ఉద్దేశ్యంలో ఏమిటి? మనుషులనేగా ! లోకానికేమైనా శరీరం ఉందా? మనస్సు ఉందా? లేదుకదా ! లోకం అంటే పంచభూతాలు తప్ప ఇంకేముంది? అవి అమాయకాలు. వాటికి కుళ్ళూ కుత్సితమూ లేవు. అవి మంచివే. ఎన్నో కోట్ల సంవత్సరాలుగా అవి మనుషులను పోషిస్తూ వస్తున్నాయి. అవి ప్రకృతి శక్తులు. వాటిల్లో దోషం లేదు.
కనుక లోకం మంచిదే. ఆ లోకంలో ఉంటూ దాన్ని భ్రష్టు పట్టిస్తున్న మనుషులు చెడ్డవాళ్ళు. ఈ లోకంలో విచిత్రం ఏమంటే 'మేం చాలా మంచివాళ్ళం' అనుకుంటున్నవాళ్ళు కూడా చెడ్డవాళ్ళే. మన చుట్టూ పరికిస్తే ఇది తేలికగా అర్ధమౌతుంది. చెడ్డదారిలో పోతున్నవాళ్ళు కూడా తాము మంచిదారిలోనే ఉన్నామని అనుకుంటారు. అదే మాయ అంటే !
ప్రాధమికంగా మనిషి కూడా మంచివాడే. ప్రతిమనిషీ మంచివాడే. ఎందుకంటే అతనిలో ఉన్నది దైవం యొక్క అంశమే. కానీ అతను మాయకు లోబడ్డాడు. దిగజారిపోయాడు. లోకాన్ని కూడా దిగజారుస్తున్నాడు. ఈ పరిస్థితిని నుంచి బయట పడగలిగితే అతను మళ్ళీ తన దివ్యత్వపు మూలాలను అందుకోగలడు. అసలీ మాయ అంటే ఏమిటి?
స్వార్ధమే మాయ. పక్కవాడి నోరుకొట్టి తాను తినాలని అనుకోవడమే మాయ. దానికి మూలమైన భయమే మాయ. దాచుకోకపోతే రేపు ఏమౌతుందో అన్న ఆటవిక మనిషి యొక్క ప్రాధమిక భయం నుంచి తరతరాలకు సరిపడా దాచుకుందాం అన్న నేటి మానవుని దురాశ వరకూ అన్నీ ఈ మాయ యొక్క నీడలే. కొన్ని చిక్కటి నీడలైతే కొన్ని తేలికపాటి నీడలు. నా కుటుంబం అన్న పరిమిత స్వార్థం నుంచి నా కులం, నా వర్గం, నా ప్రాంతం, నా దేశం అన్న సూక్ష్మమైన, సమర్ధించుకోడానికి బాగుండే స్వార్ధాల వరకూ అన్నీ ఆ నీడలే. అంతే తేడా ! తనకొక న్యాయమూ ఇంకొకడికి వేరొక న్యాయమూ అని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో ఆ క్షణంలోనే అతను స్వార్ధానికి లోబడతాడు. ఆ క్షణంలోనే అతను దైవత్వానికి దూరమౌతాడు. అలా దూరమయ్యానని అతనికి తెలియనివ్వకుండా చేసేదే అహంకారం. అహంకారపు మాయలో చిక్కినవాడు తను చేస్తున్నది కరెక్టే అని అనుకుంటూ తన చర్యలను సమర్ధించుకుంటూ ఉంటాడు.
మనుషులు స్వార్ధానికి లోబడి బ్రతుకుతూ, తామేం చేసినా ఒప్పే అనుకుంటూ ఉంటారు. అదే పని ఎదుటివారు చేస్తే మాత్రం తప్పు అనుకుంటూ ఉంటారు. ఇక్కడే మానవజాతి మొత్తం తప్పటడుగు వేస్తున్నది. అయితే, ఈ తీరు ఒక్కనాటితో మారేది కాదు. అహంకారం, మదం, డబ్బు మీద మోజులు తలకెక్కిన మనుషులు అంత తేలికగా జ్ఞానులు చెప్పిన మాటలను వినరు. కనుక వారికి చెప్పాలని కూడా విజ్ఞులైనవారు ప్రయత్నించరాదు.
బుద్ధుడు బ్రతికున్న రోజులలో ఎందఱో రాజులున్నారు. బుద్ధుడూ క్షత్రియుడే. ఆ సాటి క్షత్రియరాజులు గానీ అప్పటి మనుషులు గానీ ఎందరు బుద్ధుని సరిగ్గా అర్ధం చేసుకున్నారు? ఆయన బోధలు ఎందఱో విన్నారు. కానీ సరిగా వాటిని అర్ధం చేసుకున్నది మాత్రం కొందరే. పైగా దానిని తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఎంతో నష్టపోయారు. బుద్ధుడు చెప్పినది అహింసా మార్గం కానేకాదు. ఆయనది జ్ఞానమార్గం. లోకం దానిని తప్పుగా అహింసామార్గం అని అర్ధం చేసుకున్నది. అలా లోకానికి ప్రచారం చేసింది కూడా ముందు తమకే అర్ధం కాని కొందరు లీడర్లే.
జైన మహావీరునిది అహింసా మార్గం. బుద్ధునిది జ్ఞానమార్గం. ఈ తేడా నేటికీ, అంటే బుద్ధుని తర్వాత 2500 వత్సరాలు గడచినా కూడా, ఇంకా చాలామందికి తెలియదు. లోకులు ఎంత అజ్ఞానంలో ఉన్నారో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. మహర్షులు బ్రతికున్న కాలంలో ఎందరు వారి మాటలు విన్నారు? ఎందరు వాటిని తలకెక్కించుకున్నారు? మహాభారత కాలంలో వ్యాసమహర్షి బ్రతికే ఉన్నాడు. విదురుడు బ్రతికే ఉన్నాడు. ఇంకా ఎందఱో విజ్ఞులూ, జ్ఞానులూ, మహర్షులూ బ్రతికే ఉన్నారు. కానీ వారి మాటలు ఎవరు విన్నారు? పాండవులు గానీ కౌరవులు గానీ వారి మాటలను వినలేదు. ఫలితంగా అనేక లక్షలమంది హతమైపోయిన భారత యుద్ధం జరిగింది. దానివల్ల ఎవరికీ శాంతి మాత్రం రాలేదు. ఎప్పుడైనా, ఏ కాలంలోనైనా కొద్దిమందికి మాత్రమే సత్యాన్ని అనుసరించగలిగే ధైర్యమూ, మానసిక సంసిద్ధతా ఉంటాయి. ఆ పనిని అందరూ చెయ్యలేరు. అలా చెయ్యలేకపోవదానికి కారణాలు - స్వార్ధం, అహంకారం. గర్వం, భయం మొదలైన గుణాలు. ఇవి వారి మనస్సులోనే ఉంటూ వారిని తప్పుదారిన నడిపిస్తూ అది మంచి దారేనని సరియైన దారేనని భ్రమింపజేస్తూ ఉంటాయి. వాటిమాట వింటున్నంత వరకూ అలాంటి వాళ్ళు జ్ఞానమార్గంలో, సత్యమార్గంలో, వెలుగుదారిలో నడవలేరు.
మరి జ్ఞానులైన వారు ఏం చెయ్యాలి? తమకు తెలిసినదానిని అందరికీ చెప్పాలా వద్దా?
చెప్పవచ్చు. కానీ అలా చెప్పినంత మాత్రాన దానిని అందరూ అర్ధం చేసుకోలేరు. శంకరుని బోధలూ, బుద్ధుని బోధలూ, నిన్నా మొన్నటి వివేకానందుని బోధలూ ఎలా వక్రీకరించబడ్డాయో, బడుతున్నాయో చూస్తె ఈ విషయం తేలికగా అర్ధమౌతుంది. ఈ లోకంలో ఏదైనా కరప్ట్ అయి పోతుంది. జ్ఞానుల బోధలు కూడా దీనికి మినహాయింపులు కావు. మరి జ్ఞానులైనవాళ్ళు ఏం చెయ్యాలి? ఉత్త బోధించడం చాలదు. లోకంలో ఉన్న ఇన్ని కోట్లమందిలో నుంచి తనవారెవరో వారు సెలక్ట్ చేసుకోవాలి. వారిని తమ దగ్గరకు తీసుకోవాలి. వారికి మాత్రమే తనకు అనుభవంలోకి వచ్చిన జ్ఞానాన్ని ప్రసారం చెయ్యాలి. వారికే అది అందుతుంది కూడా. అందరికీ అది అందదు. ఎందుకంటే దానిని అందుకునే అంతరికస్థితి ఆ బోధలను విన్న అందరిలోనూ ఉండదు. కనుక వినేవారు కోట్లలో ఉంటే, సరిగా అర్ధం చేసుకునేవారు వందల్లో ఉంటే, ఆచరించి అనుభవం లోకి తెచ్చుకునేవారు పదుల సంఖ్యలోనే ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటారు. ఇది ప్రకృతి నియమం. మొదటనుంచీ ఏ మహాపురుషుని జీవితం చూచినా ఇది సత్యం అని మనకు అర్ధమౌతుంది.
మంచి లోకంలో ఉంటూ, తమలోని విషంతో దాన్ని పాడు చేస్తూ, తమ జీవితాలను కూడా పాడు చేసుకుంటూ, అదే ఏదో విజయంగా భావిస్తూ విర్రవీగుతున్న చెత్తమనుషుల లోనుంచి తనవారిని గుర్తుపట్టి, వారికి తన అనుభవాన్ని అందించి వారిని కూడా తన స్థాయికి చేర్చడమే ఏ సద్గురువైనా చెయ్యగలిగిన పని. అతడు చేసే పని కూడా అదే.
ఈ పని చేసిన తర్వాత, ఆ గ్రూప్ వరకూ అందరూ ఈ లోకపు ఊబిలోనుంచి బయటపడి, చెత్త మనుషులతో నిండిన ఈ మంచిలోకానికి దూరంగా, వారిలోకానికి వారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళెవరికీ కన్పించరు. అంతిమ సత్యం ఇదే. ప్రాచీన కాలం నుంచీ ఇదే జరుగుతున్నది. ఇకముందు కూడా జరుగుతూనే ఉంటుంది ! ఈ లోకం మాత్రం, తాము చెత్త మనుషులమని కూడా గ్రహించలేనంత ఘోరమైన స్థితిలో ఉన్న మనుషులతో ఇలా కునారిల్లుతూనే ఎప్పటికీ ఉంటుంది.
మన సమయం వచ్చేవరకూ, మంచిలోకంలో ఉన్న చెత్త మనుషుల మధ్యన, మన ఆయుష్షు ఉన్నంతవరకూ మనం బ్రతకక తప్పదు మరి !
ధనూరాశిలో శనికుజుల యుతి మీద గతనెల 27 వ తేదీన ఒక పోస్ట్ వ్రాస్తూ నేను చెప్పిన సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో జరుగుతూ ఉండటం మీరందరూ చూస్తున్నారు కదా ! సరిగ్గా చెప్పాలంటే మార్చి 8 వ తేదీన కుజుడు ధనూరాశిలోకి ప్రవేశించి శనీశ్వరుడితో కలిశాడు. ఆ రోజునుంచీ యాక్సిడెంట్ల పర్వం మొదలైంది. మార్చి 21 న ఈక్వినాక్టియల్ డే నుంచీ మరీ ఎక్కువైంది. ఈ నలభై రోజులుగా నేను ఎన్నో వార్తలు విన్నాను. అంతర్జాతీయ స్థాయిలో గాని. జాతీయ స్థాయిలో గాని. సిటీలో గాని, మాకు తెలిసిన వారిలో గాని ఈ కాలంలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. వీటిలో, వందలాదిమంది సైనికులు చనిపోయిన విమాన ప్రమాదాలనుంచి, టూ వీలర్ ప్రమాదాలనుంచి. కార్లు ఆటోల ప్రమాదాల నుంచి, ఊరకే నడుస్తూ క్రింద పడి గిలక బెణికిన వారివరకూ, మోకాళ్ళు మోచేతులు ఎముకలకు దెబ్బలు తగిలినవారి వరకూ అన్ని రకాల కేసులూ ఉన్నాయి.
మార్చి 22 తేదీ రాత్రి స్వయంగా నాకూ యాక్సిడెంట్ అయింది. రాత్రి పదిగంటల సమయంలో నరసరావుపేట నుంచి గుంటూరుకు వస్తుండగా బైక్ యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం నాకు చాలా చెడుదశ జరుగుతున్నది. అందులో నా ప్రాణాలే పోవలసింది. ఎప్పుడో చేసిన పుణ్యం కాస్త మిగిలి ఉండబట్టి, ఇలాటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించి రెమెడీలు చేస్తూ ఉండబట్టి చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాను. కుడిమోకాలు ప్రాక్చర్ అయింది. లిగమెంట్స్ తెగిపోయాయి. నాలుగురోజులు ఆస్పత్రిలో ఉండి ప్రమాదం నుంచి బయటపడి కోలుకుంటూ ప్రస్తుతం ఇంకా బెడ్ రెస్ట్ దశలోనే ఉన్నాను. ఇంకా ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ లోనే ఉండాలి. పనీపాటా లేదని అనలేను. పని ఒక్కటే లేదు, పాటలున్నాయి, అందుకే బ్లాగులో ఈ పాటల వెల్లువ ! ఇదే సమయంలో మనకు ఖగోళంలో కనిపిస్తున్న ఇంకొక యోగం మీనరాశిలో శుక్రుని ఉచ్ఛ స్థితి, మరియు ఆ తర్వాత ఉచ్ఛ సూర్యునితో మేషరాశిలో ఆయన యుతి. ఇదంతా ఒకటి రెండు నెలలనుంచీ జరుగుతూ ఉన్నప్పటికీ, మార్చి 27 తేదీన శుక్రుడు మేషరాశిలోకి అడుగుపెట్టినప్పటినుంచీ కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. అవే - లైంగిక నేరాలు లేదా లుకలుకలు. ఈ యోగం వల్ల దాదాపు ప్రతిరోజూ కనిపిస్తున్న రేప్ కేసుల్లో జమ్మూలో జరిగిన ఆసిఫా రేప్ కేసు తలమానికం. అలాగే తెలుగు సినిమా రంగంలో 'కాస్టింగ్ కౌచ్' ఉందా లేదా అని యూట్యూబ్ లో రచ్చరచ్చగా జరుగుతున్న అనవసరమైన చర్చ కూడా ఇందులో భాగమే. చిలికి చిలికి గాలివాన అయినట్లుగా, ఇది సినిమా రంగంలోని ప్రముఖుల మెడలకూ, రాజకీయ నాయకుల మెడలకూ కూడా చుట్టుకుని ప్రెస్ మీట్లూ, యూట్యూబ్ వీడియోలతో, చాలా అసహ్యకరమైన గోలగా తయారైంది. ఎవరి వెనుక ఎవరున్నారో, ఎవరికి డబ్బులిచ్చి ఎవరు మాట్లాడిస్తున్నారో, ఎవరు ఎవర్ని ఎగదోస్తున్నారో తెలియనంతగా ఈ గోల జరుగుతున్నది. ప్రతిరోజూ వెల్లువెత్తుతున్న ఈ ఛండాలపు గోల చూడలేక అసలు యూట్యూబ్ ఓపన్ చెయ్యడమే ఎంతోమంది మానేశారు. మనుషులమీదా లోకంమీదా గ్రహప్రభావం ఖచ్చితంగా ఉంటుందనీ, జరిగే ఈవెంట్స్ ఆ గ్రహప్రభావం వల్లే ప్రేరేపించబడతాయనీ, జరుగుతాయనీ, వెలుగులోకి వస్తాయనీ ఇవన్నీ మళ్ళీ నిరూపిస్తున్నాయి.
Kahi dur jab din dhal jaye Saz ki dulhan badan chureye
Chup ke se aaye...
అంటూ ముకేష్ తన మధుర స్వరంలో ఆలపించిన ఈ గీతం 1971 లో వచ్చిన Anand అనే చిత్రంలోనిది. ఇది అప్పుడే కాక ఇప్పటికీ కూడా మరపురాని హిట్ గీతమే. సుమధుర సంగీత దర్శకుడు సలీల్ చౌధురీ ఈ పాటకు ఇచ్చిన రాగం చాలా మధురమైనది. సున్నిత హృదయులైన వారు ఈ లోకంలో ఇమడలేరు. ఎందుకంటే ఈ లోకం పైకి కనిపించేటంత తెల్లనిది కాదు. ఇది చాలా క్రూరమైనది. మనుషులు తనను అర్ధం చేసుకోలేనప్పుడు అలాంటి సున్నిత హృదయులు ఏం చేస్తారు? ప్రకృతితో మమేకమైపోయి, తమ గుండెను విప్పి దానితో చెప్పుకుంటారు. సేదదీరుతారు. ఈ గీతం కూడా అలాంటి సున్నిత భావాలను వెలిబుచ్చేదే.
నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.
Movie:--Anand (1971)
Lyrics:--Yogesh
Music:--Salil Chowdhury
Singer:-- Mukesh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
----------------------------------------
Kahin
dur jab din dhal jaye
Saaz
ki dulhan badan churaye chupke se aaye
Kahin
dur jab din dhal jaye
Saaz
ki dulhan badan churaye chupke se aaye
Mere
Khayalo ke aangan me – Koi sapno ke deep jalaye
Deep
jalaye
Kahin
dur jab din dhal jaye
Saaz
ki dulhan badan churaye chupke se aaye
Kabhi
yuhi jab huyi bojhal sase
Bhar
aayi baithe baithe Jab yuhi aankhe – 2
Tabhi
machal ke – Pyar se chalke
Chooye
koi mujhe par – Nazar na aaye - Nazar na aaye
Kahin
dur jab din dhal jaye
Saaz
ki dulhan badan churaye chupke se aaye
Kahin
toye dil kabhi Mil nahi paate
Kahise
nikal aaye Janmo ke naate – 2
Hai
meethi uljhan Bair apna man
Apna
hi hoke sahe Dard paraye - Dard paraye
Kahin
dur jab din dhal jaye
Saaz
ki dulhan badan churaye chupke se aaye
Dil
jaane mere sare Bhed ye gahere
Kho
gaye kaise mere sapne sunehere-2
Ye
mere sapne Yehi tohe apne
Mujhse
judana honge Inke ye saaye – Inke ye saaye
Kahin
dur jab din dhal jaye
Saaz
ki dulhan badan churaye chupke se aaye
Mere
Khayalo ke aangan me – Koi sapno ke deep jalaye
Deep
jalaye
Kahin
dur jab din dhal jaye
Saaz
ki dulhan badan churaye chupke se aaye
Meaning
Some where, at a distant place
When the day turns into night
The bride of twilight sneaks in silently
with a shy face In the courtyard of my thoughts some one has lit a lamp of dreams
Sometimes when my breath becomes heavy
for no reason at all
And when sitting for hours all alone
my eyes become full of tears
Some one madly walks over to me
and pats on my shoulder lovingly
but never becomes visible to me
Sometimes, our hearts could not come together
and sometimes, memories of past births
just spring up within
this is a sweet puzzle
and my mind becomes my own enemy
it is mine but bears the pain of others
My heart knows all my deeper problems
It clearly knows how all my golden dreams are shattered
all my dreams are nothing but yours
and these shadows will never leave me ever
Some where, at a distant place
When the day turns into night
The bride of twilight sneaks in silently
with a shy face
తెలుగు స్వేచ్చానువాదం
ఎక్కడో దూరాన, పగలు రాత్రిగా మారే సమయంలో
సంధ్యా సుందరి తన సిగ్గుమోముతో
నాకోసం నిశ్శబ్దంగా తరలి వస్తుంది నా ఆలోచనల ప్రాంగణంలో స్వప్నాల దీపాన్ని ఎవరో వెలిగించారు
అశేషాంధ్ర పాఠకుల విశేషాభిమానాన్ని సశేషంగా చూరగొన్న మా పుస్తకం 'శ్రీవిద్యా రహస్యం' మొదటి ముద్రణలో వేసిన పుస్తకాలన్నీ అయిపోవడంతో రెండవ ముద్రణకు ముందుగా, పుస్తకాన్ని మళ్ళీ ఒకసారి అవసరమైన మార్పులు చేర్పులు చేద్దామని భావించడం జరిగింది.
ఈ క్రమంలో భాగంగా, 'నాలుగు ఆచారములు' అన్న క్రొత్త అధ్యాయాన్ని పుస్తకానికి చేర్చాము. అందులో, శ్రీవిద్యోపాసనలోని నాలుగు ఆచారాలను దాదాపు ఏభై పద్యాలలో వివరించడం జరిగింది. అక్కడక్కడా పాతపద్యాలను మార్చడం, కొన్ని అధ్యాయాలలో అవసరమైన చోట్ల కొంత వివరణను పెంచడం జరిగింది. ఆయా అధ్యాయాల ముందుగా శ్రీ యంత్రంలోని నవావరణల చిత్రాలను చేర్చడం జరిగింది. ఈ మార్పులతో మా పుస్తకానికి ఒక పరిపూర్ణత వచ్చినట్లుగా భావిస్తూ రెండవ ముద్రణకు వెళ్ళబోతున్న సందర్భంగా, ముందుగా 'ఈ - బుక్' ను విడుదల చెయ్యడం జరిగింది.
పుస్తకం కావలసినవారు ఇంతకు ముందు మాదిరిగానే, google play booksనుంచి పొందవచ్చు.
ఈ పుస్తకాన్ని రివ్యూ చెయ్యడంలో విసుగు లేకుండా సహకరించిన నా అమెరికా శిష్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం ఇంగ్లీషు వెర్షన్ The Secret of Sri Vidya అనే పేరుతో అమెజాన్ లో కూడా లభ్యమౌతున్నది. అతి త్వరలో ఆ 'ఈ-బుక్' కూడా అప్ డేట్ చెయ్యబడుతుంది.
అంటూ కుమార్ సానూ, అనూరాధా పోద్వాల్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1990 లో వచ్చిన Aashiqui అనే చిత్రంలోనిది. ఇదొక ఎవర్ గ్రీన్ మధుర గీతం. నేను పాడి బ్లాగ్లో పోస్ట్ చేసిన పాటలలో ఇది మొదటి పాట. మళ్ళీ ఇప్పుడు రివైజ్ చేసి పాడాను. వినండి మరి.
Movie:-- Aashiqui (1990)
Lyrics:-- Sameer
Music:-- Nadeem Shravan
Singers:-- Kumar Sanu, Anuradha Podwal
Karaoke singer:-- Satya Narayana Sarma
Enjoy
---------------------------------------------- Tu meri zindagi hai - Tu meri har khushi hai Tuhi pyar tuhi chahat - Tuhi aashiqui hai Tu meri zindagi hai - Tu meri har khushi hai Pehli mohabbat ka ehsaas hai tu -2 Bujhte jo bujhna paaye Vo pyas hai tu Tuhi meri pehli khwahish - Tuhi aakhri hai Tu meri zindagi hai - Tu meri har khushi hai Har jakhm dilka - mere dilse dua de Khushiya tujhe gham sare - mujhko khuda de Tujhko bhulana paya - Meri bebasi hai Tu meri zindagi hai - Tu meri har khushi hai
నేనేం వ్రాసినా నా అనుభవాల నుంచీ నా చుట్టూ జరుగుతున్న విషయాల పరిశీలన నుంచీ వ్రాస్తూ ఉంటాను. అలాంటివి మాత్రమే మనస్సులో హత్తుకుపోతాయనీ ఎప్పటికైనా గుర్తుంటాయనేదీ నా నమ్మకం మాత్రమే కాదు వాస్తవం కూడా.
అలాంటి సంఘటనే ఈ మధ్యన ఒకటి జరిగింది.
మొన్నేదో పనిలో ఉండగా ఒక ఫోనొచ్చింది.
'హలో' అంటూ పలకరించింది ఒక స్త్రీ స్వరం.
'హలో' అన్నా.
'వచ్చే వారం మా ఇంట్లో సత్సంగం ఉంది. మీరు రావాలి.' అంది ఆ స్వరం.
బిజీ బ్రతుకుల పుణ్యమా అని ఈ మధ్యన ఫోన్ మానర్స్ కూడా ఎవరికీ ఉండటం లేదు. వాళ్ళు హలో అంటూనే వాళ్లెవరో మనకు తెలిసిపోతుందని అనుకుంటారో ఏమిటో అర్ధం కాదు. డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వచ్చేస్తూ ఉంటారు.
'ఏమ్మా! ముందు మీరెవరో చెప్పండి' అడిగా.
ఎంతమందికి చెప్పమంటారు? అన్న విసుగు ఆమె గొంతులో ధ్వనించింది.
'నేను పలానా. ఇక్కడ పలానా కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటాను.' అంది.
'నేను శారదా మఠ్ డివోటీని. వచ్చే ఆదివారం మా ఇంట్లో సత్సంగం పెడుతున్నాం. మీరూ మీ శ్రీమతీ రావాలి.' అందామె.
అలా అనడమే గాక, ఆ సత్సంగం షెడ్యూల్ ఎలా ఉంటుందో వివరంగా చెప్పడం మొదలుపెట్టింది.
అదంతా ఓపికగా విని ఆమెతో ఇలా చెప్పాను.
'చూడమ్మా నాదొక సందేహం. సత్సంగం వారానికి ఒకరోజు చేస్తే సరిపోతుందా?'
నేనడిగింది ఆమెకు అర్ధం కాలేదు.
'ఒక్కొక్క వారం ఒక్కొక్కరి ఇంట్లో పెడుతున్నాం అండి.' అందామె.
'మీరు వారానికి ఒకరోజే భోజనం చేస్తున్నారా లేక రోజూ చేస్తున్నారా?' అడిగాను.
అవతలవైపు నుంచి కాసేపు మౌనం.
'అదేంటండి అలా అంటారు?' అడిగింది కాసేపటి తర్వాత.
ఇక ముసుగులో గుద్దులాట ఎందుకని ఆమెతో డైరెక్ట్ గా ఇలా చెప్పాను.
'చూడమ్మా. నేను రాలేను. ఎందుకంటే ఇలాంటి సత్సంగాల మీద నాకు నమ్మకం లేదు.'
'అదేంటండి మీరు రామకృష్ణా డివోటీనే కదా.' అందామె.
'అవునమ్మా. కానీ నా సంబంధం సరాసరి రామకృష్ణునితోనే గాని ఆయన సంస్థలతో కాదు. ఆ సంస్థలన్నీ నేను చిన్నప్పుడే బాగా తిరిగాను. ఇప్పుడు నాకు వాటిమీద ఏమీ ఇంటరెస్ట్ లేదు. వాటిల్లో ఆయన నాకు కనపడలేదు. సారీ. నేను మీ సత్సంగానికి రాలేను. మీకింకా వివరంగా కావాలంటే నేను వ్రాసిన పుస్తకాలు చదవండి. నా భావజాలం బాగా అర్ధమౌతుంది. దయచేసి ఇలాంటి ఆహ్వానాలతో నాకు మళ్ళీ ఫోన్ చెయ్యకండి' అని చెప్పాను.
అంతసేపు మాట్లాడి కనీసం 'థాంక్స్' కూడా చెప్పకుండా ఫోన్ కట్ చేసింది ఆమె. ముందే చెప్పాగా కనీసం ఫోన్ మానర్స్ కూడా జనం మర్చిపోతున్నారని.
ఇలాంటి సత్సంగాలలో నేను చాలా చిన్నప్పుడే, అంటే నాకు ఇరవై ఏళ్ళ లోపే చాలా తిరిగాను. వాటిలో ఏమీ లేదనీ ఏమీ దొరకదనీ నేను స్పష్టంగా చెప్పగలను. ఇలాంటి సత్సంగాలూ పూజలూ, ఇంకా ఇంకా మనల్ని భ్రమల్లో ముంచేవేగాని తేల్చేవి కావు.
వీటిని నిర్వహించే వారిలో చాలామందిలో 'ఐడెంటిటీ క్రైసిస్' ఉంటుంది. అదే వీళ్ళచేత ఇలాంటి మీటింగులు పెట్టిస్తూ ఉంటుంది. చివరకు వీరంతా కరుడుగట్టిన చాదస్తపు భక్తులుగా రూపాంతరం చెందుతూ మిగతావారిని కూడా అలాగే మార్చాలని ప్రయత్నిస్తూ మిగిలిపోతారుగాని ఆధ్యాత్మికంగా అంగుళం కూడా ఎదగలేరు. ఇలాంటి వారిలో సాయిబాబా భక్తులూ, ఇంకా చాలామంది సోకాల్డ్ మహనీయుల భక్తులూ ఉంటారు. ఈ సత్సంగాలూ పూజల వరకే గాని, వారివారి జీవితాలలో ఉన్నతమైన మార్పులు ఎక్కడా కన్పించవు. ఇంకా చెప్పాలంటే, మామూలు మనుషులకంటే ఇంకా దరిద్రంగా వీరి ప్రవర్తనలుంటూ ఉంటాయి. ఇలాంటి వారిని నా జీవితంలో నేను చాలామందిని చూచాను. అందుకే ఈ సత్సంగాలన్నా, సామూహిక భజనలన్నా, పార్టు టైం దీక్షలన్నా, గురుపూజా మహోత్సవాలన్నా నాకు పరమ చీదర. దానికి కారణం ఒక్కటే ! ఇలాంటి వారిని కొన్ని వందలమందిని నేనింతవరకూ చూచాను. కానీ వారిలో ఒక్కరిలో కూడా నిజమైన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని నేను ఇంతవరకూ చూడలేదు. ఇలాంటి సత్సంగాలతో సంబంధం లేని మామూలు మనుషులలో ఆ ఔన్నత్యాన్ని అనేకసార్లు చూచాను. అందుకే ఈ పూజలకూ నిజమైన ఆధ్యాత్మికతకూ ఎలాంటి సంబంధమూ లేదని నేను విశ్వసిస్తాను.
ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మగారి భక్తులు కూడా ఒకరు నాతో ఇలా అన్నారు.
'మీరు గుంటూరు లోనే ఉంటారు కదా! ప్రతివారం ఒకరోజున ఒక్కొక్క భక్తుని ఇంట్లో మేం కలుస్తున్నాం. అక్కడ అమ్మ పూజ జరుగుతుంది. మీరూ రండి. వచ్చేటప్పుడు కొబ్బరికాయా పూలూ తెచ్చుకోండి. మీరు కూడా పూజ చేసుకోవచ్చు'.
పిచ్చోడిలా చూశాను ఆ వ్యక్తి వైపు.
'నేను జిల్లెల్లమూడి వెళ్ళినప్పుడే ఏ కొబ్బరికాయలూ పూలూ తీసికెళ్ళను. ఇక ఈ సత్సంగానికి ఎలా తెస్తానని మీరనుకుంటున్నారు? నా పూజా విధానం మీకర్ధం కాదులే. మీరు పిలిచినందుకు థాంక్స్. కానీ నేను రాను. ఇలాంటి పూజల మీద నాకు నమ్మకం లేదు.' అని సూటిగా చెప్పాను.
ఆ వ్యక్తి మళ్ళీ మాట్లాడలేదు.
ఇలాంటి వ్యక్తులు చాలామంది, తామేం చేస్తున్నారో తమకే తెలియని వారు, మనకు తరచుగా తారసపడుతూ ఉంటారు. వీరిని చూచి జాలిపడటం తప్ప ఇంకేం చెయ్యలేం ప్రస్తుతానికి !
వారానికి ఒకరోజు సత్సంగం జరిగితే మిగతా ఆర్రోజుల జీవితమూ దుష్టసంగం అని అర్ధమేగా మరి !! అయినా వీళ్ళ పిచ్చి కాకపోతే, సత్యానికి సత్సంగం అవసరమా ??
అంటూ జగ్జీత్ సింగ్ తన సుమధుర మంద్ర స్వరంతో పాడిన ఈ పాట 1982 లో వచ్చిన Saath Saaath అనే చిత్రంలోనిది. ఇది ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్న మధురగీతాలలో ఒకటి. నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి !
Movie:-- Saath Saath (1982)
Lyrics:-- Javed Akhtar
Music:-- Kuldeep Singh
Singer:-- Jagjit Singh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------
Humming
Tum
ko dekha to ye khayal aaya
Zindagi
dhoop tum ghana saya
Tum
ko dekha to ye khayal aaya - 2
Zindagi
dhoop tum ghana saya
Tum
ko dekha to ye khayal aaya
Aaz
phir dilne ik tamanna ki-2
Aaz
phir dilko hamne samjhaya-2
Zindagi
dhoop tum ghana saya
Tum
ko dekha to ye khayal aaya
Tum
chale jaoge tho sochenge-2
Hum
ne kya khoya humne kya paya-2
Zindagi
dhoop tum ghana saya
Tum
ko dekha to ye khayal aaya
Hum
jise gunguna nahi sakte - 2
Waqt
ne aisa geet kyu gaaya - 2
Zindagi
dhoop tum ghana saya
Tum
ko dekha to ye khayal aaya – 2
Humming
Meaning
When I saw you , this thought came to me
The world is strong heat
and you are my cool shade
Today again my heart wished for something
Today again I pacified it
telling it that the world is strong heat
and you are my cool shade
When you leave me then I might think
What I have lost and what I have gained
Perhaps only then I will understand that the world is strong heat