అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః
ఇతరములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇతరములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, డిసెంబర్ 2024, సోమవారం

హైద్రాబాద్ బుక్ ఫెయిర్ (పుస్తక ప్రదర్శన) - 2024 లో పంచవటి స్టాల్

హైదరాబాద్ బుక్ ఫెయిర్ - 2024 వచ్చేసింది.

డిసెంబర్ 19 నుండి 29 వరకూ 11 రోజులపాటు జరుగబోతున్న ఈ పుస్తక ప్రదర్శన, హైద్రాబాద్ లోని NTR స్టేడియంలో జరుగుతుంది. దీనిలో పంచవటి బుక్ స్టాల్ కు స్టాల్ నంబర్ - 145 కేటాయించబడింది. అక్కడ పంచవటి ప్రచురణల పుస్తకాలన్నీ మీకు లభిస్తాయి.

మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకూ పుస్తకప్రదర్శన ఉంటుంది.

నా రచనలను అభిమానించేవారు మీకు కావలసిన పుస్తకాలను మా స్టాల్ నుండి కొనుగోలు చేయవచ్చు.  అంతేగాక, పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ గురించి, మా యోగాశ్రమం గురించి, మా సాధనామార్గం గురించి మీకున్న సందేహాలను మా సభ్యులతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు.

గతంలో ఉన్న ప్రింట్ పుస్తకాలకు తోడుగా, ఎంతోమంది అడుగుతున్న ఈ క్రొత్త పుస్తకాలు ఇప్పుడు ప్రింట్ చేయబడ్డాయి. స్టాల్ లో మీకు లభిస్తాయి.

1. ఆరు యోగోపనిషత్తులు

2. వెలుగు దారులు (మూడు భాగాలు)

3. మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు (రెండు భాగాలు)

4. గోరక్ష సంహిత

5. శ్రీరామ గీత

6. ముక్తికోపనిషత్తు

7. గాయత్రీ రహస్యోపనిషత్తు

8. పతంజలి యోగసూత్రములు

9. మధుశాల

10. భారతీయ జ్యోతిష సంఖ్యాశాస్త్రము

పుస్తకాభిమానులు, నా రచనల అభిమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " హైద్రాబాద్ బుక్ ఫెయిర్ (పుస్తక ప్రదర్శన) - 2024 లో పంచవటి స్టాల్ "

9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో మా స్టాల్ ప్రారంభం

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో మా స్టాల్ (నం. 67) ప్రారంభం అయింది.

సందర్శించండి



read more " హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో మా స్టాల్ ప్రారంభం "

8, ఫిబ్రవరి 2024, గురువారం

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్ ను సందర్శించండి



హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ - 2024, ఈ నెల 9 నుంచి 19 వరకూ జరుగుతున్నది. దానిలో పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ కు స్టాల్ నంబర్ 67 కేటాయించబడింది. ఈ రోజు స్టాల్ ను సెటప్  చేయడం జరిగింది. పుస్తకాలు రేపటినుండి పెట్టబడతాయి. మా పుస్తకాలు కావలసినవారు ఈ స్టాల్ ను సందర్శించండి.

అక్కడ పంచవటి ఫౌండేషన్ సెక్రటరీ శ్రీరామమూర్తిని, ఇతర సభ్యులను మీరు కలుసుకోవచ్చు. సనాతన ధర్మం పైన, ఆధ్యాత్మిక ప్రయాణం పైన, మా సాధనా మార్గం పైన, మీమీ సందేహాలను వారితో మాట్లాడి తీర్చుకోవచ్చు. పంచవటిలో సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. మాతో కలసి ప్రయాణం చేయవచ్చు.

హైదరాబాద్ లో ఉన్నవారు, మమ్మల్ని కలవాలని ఎంతోకాలంగా అనుకుంటున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
read more " హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్ ను సందర్శించండి "

18, డిసెంబర్ 2023, సోమవారం

ఆశ్రమం ప్రారంభోత్సవ వీడియోలు

'పంచవటి యోగాశ్రమం' ప్రారంభోత్సవ వీడియోలను మా యూ ట్యూబ్ ఛానల్లో ఇక్కడ చూడండి

https://youtu.be/Y1wEuYu4SOc

https://youtu.be/fzfEJCy1zlY


read more " ఆశ్రమం ప్రారంభోత్సవ వీడియోలు "

30, నవంబర్ 2023, గురువారం

మా షష్టిపూర్తి పండుగ

ఆశ్రమ  ప్రారంభోత్సవ కార్యక్రమాలలో భాగంగా, శిష్యులందరి సమక్షంలో, మా షష్టిపూర్తి పండుగ కూడా జరిగింది.  ఇది ఆశ్రమంలో జరిగిన మొదటి వేడుక. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, తెలుగు పండితురాలు, ఉపాధ్యాయిని, శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి సమర్పించిన కవితాహారం.







read more " మా షష్టిపూర్తి పండుగ "

12, జనవరి 2023, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 83 (అమెరికాలో కూడా ముసలం మొదలైంది)

అమెరికాలో షరియా మొదలైంది.

డెట్రాయిట్ దగ్గరలో హాంట్రామిక్ అనే ఒక సిటీ ఉంటుంది. ఇది డెట్రాయిట్ మెట్రో పరిధిలోకే వస్తుంది. కొన్నేళ్ల క్రితం వరకూ ఇక్కడ మొత్తం పోలిష్ జాతీయులు మాత్రమే ఉండేవారు. సెప్టెంబర్ 19, 1987 న ఈ సిటీకి పోప్ జాన్ పాల్ II కూడా వచ్చాడు. అంతగా క్రైస్తవుల ప్రాబల్యం ఉన్న సిటీ ఇది.

కానీ ఇప్పుడు, అంటే నిన్నటికి నిన్న, ఈ సిటీ కౌన్సిల్ లో ఒక కొత్త చట్టం పాస్ అయింది. అదేంటంటే, ఈద్ పండుగ సందర్భంగా ఎవరి ఇళ్లలో గాని, లేదా బ్యాక్ యార్డ్ లో గాని, గొర్రెలను, మేకలను చంపి వండుకొని తినవచ్చు. అనేదే ఈ చట్టం. దీనిని కౌన్సిల్ సభ్యులు మెజారిటీ ఓట్లతో ఆమోదించారు. కారణం? ప్రస్తుతం ఈ సిటీలో పోలిష్ జాతీయులు  చాలా తక్కువమంది ఉన్నారు.  ముస్లిం జనాభా ఏమో 62 శాతం అయి కూచుంది. ఆఫ్కోర్స్ ఇది కొన్నేళ్ల క్రితం పరిస్థితి, ఇప్పుడెంతో తెలీదు. ఇంకా పెరిగి ఉంటుంది. 

ప్రస్తుతం హాంట్రామిక్ అనే ఈ సిటీ, అమెరికా మొత్తం మీద ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నెంబర్ వన్ సిటీ అయి కూచుంది. ప్రస్తుతం ఈ సిటీ మేయర్ ఒక ముస్లిమ్. కౌన్సిల్ సభ్యులందరూ కూడా ముస్లిములే. కనుక ఈ విధమైన చట్టాన్ని వాళ్ళు పాస్ చేసుకున్నారు. పాపం అమెరికా రాజ్యాంగాన్ని వాళ్ళేమీ ధిక్కరించలేదు. సిటీ కౌన్సిల్ అధికారాలను ఉపయోగించుకుని, వాళ్ళ మెజారిటీ ప్రకారం, రాజ్యాంగపరిధిలోనే, వాళ్ళ చట్టం వాళ్ళు చేసుకున్నారు. అమెరికా కూడా నోర్మూసుకోవలసిందే. వీరిని ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంది.

అంటే,  అమెరికాలో ఒక సిటీని ఆక్రమించి, మెజారిటీ పెంచుకుని, అక్కడ డైరెక్ట్ గా షరియాను అమలు చేయడం మొదలుపెట్టారన్నమాట. ప్రస్తుతం ఈ సిటీలో 24% బంగ్లాదేశీయులు, 38% యెమెన్ జాతీయులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రస్తుతం అమెరికన్ సిటిజెన్సే. ఎప్పుడైతే వాళ్ళకు మెజారిటీ వచ్చిందో షరియా చట్టాలను పాస్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే వీళ్ళ జనాభా పెరగడం మొదలైందో, పోలిష్ జాతీయులు వాళ్ళ ఇళ్లను ఖాళీ చేసి అమెరికాలోని వేరే రాష్ట్రాలకు తరలిపోవడం మొదలైపోయింది. అంటే మన కాశ్మీర్లో లాగా అన్నమాట. అయితే కాశ్మీర్లో చేసినట్టు ఇక్కడ అరాచకాలు, దౌర్జన్యాలు, హత్యలు చేస్తే మర్నాడే సైన్యం దిగుతుంది. రెండో రోజు అందర్నీ కాల్చిపారేస్తారు.  ఆ భయంతో, అమెరికా రాజ్యాంగం ప్రకారం మెల్లిగా పోతూ, వాళ్లకు కావలసిన చట్టాలను వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే కాశ్మీర్ లాగా, లేకపోతే ఇలా అన్నమాట !

ఇప్పుడు అమెరికన్లకు భయం మొదలైంది. గగ్గోలు పెడుతున్నారు. 'ఇదేంటి? ఇన్నాళ్లూ మా సిటీ  చాలా ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు రోడ్లమీద మేకల్ని గొర్రెల్ని నరకడం మేము చూడాలా? హే జీసస్ ! వాట్ ఈస్ దిస్?' అని గోల పెడుతున్నారు.

Karma strikes back అంటే ఇదే మరి. ఈనాటికీ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తోంది కదా అమెరికా? మరి దాని ఫలితం అనుభవించొద్దూ?

అంతే కాదు. PETA (People For Ethical Treatment of Animals) అనే సంస్థ గురించి అందరికీ తెలుసు కదా ! వీళ్ళు కూడా ఏమీ మాట్లాడలేక నోళ్లు మూసుకున్నారు. అంతా రాజ్యాంగపరంగానే జరుగుతోంది. కనుక వాళ్లకు కూడా వాయిస్ లేకుండా పోయింది.

ఇకపోతే, ఈ సిటీలో కొద్దిమంది తెల్ల అమెరికన్స్ మాత్రం పారిపోలేక ఇక్కడే మిగిలిపోయి ఉన్నారు. వాళ్లేమో LGBTQ వర్గానికి చెందినవారు.  అది వాళ్ళ మతం. వాళ్ళు తమ LGBTQ జెండాను కౌన్సిల్ సమావేశంలో ప్రదర్శిస్తే మిగతా కౌన్సిల్ సభ్యులంతా దాన్ని వ్యతిరేకించారు.

'ఇదేంటి? మీ విశ్వాసం ప్రకారం గొర్రెలని మేకల్ని మీ ఇంటి దొడ్లలో నరుక్కోవచ్చని మీరు రూల్ పాస్ చేసుకున్నారు సరే.  మరి మా విశ్వాసాన్ని ఎందుకు వద్దంటున్నారు?' అని LGBTQ అడిగితే,  'మీ దిక్కున్నచోట చెప్పుకోండి. ఇదింతే' అని మెజారిటీ కౌన్సిల్ సభ్యులన్నారు. ఇదంతా వార్తల్లో గుప్పుమంది.

నేను అబద్దాలు వ్రాయడం లేదు. కావాలంటే ఇక్కడ చూడండి.

https://www.freep.com/story/news/local/michigan/wayne/2023/01/11/hamtramck-city-council-approves-religious-animal-sacrifices-slaughter-home/69797191007/

అదృష్టవశాత్తూ, మన ఇండియాలో ఇలాంటి చట్టాలేమీ అవసరం లేదు. అక్కడ ఎవడికేమైనా ఎవడికీ పట్టదు. ఈద్ కి ఎన్ని కోట్ల మేకలు గొర్రెల తలలు తెగి పడతాయో ఎవడికీ పట్టదు. రెండ్రోజులనుకుంటారు, మూడోరోజు మర్చిపోతారు. హైదరాబాద్, కడప, కర్నూలు, గుంటూరు, ఆదోని, రాయచూర్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లలో అయితే రోడ్లమీదనే మేకల్ని గొర్రెల్ని పబ్లిగ్గా నరుకుతారు,  మామూలుగా అయితే, ప్రతిదానికీ గోలగోల చేసే PETA  వాళ్ళు కూడా అప్పుడెక్కడకు పోతారో కనిపించి చావరు. సడన్ గా మాయమై పోతారు. ఇదొక వింత !

జనాభాని పెంచు, మసీదు కట్టు, షరియా అమలు చెయ్, లోకల్స్ ని తరిమెయ్,  దేశం మాదే అను - భలే ఉంది కదూ ఈ సూత్రం! ఎన్ని జన్మలెత్తినా హిందువులు ఈ సూత్రాన్ని నేర్చుకోగలరా అసలు?

ఇండియా ఎలాగూ భ్రష్టు పట్టింది. త్వరలో అమెరికా కూడా పట్టబోతోంది.

శుభం !

NASA ఎలాగూ భూమిలాంటి కొత్త గ్రహాన్ని (Exo Planet) కనుక్కుంది. ఈ భూమిని ముస్లిమ్స్ కి వదిలేసి, మిగతావాళ్లందరూ ఆ భూమికి పారిపోతే బెటరేమో?

కానీ ఒక్క సలహా ! ఇండియా విభజన సమయంలో చేసినట్టు, మళ్ళీ కొంతమందిని దేశంలోనే ఉంచుకుని, కొంతమందికి మాత్రం మీ దేశంలో ఒక ముక్కను విడగొట్టి ఇవ్వకండి. కొంతకాలానికి ఈ ముక్కకూడా పోతుంది. అలాగే, భూమీ పోయి, ఆ ఎక్సో ప్లానెట్ కూడా పోతుంది.  అదీ పాయె ఇదీ పాయె అన్నట్టు అవుతుంది మీ బ్రతుకు !

తెలివితెచ్చుకోకపోతే మీ ఖర్మ ! అనుభవించేటప్పుడు అర్ధమౌతుంది !

read more " మూడవ అమెరికా యాత్ర - 83 (అమెరికాలో కూడా ముసలం మొదలైంది) "

4, జనవరి 2023, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 79 (రాజౌరీ హిందువుల హత్యలు - భారతదేశం నిద్రపోతోంది)

కాశ్మీర్ లోని రాజౌరీ అనే ఊళ్ళో నిన్నగాక మొన్న హిందువుల హత్యలు జరిగాయి. ఇవి టార్గెటెడ్ హత్యలు. అంటే, ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, ఆధార్ కార్డు అడిగి, చెక్ చేసి, అప్పుడు షూట్ చేశారు. మళ్ళీ ఇంకో ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి అక్కడా అదే పని చేశారు. మొగవాళ్లను, పిల్లలను చంపేశారు. ఆడవాళ్లను వదిలేశారు. చనిపోయిన ఆరుగురూ బ్రాహ్మిన్ కులానికి చెందినవారే.

ఇది కాశ్మీర్లో మామూలే అనకండి. రేపు మీ ఊరికి కూడా పాకుతుంది. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కేరళలు అదే దిశగా పోతున్నాయి. దీనికి కారణం అక్కడ పెరిగిన ముస్లిం జనాభా.

2011 లెక్కల ప్రకారం కాశ్మీర్ లో 68 శాతం మంది ముస్లిములున్నారు. ఆ మాటకొస్తే అసలు ప్రభుత్వం దగ్గరే సరైన లెక్కలు లేవు. ప్రస్తుతం 2023 వచ్చింది, కానీ ప్రభుత్వం మాత్రం ఇంకా 2011 లెక్కలు చూపిస్తోంది. అప్పటికే 68 శాతం ఉంటే, ఈ 12 ఏళ్లలో ఎంత పెరిగింది? పాకిస్తాన్ నుంచి ఎంతమంది వచ్చి సైలెంట్ గా సెటిలైపోయారు? తెలీదు. కనీసం 85 శాతం అయ్యి ఉంటుంది. ఇక అక్కడ హిందువులకు రక్షణ ఎలా ఉంటుంది? మన హైదరాబాద్ లోనే రోహింగ్యాలు బోలెడుమందున్నారు. ఇక కాశ్మీర్లో పాకిస్తానీలు ఉండరా? అందుకే అక్కడ జనాభా లెక్క ప్రభుత్వం దగ్గర కూడా లేదు.

చనిపోయిన ఈ హిందువులు, వాళ్ళ పిల్లలు చేసిన తప్పేమిటి? శాంతిగా బ్రతుకుతున్నవారిని అలా చంపడం కరెక్టేనా? దేవుడి దృష్టిలో ఇది తప్పా రైటా? లేక వాళ్ళ పుస్తకంలో అలా వ్రాశారు గనుక అది రైటా? లేక వాళ్ళ దేవుడు ఇలాంటి పనులను సమర్ధిస్తాడా? ఇస్లామంటే ఇదేనా?

కొన్ని పోస్టులలో నేను ఇస్లాం ను విమర్శిస్తే చాలామందికి కోపం వచ్చింది. మరి నేడు జరిగిందేమిటి? నేను చెబుతున్నది నిజమా అబద్ధమా?

కనీసం మీడియాకూడా దీన్ని దేశసమస్యగా చూపించడం లేదు. కేవలం కాశ్మీర్ కో, ఇంకో ప్రాంతానికో పరిమితమైన సమస్యగా చూపిస్తోంది. కానీ ఇదే సమస్య ముదిరి ముదిరి ముందుముందు ప్రతిరాష్ట్రానికీ ప్రతి ఊరికీ పాకుతుంది. రేపు దేశభద్రతే అయోమయంలో పడుతుంది. హిందువుల మనుగడే ప్రశ్నార్ధకమౌతుంది? అప్పుడేం చేస్తారు? అప్పుడు కూడా 'నా కులం' 'నా కులం' అనుకుంటూ కూచుంటారా? లేక, అందరం 'భాయీ భాయీ' అనుకుంటారా? లేక మతాలు మార్చుకుంటారా?

అసలు దీనిని 'టెర్రరిస్ట్ దాడి' అనడమే తప్పు. ఈ పదం కూడా మీడియా వక్రీకరణమే. ఇది టెర్రరిజం కాదు. హిందూమతం పైన ఇస్లాం చేస్తున్న దాడి. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని వాస్తవంగా చూపకుండా, ఏవేవో పేర్లుపెట్టి, దాచిపెట్టి ఉంచుతుంటే, రోజురోజుకూ సమస్య ముదురుతోంది గాని తగ్గదు. జరిగినదాన్ని జరిగినట్లు చెప్పడానికి ఎందుకంత భయం?

'కాశ్మీరులో హిందువులపైన ఇస్లామిక్ కిరాతకుల దాడి' అని ఎందుకు మీడియాలో చెప్పరు? 'బ్రాహ్మణ కుటుంబాలను ఆధార్ కార్డు అడిగి మరీ చంపారు' అన్న నిజాన్ని ప్రజలకు చెప్పడానికి ఎందుకంత భయం?

సమస్యను నేను స్పష్టంగా చెబుతున్నాను.

హిందువులలో కుల ఐకమత్యం తప్ప, మతపరమైన ఐకమత్యం లేదు. అదే హిందూమతానికున్న పెద్ద లోటు.  కులాలలో కూడా, కొన్ని కులాలలోనే ఈ విధమైన ఐకమత్యం ఉన్నది. అందరికీ లేదు. మతపరంగా ఒకే త్రాటిక్రిందకు వచ్చే గుణం అసలే లేదు. అందుకే ఇన్ని సమస్యలు. ఈ ఐకమత్యలోపమే ముందుముందు ఇండియా కొంప ముంచబోతున్నది.

హిందువులలో ప్రతివాడూ, 'నా ఇల్లు బాగుంటే చాలు' అనుకుంటాడు గాని జాతీయతాభావం, దేశభక్తి వారిలో లేవు. అవి లేనప్పుడు, నువ్వు ఏ కులమైనా సరే, చివరకు ఒకనాటికి నీ ఇల్లు కూడా లేకుండా పోతుందన్న స్పృహ వారిలో రావాలి. అది లోపించడమే అతిపెద్ద దరిద్రం.

అన్ని మతాలూ ఒకటే అనుకోవడం ఇంకో లోపం. అన్నిమతాలూ ఒకటి ఎప్పటికీ కావు. సమస్యేమిటంటే, హింసాత్మకమతాలైన క్రైస్తవ, ఇస్లాం మతాలేమో శాంతిమతాలుగా ప్రచారం చేయబడుతున్నాయి. నిజమైన శాంతియుతమతమైన హిందూమతమేమో, నానా అపవాదులను లోనౌతున్నది. ఇదంతా గోబెల్స్ ప్రచార ఫలితం. వందలాది ఏళ్ళుగా నిజాలను అబద్ధాలుగాను, అబద్ధాలను నిజాలుగాను ప్రచారం చేసిన ఫలితమే ఇది.

నేడు నిశ్శబ్దంగా ఇండియాకు ముంచుకొస్తున్న అతి పెద్ద ప్రమాదాలు మూడే.

1. క్రైస్తవ మతప్రచారం. మతమార్పిళ్లు.

2. ఇస్లామిక్ తీవ్రవాదం

3. పెరుగుతున్న ముస్లిముల జనాభా.

ఈ మూడింటినీ చూస్తూ ఊరుకుంటే, వచ్చే 50 ఏళ్లలో ఇండియా సివిల్ వార్ కు ఖచ్చితంగా లోనౌతుంది. అంటే, రోడ్లమీద జనం కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే వచ్చింది. చాలామందికి కన్పించడం లేదు. ప్రతిరాష్ట్రమూ కాశ్మీర్ అయ్యే ప్రమాదం ఇండియాలో  చాలా త్వరలో పొంచి ఉంది. అప్పుడు ఇంటింటికీ వచ్చి ఆధార్ కార్డు అడిగి మరీ చంపుతారు. అప్పుడు కూడా 'నా ఇల్లు బాగుంటే చాలు, నా కులం బాగుంటే చాలు' అనుకుంటూ కూచోండి. సరిపోతుంది. లేదా క్రైస్తవపార్టీలను, ఇస్లామిక్ పార్టీలను ఎన్నుకొని, అధికారాన్ని కట్టబెట్టండి. మీకు సరియైన వాత పెడతారు. మీరు గుళ్ళకిచ్చే డబ్బులన్నీ వాళ్ళు వాడుకుని చర్చిలు, మసీదులు కట్టుకుంటారు. సరిపోతుంది.

రాజౌరీ సంఘటనలో మొగవాళ్లందరూ హత్యకు గురయ్యారు. ఆడవాళ్లు మిగిలారు. ఇప్పుడు వాళ్ళేం చెయ్యాలి? ఆ ఊళ్ళో అందరూ ముస్లిములే. ఆ ఇల్లు  కొనడానికి ఎవరూ ముందుకు రారు. కట్టుబట్టలతో వాళ్ళు ఇంటిని వదిలేసి ఢిల్లీకి వచ్చి రోడ్లమీద అడుక్కుంటూ బ్రతకాలి. లేదా పార్లమెంటు ముందర ఆత్మహత్య చేసుకోవాలి. ఆ ఇంటిని ఎవడో హంతకుడు ఆక్రమిస్తాడు.

సెక్యులరిస్టులు, అంబేడ్కర్ వాదులు, కమ్యూనిస్టులు, శాంతియుత ఇస్లాంవాదులు ఇప్పుడు నోరు తెరవరేమిటి? చంపబడినవాళ్లు మనుషులు కారా? మీరు చెప్పే నీతులన్నీ ఇప్పుడేమైపోయాయి? ఎప్పుడో వేలాది సంవత్సరాల క్రితం అంటరానితం పాటించారని ఇప్పటికీ రోడ్లెక్కి గోల చేస్తున్నారు, అదికూడా అన్ని రాజ్యాంగరాయితీలు అనుభవిస్తూ. మరి ఇదేంటి? ఇప్పుడు ఎవరు ఎవరిని చంపారు? ఆ బ్రాహ్మణులు చేసిన తప్పేంటి?  ఇందులో అంటరానితనం ఎక్కడుంది? చంపిన ఇస్లాం శాంతిమతమా? చంపబడిన బ్రాహ్మిన్, అతని చిన్నపిల్లలు దుర్మార్గులా? ఎవరు కసాయివాళ్ళు? ఎవరు మంచివాళ్ళు? ఎవరు దేవదూతలు? ఎవరు దేశద్రోహులు? మానవహక్కులు ఇప్పుడు లేవా? గుర్తుకు రావా? మీ దుష్ప్రచారాలతో ఇంకా ఎన్నాళ్ళు లోకాన్ని మభ్యపెడతారు?

ఇండియా నుండి నా శిష్యుడొకడు ఫోన్ చేసి 'గురువుగారు, ఇండియా పరిస్థితి ఏమిటి?' అనడిగాడు.

ఇలా చెప్పాను.

'చూడు,  భవిష్యత్తేమీ ఆశాజనకంగా లేదు. మీ హిందువులు ఇద్దర్ని కంటారు. అబ్బాయేమో అమెరికాలో సెటిలై US సిటిజెన్ అవుతాడు.  ఇక ఇండియాకు రాడు. అమ్మాయేమో లవ్ జిహాద్ కు గురై, ముస్లిం కుర్రాడి వలలో పడి ఇల్లొదిలి వెళ్ళిపోతుంది. తరువాత ఆమె అడ్రస్ ఏమైందో నీకు తెలియదు. వాడే ఆమెను ముక్కలుగా నరికి చంపుతాడు. లేదా ఆమె తానే సూయిసైడ్ చేసుకుంటుంది. లేదా, ఖర్మకాలి బ్రతికుంటే, ఆమెకు పుట్టే పిల్లలు ముస్లిములౌతారు. కొన్నాళ్ళకు నువ్వు, నీ భార్యా పెద్దవాళ్ళై ఇండియాలోనే వృద్ధాశ్రమంలో చనిపోతారు. నీ ఇంటిని ఏ ముస్లిమో కొనేసి మసీదుగా మారుస్తాడు. నీ కుటుంబచరిత్ర అంతటితో అంతమౌతుంది. కానీ అదేసమయంలో ముస్లిం జనాభా పదిరెట్లు పెరుగుతుంది. కొన్నాళ్ళకు పాకిస్తాన్ మీ దేశాన్ని హాయిగా ఆక్రమిస్తుంది. అప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఈలోపల మీలోమీరు కులాలని, ప్రాంతాలని, కులపార్టీలని కొట్టుకుంటూ ఉండండి. సరిపోతుంది' అన్నాను.

అతనికి నా మాటలు కొంచం కటువుగా అనిపించాయి. కానీ నేను చెబుతున్నది నిజం. ఇవాళ కాకపోతే రేపు ఇది నిజమౌతుంది.

ఈ విధంగా ఎన్ని చెప్పుకున్నా, చివరకు ఈ సమస్యలకన్నింటికీ ఒకటే పరిష్కారం.

1. భారతదేశం హిందూదేశంగా ప్రకటింపబడాలి. ఎప్పటినుంచో ఇండియా హిందూదేశమే. నేడు బురదగుంటగా మారింది. మళ్ళీ అది అధికారికంగా హిందూదేశం అవ్వాలి.

2. ఇండియాలో మిలటరీ రూల్ రావాలి. అతిస్వేచ్ఛను, అరాచకాలను, పొలిటికల్ కుట్రలను, అవినీతిని ఎక్కడికక్కడ అణిచివేయాలి. 

3. ఆస్తులను ధ్వంసం చేసేవారిపైనా, క్రైమ్ చేసేవారిపైనా, తక్షణ శిక్షలు అమలు కావాలి. కోర్టులు, దశాబ్దాల తరబడి కేసులు తేలకుండా ఉండటాలు, ఇవన్నీ పోవాలి. నేరస్తులకు ఆన్ ద స్పాట్ శిక్షలు పడాలి. 

ఇవి జరిగినప్పుడే ఇండియాలో శాంతి నెలకొంటుంది. అప్పుడే ఇండియా ప్రపంచదేశాలలో అన్నిరంగాలలోనూ నెంబర్ 1 అవుతుంది.

లేదంటే రాబోయే 50 ఏళ్లలో ఇండియా ఏమౌతుందో చెప్పడం నా ఊహకు అందటం లేదు.

read more " మూడవ అమెరికా యాత్ర - 79 (రాజౌరీ హిందువుల హత్యలు - భారతదేశం నిద్రపోతోంది) "

3, జనవరి 2023, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 78 (ఇస్లాం ఒక్కటే ప్రపంచాన్ని ఏకం చేయగలదు)

ఇస్లాం ఒక్కటే ప్రపంచాన్ని ఏకం చేయగలదని ఆ మతాన్ని అనుసరించే వారంతా నమ్ముతూ ఉంటారు. అది నిజమేనని నేనూ ఒప్పుకుంటాను నేనేకాదు, ఇప్పుడు అమెరికా కూడా ఒప్పుకుంటోంది. ఎలాగో చివర్లో చెబుతా.

అమెరికాలో మైన్ అని ఒక రాష్ట్రం ఉంది. ఇది నార్త్ ఈస్ట్ లో పైకి, ఒక మూలగా ఉంటుంది. విపరీతమైన చలివల్ల, ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువ. మన ఇండియాలో మిజోరాం, మణిపూర్ లాగా ఇది ఉంటుంది.

డిసెంబర్ 31 శనివారం రాత్రి ఒక 19 ఏళ్ల అబ్బాయి ఈ రాష్ట్రం నుంచి న్యూయార్క్ టైం స్క్వేర్ కి వచ్చాడు. అతని పేరు ట్రెవర్ బిక్ ఫోర్డ్. స్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం, టైమ్ స్క్వేర్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీడు ఒక మేచట్ (కొబ్బరిబోండాల కత్తి) తో పోలీసులమీద దాడిచేసి ముగ్గురిని తీవ్రంగా గాయపరిచాడు. అయితే అతని భుజం మీద షూట్ చేసిన పోలీసులు అతన్ని వెంటనే పట్టుకున్నారు.

ఎందుకురా ఇలా చేశావంటే, ఇస్లామిక్ తీవ్రవాద నినాదాలు చేశాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ టైములో ఇస్లామంటే ఏమిటో అమెరికాకు చూపిద్దామని కంకణం కట్టుకున్నాడట. అందుకని ఒక కొబ్బరి బొండాల కత్తి పట్టుకుని అమెరికన్ పోలీసులను నిష్కారణంగా ఎటాక్ చేశాడు. సెలబ్రేషన్ జరుగుతున్న స్థలంలోకి వెళ్లి, అక్కడి జనాన్ని దొరికినంతమందిని చంపుదామని అతని ప్లాన్. కానీ వీలుకాలేదు. ఏమంటే, పోలీసు కాపలా ఉంది. అందుకని పోలీసులను ఎటాక్ చేశాడు. అతన్ని కాల్చి, హాస్పటల్లో పడేసి, అతని చరిత్ర తవ్వితీశారు. సోషల్ మీడియాలో తీవ్రవాద ఇస్లామిక్ భావాలను చాలాసార్లు వెలిబుచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి అక్కడి తాలిబాన్ లో చేరడం ఇతని జీవితాశయమట. అమెరికాలో ఇటుపక్క, గన్స్ అంత తేలికగా దొరకవు. టెక్సాస్ వైపైతే వేరుశెనగ పప్పులమాదిరి దొరుకుతాయి. సరే, అతనికి గన్ దొరకలేదు గనుక సరిపోయింది. అదే గన్ షూటింగ్ అయినట్లయితే చాలామంది చనిపోయి ఉండేవారు.  

అయితే అతని తల్లి, అక్క ఇంతకు ముందే పోలీసులకు కంప్లెయింట్ చేసి ఉన్నారు. వీడు ఇస్లామిక్ తీవ్రవాదానికి లోనౌతున్నాడు, అని. అంతవరకూ వాళ్ళు మంచివాళ్ళే అనుకోవాలి. వాళ్ళలా ఎందుకు కంప్లెయింట్ఇచ్చారంటే,  వాళ్ళు  అమెరికన్స్ కాబట్టి. అదే ముస్లిమ్స్ అయితే ఇవ్వరు. దాచిపెడతారు. మన ఇండియాలోని ముస్లిం నేరస్తుల కుటుంబసభ్యులెవరూ కూడా ఇలా పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వరు. నేరం జరిగిన తర్వాత కూడా ఒప్పుకోరు. 'మావాడు చాలామంచివాడు. ఇండియా ప్రభుత్వమే అసలైన టెర్రరిస్టు ప్రభుత్వం, మావాడేదో సరదాకి అలా చేస్తే దాన్ని మీరంతా వక్రీకరిస్తున్నారు. పాపం చిన్నపిల్లాడు. వాడికేం తెలుసు? చూసీ చూడనట్టు పోవాలి. వదిలెయ్యాలి.' అని వాళ్ళు ప్రెస్సులో మాట్లాడతారు. వేదికలెక్కి కూడా మాట్లాడతారు. అదేమంటే మైనారిటీ హక్కులంటారు. మానవహక్కులంటారు. అంతటి స్వేచ్ఛను మన రాజ్యాంగం వాళ్లకు కల్పించింది మరి !

ఇంకొక వింతేమిటంటే, మన పార్టీలు, మన మేధావులు, మన లీడర్లే వాళ్ళను సపోర్ట్ చేస్తారు.అసలిదేంటో ఎప్పటికీ అర్ధం కాదు.

ఇప్పుడు అమెరికాలో చర్చ మొదలైంది. 'ఇస్లామిక్ తీవ్రవాదం అమెరికాలో కూడా పాకుతోందేంటి? 19 ఏళ్ల కుర్రాడికి ఇంతటి ఉన్మాదం ఎలా ఎక్కింది?' అని. మరి పాకకుండా, ఎక్కకుండా ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్య దేశం కదా? వస్తారు. పెరుగుతారు. ఆ తర్వాత ఇదే జరుగుతుంది. ఇన్నాళ్లూ ఇండియాలో జరుగుతుంటే, అమెరికన్లు ఎగతాళిగా కామెంట్లు చేసేవాళ్ళు.  ఇప్పుడు అమెరికాలో కూడా మొదలైంది. ఏదైనా తనదాకా వస్తేనేగాని తెలీదు కదా !

ఇప్పుడు సోకాల్డ్ ఇస్లామిక్ స్కాలర్లు వస్తారు. 'ఛీ ఛీ ఇస్లాం అలాంటిది కాదు. అదేమీ అలా చెయ్యమని చెప్పలేదు. అది శాంతిమతం. ఎవడో ఒకడు చేశాడని మొత్తం అందర్నీ అనకూడదు' అంటారు. ఒకపక్కన ఇలాంటి చిన్నపిల్లలకు తీవ్రవాదాన్ని నూరిపోస్తూనే ఉంటారు. మరొపక్కన ఇలాంటి శాంతికబుర్లు చెబుతూనే ఉంటారు. ఇదేమీ కొత్త స్ట్రాటజీ కాదుకదా ! గత వెయ్యేళ్ళ నుంచీ ఇదే కదా వాళ్ళు చేస్తున్నది !

అసలు 'తీవ్రవాద ఇస్లాం' అనే మాటకే నాకు నవ్వొస్తుంది. అదికాకుండా వేరేది అందులో ఏముందసలు? ఆ మధ్యన ఇండియాలో కూడా ఇలాగే ఒకడు ఇలాంటి మేచట్ తోనే పోలీసులను దాడిచేశాడు.  వాడూ ఇస్లామిక్ గూండానే.

అమెరికాలో మైన్ అనే ఒక రాష్ట్రం ఉందని అమెరికన్స్ కే చాలామందికి తెలీదు. అంతటి మారుమూల రాష్ట్రంలో కూడా ఇస్లామిక్ తీవ్రవాదం పెరుగుతోంది. భలేగా ఉంది కదూ !

ఇలాంటివి మరిన్ని జరిగితే కదా అమెరికన్స్ కళ్ళు తెరిచేది? బుద్ధితెచ్చుకునేది? అన్ని దేశాలలో ఇదే జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ కూడా మొదలైంది.

నిజమే ! ఇస్లాం అంటే శాంతి మాత్రమే. నేను నమ్ముతున్నాను. మీరూ నమ్మండి. నేను ఖురాన్ చదివాను. ఒకసారి కాదు. చాలాసార్లు చదివాను. 'శాంతి' అనే పదం ఎక్కడైనా కన్పిస్తుందా అని వెదుకుతూ చదివాను. అంతా హింస తప్ప అందులో 'శాంతి' అనే మాటే ఎక్కడా కన్పించలేదు. కావాలంటే మీరూ చదివి చూడండి. నా మాటను ఒప్పుకుంటారు.

కానీ ఒక్కటి మాత్రం నిజం.

ఇస్లాం ఒక్కటే ప్రపంచాన్ని ఏకం చేయగలదు - ఇస్లాంకు వ్యతిరేకంగా !

ఇంకే మతమూ అలా చెయ్యలేదు. అదే ఇస్లాం గొప్పదనం మరి !

read more " మూడవ అమెరికా యాత్ర - 78 (ఇస్లాం ఒక్కటే ప్రపంచాన్ని ఏకం చేయగలదు) "

29, డిసెంబర్ 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 75 (మంచు ఫోటోలు)

వారం తర్వాత ఈరోజున కొంచం ఎండ వచ్చింది. మంచు కరగడం మొదలైంది. నేనుంటున్న చోటకు దగ్గర్లోనే ఒక పార్కుకు పోయేదారిలో ఒక కొలనుంటుంది. సరదాగా బయటకెళ్ళి, కాఫీ త్రాగుతూ, అదెలా ఉందో చూద్దామని వెళ్ళాము. ఆ కొలనంతా మంచుమయమై పోయింది. అక్కడి ఫోటోలు ఇవన్నీ. 








read more " మూడవ అమెరికా యాత్ర - 75 (మంచు ఫోటోలు) "

7, డిసెంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 65 (ఈ పౌర్ణమి ప్రభావం-నార్త్ కెరొలినా లో అంధకారం)

డిసెంబర్ 3 శనివారం సాయంత్రం ఏడు గంటలు. నార్త్ కెరొలినాలోని మూర్ కౌంటీలో కరెంట్ పోయింది. ఈ రోజు బుధవారం. నేటికి అయిదురోజులైంది. కరెంట్ రాలేదు. కనీసం ముప్పై వేలమంది ఈ ఐదురోజులుగా చీకట్లో మగ్గుతున్నారు. చలేమో నాలుగు నుండి ఎనిమిది డిగ్రీలుంది. 

ఈ నాలుగు రోజులుగా కరెంటే కాదు. ఇంటర్నెట్ లేదు. మొబైల్ నెట్వర్క్ లేదు. అమెరికన్స్ నానా బాధలు పడుతున్నారు. ఈ చలిదేశంలో కరెంట్ లేకపోతే ఒక్కరోజైనా బ్రతకడం చాలా కష్టం. అలాంటిది అయిదు రోజులుగా నార్త్ కెరొలినా వాసులు నరకం చూస్తున్నారు.

సరిగ్గా పౌర్ణమి నీడలో ఇది జరిగింది.

అమెరికాను సూచించే మిథునరాశి నుండి చూస్తే, లగ్నాధిపతి బుధుడు సప్తమంలో  కెళ్ళిపోయాడు.  సప్తమానికి అర్గళం పట్టింది. మేషంనుండి రాహు, కుజ, చంద్రుల దృష్టి ధనుస్సు మీదుంది. అందుకే  ఇలా జరిగింది.

అయితే, ఇది ఏదో దానంతట అది జరిగిన విద్యుత్ ఫెయిల్యూర్ కాదు. ఎవరో దుండగులు వచ్చి, సబ్ స్టేషన్లమీద కాల్పులు జరిపి అక్కడి పరికరాలను ధ్వంసం చేశారు. వాళ్ళను ఇంతవరకూ  పట్టుకోలేకపోయారు. 'దాడులకు మన పవర్ లైన్లు ఎంత అందుబాటులో ఉన్నాయో చూడండి; అని ఇక్కడ సోషల్ మీడియాలో అమెరికన్లు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, 'గ్యాస్ లైన్లు, వాటర్ సప్లై లైన్లు కూడా ఇదే విధంగా సరైన రక్షణ లేకుండా ఉన్నాయి. మనకు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు' అని భయపడుతున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.

రాజకీయపార్టీల మధ్య గొడవలతో ఇవి జరుగుతున్నాయని, దుండగులు చేసిన పని కాదని లోకల్ వార్తలు. ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఫెడరల్ ప్రభుత్వం సామాన్యంగా జోక్యం చేసుకోదు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా రంగంలోకి దిగి  నార్త్ కెరొలినాకు సాయం చేస్తున్నారు. రాజకీయగొడవలకు ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇక్కడ కూడా ఉందన్నమాట. అవున్లే ఇండియాలో అయితే మకలహాలు రెచ్చగొట్టొచ్చు, ఇక్కడ అది కుదరదు. కాబట్టి ఇలాగన్నమాట. ఎక్కడైనా మనిషి మనస్తత్వం ఒకలాగే ఉంటుంది మరి. 

ఇదంతా చూస్తుంటే మన ఇండియా ఎంత స్వర్గమో అర్ధమౌతున్నది. ఇక్కడ సమస్యలు చాలా తక్కువ. కానీ ఇక్కడ కూడా ఉన్నాయి. చాలాసార్లు వాటినే మేనేజ్ చేయలేకపోతున్నారు.  అదే మన ఇండియాలో అయితే, అన్నీ సమస్యలే. అడుగడుక్కూ సమస్యలే. అందరూ దేశద్రోహులే. అయినా అక్కడ నడుస్తున్నదంటే అది మనుషుల మంచితనమో ఇంకేదోనో మాత్రం తెలీడం లేదు..

ఏదేమైనా, ఈ పౌర్ణమికి ఇక్కడ ఇలా జరిగింది.

read more " మూడవ అమెరికా యాత్ర - 65 (ఈ పౌర్ణమి ప్రభావం-నార్త్ కెరొలినా లో అంధకారం) "

1, డిసెంబర్ 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 63 (ఇస్లాం చాలా సంస్కరింపబడాలి)

ముస్లిములలో కిరాతక మనస్తత్వాన్ని పెంచి పోషించడంలో ఖురాన్ పాత్ర ఎంతో ఉంది. ఎలాగంటారా?

తనను నమ్మి, తల్లిదండ్రులను ఎదిరించి, తనతో ఉంటూ, సంసారం చేసిన శ్రద్ధ అనే అమ్మాయిని 35 ముక్కలుగా నరికి నెలలపాటు ఫ్రిజ్ లో దాచిపెట్టి, రోజుకొక్క ముక్కగా ఎక్కడెక్కడో పారేస్తూ వచ్చిన, ఆఫ్తాబ్ పూనావాలా, పోలీసులు చేస్తున్న విచారణలోగాని, లై డిటెక్టర్ టెస్ట్ లో గాని, ఇతర టెస్టులలో గాని, ఎక్కడా పశ్చాత్తాపాన్ని చూపించలేదు. అతనికి తప్పు చేశానన్న స్పృహ కూడా లేదు. అంతటి రాక్షసుడుగా ఉన్నాడు. అంతేకాదు, శ్రద్ధను చంపి, ఆమె ఇంకా తన ఫ్రిజ్ లో ఉండగానే, ఇంకో అమ్మాయితో డేటింగ్ సైట్లో డేటింగ్ మొదలుపెట్టి,రూముకు పిలిపించుకుని, శ్రద్ధ బాడీ నుండి తీసిన ఉంగరాన్ని ఆ అమ్మాయికి గిఫ్ట్ గా ఇచ్చాడు. వీడి గురించి మాట్లాడటానికి, రాక్షసుడనే పదం చాలా చిన్నదేమో ! ఆ పదాన్ని వాడితే రాక్షసులే సిగ్గుతో సూయిసైడ్ చేసుకుంటారేమో?

నిన్నటికి నిన్న ఒక కొరియన్ వ్లాగర్ అమ్మాయి, బాంబే నడిరోడ్లమీద అల్లరికి గురయ్యింది. అదికూడా లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుండగా, ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని లాగి, బైక్ మీద ఎక్కమని అల్లరి చేసినది, మహమ్మద్ షేక్, మహమ్మద్ నకీబ్ అనే ఇద్దరు ముస్లిమ్స్. ఇద్దరినీ అరెస్టు చేశారు ముంబై పోలీసులు. వాళ్ళలోనూ పశ్చాత్తాపం లేదు.

మొన్నటికి మొన్న, "క్రిస్టియన్స్ ని అనుకరిస్తూ, పుట్టినరోజు పండుగలు జరుపుకోవడం ఇస్లాం పధ్ధతి కాదు, అలా జరుపుకోవద్దు" అంటూ ఒక ఫత్వాను జారీ చేశాడు ఒక  ఇండియా ఇమామ్. ఈ మోడ్రన్ కాలంలో అలా మాట్లాడుతున్నందుకు వాడికి సిగ్గు కూడా లేదు.

ఉదయపూర్లో కన్నయ్య లాల్ అనే టైలర్ని కొద్దీ నెలలక్రితం దారుణంగా చంపేశారు ఇద్దరు ముస్లిమ్స్. కారణం నూపుర్ శర్మను అతడు సపోర్ట్ చేశాడని. పోలీసులు ఇద్దరినీ పట్టుకున్నారు. వాళ్లలో కూడా పశ్చాత్తాపం లేదు.

ఎందుకిలా అవుతుంది?

అటువంటి పనులు చేసిన తర్వాత ఎలాంటి మనిషైనా సిగ్గుపడతాడు. పశ్చాత్తాపపడతాడు. ఏదో తెలియకో, వేడిలోనో అలాంటి తప్పులు చేసినా, ఆ తరువాత బాధతో కుమిలిపోతాడు. కొంతమంది నేరస్తులైతే, ఆ మానసికక్షోభను భరించలేక సూయిసైడ్ కూడా చేసుకుంటారు. కానీ, చాలామంది ముస్లిములలో ఆ పశ్చాత్తాపం కనిపించదు.

కారణమేంటి?

అది వాళ్ళ తప్పు కాదు. ఖురాన్ బోధలలోనే ఆ తప్పుంది.

ఇతరమతాల వాళ్ళు సైతాన్ భక్తులని అది బోధిస్తుంది. వాళ్ళను చంపినా, ఇంకేం చేసినా తప్పులేదని అది నొక్కి వక్కాణిస్తుంది. వాళ్ళ ఆస్తులను కాజేసినా, వాళ్ళ ఆడవాళ్లను ఎత్తుకుపోయినా, రేపులు చేసినా ఏమీ తప్పులేదని చెప్పడమే గాక, అలా చెయ్యమని,  అలా  చేస్తే స్వర్గంలో అల్లా పక్కన సీటు గ్యారంటీ అని, అది తాయిలాలు చూపిస్తూ బోధిస్తుంది. అవన్నీ సత్యాలని ఈనాటికీ ప్రతి శుక్రవారంనాడు, ముల్లాలు వీళ్లకు నూరిపోస్తూ ఉంటారు. అవి నిజాలేనని ప్రతి ముస్లిమూ నమ్ముతాడు. అందుకే అలాంటి పనులు చేసినప్పటికీ వాళ్లలో పశ్చాత్తాపం ఉండదు.

26/11 మారణకాండ ముంబాయిలో జరిగి ఇప్పటికి 14 ఏళ్లయింది. ఈ దాడిలో దొరికిన ఒకేఒక్క దోషి, అజ్మల్ కసబ్ లో ఏమాత్రమూ అపరాధభావన గాని, పశ్చాత్తాపం గాని కనిపించలేదు. కారణం వెరీ సింపుల్. నేను పైన చెప్పినదానిలోనే కారణం ఉంది. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళనలా రెచ్చగొడుతున్న ఖురాన్ బోధలదే అసలైన తప్పు.

ఇతర మతాల మనుషులు తమ బానిసలని, వాళ్ళను ఏమి చేసినా తప్పులేదని చెబుతున్న ఖురాన్ చీకటిబోధలను వాళ్ళు గుడ్డిగా నమ్మడము, ముల్లాలందరూ ప్రతిశుక్రవారం ప్రార్థనలలో వాళ్ళనలా నమ్మిస్తూ ఉండటమే దీనికంతా కారణం.

'అలా చెయ్యడం తప్పు,  అలాంటి నేరాలు మనం చెయ్యకూడదు. నీతిగా బ్రతకాలి. మతం ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యం' అని ఏ ముల్లా కూడా చెప్పడు. 'పుట్టినరోజులు జరుపుకోవద్దు, అది ఖురాన్ కు విరుద్ధం' అంటూ నిన్నగాక మొన్న ఫత్వా జారీ చేసిన ముల్లాయే, నేను చెబుతున్నది నిజమనడానికి ఉదాహరణ.

అసలు ముస్లిములు చేసే రోజువారీ ప్రార్ధనలోనే ద్వేషం దాగుంది. అదేంటి?

'లా ఇలాహ్ ఇల్లల్లాహ్ ముహమ్మదర్రసూలుల్లాహ్' అంటే అర్థమేంటి?

'అల్లా తప్ప వేరే దేవుడు లేడు. మహమ్మదొక్కడే ఆయన ప్రవక్త'. అని ఆ ప్రార్ధనకర్ధం.

అంటే, అర్థమేంటి? అల్లా తప్ప మిగిలిన ఎవరూ దేవుళ్ళు కారు అని ఆ ప్రార్ధన నర్మగర్భంగా  మాత్రమే కాదు, డైరెక్ట్ గానే చెబుతోంది. ఇతర ప్రవక్తలెవరూ ప్రవక్తలు కారు. మహమ్మద్ ఒక్కడే ప్రవక్త. ఆయన చెప్పిన ఖురానే దైవశాసనం, మిగతా మతాల గ్రంధాలన్నీ సైతాన్ పుస్తకాలని అది  క్లియర్ గా చెబుతోంది.

ముస్లిములు ప్రతిరోజూ చేసే దైవప్రార్థనలోనే అసలు నెగటివిటీ ఉంది. ద్వేషం ఉంది. ఇతరమతాలంటే, ప్రవక్తలంటే, అసహనభావం ఉంది. మరి అలాంటి ప్రార్ధనను ప్రతిరోజూ శ్రద్ధగా చేసేవాళ్ళు అలా ఉండక ఇంకెలా ఉంటారు? 

ఖురాన్లో హింసను ప్రేరేపించే సూరాలు బోలెడున్నాయి. పాకిస్తాన్ లోని తీవ్రవాద ముఠాలన్నీ ఆ సూరాలనే ఆధారంగా తీసుకుంటాయి. 'దేవుడే ఇలా చెయ్యమని మాకు చెప్పాడు, తప్పేముంది?' అని వాళ్ళు వాదిస్తారు. దానినే వాళ్ళు నమ్ముతారు కూడా. అందుకే ఎలాంటి ఘోరాలు చేసినా, వాళ్లలో పశ్చాత్తాపం ఎక్కడా కనపడదు దేవుడు చెప్పిన పనులనే తాము చేస్తున్నామని వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు.

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూచినా, ఇతర మతాల విషయంలో ముస్లిముల ప్రవర్తన ఇలాగే ఉంటుంది. దీనికి మూలకారణం ఖురాన్ బోధలలోనే ఉంది.

వాటిని మార్చి, ఆ హింసాత్మక పద్యాలను ఖురాన్ నుంచి తొలగించి దానిని సంస్కరించనంతవరకూ ముస్లిమ్స్ లోని హింసాత్మకధోరణి పోదు.

కానీ అది ఎన్నటికైనా జరుగుతుందా? ఎన్నటికీ జరగదు. మరి వాళ్లెలా శాంతిగా మారతారు? అదీ జరగదు. మరేం జరగబోతోంది.

నేను చెప్పడమెందుకు? ఏం జరగబోతోందో ప్రపంచంలో అందరికీ తెలుసు. ఇజ్రాయెల్ లో ఏం జరుగుతోంది? ఇండియాలో ఏం జరుగుతోంది? అమెరికాలో ఏం జరుగుతోంది? ఇరాన్లో, సిరియాలో, రువాండాలో, ఉగాండాలో, ఇథియోపియాలో, నైజీరియాలో, ఆఫ్ఘనిస్తాన్ లో, చివరకు పాకిస్తాన్ లో కూడా ఏం జరుగుతోంది? మారణకాండ జరుగుతోంది. వాళ్ళు పెంచి పోషించిన తాలిబానే వాళ్ళను కాటేస్తోంది. ఎక్కడైనా అదే జరుగుతుంది.

మొన్నొక ముస్లిం ఫ్రెండ్ నాతో మాట్లాడుతూ, 'ప్రపంచదేశాలలో అన్నిట్లోనూ మా జనాభా పెరుగుతోంది. దేశదేశాలలో అతివేగంగా విస్తరిస్తున్న మతం ఇస్లామే' అన్నాడు. అది నిజమే. ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే, వాళ్లకు జనాభానియంత్రణ లేదు. ఇస్లాం అంటే ఇష్టపడి ఎవరూ గుంపులు గుంపులుగా దానిలోకి మారడం లేదు. వాళ్ళ జనాభా పెరగడం వల్ల ఇస్లాంకు మెజారిటీ వస్తోంది. 20 ఏళ్లలో వెయ్యిమంది ముస్లిమ్స్ లక్షమంది అవుతారు. మిగతావాళ్ళు రెండువేలు లేదా మూడువేలమంది అవుతారు. మరి జనాభా పెరగక ఏమౌతుంది?

ఈరోజు న్యూస్ చూశారా? UK లోని వేల్స్, లీసెస్టర్ లలో క్రిస్టియన్స్ మైనారిటీలయ్యారు.  ముస్లిం జనాభా 44 శాతం పెరిగింది. ఇంగ్లాండ్ లోని ఇంగ్లీష్ మేధావులందరూ ఏం చెయ్యాలో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు. క్రైస్తవమతానికి ఆయువుపట్టులాంటి దేశంలో క్రైస్తవులు మైనారిటీలయ్యారు. ఊహించగలరా? రేపు ఇండియాలో కూడా ఇదే జరగబోతోంది.

ఒక ఇండియా శిష్యురాలు ఫోన్లో నాతో ఇలా అంది, 'ఎప్పటిదాకానో ఎందుకు? ఇప్పుడు మాత్రం హిందువులు మైనారిటీలు కారా? ప్రస్తుతం అలాగే బ్రతుకుతున్నాము కదా'

నిజమే అనిపించింది నాకు.

ఒక అమెరికన్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే అతనిలా అన్నాడు.

'మీ హిందువులు మా దేశంలో ఎన్ని గుళ్ళయినా కట్టుకోండి. మాకేమీ అభ్యంతరం లేదు. మీతో హానిలేదని మాకు తెలుసు. మీ జనాభా పెరగదు. మీరు మతమార్పిడి చెయ్యరు. కానీ ఒక్క మసీదును మా దేశంలో కడితే మేము చాలా కంగారుపడతాము. ఎందుకంటే, ముందు మసీదంటారు. తరువాత షరియా అంటారు. జనాభాను పెంచేస్తారు. తరువాత ఏకంగా  దేశమే మాదంటారు. ఇలా జరుగుతుందని మాకు బాగా తెలుసు. అందుకే మాకంటూ ఒక ప్లానుంది. మీ ఇండియావాళ్లకు ఒక ప్లానంటూ లేదు. ముందుముందు మీకు చాలా ట్రబులుంటుంది' అన్నాడు.

నాకు ఒప్పుకోక తప్పలేదు.

చైనాలోని ఊగిర్ ప్రావిన్స్ లో కూడా ముస్లింసమస్య ఉంది. అక్కడ, లక్షమంది ముస్లిం ఆడవాళ్లకు బలవంతంగా పామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించాడు జిన్ పింగ్. చైనాలో ఉండాలంటే చైనీయులుగా ఉండండి. మా రూల్స్ పాటిస్తూ ఉండండి. లేదంటే బయటకు పొండి' అని ఖచ్చితంగా చెప్పాడు. అది నిరంకుశ కమ్యూనిస్ట్ పరిపాలన గనుక అలా సాగింది. ప్రజాస్వామ్య దేశాలలో ఎలా సాగుతుంది? అందుకే ఇండియాలాంటి దేశాలలో కష్టాలు మొదలౌతున్నాయి.  ఇంగ్లాండ్ కంటే గొప్ప ఉదాహరణ ఇంకేదీ అవసరం లేదనుకుంటాను !

మూలాన్ని మార్చనంతవరకూ ఫలితాలెలా మారుతాయి? కళ్ళు మూసుకుని ఊరుకుంటే జనాభా పెరగకుండా ఉంటుందా? ఎవరేమన్నప్పటికీ, ఇంకొక 50 ఏళ్లలో, ప్రపంచదేశాలన్నింటిలో  ముస్లిములే మెజారిటీగా ఉంటారు. ఇస్లామే ప్రపంచమతం అవుతుంది. స్టాటిస్టికల్ వాస్తవాలు ఇదే నిజమంటున్నాయి.

దీనిని ఆపాలంటే, చైనా, ఇజ్రాయెల్ ల వల్లే అవుతుంది. ఇండియా వల్ల కాదు. ఏమంటే ఇండియాకు దాని రాజకీయవ్యవస్థయే పెద్ద అడ్డు అవుతుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇండియా దీనిని ఎదుర్కొనడం అసాధ్యం.

ముందు ముందు ఏం జరుగుతుందో చూడ్డానికి అసలు మనమంటూ ఉంటామా? డౌటే !

read more " మూడవ అమెరికా యాత్ర - 63 (ఇస్లాం చాలా సంస్కరింపబడాలి) "

25, నవంబర్ 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 60 (డెట్రాయిట్ కి తిరిగి వచ్చేశాం)

షాంపేన్ సిటీలో రెండువారాలుండి, స్పిరిట్యువల్ రిట్రీట్ నిర్వహించి, నిన్ననే మళ్ళీ డెట్రాయిట్ కు తిరిగి వచ్చేశాం. వచ్చేటప్పుడు కూడా AMTRACK రైల్లోనే ప్రయాణం. మళ్ళీ చికాగో వచ్చి, అక్కడ రైలు మారి, ట్రాయ్ సిటీకి చేరుకున్నాం. ఉదయం తొమ్మిదికి రైలెక్కితే రాత్రి తొమ్మిదికి ట్రాయ్ కి వచ్చేశాము.  మధ్యలో చికాగోలో ఒక గంట వెయిటింగ్. 

సౌత్ నుంచి నార్త్ కి వెళుతున్నాం కాబట్టి చలి పెరుగుతుంది. చికాగో నుంచి ట్రాయ్ వెళ్లే దారిలో కంట్రీసైడ్ అంతా మంచుతో కప్పబడి కనిపించింది. ఇళ్లన్నీ మంచులో ఉన్నాయి. న్యూయార్క్ లో కూడా గత వారం చాలా ఎక్కువగా మంచుకురిసి కొంతమంది చనిపోయారు కూడా. అక్కడ ఐదడుగుల ఎత్తులో మంచు పేరుకుంది.

బ్యాటిల్ క్రీక్, డెట్రాయిట్, డియర్ బార్న్, రాయల్ ఓక్, ట్రాయ్ అన్ని సిటీలూ వర్షం పడినట్లు రోడ్లన్నీ తడిగా ఉన్నాయి. ఈరోజు థాంక్స్ గివింగ్ డే. రేపు బ్లాక్ ఫ్రై డే.  కనుక, ఇక్కడ హాలిడే. ప్రతి సిటీలోనూ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. షాపులన్నీ మూసేసి ఉన్నాయి. 

ట్రెయిన్లో నా ప్రక్కన ఒక అమెరికన్ అబ్బాయి కూచున్నాడు. చికాగోలో చదువుకుంటూ, కలమజూ అనే ఊరిలో ఉన్న పేరెంట్స్ దగ్గరకు వస్తున్నాడు. తనకు ఇండియన్ మ్యూజిక్ అంటే ఇష్టమని దానిపైన రీసెర్చి చేస్తున్నానని చెప్పాడు. ఇండియానాపోలిస్ లో ఏదో ఇండియన్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగితే అక్కడకు వెళ్లి మరీ విన్నానని చెప్పి ఆ వీడియో చూపించాడు.

ఇండియన్ మ్యూజిక్ ఎంత గొప్పదో అతనికి వివరించి చెప్పాను. బసంతి, ఆనందభైరవి, యమన్ కళ్యాణి, దీపక్, మేఘమల్హార్ మొదలైన హిందూస్తానీ రాగాలను గురించి, తాన్సేన్ మొదలైన మహాగాయకుల గురించి, యోగానికీ సంగీతానికీ ఉన్న సంబంధం గురించి అతనికి వివరించాను. ఇండియన్ మ్యూజిక్ మీద రీసెర్చి చెయ్యమని అతనికి చెప్పాను. గంట తర్వాత కలమజూ స్టేషన్ వచ్చినపుడు వదల్లేక వదల్లేక తన  బ్యాగ్ తీసుకుని దిగిపోయాడు.

రాత్రి తొమ్మిదికి ట్రాయ్ లోని మా ఇంటికి చేరుకున్నాం.


చికాగో పరిసరాలు










చికాగో రైల్వే యార్డ్

















చికాగో రైల్వే యార్డ్





చికాగో రైల్వే యార్డులోని పాయింట్స్, క్రాసింగ్స్, క్రాసోవర్స్






ట్రెయిన్ పాంట్రీ కార్లో ఉన్న AMTRACK కంపెనీ వారి ఫోటో



చీకటి పడింది




ట్రాయ్ స్టేషన్ వచ్చేసింది

read more " మూడవ అమెరికా యాత్ర - 60 (డెట్రాయిట్ కి తిరిగి వచ్చేశాం) "

13, నవంబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 54 (చికాగో సందర్శన)

ఉదయం తొమ్మిదికి ట్రాయ్ లో రైలెక్కి, మధ్యాన్నం రెండు గంటలకు చికాగో యూనియన్ రైల్వే స్టేషన్లో దిగాము. షాంపేన్ ట్రెయిన్ కోసం అక్కడ రెండు గంటలపాటు వేచి ఉండాలి. ట్రాక్ రిపేర్లు జరుగుతున్నాయని ఈ రైలు డిపార్చర్ ఒక గంట లేటైంది. కనుక మూడు గంటల వెయిటింగ్  టైం ఉంది. అందుకని లగేజి దగ్గర కొంతమంది కాపలాగా ఉంటే, కొంతమందిమి స్టేషన్ బయటకొచ్చి చికాగో డౌన్ టౌన్ లో షికార్లు చేశాము. రెండు వీధుల అవతలనే సియర్స్ టవర్ ఉన్నది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన టవర్లలో ఒకటి. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్ కట్టకముందు ఇదే ప్రపంచంలోని అతి ఎత్తైన టవర్. ఈ బిల్డింగ్ లో 110 అంతస్తులున్నాయి.  దీనిని 1975 లో కట్టారు.


చికాగో డౌన్ టౌన్, సియర్స్ టవర్ దగ్గర


 చికాగో యూనియన్ రైల్వే స్టేషన్ లాంజ్ లో

చికాగో రైల్వే స్టేషన్, మన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కంటే బాగుంది, నీట్ గా ఉంది. సిటీ మధ్యలో ఉండటంతో దీనికి చాలా ఎంట్రన్స్ లున్నాయి. ఎక్కడా బెగ్గర్స్, హాకర్స్, కనపడలేదు. ప్లాట్ ఫామ్ మీద పడుకుని నిద్రపోయేవాళ్లు, అల్లరిచిల్లరగా తిరిగేవాళ్లు ఎక్కడా లేరు. ఎనౌన్స్ మెంట్ లేదు. వ్యాపారప్రకటనలు లేవు. అంత పెద్ద స్టేషన్ కూడా నిశ్శబ్దంగా, డీసెంట్ గా ఉంది.

ఇది, చెన్నై సెంట్రల్ స్టేషన్ మోడల్లో ఉంది. రైళ్లన్నీ వచ్చి ఒక డెడ్ ఎండ్ లో ఆగుతాయి. అక్కడనుంచి బయటకి దారులుంటాయి. ప్లాట్ ఫామ్స్ మీద మనుషులెవరూ ఉండరు. అవన్నీ అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా ఉంటాయి. మనుషులందరూ ఒక పెద్ద వెయిటింగ్ లాంజ్ లో ఉంటారు. రైలు టైమైనప్పుడు, ఒకతను వచ్చి ఆ రైలు పాసింజర్స్ ముందుకు రమ్మంటాడు. మనం వెళ్లి క్యూలో నిలబడితే, అతను దారిచూపిస్తూ తీసుకెళ్లి ఆ ప్లాట్ ఫామ్ కు దారి చూపుతాడు. చాలా డీసెంట్ గా ఉంది. 




చికాగో యూనియన్ రైల్వే స్టేషన్. డౌన్ టౌన్ కు వెళ్లే ఎగ్జిట్ దగ్గరనుంచి



ఇది ఈ స్టేషన్ కున్న అనేక ఎంట్రన్స్ లలో ఒకటి. దీనిలోనుంచి బయటకొస్తే సియర్స్ టవర్ దగ్గరకు వస్తాము.



సియర్స్ టవర్ దగ్గరలోని బిల్డింగ్స్ ఇలా ఉంటాయి


చికాగో రివర్ దగ్గర


చికాగో నది, సియర్స్ టవర్ దగ్గర
చికాగో ని 'విండీ టౌన్' అంటారు. లేక్ మిషిగన్ పక్కనే ఉండటంతో ఎప్పుడూ హోరుమని గాలివీస్తూ ఉంటుంది. ఈ రోజున కూడా బాగా చలిగాలి ఉంది.



చికాగో రివర్



స్టీమర్లో ఎక్కి, చికాగో నది గుండా తిరుగుతూ సిటీ టూర్ చేసే సౌకర్యం ఇక్కడుంది. నేను ఆ బ్రిడ్జి మీద  నిలబడి చూస్తూ ఉండగా  ఒక స్టీమర్ వచ్చింది. దాని వీడియో ఇది.



చికాగో యూనియన్ స్టేషన్ ప్లాట్ ఫామ్స్ 


సాయంత్రం అయిందింటికి చికాగో యూనియన్ స్టేషన్ ప్లాట్ ఫామ్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ ఐదుకే చీకటి పడిపోతోంది.


చికాగో డౌన్ టౌన్


షాంపేన్ అర్బానా స్టేషన్లో రిసెప్షన్

చికాగోలో సాయంత్రం అయిందింటికి డబల్ డెక్కర్ రైలెక్కి రాత్రి ఏడింటికి షాంపేన్ చేరుకున్నాం. అప్పటికే రాత్రి పదో, పదకొండో అయినట్లు చీకటిగా ఉంది. ఈ ట్రెయిన్ నిండా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్ ఉండటంతో చికాగో నుంచి ఇక్కడకు స్టూడెంట్స్ వస్తూపోతూ ఉంటారు.

శ్రీనివాస్, జ్యోతి, గీత స్టేషనుకొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు.



షాంపేన్ లో శ్రీనివాస్ గారి ఇంటినుండి 'సనత్సుజాతీయము' తెలుగు పుస్తకం విడుదల



షాంపేన్ సరస్వతీ మాత ఆలయ సందర్శన. ఇక్కడ చలి మైనస్ ఒక డిగ్రీ ఉంది.


షాంపేన్ లో
read more " మూడవ అమెరికా యాత్ర - 54 (చికాగో సందర్శన) "