“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, మే 2021, ఆదివారం

ఆఫ్ఘనిస్తాన్ కారుబాంబు దాడి - జ్యోతిష్య విశ్లేషణ

8-5-2021 శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో ఒక స్కూల్ బయట జరిగిన కారుబాంబు దాడిలో 50 మంది స్కూలు పిల్లలు చనిపోయారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువమంది ఆడపిల్లలు.

ఏం జరిగిందో జ్యోతిష్యపరంగా చూద్దాం.

ఏయే రాశులు ఏయే దేశాలను సూచిస్తాయి అన్న విషయం మీద ఇప్పటివరకూ జ్యోతిష్య ప్రపంచంలో స్పష్టత లేదు. నేను చేస్తున్న ఈ రీసెర్చి ఆ లోటును పూరిస్తున్నది. గతంలో నన్ను చాలామంది గేలిచేశారు 'జరిగిపోయిన వాటిని చెప్పి ఏం ఉపయోగం? జరగబోయేది చెప్పాలిగాని?' అంటూ. అలాంటివారికందరికీ ఒకటే చెప్పదలచుకున్నాను. 

జరగబోయేవి నేను చెప్పగలనో లేదో ఎవరికీ రుజువు చేసుకోవలసిన ఖర్మ నాకు లేదు. వాటిని ఆపాల్సిన ఖర్మ అంతకంటే లేదు. నా ఇష్టం వచ్చిన దారిలో నేను నడుస్తూ పోతాను గాని మీ ఇష్టప్రకారం నేను నడవనన్నది ముందుగా గ్రహించండి. మీ అదృష్టం బాగున్నది గనుకనే నా పోస్టులు చదువుతున్నారన్న సత్యాన్ని ముందుగా తెలుసుకోండి. ఇంతకంటే ఇంకేమీ చెప్పలేను.

మకరం అనేది ఇండియా రాశి అని మనకు తెలుసు. అలాగే మిడిల్ ఈస్ట్ ముస్లిం దేశాలకు ధనుస్సు సూచికని కూడా తెలుసు. ఇంతకుముందు ఎన్నో సంఘటనలు ఈ రెండు సూత్రాలను రుజువు చేశాయి. మతఛాందస టెర్రరిస్టు దేశమైన పాకిస్తాన్ కూడా ధనుస్సులోనే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ అనేది పాకిస్తానుకు ఇరాన్ కు మధ్యలో ఉన్నదేశం గనుక ఇది కూడా ధనుస్సులోనే ఉంటుంది. కనుక సంఘటన జరిగిన సమయానికి కన్యాలగ్నం ఉదయిస్తున్నప్పటికీ, ధనుర్లగ్నాన్నే లెక్కించవలసి ఉంటుంది. ఈ ఘటన జరిగినప్పుడు కన్య లగ్నమెందుకైందో ముందుముందు వివరిస్తాను.

ధనుర్లగ్నం నుంచి చూచినప్పుడు దశమైన కన్యారాశిమీద శనికుజుల బలమైన దృష్టి ఉన్నది. చతుర్థదృష్టిలో కుజుడు అతిబలవంతుడు. శని కోణదృష్టి కూడా కన్యమీదున్నది. ఇది దుర్ఘటనాయోగాన్ని సృష్టిస్తుందని గతంలో ఎన్నో పోస్టులలో నేను నిరూపించాను. నా పుస్తకాలలో కూడా వ్రాశాను. కనుక స్కూలు బయట కారుబాంబుదాడి జరిగింది. 50 మంది పిల్లలను చంపేసింది. పైగా, రాహుబుధుల పంచమదృష్టి కూడా కన్యమీదున్నది. ఇది చిన్నపిల్లల చావుకు కారణమైన యోగం.

అసలిదేం ఖర్మ? చనిపోయినవాళ్లు కూడా ముస్లిములే కదా? అందులోనూ 10 నుంచి 20 లోపున్న స్కూలు పిల్లలు. అందులోనూ ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఎందుకని ముస్లిం తీవ్రవాదులు ఇలా చేస్తున్నారు? విచక్షణ కూడా లేకుండా, మానవత్వం లేకుండా, జనాన్ని చంపుతున్నారేమిటి?అన్న అనుమానం మనకు వస్తుంది. దీనికి కొన్ని కారణాలున్నాయి వినండి.

1. చంపబడిన పిల్లలందరూ షియా ముస్లిములు. ఆ ప్రాంతంలో వారే ఎక్కువగా ఉంటారు. టెర్రరిస్టు ముస్లిములలో సున్నీలు ఎక్కువ.  షియాలు కూడా ముస్లిములే అయినప్పటికీ కూడా, సున్నీలకు షియాలంటే పడదు. అందుకని వాళ్ళని చంపుతూ ఉంటారు. చంపడానికి ఎవరో ఒకరు లేకపోతే వాళ్లలో వాళ్ళే చంపుకోవడం ముస్లిముల నైజం. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.

అసలీ షియాలు సున్నీల గోల ఏమిటి? అనే అనుమానం వస్తోందా? క్లుప్తంగా చెప్తా వినండి. అదొక  వారసత్వ యుద్ధం. ఆస్తికోసం తగాదా లాంటిది. మహమ్మద్ చనిపోయిన తర్వాత కొంతమంది ఆయన మామ పక్షాన చేరారు. ఇదొక వర్గం. కొంతమంది ఆయన అల్లుడి పక్షాన చేరారు. ఇదొక వర్గం. మామ వర్గం షియాలు. అల్లుడి వర్గం సున్నీలు. రెండు వర్గాలూ కొట్టుకు చచ్చారు. ఇప్పటికీ చస్తున్నారు. పక్కవాళ్ళని చంపుతున్నారు. వెరసి మామాఅల్లుళ్ళ సవాల్ అన్నమాట ! ఇది ప్రపంచనాశనానికి దారి తీస్తోంది. ఇంతకంటే సినిమా ఇంకేమీ లేదక్కడ.

2.  అమెరికా ఆఫ్ఘనిస్తాన్ల మధ్యన కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా సైన్యం, విడతలవారీగా ఆఫ్ఘనిస్తాన్ను వదలి వెళ్ళిపోతున్నది. ఇన్నాళ్లూ రక్షణగా ఉన్న అమెరికా సైన్యం వెళ్లిపోవడం మొదలయ్యే సరికి, ఇస్లామిక్ స్టేట్ వంటి టెర్రరిస్టు గ్రూపులు విజృంభిస్తున్నాయి. అందరూ చదువుకోవడం, అందులోనూ ఆడపిల్లలు చదువుకోవడం, ఉద్యోగాలు చెయ్యడం, ముస్లిం తీవ్రవాదులు ఇష్టపడరు. వాళ్ళ దృష్టిలో ఆడవాళ్లంటే చదువుకోకుండా వంటింటిలో మగ్గిపోతూ పిల్లల్ని కంటూ, వాళ్ళ సెక్స్ అవసరాలకి పనికొచ్చే బానిసలు మాత్రమే. అంతేగాని వాళ్ళు కూడా మోడర్నైజ్ అవడం, ప్రశ్నించడం, వారికస్సలు ఇష్టముండదు. కనుక స్కూలు బయట కారుబాంబు పేల్చేశారు. విద్యార్థులను, అందులోనూ ఆడపిల్లలను చంపేశారు. 

చరిత్ర చదివితే ఒక విషయం తెలుస్తుంది.

3. ఇతర దేశాలను ముస్లిములు ఎలా జయించారు? అంటే, ఒకటే జవాబు. రాక్షసత్వంతో, పైశాచికత్వంతో, క్రూరంగా జనాన్ని చంపి, భయభ్రాంతులను చేసి జయించారు. ఏ దేశంలోనైనా  సరే జనాన్ని భయపెట్టి మాత్రమే వాళ్ళు ఇప్పటిదాకా నెగ్గుకొస్తున్నారుగాని ప్రేమతో ఎవరినీ జయించడం ఇస్లాం చరిత్రలోనే లేదు.. ఛాందసఇస్లాంని నూరిపోస్తూ, మనుషులని ఎదగనివ్వకుండా, నోరెత్తనివ్వకుండా, ప్రశ్నించనివ్వకుండా చేస్తూ, పేదరికంలో నిరక్షరాస్యతలో ఉంచుతూ ముస్లిములు ఏ దేశంలోనైనా సరే నెగ్గుకొస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఇదే చేస్తున్నారు. అక్కడి ప్రజలు చదువుకుని ఎదిగి ఛాందస ఇస్లాం ను ప్రశ్నించడం వారికి  సుతరామూ ఇష్టం లేదు. అమెరికా సైన్యం ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోవడం తోనే ఆఫ్ఘనిస్తాన్లో సివిల్ వార్ ఖచ్చితంగా వస్తుంది.  దానికివన్నీ ముందు ఘట్టాలు.

నిన్న సాయంత్రం 4 గంటలకు ఆఫ్ఘనిస్తాన్లో కుజహోర జరుగుతున్నది. కుజుడు బాంబుదాడులకు హింసాత్మక సంఘటనలకు సూచకుడు. సప్తమంలో ఉంటూ ధనుస్సును బలమైన దృష్టితో చూస్తున్నాడు. చిన్నపిల్లలకు సూచకుడైన చంద్రుడు అష్టమాధిపతిగా, విద్యాకేంద్రమైన చతుర్దంలో ఉంటూ, 6 గ్రహాలతో తీవ్ర ఆర్గళత్వానికి గురై ఉన్నాడు. దశమకేంద్రం కన్య అయింది. కన్య అంటే వయసులో ఉన్న ఆడపిల్లలు. చదువుకునే విద్యార్థినులు. ప్రస్తుత సంఘటనలో వాళ్ళే ఎక్కువగా చనిపోయింది. లెక్క సరిపోయిందా మరి?

దశమాధిపతి అయిన బుధుడు కూడా విద్యార్థులకు సూచకుడే. అతడు యాక్సిడెంట్లకు సూచికైన వృషభంలో శుక్రరాహువులతో కలసి ఆర్గళదోషంలో బంధింపబడి ఉన్నాడు. బుధ రాహువులిద్దరూ కలసి చంద్రనక్షత్రమైన రోహిణిలో ఉంటూ చిన్నపిల్లల దారుణమైన చావును సూచిస్తున్నారు.

ఈ కుండలిలో ఆ సమయంలో బుధ - బుధ - బుధ దశ జరుగుతూ బుధునిమీద ఉన్న ఫోకస్ ను చూపిస్తున్నది. బుధుడు చిన్నపిల్లలకు సూచకుడని జ్యోతిషశాస్త్రంలో ఎల్కేజీలో ఉన్నవారికి కూడా తెలుసు ! 

నవాంశలో చూద్దామంటే, రాహుశనులిద్దరూ కలసి శపితయోగాన్నిస్తూ అమెరికాకు సూచికైన మిధునంలో ఉంటూ, ఆఫ్ఘనిస్తాన్ కు సూచికైన ధనుస్సులో ఉన్న చంద్రకేతువులను బలమైన దృష్టితో చూస్తున్నారు. ఇది గ్రహణయోగం.. ఈ యోగం ఏమి చెబుతున్నదో తెలుసా? అమెరికా బలగాలు వెళ్లిపోవడం ఆఫ్ఘనిస్తాన్ కు శాపమని, దీనివల్ల ఆ దేశంలో మనశ్శాంతి కరువౌతుందని, ముఖ్యంగా బలయ్యేది చిన్నపిల్లలు, ఆడవాళ్లే నని చెబుతున్నది. దీనికారణం 'శాంతి శాంతి' అని గొంతు చించుకునే ఇస్లాం తీవ్రవాదం. రాబోయే రోజుల్లో, ముఖ్యంగా సెప్టెంబర్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నరకం అవబోతున్నది.

ఇదీ ఆఫ్ఘనిస్తాన్ భవిష్యదర్శనం !

చూస్తూ ఉండండి ముందు ముందు నేను చెబుతున్నది నిజమౌతుందో లేదో !

ఇండియాలో ఏం జరిగినా గొల్లుమని ప్రతిదానికీ మతరంగు పూస్తూ, బీజేపీ మీదా, మోదీగారి మీదా బురదచల్లాలని చూస్తున్న టెర్రరిజం సపోర్టర్లు, పాకిస్తాన్ సపోర్టర్లు, కమ్యూనిస్టులు, మిగతా  దేశద్రోహులందరూ ఇప్పుడేమంటారో మరి? మాట్లాడరా ఇప్పుడు? నోరెత్తాలంటే భయంగా ఉందా? ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఎందుకు ఏమీ అనలేకపోతున్నారు?  పిరికిపందల్లారా !