“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

16, మే 2021, ఆదివారం

టౌటే తుఫాన్ - శుక్ర రాహువుల ప్రభావం

14-5-2021 తేదీన కేరళదగ్గరలోని అరేబియా మహాసముద్రంలో ఒక వాయుగుండం పుట్టింది. 15 వ తేదీకల్లా అది తుఫానుగా మారింది. నేటికది ఇంకా తీవ్రరూపం దాల్చింది. గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయి. నూరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. తుఫాన్ చేసే అల్లకల్లోలాన్ని సరిగ్గా ఎదుర్కోడానికి మూడురాష్ట్రాలూ సిద్ధపడుతున్నాయి. మంత్రులు వెస్ట్ కోస్ట్ లో మకాం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుని యంత్రాగమంతా సిద్ధమౌతోంది. లక్షద్వీప్ కు విమానాలు రద్దయ్యాయి. గత ఇరవై ఏళ్లలో ఇండియాలో ఇంతపెద్ద తుఫాన్ రాలేదని అంటున్నారు. మూడు రాష్ట్రాల పవర్ లైన్స్ కట్ అవుతున్నాయి.

జ్యోతిష్యదుర్భిణీ లోనుంచి ఏం జరుగుతున్నదో చూద్దాం.


శుక్ర రాహువుల పాత్ర

జలకారకుడైన శుక్రుడు ప్రస్తుతం రాహువును వేగంగా సమీపిస్తున్నాడు. రాహువుకూడా శుక్రుడినే సూచిస్తూ ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. అక్కడే మరొక జలగ్రహమైన చంద్రుడు కూడా ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. కనుక జలభూతం అమితమైన బలాన్ని సంతరించుకుంది. వీరి కోణదృష్టి మకరంలో ఉన్న శనిమీదున్నది. మకరరాశి భారతదేశానికి సూచిక. మన దేశపు స్వతంత్రసమయలగ్నం వృషభమే. అదే వృషభంలో ఇప్పుడు జలభూతం విజృంభించడం, టౌటే తుఫాన్ అదే సమయంలో తలెత్తడం కాకతాళీయమనుకుందామా?

శుక్రుడు రాహువుయొక్క 5 డిగ్రీల పరిధి (ఆర్బ్) లోకి రాగానే అరేబియా సముద్రంలో డిప్రెషన్ మొదలైంది. శుక్ర రాహువుల మధ్యన దూరం తగ్గుతున్న కొద్దీ తుఫాన్ బలపడుతున్నది. ఈ క్రింది పట్టికను గమనించండి.














తుఫాన్ దిశ ఎలా మారింది?

డిప్రెషన్ మొదలైన 14 వ తేదీన, అది తుఫాన్ గా మారిన 15, 16 వ తేదీలలో శుక్రుడు వృషభం 15 డిగ్రీలలోపలే ఉన్నాడు. అంటే, పశ్చిమదిశలో ఉన్నాడు. కనుక భారతదేశంలోని పశ్చిమ సముద్రంలో తుఫాన్ మొదలైంది. 17 వ తేదీనుంచి శుక్రుడు 15 డిగ్రీలను దాటి, ఉత్తరదిక్కులోకి ప్రవేశించాడు. కనుక తుఫాన్ ఉత్తరదిక్కుగా దిశను తీసుకుని, గోవా మీదుగా గుజరాత్ వైపు వెళ్లడం మొదలుపెట్టింది.

వృషభరాశిలో ఉన్న శుక్రుడు సవ్యదిశలో ముందుకు ప్రయాణిస్తున్నాడు. రాహువు దానికి వ్యతిరేకంగా అపసవ్యదిశలో ప్రయాణిస్తూ శుక్రుడిని మ్రింగబోతున్నట్లుగా కదులుతున్నాడు. వీరిద్దరి కంజక్షన్ ఎల్లుండి అంటే 18 వ తేదీన జరుగుతుంది. కనుక ఆ రోజున తుఫాన్ తీరాన్ని తాకుతుంది.ఆ తరువాత బలహీనపడిపోతుంది. 19 నుంచి శుక్రుడు రాహువును దాటి ముందుకు సాగిపోతాడు. కనుక తుఫాన్ బలహీనపడుతుందని ఊహిస్తున్నాను.

చూద్దాం ముందుముందు ఏం జరుగనున్నదో !