“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

15, జులై 2017, శనివారం

Tere Mere Sapne Ab Ek Rang Hai - Mohammad Rafi


Tere Mere Sapne Ab Ek Rang Hai

అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ క్లాసిక్ లవ్ సాంగ్, దేవానంద్ నిర్మించిన 'Guide' అనే సినిమాలోది. ఇది ఆల్ టైం క్లాసిక్ మూవీ. ఈ పాటలకు శైలేంద్ర అందించిన సాహిత్యం మరపురానిది. S.D.Burman స్వరపరచిన ఈ సినిమా పాటలన్నీ మరపురాని మధురగీతాలే. వింటుంటే ఈ నాటికీ ఇవి ఎంతో మాధుర్యాన్ని మనసులో కలిగిస్తాయి.

ఇది సందర్భోచితమైన పాట. ప్రేమగీతమే అయినప్పటికీ ఇందులో నేటి పాటల్లో లాగా వెకిలితనమూ, అసభ్యపదజాలమూ ఉండవు. ఒక గుండెను ఇంకొక గుండె ఓదార్చడం, నమ్మకాన్ని కలిగించడం, సున్నితమైన ప్రేమను పంచడం మాత్రమే ఉంటాయి. ఇలాంటి సున్నితభావాలను అతి తక్కువ పదాలలో పొదగడంలో శైలేంద్ర సిద్ధహస్తుడు. ఇతని సాహిత్యానికి తోడు, సచిన్ దేవ్ బర్మన్ సమకూర్చిన మధుర సంగీతమూ, దానిని శ్రావ్యంగా పాడిన రఫీ స్వరమూ అన్నీ కలసి ఈ పాటను ఒక మరపురాని మధుర ప్రేమగీతంగా మార్చాయి.

ఈ పాటలో దేవానంద్, వహీదా రెహమాన్ నటించారు. వారి నటన కూడా హృద్యంగానే ఉంటుంది.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:-- Guide (1965)
Lyrics:--Shailendra
Music:--Sachin Dev Burman
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------
Tere Mere Sapne Ab Ek Rang Hai
Ho Jaha Bhile Jaye Raahe
Ham Sang Hai
O O Tere Mere Sapne Ab Ek Rang Hai
Ho Jaha Bhile Jaye Raahe
Ham Sang Hai

[Mere Tere Dil Ka - The Tha Ek Din Milna
Jaise bahaarane par - The hai phool ka khilna]-2
O mere jeevan saathi
Tere Mere Sapne Ab Ek Rang Hai
Ho Jaha Bhile Jaye Raahe
Ham Sang Hai

[Tere dukh ab mere - Mere sukh ab tere
Tere ye do nainaa - Chand aur sooraj mere]-2
O mere jeevan saathi
Tere Mere Sapne Ab Ek Rang Hai
Ho Jaha Bhile Jaye Raahe
Ham Sang Hai

[Laakh manale duniyaa - Saath na ye chootegaa
Aake mere haathon me - Haath na ye chootega]-2
O mere jeevan saathi
Tere Mere Sapne Ab Ek Rang Hai
Ho Jaha Bhile Jaye Raahe
Ham Sang Hai

O O Tere Mere Sapne Ab Ek Rang Hai

Meaning

Your dreams and my dreams
are now of the same color
Wherever our paths may take us
We remain together

Your heart and my heart
are destined to meet one day
Like when spring season comes
Flowers are destined to bloom

Your sorrow is mine now
My happiness is yours now
These two eyes of yours
are my Sun and Moon

Let the world say a million things
We won't get separated
Coming into my hands
your hands will never leave

O my life's companion !
Your dreams and my dreams
are now of the same color
Wherever our paths may take us
We remain together

తెలుగు స్వేచ్చానువాదం

నీ కలలూ నా కలలూ
ఇప్పుడు ఒకే రంగులో ఉన్నాయి
మన దారులు మనల్ని ఎక్కడికైనా తీసుకుపోనీ
మనం కలిసే ఉందాం

నీ హృదయమూ నా హృదయమూ
ఇలా కలవాలని ఎప్పుడో వ్రాసి ఉంది
వసంతం వచ్చినపుడు
విరిసే పూలలా

నీ బాధలన్నీ నాకివ్వు
నా సంతోషాన్ని నువ్వు తీసుకో
నీ రెండు కళ్ళూ ఇప్పుడు
నా సూర్యచంద్రులు

లోకం మనగురించి ఏమైనా అనుకోనీ
మనం మాత్రం ఎన్నటికీ విడిపోము
నా చేతులలోకి వచ్చిన నీచేతులు
ఎప్పటికీ దూరం కావు

నీ కలలూ నా కలలూ
ఇప్పుడు ఒకే రంగులో ఉన్నాయి
మన దారులు మనల్ని ఎక్కడికైనా తీసుకుపోనీ
మనం కలిసే ఉందాం