నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

18, జులై 2017, మంగళవారం

Suhana Safar Aur Ye Mausam Hasee - Mukesh


Suhana safar aur ye mausam haseee

అంటూ ముకేష్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1958 లో వచ్చిన మధుమతి అనే సినిమాలోది. ఈ గీతానికి సాహిత్యాన్ని శైలేంద్ర అందించగా సంగీతాన్ని సలీల్ చౌదురీ సమకూర్చారు. 6 రోజుల క్రితం రిలీజైన సినిమాలో పాటలు మనకు గుర్తుండటం లేదు. కానీ 60 ఏళ్ళ క్రితం పాటలు ఇంకా గుర్తున్నాయి. అదీ ఆనాటి సంగీత సాహిత్యాల మహత్యం అంటే !!

అప్పట్లో హీరో ఇలా ప్రకృతిలో విహరిస్తూ పరవశించి పాడే పాటలు సినిమాలలో ఒక ఒరవడిగా ఉండేవి. ఈ పాటా అలాంటిదే. ఇందులో దిలీప్ కుమార్ నటించాడు.

ఈ పాట మొదట్లో గొర్రెల కాపరి గొర్రెలను అదిలిస్తూ అరిచే అరుపులు ఉంటాయి. అసలు పాటలో వాటిని ఎవరన్నారో నాకు తెలీదు గాని ఈ పాటలో నేనే ఆ బిట్ కూడా అన్నాను. ఇలాంటి మిమిక్రీలు చెయ్యడం మనకు చాలా సరదా కదా మరి !!

నా స్వరంలో కూడా ఆ మధురగీతాన్ని వినండి.

Movie:-- Madhumathi (1958)
Lyrics:--Shailendra
Music:-- Salil Choudhury
Singer:-- Mukesh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------
Suhana safar aur ye mausam haseee
Suhana safar aur ye mausam haseee
Hame dar hai ham kho na jaaye kahee
Suhana safar aur ye mausam haseee
Suhana safar aur ye mausam haseee
Hame dar hai ham kho na jaaye kahee
Suhana safar aur ye mausam haseee

[Ye kaun hasta hai phoolon me chup kar
Bahar bechain hai kiski dhun par] - 2
kahi gungun kahi runjhun ke jaise naache jamee

[Ye gori nadiyon ka chalna ujhal kar
Ke jaise alhad chale Pee se milkar] - 2
Pyare pyare ye nazare Nikhar hai har kahee

[Vo aasma jhuk rahaa hai jamee par
Ye milan hamne dekha yahee par] - 2
Meri duniya mere sapne Milenge shaayad yahee

Suhana safar aur ye mausam haseee
Hame dar hai ham kho na jaaye kahee
Suhana safar aur ye mausam haseee

Meaning

The journey is good
and the weather is pleasant
I am afraid that
I may lose my way somewhere

Hiding in the flowers
Who is smiling?
The weather is intoxicated
with somebody's tune
The Earth is dancing
with a hum here
and a beat there

These pure waters of rivers
are running with jest
as if a sweet girl is running
to meet her lover
Such lovely sights
are everywhere

The sky at the horizon
is bending to kiss the Earth
This wondrous meeting
I see only here
Perhaps my dreams may come true here

తెలుగు స్వేచ్చానువాదం

ప్రయాణం చాలా బాగుంది
ప్రకృతి మనోహరంగా ఉంది
ఎక్కడ నేను మైమరచి పోతానో తెలియడం లేదు

ఈ పూలలో దాక్కుని ఎవరు నవ్వుతున్నారో?
ప్రకృతి ఎవరి పాటలతో పరవశిస్తోందో?
ఈ నేల కూడా సంతోషంతో నాట్యం చేస్తోంది

ఈ నదుల స్వచ్చమైన జలాలు
తన ప్రియుని చేరడానికి పరుగెత్తే అమ్మాయిలా
గలగలా ప్రవహిస్తున్నాయి
ఎక్కడ చూచినా ప్రేమ ఉప్పొంగుతోంది

ఆకాశం వంగి భూమిని ముద్దాడటం
ఇక్కడే చూస్తున్నాను
నా కలలు ఇక్కడే నిజం కావచ్చు

ప్రయాణం చాలా బాగుంది
ప్రకృతి మనోహరంగా ఉంది
ఎక్కడ నేను మైమరచి పోతానో తెలియడం లేదు