“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

8, జులై 2017, శనివారం

Lag Ja Gale Ke Phir Ye - Lata Mangeshkar


Lag Ja Gale Ke Phir Ye Haseen Raat Ho Na Ho

అంటూ మధురాతి మధురంగా లతా మంగేష్కర్ ఆలపించిన ఈ గీతం 1964 లో వచ్చిన Wo Koun Thee అనే సినిమాలోది. ఇది ఎప్పటికీ గుర్తుండి పోయే క్లాసికల్ మధుర గీతం. ఆ తర్వాత ఎన్ని పాటలొచ్చినా, చిరస్మరణీయాలుగా నిలిచి పోయే పాటలు కొన్నే ఉంటాయి. వాటిల్లో ఇదీ ఒకటి.

ఈ పాటకు సాహిత్యాన్ని రాజా మెహదీ ఆలీఖాన్ సమకూర్చగా, సంగీతాన్ని మదన్ మోహన్ అందించారు. లతాజీ ఆలపించారు.

ఈ రాగాన్ని 'పంతులమ్మ' సినిమాలో బాలూగారు పాడిన 'ఎడారిలో కోయిలా' అనే పాటలో వాడారు. ముఖ్యంగా 'నాకోసమే విరబూసిన మనసున్న మనసైన మరుమల్లిక' అనే చరణంలో ఈ రాగం స్పష్టంగా వినిపిస్తుంది. సంగీత దర్శకుడు సత్యం చాలాకాలం పాటు శంకర్ జైకిషన్ దగ్గర డోలక్ ఆర్టిస్టుగా పనిచేశాడు. హిందూస్తానీ రాగాలను తెలుగులోకి తేవాలంటే అప్పట్లో సత్యమే దిక్కు. అందుకే ఈ రాగాన్ని ఆ పాటలో వాడాడు. తెలుగు పాట కూడా బాగా హిట్ అయింది. 

ఇది ఫిమేల్ సాంగ్. కానీ మాధుర్యానికి ఆడా మగా భేదం లేదు గనుక ఈ పాటను ఆలపించాను. మనసు పెట్టి వింటే చాలా కదిలించే పాట ఇది. నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:-- Wo Koun Thee (1964)
Lyrics:-- Raja Mehdi Ali Khan
Music:-- Madan Mohan
Singer:-- Lata Mangeshkar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------------
[Lag ja gale ke phir ye hasi raat ho na ho
Shayad phir is janam me mulaqaat ho na ho]- 2

Hamko mili hai aaj ye – Ghadiyaa naseeb se
Jee bhar ke dekh leejiye – Hamko kareeb se
Phir aapke naseeb me – Ye baat hona ho
Shayad phir is janam me mulaqaat ho na ho
Lagjaa gale E E

Paas aayiye ke ham nahi – Ayenge baar baar
Baahe gale me daal ke – Ham role zaar zaar
Aakhon se phir ye pyaar ki – Barsaat ho na ho
Shayad phir is janam me mulaqaat ho na ho

[Lag ja gale ke phir ye hasi raat ho na ho
Shayad phir is janam me mulaqaat ho na ho]- 2

Lagjaa gale E E

Meaning

Embrace me closely because
this lovely night may not come again
May be in this life
we may not meet again and again

Because of our good luck
we got these moments of tonight
Look at me as closely as you can
till you are fully satisfied
You may not get this chance again and again
May be in this life
we may not meet again and again

Come close to me because
I will not come again and again
Let us put our arms around each other's necks
and cry to our hearts' content
These tears of love
may or may not rain again
May be in this life
we may not meet again and again

Embrace me closely because
this lovely night may not come again
May be in this life
we may not meet again and again

తెలుగు స్వేచ్చానువాదం

నన్ను నీ దగ్గరగా తీసుకో
ఎందుకంటే ఈ రాత్రి మళ్ళీ మనకు రాకపోవచ్చు
ఈ జీవితంలో మనం మళ్ళీ కలవకపోవచ్చు

మన అదృష్టం బాగుండి
ఈ రాత్రి ఈ సమయం మనకు దొరికింది
నీకు తృప్తి కలిగే దాకా నన్ను బాగా చూసుకో
ఎందుకంటే ఈ జన్మలో నీకీ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు
ఈ రాత్రి మళ్ళీ మనకు రాకపోవచ్చు
ఈ జీవితంలో మనం మళ్ళీ కలవకపోవచ్చు

నాకు దగ్గరగా రా
ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ ఇలా రాలేను
ఒకరి బాహువులలో ఒకరు ఒదిగి పోయి
తనివితీరా విలపిద్దాం రా
ఎందుకంటే ఈ ప్రేమాశ్రువులు మళ్ళీ కురవకపోవచ్చు
ఈ రాత్రి మళ్ళీ మనకు రాకపోవచ్చు
ఈ జీవితంలో మనం మళ్ళీ కలవకపోవచ్చు

నన్ను నీ దగ్గరగా తీసుకో
ఎందుకంటే ఈ రాత్రి మళ్ళీ మనకు రాకపోవచ్చు
ఈ జీవితంలో మనం మళ్ళీ కలవకపోవచ్చు