“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

1, నవంబర్ 2023, బుధవారం

రాహుకేతువుల రాశిమార్పు - ఫలితాలు

30-10-2023 నాడు రాహుకేతువులు రాశుల మార్పు జరిగింది. ఈ మార్పు ఫలితాలను ఎవరికి వారు గమనించుకోవచ్చు. స్థూలంగా ఈ మార్పులు ఉంటాయి. లగ్నం నుంచి చంద్రలగ్నం నుంచి లెక్కించాలి.

మేషరాశి

దూకుడు తగ్గుతుంది. స్థానమార్పు, ప్రయాణాలు. రోగపీడ, ఆస్పత్రి సందర్శన. మానసిక వ్యధ. కర్మపరంగా ఆటుపోట్లు ఎక్కువౌతాయి.

వృషభరాశి

క్రొత్త స్నేహాలు. పాతరోగాలు. అనైతిక లాభాలు. కుటుంబంతో విరోధం. సంతానంతో ఎడబాటు.

మిధునరాశి

ఇంటిలో చికాకులు. విలువైన వస్తువులు పోవడం. మానసిక అశాంతి. అతి తెలివి. తల్లి మరణం లేదా అనారోగ్యం.

కర్కాటక రాశి

స్నేహితుడు, తమ్ముడు లేదా చెల్లెలు మరణం లేదా తీవ్ర అనారోగ్యం. స్థానచలనం. ఆధ్యాత్మిక చింతన. పరాయి మతాల అధ్యయనం. మతమార్పిడి.

సింహరాశి

ఇంటివియోగం. దీర్ఘరోగం. అనుకోని నష్టం, లాభం. నోటి దూల. కంటి జబ్బులు. విపరీతపు తిండి.

కన్యారాశి

బిజినెస్ నష్టం. పార్ట్ నర్స్ తోను, జీవిత భాగస్వామి తోను గొడవలు,  మోసపోవడం. నిరాశ. తగ్గని రోగం. భయం.

తులారాశి

నిద్రపట్టని సమస్యలు. మానసిక ఆందోళన. శత్రుబాధ. రోగాలు, కోర్టుబాధలు. నష్టాలు.

వృశ్చిక రాశి

సంతానంతో ఇబ్బందులు. మానసిక అస్థిరత. క్రొత్త స్నేహాలు. తెలివిగా ఉన్నామనుకుంటూ మోసపోవడం. అన్న లేదా అక్కల మరణం.

ధనూరాశి

ఉత్సాహం. విశాలధోరణులు. పెరిగే సమాజ సంబంధాలు. ఇంటిలో అనైతిక కార్యక్రమాలు. ఉద్యోగ మార్పు. అతితెలివి. తండ్రి లేదా ఆ స్థాయి బంధువుల మరణం.

మకరరాశి

ధైర్యం. క్రొత్త స్నేహితులు. ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. గురువులను ఆశ్రయించడం. ధ్యానం మొదలైన సాధనలు. గురువులు లేదా పెద్దల మరణం.

కుంభరాశి

నోటిదురుసు. అతి తిండి. కంటి రోగాలు. పెద్ద మొత్తంలో ధనరాబడి, అదే విధంగా పోబడి. దీర్ఘరోగాలు.

మీనరాశి

ఇతర మతాల అధ్యయనం. ఆధ్యాత్మిక చింతన. విలువైన వస్తువులు పోవడం. అహంకారపూరిత ప్రవర్తన. ఇతరులపైన పెత్తనం చెయ్యడం.

ఈ ఫలితాలు రాబోయే ఏడాదిన్నరలో జరుగుతాయి. ఇప్పటికే మొదలైపోయాయి. గమనించుకోండి.