నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

26, మే 2017, శుక్రవారం

మే 2017 అమావాస్య ప్రభావం

మే 2017 అమావాస్య ప్రభావం చాలా దారుణంగా ఉన్నది. దానికి కారణం ఈ అమావాస్య వృషభరాశిలో రావడం. ఈ రాశిలోనే ప్రజాజీవితాన్ని శాసించే రోహిణీ నక్షత్రం ఉంటున్నది. ఇక్కడనుంచి అష్టమంలో కర్మ కారకుడైన శనీశ్వరుడున్నాడు అందుకే ఇన్నిన్ని దారుణ సంఘటనలు జరుగుతున్నాయి.

>>యూపీ లో బులంద్ సహార్ హైవే మీద నలుగురు ఆడవాళ్ళు గ్యాంగ్ రేప్ కు గురయ్యారు. వారి కుటుంబంలో ఎదురు తిరిగిన ఒకడిని దుండగులు అక్కడే కాల్చి చంపారు.

ఇదీ మన ఇండియాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి. యూపీలో క్రూరత్వమూ హింసా ఎప్పుడూ ఎక్కువే. మిగతా రాష్ట్రాలలో రౌడీయిజం ఉంటుంది. కానీ యూపీలో అయితే డెకాయిటీ ఉంటుంది. అదీ యూపీకీ మిగతా రాష్ట్రాలకూ తేడా. కానీ ప్రస్తుతం ఎన్నో గొప్పలు చెప్పిన ఆదిత్యనాథ్ యోగిగారు అక్కడి సిఎం కదా ! చూద్దాం ఎంత త్వరగా కేస్ ను సాల్వ్ చేయిస్తారో? నిజంగా నేరస్తులను పట్టుకుంటారో లేక పాత కేడీలను ఇంకొక సారి ఫ్రేం చేసి చూపిస్తారో?

ఒకవేళ నేరస్తులు దొరికినా, ఈలోపల హ్యూమన్ రైట్స్ వాళ్ళు రంగం లోకి దిగుతారు. ఆ నేరస్తుల కమ్యూనిటీ సంఘాలు గోల చేస్తాయి. చివరకు ఏ శిక్షా పడకుండా నేరస్తులు చక్కగా తప్పించుకుంటారు. లేదా లోకల్ కోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ వరకూ కేసు ఇరవై ఏళ్ళ పాటు సాగుతుంది. ఈ లోపల నేరస్తులలో కొందరు చనిపోతారు. మన ఇండియాలో న్యాయం వరస ఇలా ఉంటుంది.

విచిత్రం ఏమంటే పోయినేడాది జూలైలో ఇలాంటి కేసే ఒకటి యూపీలోనే జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరిగింది. 

మాంచెస్టర్ ఉగ్రవాదులను రెండు రోజులు తిరగకుండా వీళ్ళు పట్టేసారు. యూపీలో మనవాళ్ళ నిర్వాకం ఎలా ఉంటుందో చూద్దాం !

ఇక్కడ అమెరికాలో అయితే, ఇండియా లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీద జోకులు పేలుతున్నాయి. మనల్నీ మన ప్రభుత్వాలనీ మన పోలీసులనీ కోర్టులనీ ఎగతాళి చేస్తూ పగలబడి నవ్వుతున్నారు ఇక్కడ.

>>మహారాష్ట్ర సి.ఎం.దేవేంద్ర ఫద్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మేజర్ ప్రమాదం నుంచి తప్పించుకుని లాతూరులో క్రాష్ లాండింగ్ అయింది.

>> ఇక రవాణా ప్రమాదాలకు, నేరాలకు లెక్కే లేదు. చిన్నా పెద్దా సంఘటనలు ఈ రెండు రోజులలో ఎన్నో జరిగాయి. అవన్నీ వ్రాయడం నా అభిమతం కాదు. గత రెండు రోజులలో ఎన్ని జరిగాయో ఇండియాలో ఏ న్యూస్ పేపర్ చూసినా తెలుస్తుంది.

అమావాస్య ప్రభావం మళ్ళీ రుజువైంది కదూ !