“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, మే 2017, బుధవారం

రెండవ అమెరికా యాత్ర - 22 (ఫెన్ విల్లి రిట్రీట్ హోమ్)

ఫెన్ విల్లి అనే ఊళ్ళో మేము తీసుకున్న రిట్రీట్ హోమ్ ఒక బంగళాలాగా ఉంది. ఇక్కడ ఇళ్ళన్నీ చాలా ప్లాన్డ్ గా కడతారు. అన్నీ చెక్క ఇళ్ళు. ప్రతి ఇంటికీ హీటింగ్ సిస్టం ఉంటుంది. దానిలోనుంచే రూమ్ హీటింగ్, వాటర్ హీటింగ్ రెండూ జరుగుతాయి.

ఈ హోమ్ లో సెల్లార్, సెకండ్ ఫ్లోర్ రెండున్నాయి. ముందుగా ఒక పదిహేను మెట్లెక్కి వరంగ్దాలోకి వెళ్ళాలి. అక్కడనుంచి హాల్లోకి దారి ఉంది. హాలూ కిచేనూ కలిసే ఉన్నాయి. హాల్లోంచి ఇంకొక వరండాలోకి రెండు పెద్ద రూములలోకీ దార్లున్నాయి. అలాగే, వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలం లోకి దారి ఉన్నది.హాల్లోంచి ఒక పక్కగా సెల్లార్ లోకి మెట్లున్నాయి. సెల్లార్ కూడా పై ఫ్లోర్ అంత పెద్దది. అందులో పెద్ద హాలూ, ఒక మూడు రూములూ ఉన్నాయి. బాత్రూములు విడివిడిగా ఉన్నాయి.

ఈ ఇల్లు ఉన్న స్థలం చుట్టూ U ఆకారంలో సరస్సు ఉన్నది. అంటే లేక్ లాక్డ్ ల్యాండ్ మీద ఈ ఇల్లు ఉన్నదన్నమాట. లేక్ ఒడ్డున U ఆకారంలో వరుసగా ఇళ్ళున్నాయి. వర్షాలు బాగా పడితే చుట్టూ ఉన్న సరస్సు నీళ్ళు కొన్ని ఏరియాలలోకి చొచ్చుకుని వస్తున్నాయి. అందుకని ఒకవైపు ఇళ్ళను నేలకంటే ఎత్తుగా కట్టారు.

ఉదయం లేచేసరికి వాన తగ్గింది. కానీ ఎండ లేదు. చాలా చలిగా ఉన్నది.

ఈ ఇంట్లో 2017 USA రిట్రీట్ జరిగింది.