“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, మే 2017, గురువారం

TORI Radio program మళ్ళీ మే 16th న జరుగుతుంది

మొన్న TORI Radio program ఇచ్చినపుడు సమయం చాలక పోవడం వల్ల చాలామంది శ్రోతల ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోయాను.చాలామందికి అసలు లైనే కలవలేదు. అందుకని మళ్ళీ మే 16 న ఇంకోసారి రేడియోలో నా శ్రోతలను కలవబోతున్నాను.

మొన్న ప్రోగ్రాం లో పరిచయ కార్యక్రమానికి ఒక గంట సరిపోయింది. ప్రశ్నలు జవాబులకు ఒక గంట మాత్రమే మిగిలింది. కానీ ఈసారి పరిచయం లేదు.కనుక రెండు గంటలూ శ్రోతల ప్రశ్నలకు జవాబులు చెప్పడమే జరుగుతుంది. కనుక శ్రోతలతో మాట్లాడటానికి ఎక్కువ సమయం దొరుకుతుంది.

మొన్న నాతో మాట్లాడలేకపోయినవారు ఈ సారి వారివారి ప్రశ్నలతో మళ్ళీ ప్రయత్నం చెయ్యవచ్చు.