7, జులై 2016, గురువారం

మా అమెరికా యాత్ర - 28 (గాంగెస్ ఆశ్రమంలో మరపురాని రోజులు)

స్వామీజీ వెళ్ళిపోయాక గుర్తొచ్చింది,భోజన సమయం అయింది కదా, ఆయన్ను భోజనానికి ఉండమని చెబితే బాగుండేది కదా అని. ఈ విషయం మనవాళ్ళను అడిగితే, ' మేమాయన్ను అడిగాము. ఆయన లంచ్ వండుకొని వచ్చారట.ఇంకోసారి వస్తానన్నారు.' అని చెప్పారు.

ఈ అయిదురోజులూ ఆడవాళ్ళందరూ కిచెన్ లో మాట్లాడుకుంటూ తలా ఒక పని చేసుకుంటూ చకచకా వంటలు చేసేశారు.అందరూ కలసిమెలసి పనులు చేసినా, ముఖ్యంగా శకుంతలగారు,రజితగారు,సుమతిగారు కిచెన్ లో బాగా కష్టపడ్డారు. వారికి నా ప్రత్యేకాభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

లంచ్ అయ్యాక కొద్ది సేపు రెస్ట్ తీసుకుని ఆశ్రమం వెనుక ఉన్న అడవిలోకి షికారుకు బయలుదేరాము.ముందుగా దేవాలయానికి వెళ్లి కాసేపు కూచుని, ఆ తర్వాత వెనుకగా ఉన్న అడవిలోకి వాకింగ్ కు వెళ్లి చాలాసేపు తిరిగి రిట్రీట్ హోం కు తిరిగి వచ్చాము.దారిలో మాటలన్నీ జోకులతో కూడిన ఆధ్యాత్మికమే.

ఆ ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

 ///
























 

















read more " మా అమెరికా యాత్ర - 28 (గాంగెస్ ఆశ్రమంలో మరపురాని రోజులు) "

3, జులై 2016, ఆదివారం

జూలై 2016 - అమావాస్య ప్రభావం

రేపే అమావాస్య.

ఈ అమావాస్య చాలా దారుణమైన ప్రభావాలను చూపిస్తోంది.ఈ ప్రభావాలు వ్యక్తిగత జీవితాల మీదా, సామూహిక జనజీవనం మీదా సమానంగా ఉన్నాయి.

దానికి కారణం ఏమంటే - ఈసారి అమావాస్య చంద్రుని పైన బుధ,శుక్ర,కుజ,కేతువుల ప్రభావాలున్నాయి. దీనికి తోడుగా గురు రాహువుల సంయోగ యోగం ఇంకా అంతరిక్షంలో కొనసాగుతూనే ఉంది. అందుకని ఈ ప్రభావాలన్నీ కలసి మనుషులను నానా రకాలుగా ఊపుతాయి.

ముఖ్యంగా చంద్రునిపైన ఉన్న కుజ కేతువుల ప్రభావం వల్ల హింసాత్మక సంఘటనలు ఎక్కువౌతాయి. ప్రస్తుతం జరుగుతున్నవి అవేగా?

మొన్న హైదరాబాద్ లో ISIS తో సంబంధాలున్న తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేసి వారిదగ్గర బాంబులు తయారు చేసే రసాయనాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.గుడులనూ గోపురాలనూ టార్గెట్ చేసుకుని ఈ పధకాన్ని రచిస్తున్నామని అరెస్టైన వాళ్ళు చెబుతున్నారు. ఈ అరెస్టులు జరగకపోతే, హైదరాబాద్ ప్రజలకు రంజాన్ కానుకగా మరోసారి విధ్వంసం మాత్రమే దక్కేది.

బంగ్లాదేశ్ లో రోజుకొక హిందూ దేవాలయాన్ని ఎటాక్ చేస్తున్నారు.రోజుకొక హిందూ పూజారిని (వీరిలో చాలామంది వృద్ధులు) దారుణంగా చంపుతున్నారు.పూజారులను చంపితే ఆ ఆలయాలలో పని చెయ్యడానికి ఎవరూ ముందుకు రారు.కాలక్రమేణా అవి పాడుబడి పోతాయి.అప్పుడు వాటిని మసీదులుగా మార్చుకోవచ్చు.ఇదీ వాళ్ళ రాక్షస ప్లాన్.

సిరియాలో అయితే - తమ నగరం మీద తామే బాంబింగ్ చేసుకోవలసిన ఖర్మ ఆ దేశానికి పట్టించింది ఇస్లామిక్ ఉగ్రవాదం. తమ పౌరుల్ని తామే చంపుకుంటోంది ఆ దేశం. ఆ దేశంలో ఇస్లాం స్థాపిస్తున్న 'శాంతి' అలా ఏడిసింది.

నిన్న ఢాకాలో ఒక రెస్టారెంట్లో సివిలియన్స్ ను బందీలుగా పట్టుకున్న ఇస్లాం తీవ్రవాదులు 20 మందిని దారుణంగా గొంతులు కోసి చంపేశారు.వారిలో ఇటలీ వాసులు చాలామంది ఉన్నారు.జపనీయులున్నారు.మన దేశపు అమ్మాయి కూడా ఒకరున్నారు.విచిత్రం ఏమంటే - ఖురాన్ చదవగలిగిన వారిని ఏమీ అనకుండా, వారిని పక్కకు తీసి భోజనాలు కూడా పెట్టి బాగా చూచుకున్నారు. ఖురాన్ చదవలేని వారిని మాత్రం నానా చిత్రహింసలూ పెట్టి గొంతులు కోసి చంపేశారు.

మరోవైపు 'ఇస్లాంకు చెడ్డపేరు తేకండి' అని బంగ్లాదేశ్ ప్రధాని ప్రకటన చేసింది. అంటే - మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు.ఎంతమంది దారుణంగా చంపబడ్డారనేది ముఖ్యం కాదు. ఒక మతానికి వచ్చే చెడ్డపేరే వాళ్ళకు ముఖ్యం !! పైగా ఎన్ని చెడుపనులు చేసినా సరే, చెడ్డ పేరు మాత్రం రాకూడదట.భలే గొప్ప మతం కదూ !! ఇంత జరుగుతున్నా కూడా ఇస్లాం అంటే 'శాంతి' అని మనం నమ్మే తీరాలి !!

పైగా ఆమె ఇంకో మాటంది. ఈ తీవ్రవాదులెవరూ మదరసాల నుంచి రాలేదట.వీళ్ళంతా బాగా చదువుకున్న యూనివర్సిటీ పిల్లలట. ఆమె ఏం చెప్పాలనుకుంటోంది? అంటే మా దేశంలో చాందస ఇస్లాం ఎంతమాత్రం లేదు.మదరసాలలో తీవ్రవాదం నూరిపొయ్యడం లేదు అని చెప్పాలనుకుని అంతకంటే ఇంకో ఘోరమైన స్టేట్మెంట్ ఇచ్చేసింది. అదేంటంటే - మా యూనివర్సిటీలే ఇప్పుడు విధ్వంసకర ఇస్లాం కు అడ్డాలుగా మారాయి.ఇక మాకు మదరసాలతో పనేముంది అని నోరుజారి ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది.

చదువుకూ సంస్కారానికీ ఏమీ సంబంధం లేదన్న విషయం సివిల్ ఇంజనీరింగూ పబ్లిక్ అడ్మినిష్ట్రేషనూ చదువుకున్న బిన్ లాడెన్ ఎప్పుడో ప్రూవ్ చేశాడు.ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ ప్రధాని చెప్పవలసిన పని లేదు.ఈ సోది మాటలు ఆపి ఆ దేశంలో హిందువులకు రక్షణ కల్పిస్తే చాలు.

ఒకవైపు పాకిస్తాన్ నూ మరోవైపు బంగ్లాదేశ్ నూ తమ అడ్డాలుగా మార్చుకుని, అక్కడనుంచి ఇండియాలో అల్లకల్లోలం సృష్టించడమే తమ ఆశయం అని ISIS రాక్షసులు బాహాటంగా ప్రకటనలు చేస్తున్నారు.

బ్రిటన్ విమానాశ్రయాన్ని ఎటాక్ చేస్తామని ఓపన్ గా ప్రకటన చేశారు.

ఇవన్నీ చూస్తూ కూడా ఇస్లాం అంటే శాంతే అని మనం నమ్మాలి !!!

వాటే జోక్ !!

ఇస్లాంలో మొదటినుంచీ రెండు రకాలైన వర్గపోకడలున్నాయి.ఒక వర్గమేమో మా మతం అంతా శాంతి అని నీతులు వల్లిస్తూ ఉంటారు.ఇంకొక వర్గమేమో ఇతర మతాల వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళూ వీళ్ళూ దోస్తులే. లోపల్లోపల ఒకరికొకరు చక్కగా హెల్ప్ చేసుకుంటూనే ఉంటారు. బయటకు మాత్రం నాటకం ఆడుతూ ఉంటారు.ఈ నాటకం నిన్న గాక మొన్న పుట్టిన చిన్న పిల్లాడికి కూడా తెలుసు.

చరిత్రను పరికిస్తే పఠిస్తే ఒక భయంకరమైన సత్యం కనిపిస్తుంది.ఇస్లాం మతం అనేది ఎప్పుడూ కూడా శాంతియుత మతం కానేకాదు.నిరంతరం కొట్టుకు చస్తున్న ఎడారి తెగల మధ్య యుద్దాలలోనే అది పుట్టింది.ఎదుటి వాడి గొంతు మీద కత్తిపెట్టి, 'ఇస్లాం లోకి మారతావా లేదా చస్తావా' అని అడగడమే ఎప్పుడూ ఆ మతం చేస్తూ వచ్చింది గాని శాంతితో అదెప్పుడూ వ్యాప్తి చెందలేదు.హింసతోనే ఆ మతం ఎప్పుడూ వ్యాప్తి చెందుతూ వచ్చింది.లేదా నవాబుల కాలంలో డబ్బుకోసం ఆశపడి మతం మారినవాళ్ళు ఉన్నారు. 

కనుక - డబ్బు, భయం ఈ రెండే ఎవరైనా ఇస్లాంలోకి మారడానికి చోదకశక్తులుగా చరిత్ర చదివిన వారికి కనిపిస్తాయి గాని వేరే ఇంకేమీ కనిపించవు.

మరి సాటి మనుషులను అలా దయాదాక్షిణ్యాలు లేకుండా చంపే తీవ్రవాదులు ఎందుకు అలా చేస్తున్నారు? వారికి జాలీ కరుణా ఉండవా? అని ప్రశ్నిస్తే ఒక భయంకరమైన సత్యం కనిపిస్తుంది.

అది వాళ్ళ తప్పు కూడా కాదు.అది వాళ్ళ మతగ్రంధం తప్పు.

"ఇస్లాంనూ అల్లానూ నమ్మని కాఫిర్లను చంపండి.అలా చంపడం తప్పు కాదు. పైగా అలా చంపడం వల్ల మీరు అల్లాకు ప్రియులౌతారు.ఆయన మిమ్మల్ని డైరెక్ట్ గా స్వర్గానికి తీసుకుపోతాడు.ఒకవేళ కాఫిర్లతో యుద్ధంలో మీరు చనిపోతే మీరు ఘాజీలు గా మారి అప్పుడు కూడా స్వర్గానికే డైరెక్ట్ గా  వెళ్లి అల్లా పక్కన కూచుంటారు.కనుక విజృంభించండి.జిహాద్ చెయ్యండి.' - ఈ రకంగా తలాతోకా లేని హింసను నూరిపోసే పద్యాలు ఖురాన్ లో దాదాపు 300 వరకూ ఉన్నాయి.

చిన్నప్పటినుంచీ ఇలాంటి బోధలను నూరిపోస్తే, అవి చదివిన వాళ్ళు ఏమనుకుంటారు? అవి దైవం సరాసరి చెప్పినవి కనుక, దైవాదేశాలు కనుక ,వాటిని పాటించడం మంచిదే అనుకుంటారు.పాటించక తప్పదు అనుకుంటారు.పాటించడం తమ ధర్మం అనుకుంటారు.

జిహాదీ లందరూ అలా గుడ్డిగా ఆ పద్యాలను నమ్ముతున్న వాళ్ళే.

కనుక అసలు తప్పంతా సోకాల్డ్ తీవ్రవాదులది కాదు.తప్పంతా ఖురాన్ ది. ఆ విధంగా సాటిమనుషుల మధ్యన హింసను ప్రేరేపించడం అది చేస్తున్న పెద్ద తప్పు.కానీ దానిలోని పద్యాలను మార్చే ధైర్యం ఎవరికీ లేదు.

అస్పృశ్యులనబడేవారు వేదాలను వినరాదని మనుస్మృతి చెబుతోంది గనుక దానిని రోడ్డు మీద పెట్టి పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు మన దేశపు కొందరు పౌరులు.మరి సాటి మనుషులను నిర్దాక్షిణ్యంగా గొంతులు కోసి చంపితే డైరెక్ట్ గా స్వర్గం వస్తుందని చెబుతూ రెచ్చగొడుతున్న పుస్తకాలను ఏం చెయ్యాలి?దీని గురించి ఏ సోకాల్డ్ మేధావులూ మాట్లాడరెందుకో? కనీసం అలా మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ లేదెందుకో? ఈ విషయం గురించి చర్చించమంటే ఏ టీవీ చానలూ ముందుకు రాదు. సడెన్ గా అందరూ మూగవాళ్లై పోతారు.వెన్నులోనుంచి వణుకు పుట్టుకొస్తుంది.కానీ హిందూమతాన్ని విమర్శించమంటే మాత్రం ప్రతివాడూ ముందుకొస్తాడు.ఇదే అసలైన వింతల్లో వింత.

ఈ 300 పద్యాలనూ ఖురాన్ నుంచి తొలగించే ఊహను ఒకప్పటి టర్కీ ప్రెసిడెంట్ అయిన ముస్తఫా కెమల్ పాషా చేశాడు.కానీ ఆయన గోడు ఎవరూ పట్టించుకోలేదు.అయినప్పటికీ, ఆయన చాలా సంస్కరణలను వారి సమాజంలో తెచ్చాడు.అందుకే ఇప్పుడు టర్కీలో ఉన్నది ఇస్లామే అయినప్పటికీ అది ఒక ఉదారవాద దేశంగా మంచి పేరును సంపాదించుకుంది. కానీ, ఇస్లాంలో పిడివాదానికే తప్ప ఉదారవాదానికి ఎప్పుడూ తావుండదు.దానిలో ఉన్న హింసాత్మక బోధలను కొద్దిగానైనా మారుద్దామని ఎవడైనా ప్రయత్నిస్తే చాలు, వాడికి ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లే.కానీ మాది చాలా శాంతియుత మతం అని వారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.ఇది చాలా హాస్యాస్పదమైన విషయం.

ఇతర మతాల వారిమీద హింసను రెచ్చగొట్టే పద్యాలను ఖురాన్ లో నుంచి తొలగించి ఆ పుస్తకాన్ని ఎడిట్ చెయ్యనంత వరకూ ఇస్లామిక్ తీవ్రవాదం ప్రపంచం నుంచి ఎన్నటికీ మాయం కాదు.ఈ విషయాన్ని మేధావులూ, దేశాధినేతలూ ముందుగా గుర్తించాలి.

కానీ ఇది జరుగుతుందని నాకైతే నమ్మకం లేదు.

సరే ఈ గోల ఎలా ఉన్నప్పటికీ - ఈ అమావాస్య మాత్రం ఉగ్రవాద ధోరణులను రెచ్చగొట్టే స్పందనలు అధికంగా కలిగి ఉంది. అందుకే గత మూడు రోజులుగా ఎక్కడ చూచినా ఇవే కనిపిస్తున్నాయి.

ఇదంతా సామాజిక ప్రభావం. ఇక. వ్యక్తిగత జీవితాలలో చూస్తే - 
  • అనవసర ఉద్రేకాలు చాలా కుటుంబాలలో కనిపిస్తాయి.
  • చిన్న చిన్న వాటికే పెద్దగా అరుచుకోవడం, ఏడవడం, గొడవ పడటం మొదలైనవి జరుగుతాయి.
  • ఎక్కడ చూచినా చిన్న చిన్న దుర్ఘటనలు కనిపిస్తాయి.
  • ఒకరినొకరు అపార్ధం చేసుకోవడం,మానసికంగా ఉద్రేకపడటం,అలగడం వగైరాలు ఎక్కడ చూచినా కనిపిస్తాయి.
  • హిస్టీరియా,పిచ్చి,ఫిట్స్ మొదలైన రోగాలతో బాధ పడేవారికి ఈ సమయంలో అవి చాలా ఎక్కువగా ఉద్రేకిస్తాయి.
జ్యోతిష్య శాస్త్రం నిజమే అనడానికి ప్రతి అమావాస్యకూ పౌర్ణమికీ రుజువులు ఎన్నేళ్ళైనా ఈ విధంగా కనిపిస్తూనే ఉంటాయి.

మీ చుట్టూ జరుగుతున్న విషయాలను నిశితంగా గమనించండి.మీకే అర్ధమౌతుంది. ఎందుకంటే ఈ అమావాస్య ప్రభావం ఇంకా 5 రోజులుంటుంది.
read more " జూలై 2016 - అమావాస్య ప్రభావం "

2, జులై 2016, శనివారం

మా అమెరికా యాత్ర - 27 (గాంగెస్ ఆశ్రమంలో మరపురాని రోజులు)















 







'మీరు నిన్న దేవాలయానికి వచ్చి ఠాకూర్ మరియు శ్రీశ్రీమా దర్శనం చేసుకున్నారా? ' అడిగారు స్వామి ఆత్మలోకానంద.

'బెంగాల్లో శ్రీరామకృష్ణులను 'ఠాకూర్' అని సగౌరవంగా పిలుస్తారు. అలాగే శారదామాతను శ్రీమా అనీ శ్రీశ్రీమా అనీ ఎంతో మర్యాదగా పిలుస్తారు.అదే మర్యాదను అమెరికన్ అయిన ఈయనకూడా పాటించడం ఎంతో ముచ్చటగా అనిపించింది.

'అవును.మేమిక్కడకు వచ్చీ రావడం తోనే చేసిన మొదటి పని అదే.ఆలయంలో స్పందనలు మాకు చాలా బాగా నచ్చేశాయి.మాలో కొంతమందికి ఇక్కడ అడుగుపెడుతూనే ధ్యానస్థితి దానంతట అది వచ్చేసింది.' అన్నాను.

మా అందరివైపూ ఒక్కసారి పరికించి సంతృప్తిగా చూచారాయన.

'ఇక్కడకు ఎంతోమంది గ్రూపులు వచ్చి రిట్రీట్లు చేసుకుంటూ ఉంటారు.కానీ మీలాంటి క్రమశిక్షణతో కూడిన అద్భుతమైన గ్రూపును నేనిప్పటివరకూ చూడలేదు.' అన్నారాయన.

మాకు చాలా సంతోషం అనిపించింది.

'ఆలయం వెనుక ఉన్న చెక్క కుటీరం చూచారా?' అడిగారాయన.

'చూచాము.దాని ప్రత్యేకత ఏమిటో వినాలని ఉంది' అన్నాను నేను.

'చెప్తాను.1990 ప్రాంతాలలో ఇక్కడ ఏ ఇళ్ళూ లేవు.ఇప్పుడు చెక్క కుటీరం ఉన్న ప్రదేశంలోనే తన గురువైన స్వామి భాష్యానంద గారితో కలసి గౌరీమా 'పంచతప దీక్ష' ను ఆచరించారు.ఆ తర్వాత క్రమేణా ఈ ఆశ్రమమూ ఈ రిట్రీట్ హోమూ ఇవన్నీ వచ్చాయి.' అన్నారాయన.

'పంచతపం' అంటే ఏమిటి?' - అదేంటో నాకు తెలిసినా వింటున్న మిగతా వారికోసం అడిగాను నేను.

'ఇది అయిదు పగళ్ళు అయిదు రాత్రులు ఏకధాటిగా ధ్యానంలో ఉంటూ చెయ్యవలసిన దీక్ష. దీనిని ఆకాశం క్రింద మాత్రమే చెయ్యాలి. నేలమీద మనం కూచోవాలి. మనకు నాలుగు వైపులా దగ్గరలో నాలుగు గుండాలు త్రవ్వి వాటిల్లో అగ్నిని వెలిగించి ఈ అయిదురోజులూ నిరంతరం అవి మండుతూ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఆ వేడి మనకు బాగా తగుల్తూ ఉండాలి.ఇవి నాలుగు అగ్నులు.అయిదో అగ్ని ఆకాశంలో వెలిగే సూర్యుడు.ఈ అయిదు అగ్నుల వేడీ మనకు తగుల్తూ ఉండగా, అయిదు రోజుల పాటు నిద్ర, ఆహారం, నీరు లేకుండా, నిరంతరం మంత్రజపం ధ్యానం చేస్తూ, కదలకుండా ఒకే ఆసనంలో కూచుని దీక్షగా సాధన చెయ్యడమే - పంచతపం అనే దీక్ష.' అన్నారు స్వామీజీ.

'మాతాజీ గౌరీమా' ఈ దీక్షను చేశారా?' ఆశ్చర్యంగా అడిగాను నేను.

'అవును 1990 లో ఆమె ఈ దీక్షను ఆచరించారు.నాలుగు వైపులా అగ్నులు ఆరిపోకుండా నిరంతరం వెలుగుతూ ఉండే బాధ్యతను నేనే చూచుకున్నాను.ఆ డ్యూటీ నాకిచ్చారు. అందుకని ఈ విషయం నేను కళ్ళారా చూచినవాణ్ని' అన్నారాయన.

మాకు నోటమాట రాలేదు.

'ఈ దీక్షలో మాతాజీ, ఆమె గురువైన స్వామి భాష్యానంద, ఇంకొక స్వామీజీ కూర్చున్నారు. మూడో రోజు దాటేసరికి వాళ్ళ కాళ్ళు కీళ్ళు అన్నీ లాక్ అయిపోయినట్లుగా బిగిసిపోయాయి.కొంచం కూడా వాళ్ళు కదలలేకపోయారు.ఎవరో తాళాలు వేసినట్లుగా 'టక్..టక్' మంటూ కీళ్ళలోనుంచి శబ్దాలు వచ్చి అన్నీ లాక్ అయిపోయాయి.ఆ తర్వాత కాసేపటికి ఉజ్జ్వలంగా వెలిగిపోతున్న 'శ్రీయంత్రం' వారి ఎదురుగా ప్రత్యక్షమైంది. ముగ్గురికీ అది ఒకేసారి దర్శనం ఇచ్చింది.

అప్పుడు భాష్యానంద గారు ఇలా అడిగారు.

'గౌరీమా. నీకేం కనిపిస్తున్నదో చెప్పు?'

'నాకు 'స్టార్ ఆఫ్ డేవిడ్' కనిపిస్తున్నది' అని ఆమె జవాబు చెప్పారు. ఎందుకంటే యూదు వనిత అయిన ఆమెకు తెలిసిన ఆకారం అదొక్కటే.అందుకని ఆమె ఆ యంత్రాన్ని 'స్టార్ ఆఫ్ డేవిడ్' అనుకుంది.

స్వామి భాష్యానంద నవ్వారు.

'అది స్టార్ ఆఫ్ డేవిడ్ కాదు.సరిగా చూడు. స్టార్ ఆఫ్ డేవిడ్ లో రెండు త్రిభుజాలు ఒకదానిని ఒకటి ఖండిస్తూ ఉంటాయి.దానిని మేము షట్కోణ యంత్రమనీ,షణ్ముఖ యంత్రమనీ పిలుస్తాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అది కాదు.దీనిలో చాలా త్రిభుజాలూ  చాలా కోణాలూ ఉన్నాయి చూడు.ఇది శ్రీయంత్రం. సాక్షాత్తూ జగన్మాతకు సంకేతం.' అన్నారాయన.

అప్పుడు వారి ఎదురుగా కనిపిస్తున్న శ్రీయంత్రం నుంచి ఒక స్వరం ఇలా వినిపించింది.

'నాకు ఇక్కడ ఒక ఆలయం నిర్మించండి.నేను ఇక్కడ నివసిస్తాను. నా కుమార్తెలకోసం నాకోసం ఇక్కడ ఒక ఆలయం నిర్మించండి.'

చూస్తూ ఉండగానే ఆ శ్రీయంత్రం వారి దృష్టి నుంచి మాయమై పోయింది.

వింటున్న మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.

'అందుకనే ఈ ఆలయం ముఖద్వారం లోనే శ్రీయంత్రం మీకు కనిపిస్తుంది.అలాగే, గర్భగుడిలో ఠాకూర్ ఫోటో పైన స్టెయిండ్ గ్లాస్ మీద కూడా మీకు శ్రీయంత్రం కనిపిస్తుంది.ఆ విధంగా ఈ ప్రదేశానికి శ్రీయంత్రానికి సంబంధం ఉన్నది.' అన్నారాయన.

వింటున్న నాలో ఈ భావాలు తలెత్తాయి.

'అతి ప్రాచీన కాలంలో అమెరికాను పాతాళం అనేవారు.ఇక్కడ రాక్షసరాజులు ఉన్నారనీ,ఇది బలిచక్రవర్తి రాజ్యం అనీ మన పురాణాలు చెబుతున్నాయి. అనేక మంది వేదకాలపు ఋషులు ఇక్కడ నివసించారు.వారి ఆశ్రమాలు కూడా ఇక్కడ ఉండేవి.అందుకనే ఇప్పుడు అమెరికా యూరప్ ఆస్ట్రేలియా ఆఫ్రికాలలో అనేకచోట్ల త్రవ్వకాలలో శివలింగాలూ, వినాయకుడూ,ఇంద్రుడు, విష్ణువు మొదలైన ప్రతిమలూ బయట పడుతున్నాయి.ప్రాచీన కాలంలో ప్రపంచం అంతటా వైదిక సంస్కృతి ఉండేదనదానికి చాలా రుజువులున్నాయి. కంచి పరమాచార్య కూడా ఈ విషయాన్ని చాలాసార్లు తమ ఉపన్యాసాలలో చెప్పి ఉన్నారు.బహుశా చరిత్రకందని అతి ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఏదో ఒక ఋష్యాశ్రమం అయి ఉంటుంది.ఇక్కడ లలితా పరమేశ్వరీ ఆరాధనా ఉపాసనా జరిగి ఉంటుంది. అందుకే ఇన్ని వేల ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే ఇక్కడ జరుగుతున్నది. అందుకే ఇక్కడ మళ్ళీ శ్రీచక్రం ప్రత్యక్షమైంది.అప్పటి ఆ ఋషులూ వారి శిష్యులే ఇప్పుడు అమెరికన్స్ గా పుట్టినా మళ్ళీ అదే ఆరాధనను కొనసాగిస్తున్నారు.' అని నాకు లోలోపల అనిపించింది.

'స్వామీజీ. ఇదుగో నేను వ్రాసిన 'శ్రీవిద్యా రహస్యం' అనే పుస్తకం. ఇదంతా శ్రీయంత్రం గురించీ,వేదోపనిషత్తుల ప్రమాణాలతో శ్రీచక్ర అంతరిక పూజ ఎలా చెయ్యాలి? అనే విషయం గురించే ఉంటుంది.' అంటూ నేను వ్రాసిన పుస్తకాలను కొన్నింటిని ఆయనకు ఇచ్చాను.

'ఒక కాపీని మీ లైబ్రరీలోని పుస్తకాలలో ఉంచండి.' అని ఆయనకు చెప్పాను.

ఆయన చాలా ఆశ్చర్యంగా చూచారు.

'విచిత్రంగా ఉందే. శ్రీవిద్య మీద సాధికారిక గ్రంధం వ్రాసిన మీరు, మీ దేశానికి ఇన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి వెదుక్కుంటూ రావడమూ, ఇక్కడ శ్రీయంత్రం మీకోసం వేచిచూస్తూ ఉండటమూ అంతా ఏదో వింతలా ఉంది.' అన్నారాయన.

'అవును స్వామీజీ' అన్నాను నేను.

మిగతా అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ తో ఈ సంభాషణ అంతా వింటున్నారు.

'మీరిచ్చిన పుస్తకాన్ని గౌరీమా కు అందజేస్తాను.ఒక పని చెయ్యండి.రేపు ఆదివారం నాడు,ఆలయంలో మీరు ఒక స్పీచ్ ఇవ్వండి.ప్రతి ఆదివారం ఇక్కడ యూనివర్సల్ ప్రేయర్ జరుగుతుంది.దానికి మా అమెరికన్స్ చాలామంది వస్తారు.మీరు మాట్లాడితే వినడానికి వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు.' అన్నారాయన.

'అలాగే స్వామీజీ. ఏ టాపిక్ మీద మాట్లాడమంటారు?' అడిగాను.

'వేరే టాపిక్ ఎందుకు? శ్రీయంత్రం గురించి మాట్లాడండి.నేను ఇప్పుడే మావాళ్ళకు ఈ విషయం ఎనౌన్స్ చేస్తాను.' అని ఉత్సాహంగా లేచారాయన.

'అలాగే స్వామీజీ. అలాగే మాట్లాడతాను.' అన్నాను నేనూ లేస్తూ.

'మంచిది.నమస్తే.వెళ్లి వస్తాను.మిమ్మల్ని కలసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది' అన్నారాయన.

'స్వామీజీ ఒక్కమాట.గౌరీమాను కలవడానికి వీలౌతుందా?'అడిగాను.

'లేదు.ఎందుకంటే ఆమె అదిగో ఆ ఇంట్లోనే ఉంటారు గాని,ఆమెకు తీరిక ఉండదు.ఆమె ఎప్పుడూ ఎమర్జెన్సీ కాల్స్ లో బిజీగా ఉంటారు.ఒక్క క్షణం కూడా తల పక్కకు తిప్పరు.ఎన్నో ఏళ్ళ నుంచీ అమెరికాలో ఉన్న వ్యభిచార మాఫియాతో ఆమె పోరాడుతున్నారు.వాళ్ళ చెరలో ఉన్న ఏ అమ్మాయి నుంచైనా ఆమెకు ఏ క్షణమైనా ఫోన్ రావచ్చు.వెంటనే ఆమె పోలీసులతో సంధానమై ఆ పిల్లను మాఫియా చెరనుంచి విడిపించే పనిలో ఉంటారు.కనుక మీతో ఆమె కలవలేక పోవచ్చు.ఆమె ప్రతిక్షణమూ అత్యంత విలువైనది.ఎందుకంటే ఏ క్షణంలో ఆమె హెల్ప్ లైన్ కు అమెరికాలో ఏ మూలనుంచి ఫోన్ వస్తుందో తెలియదు.అందుకని ఆమె రాత్రుళ్ళు కూడా సరిగా నిద్రపోకుండా ఆ ఫోన్ పక్కనే ఉంటారు.అయినా ఆమెను అడుగుతాను.ఆమె సమయం ఇస్తే మీరు కలసి మాట్లాడవచ్చు.' అన్నారాయన.

'మాకు ఎక్కువ సమయం వద్దు.ఒక పది నిముషాలు చాలు.ఊరకే ఆమె దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకుంటాము.అంతే.' అన్నాను నేను.

'ప్రయత్నిస్తాను.ఉంటాను మరి' - అంటూ మావద్ద సెలవు తీసుకుని, రెండు సీట్లు మాత్రమే ఉన్న ఒక చిన్న లాన్ జీప్ లో ఎక్కి, ఆయన వెనక్కు బయలుదేరారు.

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 27 (గాంగెస్ ఆశ్రమంలో మరపురాని రోజులు) "