“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, జులై 2016, గురువారం

మా అమెరికా యాత్ర - 28 (గాంగెస్ ఆశ్రమంలో మరపురాని రోజులు)

స్వామీజీ వెళ్ళిపోయాక గుర్తొచ్చింది,భోజన సమయం అయింది కదా, ఆయన్ను భోజనానికి ఉండమని చెబితే బాగుండేది కదా అని. ఈ విషయం మనవాళ్ళను అడిగితే, ' మేమాయన్ను అడిగాము. ఆయన లంచ్ వండుకొని వచ్చారట.ఇంకోసారి వస్తానన్నారు.' అని చెప్పారు.

ఈ అయిదురోజులూ ఆడవాళ్ళందరూ కిచెన్ లో మాట్లాడుకుంటూ తలా ఒక పని చేసుకుంటూ చకచకా వంటలు చేసేశారు.అందరూ కలసిమెలసి పనులు చేసినా, ముఖ్యంగా శకుంతలగారు,రజితగారు,సుమతిగారు కిచెన్ లో బాగా కష్టపడ్డారు. వారికి నా ప్రత్యేకాభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

లంచ్ అయ్యాక కొద్ది సేపు రెస్ట్ తీసుకుని ఆశ్రమం వెనుక ఉన్న అడవిలోకి షికారుకు బయలుదేరాము.ముందుగా దేవాలయానికి వెళ్లి కాసేపు కూచుని, ఆ తర్వాత వెనుకగా ఉన్న అడవిలోకి వాకింగ్ కు వెళ్లి చాలాసేపు తిరిగి రిట్రీట్ హోం కు తిరిగి వచ్చాము.దారిలో మాటలన్నీ జోకులతో కూడిన ఆధ్యాత్మికమే.

ఆ ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

 ///