“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

13, జులై 2016, బుధవారం

Sar Jo Tera Chakraye - Mohammad Rafi



Sar Jo Tera Chakraye Ya Dil Dooba Jaye...

అంటూ మహమ్మద్ రఫీ మధురంగా ఆలపించిన ఈ గీతం 1957 లో వచ్చిన 'ప్యాసా' అనే సినిమాలోనిది. ఇది ఒక హాస్య ప్రధానమైన పాట. ఇందులో జానీవాకర్ నటించాడు.తర్వాత్తర్వాత ఈ పాట స్ఫూర్తితో తెలుగులో 'మల్లెపూవు' అనే సినిమాలో చక్రవర్తి 'జుమ్బాంబ జుమ్బాంబ బాంబ బాంబ జుమ్...' అంటూ ఒక పాటను చేశాడు.

ఈ హిందీపాటను మహమ్మద్ రఫీ సునాయాసంగా పాడాడు. అయితే ఈ పాటలో -'మాలిష్ తేల్ మాలిష్... చంపే...ల్య' అంటూ ఎవరిచేత అనిపించారో నాకైతే తెలీదు గాని నాపాటలో మాత్రం ఆ మిమిక్రీ కూడా నేనే చేశాను.

నేను అమెరికా వెళ్ళినప్పుడు మా అబ్బాయి ఈ పాటను హమ్ చేస్తుండగా విన్నాను. 'నాన్నా ఈ పాటను పాడు చాలా మంచి సరదాపాట' అని మావాడు రికమెండ్ చేశాడు. అక్కడినుంచి వచ్చాక రెండు నెలలకు పాడడం అయ్యింది.

తిధుల ప్రకారం కాదు గాని, వ్యవహారిక తేదీల ప్రకారం ఈరోజు నా పుట్టినరోజు.అందుకని ఈ సరదా పాటను ఈరోజున రిలీజ్ చేస్తున్నాను.

నిజానికి నేను చేస్తున్నది కూడా ఇదేగా? మాం....ఛి మూలికాతైలాన్ని మర్దనా చేసి నా శిష్యుల తలనొప్పులు పోగొడుతున్నాను (లేదా ఇంకా పెంచుతున్నానా? ఏమో తెలీదు)

సరే, అది ఏమైనప్పటికీ నా స్వరంలో కూడా ఈపాటను వినండి మరి.

Movie:--Pyaasa (1957)
Lyrics:--Sahir Ludhianvi
Music:--S.D.Burman
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------
Sar jo tera chakraaye - Yaa dil duba jaaye
Aaja pyare paas hamaare –Kaahe ghabraay kaahe ghabraay
Sar jo tera chakraaye - Yaa dil duba jaaye
Aaja pyare paas hamaare - Kaahe ghabraay kaahe ghabraay

[Tel meraa hai muski Ganj rahena khuski

Jiske sar par haath phiradu chamake kismet uski]
[Sun sun sun are beta sun - Is champi me bade bade gun]-2
Laakh dukho ki ek dawa hai Kyuna aazmaaye
Kahe ghabaraaye kahe ghabaraaye
Sar jo tera chakraaye - Yaa dil dubajaaye
Aajapyare paas hamaare - Kaahe ghabraay kaahe ghabraay

[Pyaar kaa hove jhagadaa – Yaa bizines kaa ho ragadaa
Sab lafado kaa bojh hate Jab –pade haath ik tagadaa]
[Sun sun sun are baabu sun - Is champi me bade bade gun]-2
Laakh dukhoki ek dawa hai – Kyuna aazmaaye
Kahe ghabraaye kahe ghabraaye
Sar jo tera chakraaye - Yaa dil dubajaaye
Aaja pyare paas hamaare - Kaahe ghabraay kaahe ghabraay

[Naukar ho yaa maalik - Lidar ho yaa public
Apne aage sabhi jhukehai - Kya raja kya sainik}-2
[Sun sun sun are raja sun - Is champi me bade bade gun]-2
Laakh dukhoki ek dawahai Kyuna aazamaaye
Kahe ghabraaye kahe ghabraaye

Sar jo tera chakraaye Yaa dil dubajaaye
Aaja pyare paas hamaare
Kaahe ghabaraay kaahe ghabaraay

Sar jo tera chakraaye Yaa dil dubajaaye
Aaja pyare paas hamaare
Kaahe ghabaraay kaahe ghabaraay-3

Meaning

If your head reels, or if your heart drowns in sorrow
Come to me dear, Why do you fear?
Why do you fear?

My oil is very good
It gives you happiness
On whose head I put my hand
his fortune will surely wake up
O boy, listen, listen
My oil has very good qualities
For a million woes, this is the only sure medicine
Why not use it immediately?
Why do you fear? Why do you fear?

If it is love quarrel
or trouble in your business
Everything will ease out
Once my hand touches you correctly
O Babu, listen listen,
My oil has very good qualities
For a million woes, this is the only sure medicine
Why not use it immediately?
Why do you fear? Why do you fear?

Let him be a servant,or a master
or a leader or a common man
What if he is a king or a soldier
Everybody should bend his head in front of me
O Raja, listen listen,
My oil has very good qualities
For a million woes, this is the only sure medicine
Why not use it immediately?
Why do you fear? Why do you fear?

If your head reels, or if your heart drowns in sorrow
Come to me dear, Why do you fear?
Why do you fear?

తెలుగు స్వేచ్చానువాదం

నీ తల గిర్రున తిరుగుతోందా?

లేక నీ హృదయం బాధలో కూరుకుపోయిందా?
అయితే నా దగ్గరకి రా
ఎందుకు భయం? నీకెందుకు భయం?

నా నూనె చాలా మంచిది

ఇది నీ బాధలన్నీ పోగొడుతుంది
నేనెవరి నెత్తిమీద చెయ్యి పెడతానో
వాళ్ళ అదృష్టం కళ్ళు తెరుస్తుంది
ఏయ్ అబ్బాయ్.. విను విను
నా నూనెలో చాలా మంచి గుణాలున్నాయ్
ఇది లక్ష బాధల్ని క్షణంలో మాయం చేస్తుంది
ఎందుకు దీన్ని వాడటానికి ఆలోచిస్తున్నావ్?
ఎందుకు భయం? నీకెందుకు భయం?

నీది ప్రేమ గొడవైనా లేదా బిజినెస్ గొడవైనా

ఒక్కసారి నా చెయ్యి నీ నెత్తిన పడిందంటే
అలాంటి గొడవలన్నీ దెబ్బకి సర్దుకుంటాయ్
ఏయ్ బాబూ... విను విను
నా నూనెలో చాలా మంచి గుణాలున్నాయ్
ఇది లక్ష బాధల్ని క్షణంలో మాయం చేస్తుంది
ఎందుకు దీన్ని వాడటానికి ఆలోచిస్తున్నావ్?
ఎందుకు భయం? నీకెందుకు భయం?

వాడు నౌకరైనా లేదా యజమానైనా

నాయకుడైనా లేదా సామాన్యుడైనా
రాజైనా సైనికుడైనా ఎవరైనా సరే
నా ముందు తల వంచాల్సిందే
ఏయ్ రాజా ... విను విను
నా నూనెలో చాలా మంచి గుణాలున్నాయ్
ఇది లక్ష బాధల్ని క్షణంలో మాయం చేస్తుంది
ఎందుకు దీన్ని వాడటానికి ఆలోచిస్తున్నావ్?
ఎందుకు భయం? నీకెందుకు భయం?

నీ తల గిర్రున తిరుగుతోందా?

లేక నీ హృదయం బాధలో కూరుకుపోయిందా?
అయితే నా దగ్గరకి రా
ఎందుకు భయం? నీకెందుకు భయం?