ఈ విశాలప్రపంచాన్ని నడిపిస్తున్నవి కామకాంచనాలనబడే (lust & wealth) రెండుశక్తులే అని ఆధ్యాత్మికవేత్తలంటారు. అది నిజమే కావచ్చు. కానీ విషయం అంత తేలిక కాదు. దీనిలో చాలా లోతుపాతులున్నాయి.
కామ-కాంచనాలు రెండూ కలిసే ఉన్నప్పటికీ, చాలామంది భార్యాభర్తలలాగా, ఈ రెంటికీ క్షణం పడదు.
సాధారణంగా, కామాన్ని కోరుకుంటే కాంచనం దూరమౌతుంది. కాంచనమే కావాలనుకుంటే కామం దూరమౌతుంది.
ఏ కోరిక తీరాలన్నా డబ్బనేది ఉండాలి. పోనీ, 'నాకు డబ్బే కావాలం'టే కోరికలను తగ్గించుకోవాలి. కోరికే ముఖ్యమైతే డబ్బు ఖర్చవుతుంది. డబ్బే ముఖ్యమైతే కోరికలు ఆటోమేటిగ్గా తగ్గిపోతాయి. ఇది అందరికీ తెలిసిన, అందరికీ వర్తించే, మామూలు ఈక్వేషన్.
కాకపోతే కొందరివిషయంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఒకడి కామం తీరడం కోసం కోట్లాదిమందికి కాంచనం (డబ్బు) దూరం కావడం అనేదే ఆ విచిత్రం.
ప్రస్తుతం జెన్సెన్ హువాంగ్ కు జరిగింది అదే.
ఇతని రాసలీలలు బయటపడిన తర్వాత ఎన్విడియా కంపెనీ షేరు 22 % పడిపోయింది. దాని ఫలితంగా ఇన్వెస్టర్లు 1.17 ట్రిలియన్ డాలర్లను నష్టపోయారు. మన కరెన్సీలో చెప్పాలంటే నూరు లక్షల కోట్ల రూపాయలు. ఇదేమీ చిన్నాచితకా ఎమౌంటు కాదు. భారతదేశపు రెండేళ్ల వార్షికబడ్జెట్ తో ఇది సమానం.
ఈ గొడవ ఫలితంగా జెన్సెన్ తన కంపెనీనుండి బహిష్కరించబడ్డాడు. పరువును పోగొట్టుకున్నాడు. కుటుంబజీవితం అస్తవ్యస్తమైపోయింది. ఇప్పుడు ఎలాన్ మస్క్ దగ్గర ఉద్యోగిగా చేరతానంటున్నాడు. ఇదంతా కేవలం ఒకే ఒక్క వారంరోజులలో జరిగింది.
ఏమిటా వింత వారం? ఏమిటి దాని ప్రభావం?
నవంబరు 6 నుండి 12 వరకూ ఉన్న ఏడురోజులే ఆ వింత వారం !
నవంబరు 6 - ఎలీస్ హువాంగ్ అనే ఆమెతో ఇతనికి అక్రమసంబంధం ఉందని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక బయటపెట్టింది. ఈమె ఇతని బిజినెస్ పార్ట్నర్. ఈమె చైనా గూఢచారి అని అంటున్నారు. ఈమె భర్త కాంగ్ వై. ఇతనికి చైనాలో డేటా సెంటర్ల సామ్రాజ్యం ఉంది. ఈ విషయం బయటపడేసరికి అమెరికన్ ఇన్వెస్టర్లు గగ్గోలు పెట్టారు.
నవంబరు 8 - తన కంపెనీకి రాసిన లెటర్లో, తనకు ఈమెతో వివాహేతర సంబంధం ఉందని జెన్సెన్ ఒప్పుకున్నాడు.
నవంబరు 11 - తన కంపెనీ వైస్ ప్రెసిడెంట్లలో ఒకరితో ఇతనికి రెండవ అక్రమసంబంధం ఉందని బయటపడింది.
నవంబరు 12 - తన కంపెనీ ఉద్యోగులలో మూడవవ్యక్తితో కూడా సంబంధం ఉన్నట్లు బయటపడింది. అదే రోజున ఇతను రాజీనామా చేశాడు.
ఇదంతా శుక్రప్రభావమంటే నమ్మడం కష్టం కదా? కానీ నిజం ! వివాహేతర సంబంధాలకు శుక్రుడే కారకుడని జ్యోతిషవిద్యార్థులకు తెలిసిన విషయమే !
సరిగ్గా నవంబరు 6 న వక్ర శుక్రుడు కన్యారాశిలో తన నీచస్థితిలోకి అడుగుపెట్టాడు. వక్రస్థితిలో ఉన్నాడు గనుక నవాంశలో కూడా నీచస్థితి అవుతుంది. సరిగ్గా అదే రోజున ఈ వార్త బయటపడింది. ఒకరోజుమాత్రం అక్కడే స్తంభనలో ఉన్నాడు. అప్పటినుండి వక్రవేగం తగ్గుతూ వచ్చి సరిగ్గా 15 వ తేదీన శుక్రునికి వక్రత్వం పోయింది. 17 న సూర్యుడు తన నీచస్థితినుండి బయటపడి వృశ్చికరాశిలోకి అడుగుపెట్టాడు. అప్పటినుండీ శుక్రునికి ఋజుమార్గంలో నడకమొదలైంది. ఈ నెల 23 న, అంటే ఇంకొక నాలుగురోజులలో మళ్ళీ తులారాశిలోకి అడుగుపెట్టడం జరుగుతుంది.
కనుక నవంబరు 6 - 22 మధ్యలో ఒక రెండువారాల వ్యవధిలో ఇదంతా జరుగుతుంది. అందులో మొదటివారం (6-12 మధ్యలో) ఎన్విడియా కంపెనీ జాతకాన్ని తిరగరాసింది. కోటికోట్ల రూపాయల ఇన్వెస్టర్ల డబ్బును ఆవిరి చేసేసింది.
గ్రహప్రభావమంటే ఇలా ఉంటుంది ! "నామీద గ్రహప్రభావం లేదు" అని ఈ భూమ్మీద ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేరు. ఒకవేళ అలా అంటున్నారంటే వాళ్ళకేమీ తెలీదనే అర్ధం.
జెన్సెన్ హువాంగ్ జాతకం చూడమని ఒకరడిగారు. నాకవసరం లేదన్నాను.
ఇది జెన్సెన్ హువాంగ్ ఒక్కడి జాతకమే కాదు. భూమ్మీద ఉన్న 850 కోట్ల మనుషులకూ ఒక్కొక్కరికి ఒక్కొక్కవిధంగా ఈ వారం వాతలు పెట్టి ఉంటుంది.
మీమీ జీవితాలను గమనించుకోండి. మీకే అర్ధమౌతుంది.
అనంతకాలగమనంలో ఇటువంటి గ్రహస్థితులూ, ఇంకా ఎన్నో విధాలైన గ్రహస్థితులూ నిరంతరం వస్తూనే ఉంటాయి. వాటినిబట్టి మనిషి జీవితం జరుగుతూ ఉంటుంది.
ఈ సూక్ష్మ గ్రహసంచారాలను, మన జీవితాలపైన వాటి ప్రభావాలను తెలుసుకుంటూ, వాటిని గమనిస్తూ, వాటికి చలించకుండా అతీతంగా ఉండగలగడమే అసలైన ఆధ్యాత్మికత. అంతేగాని, ఆధ్యాత్మికవేషాలు వెయ్యడం, గుళ్ళూ గోపురాలూ తిరగడం, పార్టుటైము దీక్షలు తీసుకోవడం, దొంగభక్తిని నటించడం, నకిలీతంతులు చెయ్యడం ఇవన్నీ కాదు.
మనుషులు దీనిని అర్ధం చేసుకుంటే, పద్దతులను మార్చుకుంటే, దారిలో నడిస్తే, అదృష్టవంతులౌతారు. లేకపోతే ఎవరికర్మ వారిది.
తెలుసుకోగలిగితే, ఈ భూమ్మీద మానవజీవితమనే డ్రామా మొత్తం ఇంతే ! ఇంతకంటే ఇంకేమీ లేదు.