8, నవంబర్ 2026, ఆదివారం

ఉపవాసాలతో చనిపోతే జీసస్ కనిపిస్తాడా? సో వాట్?


వెర్రితలలేసే క్రైస్తవప్రచారాలు  ఎలాంటి దారుణమైన రూపాలు తీసుకుంటాయనేదానికి కెన్యా పాస్టర్ పాల్ మెకంజీ  కేసు ఒక ఉదాహరణ. 

మొన్న 6 వ తేదీన కెన్యా కోర్టు ఇతనికి 200 ఏళ్ల జైలుశిక్ష వేసింది. 28 మంది ఇతని అనుచరులకు కూడా శిక్షలు పడ్డాయి. నేరం? తిండిపెట్టకుండా మాడ్చి, హింసించి, 440 మందిని వీళ్ళు చంపేశారు. వాళ్లంతా ఎవరు? పాపం అమాయక క్రైస్తవభక్తులు. వాళ్లలో 190 మంది చిన్నచిన్న పిల్లలే. 

ఎందుకలా చేశాడు? అలా చనిపోతే స్వర్గానికి పోతారని, జీసస్ ను కలవొచ్చని తన చర్చిలో చేసిన బోధలతో జనాన్ని నమ్మించాడు. పిచ్చిజనం నమ్మారు. చచ్చారు. తవ్వితే ఆ శవాలన్నీ బయటపడ్డాయి. వాళ్లలో కొంతమందిని బ్రతికుండగానే పూడ్చేసినట్లు ఆధారాలు దొరికాయి.

కెన్యాలో పేదరికం ఎక్కువ. ఇతను పెద్దగా చదువుకోలేదు. బాల్యం బాధాకరంగా గడిచింది.  టాక్సీ డ్రైవర్ అయ్యాడు. ఆ కసితో విద్యావ్యవస్థపైనా, వైద్యంపైనా, విదేశీ సంస్కృతిపైనా ద్వేషం పెంచుకున్నాడు. ఒకరకంగా సైకో అయ్యాడు. తన టాక్సీలో ఎక్కిన ప్యాసింజర్లతో మాటలు కలిపి బోధలు చేసేవాడు.

మెల్లిగా ఒక చర్చి పెట్టాడు. దానిపేరు 'గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్'. విదేశీ (బ్రిటిష్, అమెరికా) సంస్కృతిని, వాళ్ళ విద్యా వైద్యవిధానాలను వ్యతిరేకించేవాడు. చదువుకోవద్దని, ఇంగ్లీషు మందులు వాడద్దని ప్రచారం చేసేవాడు. అయితే, విదేశాలలో పుట్టిన క్రైస్తవమతాన్ని మాత్రం స్వీకరించాడు. క్రమేణా వేలాదిమంది అనుచరులు పోగయ్యారు. సొంత టీవీ ఛానల్ పెట్టాడు. 2019 లో ఇతనిపైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పోలీసులు ఆ చర్చిని మూయించారు.

షకహోలా అనే ఒక అడవిలోకి మకాం మార్చాడు. అందులో 800 ఎకరాలను ఆక్రమించాడు. అక్కడే తన చర్చిని నడిపేవాడు. ప్రయివేట్ ఆర్మీలాంటి దానిని ఏర్పాటు చేసుకున్నాడు.వందలాది గుడిసెలను నిర్మించాడు.

బోధించి, భయపెట్టి, కొట్టి, తన అనుచరులను వారి పిల్లలను వాటిలో బంధించేవాడు. అదొక కాన్సెన్ట్రేషన్ క్యాంప్ లాంటిది. మోడ్రన్ లైఫ్ అంతా సైతాన్ మాయ అనీ, దానినుంచి బయటపడి ఉపవాసప్రార్ధనలు చేస్తూ చనిపోవడం ఒక్కటే జీసస్ ను చేరుకోవడానికి మార్గమని భోధించేవాడు. నెలల తరబడి ఆ ఉపవాసాలు తట్టుకోలేక తన చర్చి ఆవరణలోనుంచి పారిపోవాలని ప్రయత్నించిన పెద్దలను, పిల్లలను, తన అనుచరులతో కొట్టించి, వారిని చంపేసి అక్కడే పూడ్చేసేవాడు. అలాంటి శవాలు 500 పైనే ఉన్నాయని అంటున్నారు. 440 ఇప్పటికి బయటపడ్డాయి.

ఏప్రిల్ 2023 లో విచారణ మొదలైంది. 2026 లో తీర్పు వచ్చింది.

కెన్యాలోనే  కాదు. మనదేశంలో కూడా ఇటువంటి అబద్ధప్రచారాలతో అమాయకులను నమ్మించి మతాలు మారుస్తున్న పాస్టర్లు చాలామంది ఉన్నారు. అయితే, ఈ లెవల్లో ఉపవాసప్రార్ధనలు చేసి చనిపొమ్మని వాళ్ళు చెప్పకపోవచ్చు. కానీ, రకరకాల ఆశలు చూపి, హిందూమతమంటే ద్వేషం ఎక్కించి, మతం మారుస్తున్నారు. ఇదొక పెద్ద లాభసాటి వ్యాపారమై పోయింది. పిచ్చిజనం మోసపోతున్నారు.

ఇతను పుట్టినది 1973 లేదా 1976 అని నెట్ చెబుతోంది. సరియైన జననవివరాలు లేవు.  అది 1973 అని నేనంటాను. కారణం? 1973 లో మాత్రమే అటువంటి నరరూపరాక్షస యోగం ఉంది. చార్టు పైనిచ్చాను చూడండి.

రాహుకేతువులు, గురువు నీచస్థితులలో ఉన్నారు. వక్రగురువుకు గురుఛండాలయోగం పట్టింది. శనికేతుయోగం ఉంది. కుజగురురాశుల సంబంధం ఉన్న కుజునికి, ఉచ్ఛబుధునితో దృష్టి ఉండటం వల్ల మొండితనం, పాస్టర్ వేషం, అతితెలివీ ఏర్పడ్డాయి. ఈ యోగాలు 1976 లో లేవు.  కనుక, ఇతను పుట్టినది 1973 లో మాత్రమే.

14 ఏప్రిల్ 2023 న ఇతను అరెస్టయ్యాడు. సరిగ్గా అది మేషసంక్రాంతి సమయం అయింది. గోచార శనిగురువుల దృష్టి రహస్యాలకు నెలవైన వృశ్చికంపైన ఉంది. అందుకే ఇతని రహస్యాలన్నీ ఆనాడు బయటపడ్డాయి. మూడేళ్ళ విచారణ తర్వాత ఇప్పుడు శిక్ష పడింది.

ఇండియాక్రైస్తవులు, కమ్యూనిస్టులు, కాంగ్రెసువారు ఇలాంటి న్యూసుల గురించి మాట్లాడరు. పేపర్లు కూడా మాట్లాడవు. బ్రాహ్మణులు గుళ్ళలో రేపులు చేస్తున్నారని నేహాబోరా అంటే, పేపర్లన్నీ దాన్ని మొదటిపేజీలో వేస్తాయి. ఇలాంటి వార్తలకు మాత్రం ప్రచారం ఉండదు. ఆమె ఎన్ని రేపులను దగ్గరుండి చూసిందో పాపం ! లేదా బాధితురాలేమో !

ఒకవేళ ఎక్కడైనా ఎవడో ఒక పూజారి అలాంటిపనిని చేస్తే, హిందువులు అతన్నేమీ క్షమించరు. వాళ్లే శిక్షిస్తారు. లేదా, శిక్ష పడాలని నిస్పక్షపాతంగా కోరుకుంటారు. అంతేగానీ, క్రైస్తవులు ముస్లిములు చేసేటట్లుగా అటువంటివాడిని నిస్సిగ్గుగా వెనకేసుకురారు. సమర్ధించరు.

అసలు, క్రైస్తవం, ఇస్లాం బోధించే స్వర్గమూ నరకమూ రెండూ అబద్దాలే. అవి లేవు. వాటి పేరుతో అమాయకులను భయపెట్టి మోసం చేస్తున్నారు. అంతే!

అదేవిధంగా, జీసస్ రెండవరాకడ కూడా అబద్దమే. అది జరగదు. కొన్ని ఇస్లాం శాఖలలో చెప్పేటట్లు 'మెహదీ' మళ్ళీ వస్తాడనే భావన కూడా అబద్దమే. అంతిమతీర్పు అనేది లేనేలేదు. అది అబ్రహామిక్ మతాల మాయ. అదీ అబద్దమే. 

సరే వాళ్ళ అబద్దాలను వాళ్ళు చెప్పుకోనివ్వండి. కానీ ఇతర మతాలపైన, ముఖ్యంగా హిందూమతం పైన, బురదజల్లడం, ద్వేషం రెచ్చగొట్టడం మాత్రం తప్పులే.

స్వర్గనరకాలనేవి పెద్దభ్రమలని  ఉపనిషత్తులలోని వేదాంతభావనలంటాయి. అందుకే నేనంటాను, వేదాంతాన్ని అధ్యయనం చేస్తేనే, అసలైన హిందూమతమేమిటో అర్ధమౌతుందని. పురాణాలను పట్టుకొని కూచుంటే అదెప్పటికీ అర్ధం కాదు. వేదాంతపు కోణం నుండి పురాణాలను చదివినపుడు మాత్రమే అసలైన హిందూమత స్వరూపస్వభావాలు అర్ధమౌతాయి. 

కానీ నేడు ఏ హిందూమత బోధకులూ దీనిని చెప్పడం లేదు. ఉత్తపురాణాలను బోధిస్తున్నారు. వాటిని పట్టుకొని అవే సర్వస్వమైనట్లు జనం  కొట్టుకుంటున్నారు.

సరిగ్గా చెప్పేవారూ లేరు. చెప్పినా వినేవారూ లేరు. అదే మనకు పట్టిన దరిద్రం.

పాల్ మెకంజీ లాంటివాళ్లు చరిత్రలో చాలామందున్నప్పటికీ, అమ్ముడుపోయిన మీడియా, ఇలాంటి న్యూసులకు అంత ప్రాధాన్యతనివ్వదు. ఇస్తే, జార్జి సోరోస్ ఇచ్చే డబ్బులు ఆగిపోతాయి కదా !

క్రైస్తవం నూరిపోస్తున్న ఇలాంటి అబద్ధాలతో ఎంతమంది ఈ విధంగా భ్రమలలో పడిపోతున్నారో మరి? అసలూ, అంతమంది తనను నమ్మిన అమాయకులు అలా దారుణంగా చంపబడుతుంటే, జీసస్ ఏం  చేస్తున్నాడు? మెకంజీకి దర్శనమిచ్చి "ఒరే  అలా  చెయ్యకురా. తప్పురా" అని చెప్పాలి కదా? మరెందుకు చెప్పలేదో?

బైబిలు అబద్ధాలనూ, పాస్టర్ల అబద్ధాలనూ నమ్ముతున్న అమాయక క్రైస్తవులను ఆ జీససే రక్షించాలి. ఆయనంటూ అసలెక్కడైనా ఉంటే !