“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, జూన్ 2018, శుక్రవారం

Badi Sooni Sooni Hai - Kishore Kumar


Badi Sooni Sooni Hai - Zindagi Ye Zindagi

అంటూ కిషోర్ కుమార్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1975 లో వచ్చిన Mili అనే సినిమాలోది. ఈ సినిమా 1971 లో వచ్చిన Anand అనే సినిమాకి దాదాపు కాపీ. రెంటిలోనూ అద్భుతమైన పాటలున్నాయి. ఈ రెంటికీ మూలం ఒక జపనీస్ సినిమా అనీ దాన్ని 1960 ఫిలిం ఫెస్టివల్ లో హృషీకేష్ ముఖర్జీ చూచి Anand అనే సినిమాగా తీశాడనీ అంటారు.

ఈ పాట చాలా బరువైన పాథోస్ సాంగ్. ఇది సచిన్ దేవ్ బర్మన్ స్వరపరచిన చివరి పాట కూడా. దీనిని అమితాబ్, జయబాధురి, అశోక్ కుమార్ల మీద చిత్రీకరించారు.

అంతిమ విశ్లేషణలో ప్రతి మనిషీ ఒంటరివాడే. ఈ లోకంలో ఎవరూ ఎవరికీ ఏమీ కారు. అవుతారని అనుకోవడం పెద్ద భ్రమ. ప్రతి మనిషీ తన నడకను ఒంటరిగా తానే నడవాలి. ఎవరూ మనకు తోడు రారు. రాలేరు.

ఈ పాట రికార్డింగ్ కి సచిన్ దేవ్ బర్మన్ స్టూడియోలో లేరు. ఆస్పత్రిలో ఉన్నారు. ఈ పాట రిహార్సల్ జరుగుతున్నప్పుడే ఆయనకు సీరియస్ అయి ఆస్పత్రిలో చేరవలసి వచ్చింది. తనకు ప్రాణం మీదకు వచ్చినా సరే, ఈ పాట రికార్డింగ్ ఆపద్దని ఆయన కిషోర్ ను కోరారు.

ఆయన కిషోర్ తో ఇలా అన్నారట - 'కిషోర్ ! పాట బాగా రావాలి. ఫీలయ్యి పాడు'

ఆయన అనుకున్నట్లే ఈ పాట అద్భుతంగా వచ్చింది. మర్నాడు దీనిని రికార్డ్ చేశాక, ఆస్పత్రిలో ఆయనకు వినిపిస్తే, పాట వింటూ వింటూ, ఎంతో ఆర్ద్రతతో ఈ పాటను కిషోర్ పాడిన తీరుకు ఆయన కన్నీరు పెట్టుకున్నారట. తన కుమారుడు ఆర్. డి. బర్మన్ తో ఇలా అన్నారట - 'పంచమ్! నాకు తెలుసు కిషోర్ ఇలాగే పాడతాడని'. 

అదే రోజో మర్నాడో ఆయన చనిపోయారు. ఆ విధంగా ఇదే ఆయన స్వరపరచిన ఆఖరు పాట అయింది.

ఈ పాట పుట్టి 43 ఏళ్ళు అయ్యాయి. అయినా ఈ నాటికీ ఇది ఒక అద్భుతమైన పాథోస్ సాంగ్ గా మిగిలిపోయి ఉంది. సచిన్ దేవ్ బర్మన్ నూ, కిషోర్ కుమార్ నూ మనకు గుర్తు చేస్తూనే ఉంది.

ఒక స్వరకర్తకు గానీ, ఒక గాయకునికి గానీ అసలైన పరీక్ష ఏంటంటే విషాద గీతాలను స్వరపరచి పాడటమే. హుషారు పాటలు ఎవరైనా పాడగలరు. కానీ విషాదాన్ని గొంతులో పలికించాలంటే దానికి ఫీలయ్యే హృదయం ఉండాలి. ఆ ఫీలింగ్ గొంతులో పలకాలి. అప్పుడే ఆ పాటకు ప్రాణం వస్తుంది. ఈ పాట అలాంటి బరువైన పాటల్లో ఒకటి. 

సచిన్ దేవ్ బర్మన్ గురించీ, ఈ పాట గురించీ కిషోర్ కుమార్ స్వయానా చెప్పిన సంగతులు ఇక్కడ వినండి.


ఈ పాటకు నేను కూడా పూర్తిగా న్యాయం చేశానని భావిస్తూ నా ఈ పాటను మధుర సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ స్మృతికి అంకితం ఇస్తున్నాను. ఈ పాటను తదేకంగా వింటే, మీకు కళ్ళలో నీళ్ళు గిర్రున తిరగకపోతే, మీకు హృదయం లేనట్లే లెక్క.

ఈ మధురగీతాన్ని నా స్వరంలో కూడా వినండి. ఇది కిషోర్ కుమార్  పాడిన వెర్షన్ కాదు. నేనే పాడాను. నమ్మలేకపోతున్నారా? వినండి మరి.

Movie:--Mili (1975)
Lyrics:-- Majrooh Sultanpuri
Mucis:-- Sachin Dev Burman
Singer:-- Kishore Kumar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
----------------------------------
Badee sooni sooni hai – Zindagi zindgi
Badi sooni sooni hai – Zindagi zindgi
Mai khudse hoon yaha – Ajnabi ajnabi
Badi suni suni hai

Kabhi ek pal bhi – Kahi ye udasi – Dil mera bhoole
Tabhee muskura kar – Dabe paav aakar – Dukh mujhe choole
Nakar mujhse gam mere – Dillagi ye dillagi
Badi sooni sooni hai

Kabhi mai na soya – Kahi mujhse khoya - Sukh mera aise
Pata naam likh kar – Kahi yuhi rakhkar – Bhulekoi jaise
Ajab dukh bhari haiye – Bebasi ye bebasi
Badi suni suni hai – Zindagi ye zindgi
Badi suni suni hai

Meaning

My life is lonely, very lonely
In this world, I remain a stranger, a stranger
My life is lonely, very lonely

I wish I forget this pain
at least for a moment
Sometimes, grief comes with a smile
and touches my heart
Oh my love, don't be sad with me
My life is lonely, very lonely

I had never slept, still I lost

I had never slept, still I lost my happiness somehow
Just like we write our name on a thing
keep it somewhere but forget it somehow
This helplessness of mine is full of misery
My life is lonely, very lonely

తెలుగు స్వేచ్చానువాదం

చాలా ఒంటరిగా ఉంది, నా జీవితం
ఈ ప్రపంచంలో నేనొక పరాయివాడిని
చాలా ఒంటరిగా ఉంది, నా జీవితం

ఈ వేదనను ఒక్క క్షణమైనా మరచిపోవాలని
ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను
కొన్ని సార్లు బాధ అనేది
నవ్వుతూ వచ్చి నా గుండెను తాకుతోంది
ఓ ప్రేమా ! నన్నిలా బాధపెట్టకు
చాలా ఒంటరిగా ఉంది, నా జీవితం
చాలా ఒంటరిగా ఉంది

నేనేరోజూ ఏమరుపాటుగా నిద్రపోలేదు
కానీ నా సంతోషాన్ని ఎలాగో కోల్పోయాను
మనం మన వస్తువును
ఎక్కడో పెట్టి మర్చిపోయినట్లు...
ఈ నా అశక్తత చాలా బాధామయంగా ఉంది
చాలా ఒంటరిగా ఉంది, నా జీవితం
చాలా ఒంటరిగా ఉంది...