“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, మే 2017, శుక్రవారం

Ek Banjara Gaye - Mohammad Rafi


Ek Banjara Gaye - Jeevan Ke Geet Sunaye
Hum Sab Jeene Walonko - Jeene Ki Raah Bataye

అంటూ మహమ్మద్ రఫీ మధురంగా గానం చేసిన ఈ గీతం 1969 లో వచ్చిన Jeene Ki Raah అనే సినిమాలోది. ఈ పాట ఎంతో చక్కనైన అర్ధాన్ని కలిగి ఉన్న పాట.

ఈ పాటంటే నాకెంతో ఇష్టం. ఎందుకంటే ఆ దేశద్రిమ్మరిని నేనే కాబట్టి. నేను ఇలాగే బ్రతికాను కాబట్టి. జీవితాన్ని ఎలా జీవించాలో నన్ను అనుసరించే వారికి ప్రస్తుతం నేర్పుతున్నాను కాబట్టి.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Jeene Ki Raah (1969)
Lyrics:--Anand Bakshi
Music:--Laxmikant Pyarelal
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------------------
Suno, ek tarana, naya yeh fasana,
ke, aangan mein mere, sawere sawere.

Ek Banjara gaaye
jeevan ke geet sunaaye,
hum sab jeene walon ko
jeene ki raah bataaye,
Ek Banjara gaaye, ho o,h o o,..............(2)

Zamaane waalon - kitaab-e-gham mein,
khushi ka koyi - fasaana dhoondho, ..........(2)
agar jeena hai - zamaane mein to,
haseen ka koyi - bahaana dhoondho.

ho ho ho ho
aankhon mein - aansoo bhi aaye,
tho aa kar muskaaye,

Ek Banjara gaaye
jeevan ke geet sunaaye,
hum sab jeene walon ko
jeene ki raah bataaye,


Ek Banjara gaaye, ho o,h o o

Sabhi ka dekho - nahi hota hai,
naseeba roshan - sitaaron jaisa,........(2)
sayana woh hai - jo pathjhadh mein bhi,
sajaale gulshan - bahaaron jaisa,

ho o o o, kaagaz ke phoolon ko bhi,
tu, mehka kar, dikhlaaye,

Ek Banjara gaaye
jeevan ke geet sunaaye,
hum sab jeene walon ko
jeene ki raah bataaye,


Ek Banjara gaaye,
oho oho oho...

Meaning

Listen to a melody song
Its a new romantic tale
It says that
in my home its always dawn and dawn

A nomad is singing a song
He is singing the song of life
To all of us who are living here
He is showing the path of life

Oh fellows of the world
Search for a tale of joy
in the book of sorrow called your life
If you want to live in this world
Just search for a beautiful excuse
Even if your eyes are full of tears
Keep others happy by making them smile

Just look !
In this world, everyone will not
have a fate shining like the stars
The real cleverness is to keep
smiling in sorrow
like a garden of flowers in autumn
waiting for the spring
You make even the paper flowers
to shine and smile like the real ones
that is the real beauty of life

A nomad is singing a song
He is singing the song of life
To all of us who are living here
He is showing the path of life

తెలుగు స్వేచ్చానువాదం

ఒక మధురమైన కొత్త పాటను వినండి
అదేం చెబుతుందో తెలుసా?
నా ఇంటిలో ఎప్పుడూ ఉషోదయమే అంటుంది..
వినండి మరి..

ఒక దేశద్రిమ్మరి పాడుతున్న పాటను వినండి
జీవన గీతాన్ని అతను పాడుతున్నాడు
జీవిస్తున్న మనందరికీ
ఎలా జీవించాలో నేర్పుతున్నాడు

ఓ లోక ప్రయాణీకులారా !
వేదనాభరితమైన మీ జీవితం అనే పుస్తకంలో
ఒక సంతోషపు అధ్యాయం కోసం వెదకండి
మీరీ లోకంలో బ్రతకాలంటే
ఒక అందమైన కుంటిసాకును వెతుక్కోండి
మీ కళ్ళలో కన్నీరు ఉన్నా సరే
ఇతరులను మీరు నవ్వించాలి
వారిని ఆనందంగా ఉంచాలి
ఇదే జీవన నియమం

గమనించండి !
ఈ లోకంలో అందరి జాతకాలూ
ఆనందమయంగా మెరుస్తూ ఏమీ ఉండవు
తెలివైన వాడి లక్షణం ఏమంటే,
బాధలో కూడా నవ్వుతూ ఉండటం
వసంతం కోసం ఎదురు చూస్తూ
శిశిరంలో కూడా నవ్వే తోటలా..
కాగితపు పూలను కూడా అసలైన పూలలా
మెరిపించి మీరు చూపించాలి.
ఇదే జీవన నియమం

ఒక దేశద్రిమ్మరి పాడుతున్న పాటను వినండి
జీవన గీతాన్ని అతను పాడుతున్నాడు
జీవిస్తున్న మనందరికీ
ఎలా జీవించాలో నేర్పుతున్నాడు...