“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

15, జూన్ 2016, బుధవారం

Orlando Massacre - Astro analysis


ఫ్లోరిడా లోని ఆర్లాండో నైట్ క్లబ్ లో గత ఆదివారం తెల్లవారు జామున జరిగిన షూటింగ్ లో 50 మంది చనిపోవడం అందరికీ తెలిసిందే.ఈ సంఘటన ఉదయం 2.02 నుంచి 5.45 వరకూ జరిగింది.

పూర్తిగా నా ఆధ్యాత్మిక లోకంలో నా పనిలో నేను ఉంటుండటం వల్ల ఈమధ్య కాలంలో దేశ జాతకాన్ని నేనసలు పట్టించుకోవడంలేదు.

మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియబరుస్తూ, ఈ సంఘటనను జ్యోతిష్య కోణంలో ఒక్కసారి చూద్దాం.

వృశ్చిక రాశిలో కుజశనులు కలసినపుడు అనేక దుర్ఘటనలు ఘోరాలు జరుగుతాయని ఒకటిన్నర ఏళ్ళక్రితం నేను వ్రాశాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ వృశ్చికరాశిలోనే ఉన్నారు.ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. జ్యోతిశ్శాస్త్రం ఎంత గొప్పదో ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి.

ఆ సమయంలో మీనలగ్నం ఉదయిస్తున్నది.రాశ్యాదిపతి అయిన గురువు శత్రురాశిలో, ముస్లిం ఉగ్రవాదానికి సూచకుడైన రాహువుతో కలసి కూర్చుని చాలా దగ్గరగా ఉన్నాడు.ఈ సంఘటన వెనుక ఎవరున్నారో ప్రస్తుతం ప్రపంచానికి అంతటికీ తెలుసు.

శని కుజులు ఇద్దరూ వక్రించిన స్థితిలో ప్రస్తుతం ఉన్నారు. నవాంశలో వాళ్ళు ఒకరికొకరు షష్టాష్టకంలో ఉన్నారు.కుజుడు నీచలో ఉన్నాడు.గురు రాహువులు లగ్నం నుంచి అష్టమంలో ఉంటూ మతపరమైన హింసనూ వినాశనాన్ని సూచిస్తున్నారు.

తృతీయ అష్టమాదిపతి అయిన శుక్రుడు అస్తంగతుడై బుద్ధిలేని హింసను సూచిస్తున్నాడు.ఆరోజు అష్టమీ తిధిగా ఉండి దుర్ఘటనను సూచిస్తోంది.

ఇవన్నీ కలసి ఈ సంఘటన జరగడానికి దోహదం గావించాయి.

ముస్లిం ఉగ్రవాదంతో ప్రపంచ వినాశనం జరగడం ఖాయం. ప్రపంచం అంతా సైతాన్ గుప్పిట్లో ఉందనీ తామొక్కళ్ళమే దైవదూతలమనీ వారు భావించి, ప్రపంచాన్ని హింసద్వారా చక్కదిద్దాలని ప్రయత్నించడమే ఈ వినాశనానికి గల మూలకారణం.

ఖురాన్ ఒక్కటే దైవగ్రంధమని వీళ్ళూ, బైబిల్ ఒక్కటే దైవగ్రంధమని వాళ్ళూ మూర్ఖంగా నమ్మడం వల్లనే సర్వం నాశనం అవుతున్నది.అసలు నిజమేమంటే ఇవి రెండూ compilations మాత్రమే గాని డైరెక్ట్ గా దేవుడు చెప్పినవి కానే కావు. ఈ మూడనమ్మకానికి తోడు, ప్రపంచాన్ని చక్కదిద్దాలని వీళ్ళు మూర్ఖంగా ప్రయత్నించడం వల్లనే ఈ వినాశనం అంతా జరుగుతున్నది.అసలా పని చెయ్యడానికి వీళ్ళెవరు? ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఆ పని చూసుకోడా? నిద్రపోతున్నాడా? వీళ్ళ చేతుల్లోకి న్యాయాన్ని తీసుకోడానికి అసలు వీళ్ళెవరు?

ఇతరులు 'గే' లైతే మనకెందుకు? లెస్బియన్స్ అయితే మనకెందుకు?ఎవడి గోల వాడిది.ఎవడి ఖర్మ వాడిది.వాళ్ళకి చెప్పే ఖర్మ మనకెందుకు? పక్కమనిషికి హాని చెయ్యకుండా ఎవడు ఎలా ఏడిస్తే మాత్రం ఏమౌతుంది గనక? ఈమాత్రం బుద్ధిలేక ప్రతిదాంట్లో కల్పించుకోవాలని చూడటమే ఈ విపరీతాలకన్నింటికీ కారణం.

ఈ విపరీతాలను ఆపడం ఎవరి తరమూ కాదు. ప్రపంచ వినాశనంతోనే దీనికి అంతం.

ఇక్కడ మీకొక అనుమానం సహజంగానే రావచ్చు.

మునుపట్లా, అన్నీ జరిగిపోయాకే మీరు ఎనాలిసిస్ వ్రాస్తున్నారు.ముందే చెప్పి ఇదంతా ఆపవచ్చు కదా అని.

ప్రతిదాన్నీ ఆపాల్సిన పని నాకేంటి? ఎందుకాపాలి?

నేనాపని చెయ్యను.నాకవసరం లేదు.ఆపవలసిన పని నాకు లేదు.అలా ఆపడం అనేది ఎవరికి పడితే వారికి చెయ్యను కూడా.నాకిష్టమైన వాళ్ళకే అది చేస్తాను.వారిని ముందుగా హెచ్చరించి,వారి జీవితాలు మాత్రమే బాగు చేస్తాను.అందరికీ ఆ సహాయం చెయ్యను.అందరి కర్మలో నేనేమీ జోక్యం చేసుకోను.

పౌర్ణమి దగ్గరకొస్తోంది - పిచ్చి ముదురుతోందని అనుకుంటున్నారు కదా? నిజమే.

నేనింతే !!

మీకేమైనా అభ్యంతరమా?