18, ఫిబ్రవరి 2020, మంగళవారం

Astro - Homoeo Retreat - Feb 2020






















































ఈ సంవత్సరానికి మొదటి జ్యోతిష్య - హోమియో సమ్మేళనం 16th Feb 2020 న హైదరాబాద్ లో జరిగింది. దీనికి పంచవటి సభ్యులు నలభైమంది హాజరయ్యారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరువరకూ ఏకధాటిగా ఈ కార్యక్రమం జరిగింది.

9 నుంచి మధ్యాన్నం రెండువరకూ జరిగిన జ్యోతిష్యసమ్మేళనంలో మొదటి రెండుగంటలు జ్యోతిష్యశాస్త్ర పునాదులను మళ్ళీ ఒకసారి త్వరగా నేర్పించాను. ఇంతకుముందు మేము చేసిన Astro workshops లో అవన్నీ చెప్పాను. కానీ ఈ సబ్జెక్ట్ మళ్ళీ మళ్ళీ చెప్పవలసినది గనుక ఒకసారి మళ్ళీ బేసిక్స్ నుంచి మొదలుపెట్టి నేర్పించాను. కానీ, సోది లేకుండా, నా పద్ధతిలో విశ్లేషణ ఎలా చెయ్యాలో, దానికి ఏయే ప్రాధమిక అంశాలు అవసరమో అంతవరకే నేర్పించాను. దానికే మొదటి రెండు గంటలు పట్టింది.

2000 సంవత్సరంలో తెలుగువిశ్వవిద్యాయం నుంచి నేను జ్యోతిష్యం MA చేశాను. అంటే నేటికి 20 ఏళ్లయింది. అంతకు ముందు 5 ఏళ్ళనుంచీ నేను జ్యోతిష్యం నేర్చుకుంటూనే ఉన్నాను. అయితే, ఈ  కోర్సుకు అది మొదటి బ్యాచ్. అప్పటినుంచీ నేను చేస్తున్న రీసెర్చి వల్ల అనేక కొత్త టెక్నిక్స్ దానిలో కనుక్కున్నాను. ఇవి పుస్తకాలలో ఎక్కడా మీకు దొరకవు. ఆ టెక్నిక్స్ ను నా శిష్యులకు నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఈ రిట్రీట్స్ పెడుతున్నాను. అంటే, నా 25 ఏళ్ళ పరిశోధనా ఫలితాలను వారికి పంచిపెడుతున్నాను.

11 గంటలనుంచి 2 గంటలవరకూ, జ్యోతిష్యశాస్త్రంలో నేను ఉపయోగించే కిటుకులు, సూత్రాలను కొన్నింటిని వారికి నేర్పించడమే గాక, కొన్ని జాతకాలను వారిచేతనే విశ్లేషణ చేయించాను. మిగతా సూత్రాలను తరువాత జరిగే సమ్మేళనాలలో వివరిస్తాను.

జ్యోతిష్యం కోసం మేమిన్నాళ్ళు "జగన్నాధహోర" ఫ్రీ సాఫ్ట్ వేర్ వాడుతున్నాము. అందులో మాకు కావలసిన దానికంటే చాలా ఎక్కువ లెక్కడొక్కలు ఉన్నాయి. అన్ని మాకు అవసరం లేదు. మాది చాలా simple and straight approach. కనుక మాదంటూ ఒక జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ను మేమే డెవలప్ చేస్తున్నాము. త్వరలో మా "పంచవటి" సంస్థ నుంచి దానిని విడుదల చెయ్యడం జరుగుతుంది. అది Windows, Mac, Mobile అన్ని ప్లాట్ ఫాం ల మీదా పనిచేస్తుంది. ఆ విధంగా దానిని తయారు చేస్తున్నాము. దానిపేరు Satya Jyotish (SJ) అని నిర్ణయించడం జరిగింది. 

చివరగా వారికొక విషయం చెప్పాను.

"డబ్బుకోసం జ్యోతిష్యశాస్త్రాన్ని ఎప్పుడూ వాడకండి. దురాశకు లోనుకాకండి. దీనిని ఎగతాళిగా, సరదాగా తీసుకోకండి. ఇది చాలా పవర్ ఫుల్ సైన్స్. జాగ్రత్తగా దీనిని డీల్ చెయ్యకపోతే, మీ చేతులు కాలిపోతాయి. నా సాధనామార్గంలో నడిస్తేనే మీరు దీనిని సరిగ్గా అర్ధం చేసుకోగలుగుతారు, చెయ్యగలుగుతారు. Ordinary astrology ని వదలి, Spiritual astrology ని అర్ధం చేసుకోండి. మీమీ జీవితాలలో అన్వయించుకోండి. ఆచరించండి. మీమీ కుటుంబాలను బాగు చేసుకోండి, మీమీ ఆరోగ్యాలను బాగు చేసుకోండి. నేను చూపుతున్న ఆధ్యాత్మికమార్గంలో నడచి, సాధనామార్గంలో ఎదగండి. లోకంలో ఉన్న అజ్ఞానపు చీకట్లను పోగొట్టే దీపాలుగా మారండి" అని నా శిష్యులకు చెప్పాను.

ఈ విధంగా ఉదయంపూట జ్యోతిషశాస్త్ర సమ్మేళనం ముగిసింది.

లంచ్ తరువాత జరిగిన హోమియో సమ్మేళనంలో  ఈ క్రింది విషయాలను వారికి వివరించాను.

1. హోమియోపతి ఎలా పుట్టింది? దాని ప్రాముఖ్యత ఏమిటి? డా || హన్నేమాన్ జీవితం. 
2. రోగం అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? ఎలా వస్తుంది ?
3. ప్రాణశక్తి అంటే ఏంటి? రోగాన్ని అది ఎలా నయం చేస్తుంది?
4. పొటెన్సీ  అంటే ఏమిటి? అందులో ఎన్ని స్కేల్స్ ఉన్నాయి? వాటినిఎలా తయారు చేస్తారు? వాటిని ఎలా ఎప్పుడు వాడాలి? 
5. హోమియోపతిలో - Plant, Mineral, Animal, Poisonous, Disease products - ఇలా ఎన్ని రకాలైన ఔషధాలున్నాయి? అవి ఎలా పని చేస్తాయి ? వేటిని ఎప్పుడు వాడాలి?
6. ఇంగ్లీషు వైద్యానికి హోమియో వైద్యానికి ఉన్న తేడాలేమిటి? రోగం తగ్గడం అంటే ఏమిటి? దానికి మనమేమేం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు?
7. ఎక్యూట్ మరియు క్రానిక్ రోగాలలో హోమియో మందులు ఎలా వాడాలి? పోటేన్సీలు ఎలా వాడాలి? రిపీట్ ఎలా చెయ్యాలి?

ఆ తర్వాత, మా అమ్మాయి డా || శ్రీభార్గవి MD (Homoeo), హోమియోపతి మీద క్లాసు తీసుకుంది. దానిలో First Aid Remedies - Homoeopathy గురించి దాదాపు 20 రకాలైన ఔషధాలను వివరిస్తూ, నిత్యజీవితంలో ప్రతివారికీ వచ్చే అనేక బాధలకు ఆ మందులను ఎలా వాడాలో తను చక్కగా వివరించింది.

ఆధ్యాత్మికం అనేది మా జీవితాలలో అన్ని విషయాలలోనూ అంతర్లీనంగా ఉంటూనే ఉంటుంది గనుక - జ్యోతిష్యాన్ని, హోమియోపతిని కూడా ఆధ్యాత్మికసాధనతో మేళవిస్తూ, నిత్యజీవితంలో వాటిని ఎలా ఉపయోగించుకోవాలో  చెప్పడం జరిగింది.

ఇన్నేళ్ళుగా నేను రిట్రీట్స్  జరుపుతూ ఉన్నప్పటికీ Advanced level లో Subject ను చెప్పడం ఇదే మొదటిసారి. ఏడాదికి కనీసం నాలుగు రిట్రీట్స్ ఇకపైన జరపాలన్న సంకల్పాన్ని అందరూ వ్యక్తం చేశారు. అలాగే చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. ఈ పునాదులనుంచి మొదలుపెట్టి, ముందుముందు క్లాసులలో ఈ సైన్సులలోని Advanced topics కూలంకషంగా నేర్పించడం జరుగుతుంది.

ప్రసిద్ధ కర్నాటక సంగీత విద్వాంసులు T.P. Chakrapani గారు, వారి శిష్యురాలు కుమారి నవ్య గార్ల సాంప్రదాయ కీర్తనలతో సమావేశం జయప్రదంగా ముగిసింది.

జ్యోతిష్యశాస్త్రం, హోమియోపతి, ఆధ్యాత్మికసాధనల గురించి ఎన్నో క్రొత్త విషయాలను, ఇంకెన్నో క్రొత్త Insights ను మనసులలో నింపుకుని, "మళ్ళీ త్వరలో అందరం కలుసుకుందాం" అన్న మంచిసంకల్పంతో అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు.
read more " Astro - Homoeo Retreat - Feb 2020 "

17, ఫిబ్రవరి 2020, సోమవారం

Fitness Challenge - 1 (Flexibility)

ప్రస్తుతం నాకు 57 నడుస్తోంది. మరికొద్ది నెలలలో 58 లోకి అడుగు పెడుతున్నాను. కానీ, నా వయసు 30-35 మధ్యలో ఆగిపోయిందని నా ప్రగాఢవిశ్వాసం. ఈ ఫీలింగుకి కారణం నా యోగాభ్యాసం, నా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్. ఈ ఫీలింగ్ నిజమా కాదా అని అప్పుడప్పుడూ పరీక్ష చేసుకుంటూ ఉంటాను. నిజమే అని జవాబు వస్తూ ఉంటుంది.

నేను ఇరవైలలో ఉండగా హై కిక్స్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. అప్పుడు దాదాపు 180 డిగ్రీలలో కాలు పైకి లేచేది. నిలుచుని ఉన్న ఒకరి తలమీద ప్లాస్టిక్ చెంబు ఉంచి, సునాయాసంగా దానిని కాలితో కిక్ చేసి ఎగరగొట్టేవాడిని. అది ఇప్పుడు కూడా చెయ్యగలను. కానీ నిలబడటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే, ఇప్పుడు 180 డిగ్రీస్ రావడం లేదు, 135 డిగ్రీస్ మాత్రమే వస్తోంది. అందుకే, ఎటుపోయి ఎటోస్తుందో ఏమో అని నా శిష్యులు భయపడుతున్నారు. కానీ ఒక్క ఏడాదిలో 180 డిగ్రీస్ లో కిక్స్ మళ్ళీ సాధించాలని ఈ మధ్యనే కంకణం కట్టుకున్నాను.

ఇంకో మూడేళ్ళలో నాకు 60 నిండుతాయి. నా షష్టిపూర్తికి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజున ఈ క్రింది వ్యాయామాలు చేసి వాటిని వీడియో తీసి రికార్డ్ చేసి ఇదే బ్లాగులో పోస్ట్ చేస్తాను. అవేంటో తెలుసా ?

1. 60 Push Ups at a time.
2. 60 Punches and 60 Kicks non - stop.
3. 120 minutes Yoga Non - stop

ఈ షెడ్యూల్ ను నా షష్టిపూర్తి రోజున చెయ్యబోతున్నాను. ఇది నాకు నేనే ఇచ్చుకుంటున్న సెల్ఫ్ చాలెంజ్ !

ఆఫ్ కోర్స్ ఇది మూడేళ్ళ తర్వాత అనుకోండి. ప్రస్తుతానికి - flexibility కోసం ఇప్పుడు చేస్తున్న martial arts వ్యాయామాలు కొన్నింటిని చూడండి.
















read more " Fitness Challenge - 1 (Flexibility) "

14, ఫిబ్రవరి 2020, శుక్రవారం

సేవ చెయ్యకండి ! దాని పని అయిపోయింది !

'మానవసేవే మాధవసేవ' అన్న సూత్రం మనకు బాగా తెలుసు. రాజకీయ నాయకులూ, లెక్చరర్లూ, వక్తలూ అందరూ ఈ మాటను కొన్ని వేలసార్లు వాడి ఉంటారు. చివరకు లారీల వెనుకా ఆటోల వెనుకా కూడా దీనిని మనం గమనిస్తూ ఉంటాం.

నా ఉద్దేశ్యంలో మాత్రం ఈ సూక్తి తన విలువను కోల్పోయింది. నేటి సమాజంలో సేవ అనేది ఎవరికీ అవసరం లేదని నా ప్రగాఢమైన నమ్మకం. ఈ నమ్మకం నిరాధారమైనది కాదు. గట్టి పరిశీలన తర్వాతే నేనీ నమ్మకానికి వచ్చాను.

మొన్నీ మధ్యన రామకృష్ణా మిషన్ కు చెందిన స్వామీజీ ఒకాయన నాకు వాట్సప్ లో కొన్ని ఫోటోలు పంపారు. ఏదో పేదల కాలనీకి వెళ్లి అక్కడ ఉన్న కుష్టువారికీ ఇతర నిర్భాగ్యులకూ దుప్పట్లూ బట్టలూ పంచుతున్న ఫోటోలవి. కేరళలో ఎక్కడో ఈ కార్యక్రమం జరిగింది. ఆ ఫోటోలను ఆయన నాకు పంపారు. ఆయనకు ఇలా మెసేజి ఇచ్చాను.

'మీరు చేస్తున్న సేవకు అర్ధం లేదు. ప్రస్తుతం మన సమాజంలో ఈ రకమైన సేవ ఎవరికీ అవసరం లేదు. వివేకానందస్వామి టైములో ఈ రకమైన సేవ అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు లేదు. కనుక మీరు ఈ పనులు చెయ్యనవసరం లేదని నా ఉద్దేశం. మీ ఫోటోలు చాలా కామెడీగా ఉన్నాయి. అన్నీ ఉన్నవాడికి ఏమీ లేనివాడు బట్టలు పంచుతున్నాడు. ఇది కామెడీ కాకపోతే మరేంటి?'.

దానికాయన షాకైనారు. బహుశా ఇలా ఆయనకు ఎవరూ చెప్పి ఉండరు.

ఆయన షాక్ ను చూసి ఇలా చెప్పాను.

'చూడండి స్వామీజీ ! మీరు సర్వసంగ పరిత్యాగులు. మీకు బ్యాంక్ ఎకౌంట్ లేదు. ఆదాయం లేదు. పూర్తిగా భగవంతునిమీద ఆధారపడి మీరు ఉంటున్నారు. ఇకపోతే, మీరు సేవ ఎవరికి చేస్తున్నారో గమనించండి. ఆ కుష్టువారికీ, ఇతర నిర్భాగ్యులకూ అందరికీ ఇప్పుడు ఇళ్ళస్థలాలున్నాయి, బ్యాంక్ ఎకౌంట్లున్నాయి, ఆదాయమార్గాలున్నాయి. ప్రభుత్వమే లెక్కలేనన్ని welfare schemes ఇస్తోంది. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరయ్యా అంటే, పేదవాడే. వాడికి అన్నీ ఫ్రీనే. టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. స్కీమ్స్ అన్నీ వాడుకుని ప్రభుత్వం నుండి డబ్బులు తీసుకుంటాడు. ఇళ్ళస్థలాలు తీసుకుంటాడు. అవి అమ్ముకుని మళ్ళీ ఇంకో స్కీం లో మళ్ళీ తీసుకుంటాడు. వాడికన్నీ ఉన్నాయి. మీకేమో ఏమీ లేవు. నిజంగా పేద మీరే. మీకే సేవ అవసరం. మీరు ఇంకొకరికి చేయ్యనక్కర లేదు.

ఇంకో కోణం వినండి.

మీ దగ్గర సహాయం తీసుకుంటున్న ఎవరికీ మీమీద కనీస కృతజ్ఞత ఉండదు. వాళ్ళలో చాలామంది ఇప్పటికే క్రైస్తవులుగా మారినవాళ్ళు. చర్చిల నుండి సహాయాన్ని పొందుతున్న వాళ్ళు. ఇంకోపక్క ప్రభుత్వం కూడా వారికి ఇస్తోంది. మీరిస్తే మీ దగ్గర తీసుకుంటారు, కానీ మీ వెనుక మిమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడతారు. మీరు చూడలేదేమో? నేనిది చాలాకాలం క్రితమే గమనించాను.

ఈ దేశంలో బెగ్గర్ అనేవాడు రోజుకు సగటున వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే కొత్తగా చేరిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కంటే ఒక బెగ్గర్ ఎక్కువ సంపాదిస్తున్నాడు. TCS లో కొత్తగా చేరిన ఉద్యోగికి 18000 మాత్రమే వస్తోంది, సెంటర్లో హోటల్ దగ్గర పొద్దుటనుంచీ సాయంత్రం దాకా ఊరకే కూచుని అడుక్కునే బెగ్గర్ గాడు 30000 సంపాదిస్తున్నాడు. వాడి భార్య ఇంకో సెంటర్లో ఇంకో 30000 సంపాదిస్తోంది. TCS లో కొత్తగా చేరిన సాఫ్ట్ వేర్ ఇంజనీరేమో పెళ్లి చేసుకోవాలంటే ఈ 18000 ఏ మూలకీ చాలవు. ఏం చెయ్యాలి? అని దిక్కులు చూస్తున్నాడు. అందులోనే పనిచేసే సాటి అమ్మాయి వీడిని చేసుకోదు. ఎందుకంటే వాడికి కూడా తనలాగే 18000 వస్తుంది మరి !. అందుకని, తన అందాన్ని ఎరగా వేసి ఏ కాలిఫోర్నియాలోనో ఉన్న గూగుల్ ఇంజనీరుకి ఆమె గాలం వేస్తూ ఉంటుంది.

ఈలోపు ఈ బెగ్గర్ ఫామిలీ ఇంకో నలుగురు పిల్లల్ని కని సమాజం మీదకు వదుల్తారు. వాళ్ళుకూడా ఏదో ఒక సెంటర్లో ఒక మంచిహోటలు చూసుకుని రోడ్డుమీద హాయిగా సెటిలై పోతారు. ప్రభుత్వం వాళ్లకు కూడా ఇళ్ళస్థలాలు ఇస్తుంది. వాళ్ళకూ బ్యాంక్ ఎకౌంట్లు వస్తాయి. వాళ్ళు కూడా మొబైల్స్ వాడుతూ ఉంటారు. అందరూ కలసి బేవార్స్ గా సంపాదిస్తూ ఉంటారు. దీనికితోడు, ప్రభుత్వం ఇచ్చే welfare schemes అన్నీ వాడుకుని డబ్బులు తీసుకుంటూ ఉంటారు. నిజాయితీగా చదువుకుని ఉద్యోగం చేసేవాడు మాత్రం 'ఈ జీతంతో ఈ సిటీలో ఎలా బ్రతకాలిరా దేవుడా?' అని ఏడుస్తూ ఉంటాడు. ఇదీ మన దేశం పరిస్థితి ! 

బెగ్గర్స్ మాఫియా గురించి చెబితే మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. కొన్ని సెంటర్స్, కొన్ని హోటల్స్ దగ్గర కొందరే బెగ్గర్స్ ఉంటారు. అవి వారి సొంత స్థలాలన్నమాట. వేరే బెగ్గర్ అక్కడ కొచ్చి అడుక్కోవాలంటే, ఎప్పటినుంచో అక్కడ ఉన్న బెగ్గర్ కి వాడు రాయల్టీ కట్టాలి. వాళ్లకు సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘాల నాయకులు అడుక్కోవడం మానేసి, బెగ్గర్స్ ఇచ్చే మామూళ్ళతో బ్రతికేస్తూ ఉంటారు. వీళ్ళలో చాలామంది స్కూటీలో అన్ని సెంటర్స్ కీ తిరుగుతూ మామూళ్ళు వసూలు చేస్తూ ఉంటాడు. వీటిని మీరు నమ్మలేరు, కానీ నిజాలే.

ఆయన ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే నేను చెబుతున్నది నిజమే అని ఆయనకూ తెలుసు మరి ! ఆయనలో 'ఆలోచనాతరంగాలు' మొదలై ఉంటాయని నాకనిపించింది.

సేవ అనే పదం ప్రస్తుతం తన విలువనే కాదు. తన ప్రాణాన్నే కోల్పోయింది. అందుకే నా శిష్యులందరికీ నేను చెబుతాను. 'ఏ బెగ్గర్ కీ మీరు డబ్బులు ఇవ్వకండి. ఎవడి సైకలాజికల్ బ్లాక్ మెయిల్ కీ మీరు పడకండి. అలా ఇస్తే మీరు ఒక దరిద్రపు బద్దకాన్ని సమాజంలో పెంచి పోషిస్తున్నట్లే.'

అంతేకాదు, నేను ఇంకో మాట కూడా తరచుగా చెబుతూ ఉంటాను. నాకే గనుక అధికారం ఉంటే, నేను ఈ బెగ్గర్స్ కీ, పనీపాటా చెయ్యకుండా సమాజం మీద పడి బ్రతికే వాళ్ళకీ ఒకే రకమైన 'సేవ' చేస్తాను.  ఈ దరిద్రపు జీవితం నుంచి వాళ్లకు శాశ్వతంగా విముక్తి ప్రసాదిస్తాను. అదెలాగంటే, ముందుగా ఒక వారం గడువు వాళ్ళందరికీ ఇస్తాను. "అడుక్కోవడం మానుకొని చేతనైన పనులు చేసుకుని బ్రతకండి" అని. ఆ గడువు అయిపోయిన తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ ఒకచోటకు చేర్చి ఆర్మీ చేత షూట్ చేయించి పారేస్తాను. ఆ తర్వాత మాస్ క్రిమేషన్ చేయిస్తాను. ఒకే ఒక్క రోజులో ఇండియాలో అడుక్కునేవాళ్ళ బెడద తప్పిపోతుంది. ఇండియా బెగ్గర్ ఫ్రీ కంట్రీ అవుతుంది.

మొన్నటికి మొన్న పాండిచేరి బస్టాండ్ లో చూచాను. కొందరు ఫారినర్స్ బెంగుళూరు బస్స్టు ఎక్కబోతూ, ఒక స్టాల్ దగ్గర ఏవో కొంటున్నారు. ఒక బెగ్గర్ గారు వాళ్ళను ఘోరంగా సతాయిస్తున్నాడు. వాళ్లకు విసుగోచ్చి ఒక పాకెట్లో పదికి పైగా సమోసాలు కొని వాడికిచ్చారు. వాడు ఆ సమోసాల పొట్లాన్ని కొంచం దూరంలో కూచుని ఉన్న ఇంకొక బెగ్గర్ దగ్గర డిపాజిట్ చేసి మళ్ళీ వీళ్ళ దగ్గరకొచ్చి మళ్ళీ బెగ్గింగ్ మొదలు పెట్టాడు. అప్పుడు ఆ ఫారినర్స్ ముఖాలు చూడాలి ! నాకు భలే నవ్వొచ్చింది. మన దేశం గురించి వాళ్ళు ఎంత చండాలంగా మాట్లాడుకుంటారో నవ్వుకుంటారో ఆలోచిస్తే నాకు చాలా బాధ కలిగింది. పోనీ ఆ బెగ్గర్ గాడు నిజంగా దరిద్రంలో ఉన్నాడా అంటే అదీ లేదు ! అంతా డ్రామా !

మొన్నా మధ్యన ఇంకో సంఘటన జరిగింది. ఎవరో నాకు ఒక రిక్వెస్ట్ పంపారు. 'ఒక తండ్రి తన కూతురుకి పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాడు. అందుకనే అందరం డబ్బులు వేసుకుని ఆ పెళ్లి చేస్తున్నాం. మీరు కూడా కొంత సాయం చెయ్యండి' అని దాని సారాంశం. దానికిలా జవాబిచ్చాను.

'మొదటగా, అలాంటి పరిస్థితిలో ఉన్నవాడు అసలు పిల్లల్ని కనకూడదు. ఎందుకు కన్నాడు? అందుకు వాడిని ముందుగా శిక్షించాలి. రెండోది - అంత అప్పు చేసి ఆ పెళ్లి చెయ్యనవసరం లేదు. ఈ రోజుల్లో పెళ్ళే చెయ్యాలంటే, చాలా మార్గాలున్నాయి. గుళ్ళో దండలు మార్చుకుని సింపుల్ గా చేసుకోవచ్చు. లేదా రిజిస్టర్ మేరేజి చేసుకోవచ్చు.  ఈ రెండిట్లో ఎదో ఒకటి చెయ్యమని ఆ తండ్రికి నా మాటగా చెప్పండి. అడుక్కుని ఆర్భాటంగా  పెళ్లి చెయ్యవలసిన పని ఏ మాత్రమూ లేదు. ఇంకా చెప్పాలంటే, నా దృష్టిలో ఆ అమ్మాయికి అర్జంట్ గా కావలసింది పెళ్లి కాదు. ముందు ఆర్ధిక భద్రత కావాలి.  అడుక్కుని పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళైన రెండో రోజునుంచీ ఎవర్ని అడుక్కుంటారు? పెళ్లి చేస్తే జీవితం అయిపోదు, మొదలౌతుంది. మరి అప్పుడెవరిని అడుక్కుంటారు? కనుక, తనకు చేతనైనది ఏదో ఒక ఉద్యోగమో, పనో చేసుకుని కొన్నాళ్ళు డబ్బులు దాచిపెట్టుకుని ఆ తర్వాత కులమూ మతమూ అన్న చెత్తమాటలు మాట్లాడకుండా తనకు నచ్చినవాడిని చేసుకోమని  ఆ అమ్మాయికి నా మాటగా చెప్పండి. ఇలాంటి సహాయాలు చెయ్యడం 'సేవ' కాదు. నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఆ పెళ్లిని ఆపమని నా మాటగా వారికి చెప్పండి' అన్నాను.

యధావిధిగా నా మాటలకు వాళ్ళు షాకైనారని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను.

మొన్నొక రోజున స్కందగిరి సుబ్రమణ్యస్వామి గుడికి వెళ్ళాము నేనూ మా ఆవిడా. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి యధావిధిగా బెగ్గర్స్ చుట్టుముట్టారు. నేను డబ్బులివ్వకుండా వచ్చేస్తుంటే వాళ్ళ సైకాలజీ అస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు.

'దరమం చేసుకో, పున్నెం వస్తాది' అని ఒకామె అంది.

'నాకే నువ్వు చేసుకో, నీకింకా వస్తాది. వచ్చే జన్మలో కూడా ఈ గుడిదగ్గరే ఉంటావ్' అన్నా నేను.

చివరకు బెగ్గర్స్ కూడా షాకైనారు నా మాటలకి. నా ఖర్మకి నాకే నవ్వొచ్చింది. పెద్దగా నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశా. బహుశా నేనొక పిచ్చోడినో లేదా దురహంకారినో అనుకోని ఉంటారు వాళ్ళంతా.

వివేకానందస్వామి టైంలో బ్రిటిష్ పాలన ఉంది. అంతా దోపిడీనే. చదువు లేదు. ఉద్యోగాలు లేవు. పరిశ్రమలు లేవు. అవకాశాలు లేవు. అంతా దరిద్రమే. అలాంటి పరిస్థితిలో 'సేవ' అనేది అవసరం అని స్వామి అన్నారు. కానీ అప్పటినుంచి ఇప్పటికి 120 ఏళ్ళు గడిచిపోయాయి. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ రకమైన సేవ ఇప్పుడు ఎవరూ చెయ్యవలసిన అవసరం లేదు. ఇప్పుడు గనుక 'అయ్యోపాపం' అని ఎవరైనా అనుకుంటే వారికే పాపం చుట్టుకుంటుంది ! అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం !

'ఆత్మనో మోక్షార్ధం జగద్ధితాయచ' - 'తన మోక్షంకోసం, జగత్తుకు హితం చెయ్యడం కోసం' - అనే బుద్ధుని వాక్యాన్ని వివేకానందస్వామి తన ఆదర్శంగా స్వీకరించారు. జగత్తుకు హితం చెయ్యడం అనేదానిని ఆరోజులలో ఉన్న అవసరాలను బట్టి ఆయన నిర్దేశించారు. ఈ వందేళ్ళలో ఆ అవసరాలు ఆ పరిస్థితులు పూర్తిగా తల్లక్రిందులైనాయి. ఒకప్పుడు తినడానికి ముద్దలేని పరిస్థితి ఇండియాది. ప్రస్తుతం ఇండియాను పీడిస్తున్న అతి పెద్ద సమస్యలు ఊబకాయమూ, బానపొట్టా, అవెలా తగ్గుతాయన్న చింతా. ఇంతే !

ఇంతకంటే ఎక్కువగా చెప్పనవసరం లేదనుకుంటాను !

నేడు చెయ్యవలసిన సేవ వేరే ఉంది. దాని టైటిల్ 'ఆత్మసేవే అత్యున్నత సేవ'. 'మానవసేవే మాధవసేవ' అన్నసూత్రానికి ఇప్పుడు అర్ధం లేదు. 'ఆత్మసేవే సర్వసేవ' అనేదే నేటి సూత్రం ! దానిగురించి ఆ రామకృష్ణా మిషన్ స్వామీజీకి ఇంకోసారి ఉపదేశం ఇస్తాను. అలాగే మీకు కూడా ! అంతవరకూ ఓపికగా వేచిచూడండి. ఈ లోపల నేను చెప్పినది నిజమో కాదో మీరే గమనించి, ఆలోచించి, విచారించి చూడండి. సత్యం మీకే అర్ధమౌతుంది !
read more " సేవ చెయ్యకండి ! దాని పని అయిపోయింది ! "

10, ఫిబ్రవరి 2020, సోమవారం

సంగీతయోగం - 2 (కామయాగము జేసె కలికి...)

T.P.చక్రపాణి గారు ఆలపించిన అన్నమయ్య శృంగారకీర్తన ఇది. దీనిని స్వరపరచినది కూడా చక్రపాణి గారే. రాగం:--కనకాంగి (మొదటి మేళకర్త రాగం). ఈ విషయం కూడా ఆయనే చెప్పారు.
--------------------------------------
పల్లవి
కామయాగము జేసె కలికి తన
ప్రేమమే దేవతా ప్రీతిగాను

చరణం - 1
పొలుపలర సురత తాంబూల రసపానంబు
నళినాక్షి సోమపానంబు గాను
కలకలంబుల మంచి గళరవంబుల మోత
తలకొన్న వేదమంత్రములు గాను

చరణం - 2
పడతి తన విరహతాపమున బుట్టిన యగ్ని
అడరి దరికొన్న హోమాగ్ని గాను
ఒడబడిక సమరతుల నుదయించిన చెమట
దడియుటే యవబృధంబు గాను

చరణం - 3
దనర కుచముల రుచులు దంతాక్షత క్రీడ
నునుపైన పశుబంధనంబు గాను
యెనసి శ్రీవేంకటేశ్వరుని పొందు
ఘనమైన దివ్యభోగంబు గాను

కామయాగము జేసె కలికి తన
ప్రేమమే దేవతా ప్రీతిగాను
-------------------------------------------
ఒక యాగంలో ఇవన్నీ విధిగా ఉంటాయి - సోమపానము, వేదమంత్రములు, హోమాగ్ని, అవబృధస్నానము, పశుబంధనము, దివ్యభోగము (పూర్ణాహుతి). ఆయా యాగాలను బట్టి ఇంకా కొన్ని ఉండవచ్చు, ఉండకపోవచ్చు.

రతిక్రీడను ఒక యాగంతో పోల్చి 'కామయాగం' అంటూ అన్నమాచార్యులు తన సహజశైలిలో ఈ కృతిని రచించారు. స్థూలదృష్టికి ఇది ఇద్దరు స్త్రీపురుషుల మధ్యన జరిగే రతిక్రీడగా అనిపిస్తుంది. ఆధ్యాత్మికకోణంలో అయితే జీవబ్రహ్మైక్య సంయోగంగా భాసిస్తుంది.

అన్నమాచార్యులు 500 సంవత్సరాల క్రిందటివారు. ఆయన కాలానికి తంత్రం బాగా ప్రచారంలో ఉన్నది. అది వైష్ణవంలోనూ ప్రవేశించింది. అసలే వారికి, వైరాగ్యం అంటే పడదు. ఎందుకంటే అది శైవుల సొత్తు. వైష్ణవులకు రాగమూ, సరాగమూ, శరణాగతీ, భక్తీ, ప్రేమా, వైభోగములే పరమావధులు. కనుకనే ఇవన్నీ ఈ కీర్తనలో పొంగిపొర్లుతూ మనకు కనిపిస్తాయి.

రతిలోనూ ఆధ్యాత్మికం ఉంటుంది. ఆధ్యాత్మికం కూడా ఒక విధమైన రతియే. అందుకే రతికి మరో పేరు సంయోగం అయింది. అంటే, సరియైన యోగం అన్నమాట. యోగమంటేనే కలయిక అని అర్ధం. ఇక సంయోగం అంటే చక్కని, పరిపూర్ణమైన కలయిక అని అర్ధం. అది రెండు శరీరాలు కలిస్తే జరగదు. రెండు మనసులు కలిస్తే, రెండు ఆత్మలు కలిస్తేనే అది జరుగుతుంది. లోకంలో ఎక్కడచూచినా శరీరాలే కలుస్తాయి గాని మనసులు ఆత్మలు ఎక్కడో తప్ప కలవవు. అందుకే లోకులకు బూతే తెలుస్తుంది గాని, శృంగారం తెలీదు. శృంగారయోగం అసలే అర్ధం కాదు.

ఇంతకు ముందే చెప్పినట్లు, అన్నమాచార్యుల వారి కృతులు దాదాపు 15.000 ప్రస్తుతం మనకు లభిస్తుండగా, వాటిల్లో ఆధ్యాత్మికాలు 4,000 అనుకుంటే, తక్కినవన్నీ శృంగారకీర్తనలే. కాలగర్భంలో కలసిపోయిన మిగతా 20,000 కృతులను తలచుకుంటే మన దౌర్భాగ్యానికి మనకే సిగ్గు కలుగుతుంది. మన సాంస్కృతికసంపద అంటే మనకసలు విలువ తెలుసా అని ప్రశ్నించుకుంటే, 'తెలీదు' అనే జవాబు వస్తుంది.

ఇంతకు మునుపు చక్రపాణిగారు చెప్పినట్లుగా - మనకన్నీ సోకాల్డ్ ఆధ్యాత్మిక కీర్తనలే ప్రచారంలో ఉన్నాయి. ఎందుకంటే, శృంగారకీర్తనల అర్ధాలు తెలుసుకుంటే, మర్యాదస్తులు వాటిని చీదరించుకునే ప్రమాదం 'ఘట్టిగా' ఉంది మరి ! మళ్ళీ అదే మర్యాదస్తులు దొంగతనంగా వీటిని చదువుతారు. చలంగారి పుస్తకాలు దిండు క్రింద ఉంచుకుని అమ్మలక్కలు చదివినట్లు ! అది వేరే సంగతి అనుకోండి !

లోతుగా చూస్తే, మనిషి జీవితం మొత్తం బూతుమయమే. 'అబ్బే. అది లేదులే' అని మనల్ని మనం మోసగించుకుంటూ హిపోక్రిటిక్ బ్రతుకులు బ్రతకడమే మనం చేసేపని. బూతెక్కడ లేదు? వెంకటేశ్వర సుప్రభాతంలో లేదా? వెంకటేశ్వర గద్యంలో లేదా? జయదేవుని అష్టపదులలో లేదా?  లలితా సహస్రనామాలలో లేదా? పురాణాలలో లేదా? అన్ని మతాల గ్రంధాలలోనూ బూతుంది. అన్ని చోట్లా ఉంది. కానీ అప్పటికాలం వారికి అది బూతు కాదు.

నన్నడిగితే ప్రపంచంలో ఒకే ఒక్క బూతుమాట ఉంది అంటాను. అదేంటంటే 'బూతు' అన్న పదమే ! అదే పెద్ద బూతుమాట. దాన్ని మించిన బూతుమాట ఇంకేమీ లేదు. అసలు బూతు అన్నమాటే పెద్ద ట్రాష్ ! సరిగ్గా చూస్తె బూతు అనేది ఎక్కడా లేనేలేదు.

శృంగారభావన వేరు, బూతు వేరు. మొదటిదానిలో సౌకుమార్యమూ, లాలిత్యమూ, సౌందర్యమూ ఉంటే, రెండోదానిలో మోటుదనమూ, చౌకబారుతనమూ, నేలబాటు పోకడా, అసహ్యమైన ధోరణీ ఉంటాయి. సృష్టిలో శృంగారం ఉంది. బూతు మన మనసులో ఉంది. అంతే తేడా !

శృంగారం లేనిదే సృష్టి లేదని అందరికీ తెలిసిన విషయమే ! దానిని అసహ్యించుకోవడమే అతిపెద్ద తప్పు. ఏ అసహ్యమూ లేకుండా దానిని accept చెయ్యడమూ, దానివల్ల కలిగే guilt ను అధిగమించడమే తంత్రసాదనలో మొదటిమెట్టు.

ఈ ఉపోద్ఘాతంతో, ఈ కృతి అర్ధాన్ని చదువుకుందాం. అసహ్యించుకోకండి మరి ! ఇది వ్రాసినది పదకవితా పితామహుడైన అన్నమాచార్యులవారనీ, అత్యున్నతమైన వేదాంతాన్ని నింపుకున్న ఆధ్యాత్మికకీర్తనలు దాదాపు 5000 (ప్రస్తుతం దొరుకుతున్నవి ఇన్నే, గతించిపోయినవి ఇంకెన్నో) వ్రాసినది కూడా ఈయనేననీ బాగా గుర్తుంచుకుని మరీ చదవండి !

పల్లవిలో అన్నమాచార్యులు ఇలా అన్నారు.
|| కామయాగము జేసె కలికి తన - ప్రేమమే దేవతా ప్రీతిగాను ||

రతిక్రీడను ఒక యాగంగా భావించి చేసింది ప్రియురాలు. ఇక్కడ కలికి అంటే, లక్ష్మీదేవి అని అర్ధం. వెంకటేశ్వరునితో తన సంభోగాన్ని ఒక యాగంగా ఆమె భావించింది. తంత్రసాదనలో కూడా ఇదే Concept ఉంటుంది. తంత్రం ప్రకారం సంభోగం తప్పుకాదు, చీదరించుకోవలసిన ఒక చెడ్డపని కాదు. అతి ఒక సాధనామార్గం. పరమేశ్వరీ పరమేశ్వరుల సంభోగం నుంచే ఈ సమస్తసృష్టీ ఉద్భవించింది. ఇదే క్రీడ మన స్థాయిలో కూడా జరుగుతుంది. దానిని సక్రమమైన దృష్టితో చూచే విధానం, దానిని ఒక సాధనగా మలచుకునే విధానం మనకు తెలియాలి. అప్పుడదే యాగమౌతుంది, యోగమౌతుంది, తంత్రమౌతుంది, అతీతసిద్ధిని అలవోకగా కలిగిస్తుంది. అయితే అది పావుగంటలో అరగంటలో అయిపోయే అసహ్యమైన తంతు కాదు. తాంత్రికసంభోగాన్ని ప్రయత్నించిన ప్రేమికులు శివరాత్రి జాగారం చెయ్యడం తప్పనిసరి అవుతుంది. వారు శుద్ధవైష్ణవులైనా సరే !

తన ప్రేమనే దేవతాప్రీతి కొరకు సమర్పించింది కలికి - అంటారు ఆచార్యులు. ప్రేమలేని సంభోగం శవసంభోగసమమే. సంభోగానికి పునాది ప్రేమ. అది లేని సంభోగం ఒక జుగుప్సాకరమైన మొక్కుబడి. సంభోగాన్ని ప్రేమతో కలిపి ఒక దివ్యసాధనగా చెయ్యగలిగితే అది ఆనందపు అవధులు చూపిస్తుంది. సమాధిలో ఏ ఆనందం మనకు ప్రాప్తిస్తుందో తాంత్రికసంభోగంలో కూడా అదే దక్కుతుంది. అందుకే తాంత్రికసంభోగాన్ని ఒక్కసారి రుచి చూచిన ఏ జంట కూడా మామూలు సంభోగం వైపు ఇకపైన కన్నెత్తి చూడను కూడా చూడరు.

తాంత్రిక సంభోగక్రియ ముందు చాలా తతంగం ఉంటుంది. దానిని నేటి సెక్సాలజిస్టులు 'ఫోర్ ప్లే' అంటున్నారు. కానీ తాంత్రిక ఫోర్ ప్లే అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది అందరికీ తెలిసిన మొక్కుబడి ప్రక్రియ కాదు. అది రసికాగ్రేసరులకే తెలిసిన ఒక మనోజ్ఞప్రపంచం. అందులో ముందుగా జరిగే అనేక కార్యక్రమాలలో 'తాంబూలసేవనం' అనే ప్రక్రియ కూడా ఒకటి. దానిని, వైదికయాగంలో చేసే సోమపానంతో పోల్చారు ఆచార్యులు. ఈ 'తాంబూలసేవనం' అనే ప్రక్రియలోనే అధరచుంబనం, సుధామధుపానం వంటి ఇతరక్రియలన్నీ అంతర్భాగాలుగా వస్తాయి. ఇది యాగంలో జరిగే సోమపానంతో సమానమట !

దానిని - పొలుపలర సురత తాంబూల రసపానంబు - నళినాక్షి సోమపానంబు గాను - అంటూ వర్ణించారు ఆచార్యులవారు.

'సురత తాంబూల రసపానంబు' అంటే రతి సమయంలో చేసే తాంబూలరస సేవనమన్నమాట. పొలుపు, అలర అంటూ రెండుపదాలు ప్రయోగించారు ఇక్కడ. పొలుపు అంటే సొంపు, తీరు, కుదురు అని తెలుగు నిఘంటువు చెబుతోంది.

అంటే, తీరుగా, కుదురుగా, చక్కగా తాంబూలాన్ని సేవించడం అని అర్ధం. అందులో జాజికాయ, జాపత్రి, కుంకుమపువ్వు. కర్పూరం, ఏలకులు, కలగలిసి ఉంటాయి గనుక నోటికి సుగంధాన్నివ్వడమే గాక కామోద్దీపనాన్ని కలిగిస్తాయి ఈ దినుసులన్నీ.

యోగ తంత్రసాంప్రదాయంలో - కాకిముద్ర పట్టి చేసే శీతలీ ప్రాణాయామ క్రియలో నోటిలో స్రవించే లాలాజలాన్ని మ్రింగడం అని తాంబూల సేవనానికి గల మార్మికార్ధం.

ఈ తాంబూల సేవనాన్ని నేను వివరించబోవడం లేదు. కామశాస్త్రం ప్రకారం, ఇది అనేకరకాలుగా ఉంటుంది. దీనిలో అనేక పద్ధతులు సులువులు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ వ్రాశానంటే 'మర్యాదస్తులు' అసహ్యించుకునే ప్రమాదం ఉంది.

'తాంబూలసేవనం' అనే పదానికి గల తాన్త్రికార్ధాన్ని తెలుసుకోవాలనుకునేవారు నా పుస్తకం 'శ్రీ లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక' లో, "తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా" అన్న నామానికి నేను వ్రాసిన వివరణ చదవండి.

కలకలంబుల మంచి గళరవంబుల మోత
తలకొన్న వేదమంత్రములు గాను

అని మొదటి చరణాన్ని పూరిస్తారు అన్నమాచార్యులవారు.

అంటే, ప్రియుడు పెట్టే చక్కిలిగింతలకు, నాడీస్థానాలను తాకుతూ చేసే ప్రేరేపణలకు కిలకిలా నవ్వడం, కూజితం (కోకిల వలె 'కూ' అంటూ కూయడం) మొదలైన రకరకాలైన శబ్దాలను చెయ్యడం ఇవన్నీ వేదమంత్రములన్నారు ఆ రసికాగ్రేసర చక్రవర్తి.

తంత్రసాధనాక్రమంలో యోగి దేహం లోలోపల వినిపించే దశవిధనాదాలకు, రతీసమయంలో వెలువడే ఈ కూజితధ్వనులు ప్రతీకలు. ఈ ధ్వనులు చేసే సమయంలో స్త్రీ శరీరంలో కలిగే పులకింతలే, ధ్యానతన్మయత్వంలో అంతరికనాదాలు వినే సమయంలో యోగి దేహంలో కూడా కలుగుతాయి. రెంటికీ చాలా సామ్యం ఉన్నది.

పడతి తన విరహతాపమున బుట్టిన యగ్ని
అడరి దరికొన్న హోమాగ్ని గాను

అంటూ రెండవ పాదాన్ని ప్రారంభించారు ఆచార్యులవారు.

ఓపలేని తాపంతో ప్రియురాలి ఒళ్ళు వేడెక్కడం అనేది హోమగుండంలో అగ్నిని రగల్చడంతో పోల్చబడింది. దేహం ఒక హోమగుండం. దానిలో కామాగ్నినీ రగల్చవచ్చు, హోమాగ్నినీ రగల్చవచ్చు. తాన్త్రికులకు రెండూ ఒకటే అవుతాయి. ముందు కామాగ్నిని రగిలించి దాన్నే హోమాగ్నిగా మారుస్తారు వారు. అంతరికసాధనాక్రమంలో దేహంలో జ్వలించే అత్యంతవేడిమి 'యోగాగ్ని' అనబడుతుంది. సాధనా సమయంలో శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల వరకూ పెరగడం మామూలుగా జరుగుతుంది. దీనినే యోగాగ్ని అంటారు. హోమాగ్ని, యోగాగ్ని, కామాగ్ని, ప్రణయాగ్ని ఇవన్నీ తంత్రసాధనలో సమానార్ధకాలుగా భావించబడతాయి.

ఒడబడిక సమరతుల నుదయించిన చెమట
దడియుటే యవబృధంబు గాను

అవబృధస్నానం అంటే, యాగక్రమంలో దీక్షాసమాప్తి సమయంలో చేసే స్నానం. తంత్రపరంగా చూస్తే, సమరతి వల్ల ఉదయించిన చెమటలో ఇరువురి దేహాలూ తడిసి ముద్దైపోవడం, హోమవిది సమయంలో చేసే అవబృధస్నానంతో పోల్చబడింది. యోగసాధనా సమయంలో కుంభకక్రియ యొక్క ప్రధమావస్థలో విపరీతమైన చెమట పుట్టి ఒళ్ళంతా తడుస్తుంది. ఈ చెమటా, రతి సమయంలో పుట్టే చెమటా, హోమస్నాన సమయంలో ఒళ్లంతా తడవడమూ మూడూ ఒక్కటిగానే కనిపించాయి ఆచార్యులవారి రసికాగ్రేసర దృష్టికి.

ఇక్కడ, 'సమరతి' అనే ఒక పదాన్ని ఉపయోగించారాయన. దీనిలో ఎంతో లోతైన సెక్సాలజీ దాగి ఉంది. సమరతి అంటే - ఇద్దరికీ ఒకేసారి క్లైమాక్స్ కలగడం. ప్రపంచంలోని కోట్లాది జంటలలో ఈ 'సమరతి' అనేది అతి కొద్దిమందికి మాత్రమే జరుగుతుంది. అదేంటో నేను మీకు వివరించాలంటే ఇప్పుడు హేవలాక్ ఎల్లిస్ నీ, మాస్టర్స్ అండ్ జాన్సంస్ నీ మీకు వివరించాలి. అదంతా నేను వ్రాయనక్కరలేదు. ఓపికుంటే నెట్లో వెదుక్కోండి. మీకే అర్ధమౌతుంది. సారాంశం మాత్రం నేను చెబుతాను.

స్త్రీకి మల్టిపుల్ ఆర్గాజమ్స్ కలిగే వరకూ తన స్కలనాన్ని నిగ్రహించుకుంటూ రతిని కొనసాగించే శక్తి పురుషునిలో ఉండాలి. కామశాస్త్రంలో పండిపోయి ఉంటే తప్ప, ఈ శక్తి పురుషులలో ఎవరికీ ఉండదు. అందుకే ఒక స్త్రీని పరిపూర్ణంగా తృప్తిపరచడం అనేది, ఆ కళలో సరియైన ట్రెయినింగ్ తీసుకుని సిద్దంకాకపోతే, ఏ పురుషుని వల్లా జరిగేపని కాదని కామశాస్త్రం అంటుంది. నవీనకాలపు సెక్సాలజీ పరిశోధనలు కూడా దీనినే నిరూపిస్తున్నాయి. స్త్రీలలో 95 శాతం మందికి Orgasm అంటే అసలేంటో తెలీదనీ, అదేంటో తెలీకుండానే స్త్రీలు నలుగురైదుగురు పిల్లల్ని కంటూ ఉంటారనీ, నవీనకాలపు సెక్సాలజిస్ట్ లు అంటున్నారు. దీనికి బాధ్యత వహించవలసింది పురుషులే !

ఇకపోతే, యోగ-తంత్ర సాంప్రదాయంలో చూస్తే, ఇడా పింగళానాడులలో సమంగా ప్రాణసంచారం చేయిస్తూ కుండలినీ జాగృతిని సాధించడమే 'సమరతి' అనే మాటకు కల యోగార్ధం.  

దనర కుచముల రుచులు దంతాక్షత క్రీడ
నునుపైన పశుబంధనంబు గాను

ప్రియురాలి స్తనములను సుతారంగా కొరకడం అనే ప్రక్రియను 'కుచముల రుచులు దంతాక్షతక్రీడ' అనే పదంతో సూచిస్తూ, దానిని యాగసమయంలో చేసే 'నిరూఢ పశుబంధం' అనే ప్రక్రియతో పోల్చారు. అన్ని యాగాలలో ఉండకపోయినా, కొన్నికొన్ని యాగాలలో జంతుబలి ఉంటుంది. ఆ సమయంలో మెల్లిగా దానిని నిమురుతూ బుజ్జగించి యాగస్థలానికి తీసుకొచ్చి ఒక త్రాటితో ఆ పశువును గట్టిగా కట్టివెయ్యడం, ఆ తదుపరి దానిని బలివ్వడం జరుగుతాయి. 'తన పండ్లతో ప్రియురాలిని సుతారంగా కొరకడం' అనే రతిక్రీడా ప్రక్రియతో యాగసమయంలో జరిగే పశుబంధాన్ని పోల్చారు అన్నమాచార్యులవారు. 'నునుపైన' అనే పదప్రయోగంతో మెల్లిగా సుతారంగా నిమరడం, బుజ్జగించడం అనే ప్రక్రియ సూచింపబడింది.

యెనసి శ్రీవేంకటేశ్వరుని పొందు
ఘనమైన దివ్యభోగంబు గాను

వేంకటేశ్వరుడు ఇక్కడ రెండు పాత్రలలో కనిపిస్తాడు. ఒకటి - ప్రియుడు. రెండు - భగవంతుడు. లక్ష్మీదేవికి ఆయన రెండూ అయ్యాడు. అదే ఆమె అదృష్టం. భగవంతుని తన ప్రియునిగా భావించి సేవించడం, ఆరాధించడం, ధ్యానించడం - 'మధురభావం' అనబడుతుంది. ఇది భక్తిమార్గంలో అత్యున్నతమైన స్థాయి. గోపికలకు తప్ప ఇంతవరకూ ఇంకెవ్వరికీ దక్కని స్థాయి ఇది.

అదేవిధంగా, హోమం చివరలో పూర్ణాహుతి జరుగుతుంది. అంటే, హోమసామగ్రి మొత్తాన్నీ హోమాగ్నిలో వెయ్యడం చేస్తారు. అంతరికసాధనలో అయితే, తన సర్వస్వాన్నీ భగవంతునికి అర్పించడం, తన అహంకారాన్ని బలివ్వడం అనే ప్రక్రియే ఇది. దీనిని సర్వార్పణక్రియ అంటారు. దీనినే 'దివ్యభోగం' అని ఆచార్యులవారన్నారు. అది మామూలుగా అందరికీ తెలిసిన భోగం కాదు. దివ్యభోగం. అంటే Divine Bliss అన్నమాట. మామూలు బ్లిస్సే తెలీనివారికి ఇక డివైన్ బ్లిస్ ఎలా తెలుస్తుంది?

వేంకటేశ్వరుని పొందటం అంటే, 'తను విడిగా ఉన్నాను' అన్న భావన నశించి, భగవంతునిలో తాను ఐక్యం అయిపోవడం, 'ఇద్దరు' అన్న ద్వైతభావన పూర్తిగా నశించి 'తానే నేను - నేనే తాను' అన్న అద్వైతసిద్ధి కలగడం దివ్యభోగం అవుతుంది. ఇదే పూర్ణాహుతి. ఇదే అద్వైతసిద్ధి. ఇదే సమాధిస్థితి.

అయితే, దీని ఛాయ మామూలు రతిలో కూడా కనపడుతుంది. ఎప్పుడు? ఇద్దరూ కామశాస్త్రంలో ఆరితేరినవాళ్ళు అయినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. లేకుంటే ఏదో క్షణికమైన త్రిల్ కలుగుతుంది. అంతే ! అది కూడా స్త్రీకి కలగదు. ప్రకృతి ఆమె దేహాన్ని అలా తయారుచేసింది. ఇదే అందరికీ తెలిసిన సెక్స్. కానీ అసలైన సంభోగం ఇదికాదు. దురదృష్టవశాత్తూ ఈ క్షుద్రమైన క్షణికమైన త్రిల్ కోసమే ప్రపంచమంతా వెంపర్లాడుతూ ఉంటుంది. ఇదే సర్వస్వం అనుకుంటూ భ్రమలో బ్రతుకుతూ ఉంటుంది.

అసలైనది తెలీకపోతే నకిలీదే ఏదో గొప్పగా అనిపిస్తుంది మరి !

కామశాస్త్రం బాగా తెలిసి చేస్తే, కలిగే Orgasmic bliss నే యాగంలో చివరిలో జరిగే దివ్యభోగం (పూర్ణాహుతి) తో పోల్చారు ఆచార్యులవారు.

ఈ మూడు చరణాలలోనూ ఆయన వర్ణించిన ప్రక్రియ అంతా - మోటు మనుషులకు మోటు సెక్స్ గా అనిపిస్తుంది, రసికాగ్రేసరులకేమో ఆనందపు అంచులు చూపించే మనోజ్ఞమైన శృంగారంగా తోస్తుంది. ఇక ఆధ్యాత్మిక లోకపు అవధులు చూచినవారికి మాత్రం, జీవుడిని దైవంలో లీనం గావించే మహత్తరమైన తాంత్రికసాధనాప్రక్రియ గోచరిస్తుంది.

'యద్భావం తద్భవతి' అన్నట్లు ఎవరెవరి భావనను బట్టి వారికి కనిపించే విషయం ఉంటుంది మరి !

మీకేం కనిపిస్తోందో మీరే నిర్ణయించుకోండి. దానినిబట్టి మీస్థాయి మీకే అర్ధమౌతుంది. ఆచార్యులవారి శృంగారకీర్తనలన్నీ అద్దాల వంటివి. మన ముఖం దరిద్రంగా ఉంటె, అద్దంలో దరిద్రమైన ముఖమే కనిపిస్తుంది. మనం శుభ్రంగా ఉంటె, అద్దంలో శుభ్రమైన ముఖమే కనిపిస్తుంది. తప్పు అద్దానిది కాదు. మన శరీరానిది.

ఈ అద్దంలో మీ ముఖం ఎలా కనిపిస్తోంది?

ఈ కీర్తనను చక్రపాణిగారు పాడుతున్నపుడు నాకు తన్మయత్వంతో అప్రయత్న ధ్యానస్థితి కలిగింది. మరి మీకేం కలుగుతోంది? కామోద్రేకం కలిగితే మీది పశువుస్థాయి, అసహ్యం కలిగితే చెత్తమైండ్ కలిగి ఉన్న సగటుమనిషి స్థాయి, మనోజ్ఞమైన ఫీలింగ్ కలిగితే మీది రసికస్థాయి. ధ్యానతన్మయత్వం కలిగితే మీది దేవతాస్థాయి.

మీదే స్థాయో ఇప్పుడు మీకే తెలుస్తోంది కదూ???
read more " సంగీతయోగం - 2 (కామయాగము జేసె కలికి...) "