“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, జూన్ 2016, బుధవారం

Binkada Singari My Donkina Vayyari - P.B.Srinivas



P.B.Srinivas అద్భుతమైన మధురగాత్రం కలిగి ఉన్నప్పటికీ పనికిమాలిన తెలుగువాళ్ళు ఆదరించక పోతే కన్నడదేశం వెళ్లి అక్కడ ఒక వెలుగు వెలిగిన మధురగాయకుడు. ఆయన కన్నడంలో పాడిన మధురగీతాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఈ పాట ever green hit song of 1960s. ఇప్పుడు విన్నా కూడా ఈ పాట చాలా బాగుంటుంది.ఇదొక haunting melody.

ఈ పాట 1963 లో వచ్చిన 'కన్యా రత్న' అనే కన్నడ సినిమా లోది.ఈపాటను వ్రాసింది K.R.Seetha Rama Sastry అయితే సంగీతాన్ని సమకూర్చింది G.K.Venkatesh.అప్పట్లోనే ఇంత మెలోడీతో కూడిన ఫాస్ట్ బీట్ సాంగ్ చేసిన వెంకటేష్ ను అభినందించక తప్పదు మరి.

ఈ పాటలో డా|| రాజ్ కుమార్, లీలావతి నటించారు.

దీనిలో కొన్ని మంచిమంచి తెలుగు పదాలకు సమానమైన పదాలున్నాయి. కన్నడంలో తెలుగు పదాలు ఇంకా బ్రతికి ఉన్నాయంటే వినడానికి వింతగా ఉంటుంది.

బింకద సింగారీ మై డొంకిన వయ్యారీ - అనే పాదంలో బింకం అనే పాత తెలుగు పదం ఉంది. బింకంతో కూడిన సింగారి అని అర్ధం. అంకము, బింకము, పొంకము అనే పదాలు పాత తెలుగులో ఉండేవి. ఇలాంటి పాత తెలుగు పదాలను మనం చాలా మటుకు మర్చిపోతున్నాము.

మై - అంటే ఒళ్ళు అని అర్ధం. మైపూత అనే పదం పాత తెలుగులో ఉండేది. 'డొంకిన' - అంటే డొంకలతో కూడిన అని అర్ధం. డొంక అంటే వంపులతో కూడిన దారి. "మై డొంకిన వయ్యారి" - అంటే వంపుసొంపులతో కూడిన సుందరి.

మై, కై అనే పదాలు పాత తెలుగులో, కన్నడంలో, తమిళంలో సమానంగా ఉండేవి.మయి అంటే ఒళ్ళు.అలాగే కయి అంటే చెయ్యి. కైమోడ్చి,కేలుమోడ్చి అనే పదాలు మనకు పాతకాలపు తెలుగుభాషలో కనిపిస్తాయి.

రసభావయుతుడైన మనిషి ఈ ప్రపంచంలో రెంటినే ప్రేమించగలడు.అతనికి వేరే చాయిస్ లేదు. అవేమంటే ఒకటి - ప్రకృతి, రెండు మనోహరియైన తన ప్రేయసి. ప్రకృతీ స్త్రీ ఇద్దరూ సమానాలే.అందుకే రసభావుకులు ప్రకృతినీ,స్త్రీనీ సమానంగా ప్రేమిస్తారు.ప్రకృతిని చూచి మైమరచి పోయేవాడు తనకు నచ్చిన స్త్రీని చూచినా అలాగే మైమరచి పోతాడు.ఇదుగో చూచారా - 'మైమరచి' అనే పదంలో 'మై' అనే మాట వచ్చింది. తన శరీరాన్ని తానే మరచి అని దీని అర్ధం.

ఈ పాటకూడా తన ప్రేయసి అందచందాలను వర్ణిస్తూ సాగే పాటే.

అయితే, ఇది ఫాస్ట్ బీట్ సాంగ్ కావడంతో, ఈ పాట వింటూ వింటూ  చివరకు వచ్చేసరికి ' అయ్యో అప్పుడే అయిపోయిందే ! ఇంకో రెండు చరణాలుంటే బాగుండు' అని తప్పకుండా మీకనిపిస్తుంది. ఆ గ్యారంటీ నేనివ్వగలను.అంత మంచి పాట.

నా గళంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి.

'బింకద సింగారీ....'

Movie:--Kanya Ratna (1963)
Lyrics:--K.R.Seetha Rama Sastry
Music:--G.K.Venkatesh
Singer:--P.B.Srinivas
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------
Binkada singaari mai donkina vayyaari
Ee savi gaLige rasa deevaLige ninnantharanga madhuranga

Aha binkada singaari mai donkina vayyaari
Ee savi gaLige rasa deevaLige ninnantharanga madhuranga

BaLi neeniralu bisile neraLu madhupaana pathre ninnodalooo-2
madhuvillade madhaveripa ninnanda chenda makaranda-2

Aha binkada singaari mai donkina vayyaari
Ee savi gaLige rasa deevaLige ninnantharanga madhuranga

Ninneevadana aravinda vana hoo baaNa ninna binnaNaaa-2
olavemba dhana bide humbathana baa chinna ranna varisenna-2

Aha binkada singaari mai donkina vayyaari
Ee savi gaLige rasa deevaLige ninnantharanga madhuranga


Meaning

O lovely lady, with beautiful curves
This hour is very lovely,
your mind is full of nectar of love

In your presence, even hot sun becomes a shade
Your lap is like a goblet of wine
Even without drinking it
I am getting intoxicated
Your beauty itself is the real honey

Your face is like a blossomed flower
and your mischievous manners are like arrows of cupid
Your youthful love is your treasure
Now,give up this adamant nature
Come ! my darling, accept me

O lovely lady, with beautiful curves
This hour is very lovely
and your mind is full of nectar of love...

తెలుగు స్వేచ్చానువాదం

ఓ అందాల జవ్వనీ
నీ ఒంపుసొంపులు చాలా అద్భుతంగా ఉన్నాయి
ఈ రసమయ సమయంలో
నీ అంతరంగం ఎంతో మధుమయంగా ఉంది

నీ సమక్షంలో ఎండ కూడా నీడలా తోస్తోంది
నీ ఒడి ఒక మధుపానపాత్రలా ఉంది
మధువు లేకున్నా నాకు మత్తెక్కుతోంది
నీ అందచందాలే నా మధువు

నీ వదనం విరిసిన కమలంలా ఉంది
నీ వేషాలు పూలబాణాలలా ఉన్నాయి
నీ వలపే నీ సంపద
ఈ మొండితనం వదలిపెట్టు
నా బుజ్జి బంగారువు కదూ
నన్ను స్వీకరించు

ఓ అందాల జవ్వనీ
నీ ఒంపుసొంపులు చాలా అద్భుతంగా ఉన్నాయి
ఈ రసమయ సమయంలో
నీ అంతరంగం ఎంతో మధుమయంగా ఉంది...