20, అక్టోబర్ 2026, మంగళవారం

భక్తులను దేవుడు నిజంగా రక్షిస్తాడా?

చర్చిలో మాస్ ను నిర్వహిస్తున్న కేథలిక్ పాస్టర్ పైన, వెనుకనుండి శిలువా, దానిపైనున్న ఏసుక్రీస్తు విగ్రహమూ పడి, ఆ పాస్టర్  చనిపోయిన సంఘటన ఈక్వడార్ లో నిన్న జరిగింది.

ఆ చర్చి పేరు Our Lady of Perpetual Help Church.

ఈ సంఘటన అనేక చర్చలను రేకెత్తించింది.

జీసస్ నిజంగా ఉంటే, ప్రార్ధనలు చేసేవారిని రక్షిస్తూ ఉంటే,  ఇలా ఎలా జరుగుతుంది? అని సహజంగానే కొందరంటున్నారు.

దీనికి సపోర్టుగా పోప్ లియో కూడా ఈ మధ్యనే ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆయనకు కుడి ఊపిరితిత్తిలో గడ్డ ఉందని, ఊపిరితిత్తి కొంతభాగాన్ని తొలగించారు.

ఆయననెందుకు జీసస్ కాపాడలేకపోయాడు? కొబ్బరినూనెలూ, మోకాళ్ళ ప్రార్ధనలూ పోప్ కు చేతకావా? చేసినా పనిచెయ్యలేదా? లేక పోపుకి జీసస్ పైన గట్టి విశ్వాసం లేదా?

సాక్షాత్తు పోపుకే దిక్కులేకపోతే, ఇక సామాన్య క్రైస్తవుడెలా రక్షింపబడతాడు? పోపునే రక్షించని జీసస్ సామాన్యక్రైస్తవుడినెలా రక్షిస్తాడు? అసలు, రక్షణే బూటకమా? మొదలైన ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి.

ఎందుకంటే, ఇవే నమ్మకాలపైన ఆధారపడి కోట్లాదిమంది క్రైస్తవుల జీవితాలు నడుస్తున్నాయి మరి !

ఇలా ప్రశ్నించినవారిని, "ఏం? మీ గుళ్ళలో ఇలా ఎప్పుడూ జరగలేదా?" అని క్రైస్తవులు ఎదురు ప్రశ్నిస్తున్నారు?

ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు. కాబోదు.

లాజిక్కు లేని మొండిచర్చలవల్ల విషయంలో స్పష్టత ఎప్పటికీ రాదు. ఉత్తనమ్మకం వల్ల ఏదీ తేలదు.

ఏ మతమైనా, ఏ ప్రార్థనామందిరమైనా, అడిగిన అన్నింటినీ ఏ దేవుడూ ఇవ్వడు. మరి అడగటం ఎందుకు? అంటే, మన మనశ్శాంతి కోసం అంటారు. ఆ మనశ్శాంతిని కూడా దేవుడే ఇవ్వచ్చు కదా. మనమెందుకు అడగాలి? అంటే, 'అడగనిదే అమ్మైనా పెట్టదు' అంటారు. అమ్మకీ దేవుడికీ పోలికేంటసలు? మనం అడగకపోతే అమ్మకు తెలియకపోవచ్చు. దేవుడికి కూడా తెలీదా?

జవాబులుండవు.

'ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే' అని క్రైస్తవులు పాడుతుంటారు. ఇక అడగటం ఎందుకు, పనిలేకనా?

నువ్వడిగినా అడగకపోయినా జరిగేది జరుగుతుంది. దేవుడు ఇచ్చేదానిని ఇస్తాడు. ఇక ప్రార్థన ఎందుకు? మనిషి మనిషిగా బ్రతికితే పోలా?

ఆ మాటకొస్తే, అన్ని మతాల ప్రార్ధనామందిరాలలోనూ, అంటే గుడులు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, బౌద్ధారామాలు మొదలైన అన్నింటిలోనూ ఇలాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి.

రోడ్డుపక్కన దర్గాల దగ్గరనుండి, పెద్ద పెద్ద మందిరాల వరకూ అన్నింటిలోనూ మిరకిల్సూ ఉన్నాయి, ఫెయిల్యూర్సూ ఉన్నాయి. వీటిలో ఉత్త నమ్మకాలూ ఉన్నాయి, నిజంగా జరిగినవీ ఉన్నాయి. సంఘటనలు వాటంతట అవే జరిగినపుడు, దేవుడికి ఆపాదించి భక్తులు నమ్ముతున్నవీ ఉన్నాయి.

ఉదాహరణకు, దేవీనవరాత్రుల తొక్కిసలాటలో భక్తులు చనిపోయిన సంఘటన మొన్న 17 వ తేదీన కలకత్తాలో జరిగింది.

18 వ తేదీన గ్వాలియర్ లో శీతలాదేవి ఉత్సవసందర్భంలో అయితే, లోడుతో ఉన్న ఒక ట్రక్కు భక్తులపైకి దూసుకురావడంతో చాలామంది చనిపోయారు.

గతంలో తిరుమలలోనూ, శబరిమలలోనూ, పుష్కరాలలోనూ, ఇతర సందర్భాలలోనూ ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి.

ఇంకొక కోణంలో చూస్తే, ఇజ్రాయెల్ విమానప్రమాదంలో 180 మంది రక్షింపబడ్డారు. పైలట్ మచ్చర్ , హనుమాన్ చాలీసా చదువుకుంటూ హనుమంతుని ధ్యానించడం వల్ల ఇది జరిగిందని అంటున్నారు. ఆంజనేయస్వామి వల్ల జరిగిన మహిమలు కోకొల్లలుగా ఉన్నాయి. నేటికీ ఎన్నో జరుగుతున్నాయి.

అదేవిధంగా 11 వ తేదీన ఇల్లినాయ్ రాష్ట్రంలోని అరోరా వెంకటేశ్వరస్వామి ఆలయంలో గుమిగూడిన భక్తులపైన కాల్పులు జరుపుదామని ఒక అమెరికన్ టీనేజర్ అబ్బాయి ప్రయత్నించగా, రైఫిల్ జామ్ అవడం వల్ల ఆ ప్రమాదం తప్పిపోయింది. దీనిని స్వామి మహిమగా ఆయన భక్తులు అంటున్నారు. కావచ్చు !

అయితే, "మా దేవుడొక్కడే ప్రమాదాలనుంచి కాపాడగలడు, మీ దేవుడు కాపాడలేడు" అని ఎవరూ చెప్పలేరు. చెప్పకూడదు కూడా. ఎందుకంటే, ప్రమాదాలూ, రక్షణలూ రెండూ, అన్ని మతాలవారికీ, అందరు దేవుళ్ళ భక్తులకూ జరిగాయి. జరుగుతున్నాయి. 

దేవుడిని నమ్మని నాస్తికులకు కూడా ఇదే విధంగా రెండూ జరుగుతాయి.

అయితే, నమ్మిన ప్రతిసారీ మిరకిల్స్ జరగవు. జరిగినదానిని మిరకిల్ అనుకుంటారంతే !

సైన్సును నమ్మేవారు దీనిని "ఛాన్స్ ఫేక్టర్" అంటారు.

"నమ్మకం" అనే కోణాన్ని ప్రక్కన పెట్టి వీటిని నిస్పాక్షికంగా పరిశీలిస్తే, అసలైన కారణాలు అర్ధమౌతాయి.

తొక్కిసలాట వల్ల  జరిగే ప్రమాదాలకేమో నిర్వాహకుల అజాగ్రత్తా, భక్తుల దురాశా, సివిక్ సెన్సు లేకపోవడాలే కారణాలు.

టెర్రరిస్టు సంఘటనలకేమో, "మన మతమే గొప్ప. మన దేవుడే గొప్ప. వేరేవాళ్లను చంపండి" అని ప్రేరేపించే ఎడారి రాక్షసమతాలు కారణాలు.

చంపుతున్నదీ, విధ్వంసం సృష్టిస్తున్నదీ సైతాను, రక్షిస్తున్నది మాత్రం దేవుడు అనే వాదన కూడా శుద్ధ తప్పే. ఆ సైతాను దేవుడి సృష్టిలో ఎందుకుంది? దేవుడెందుకు దానిని ఉండనిస్తున్నాడు? అనే ప్రశ్నకు ఒక్క హిందూమతంలో తప్ప ఇతరమతాలలో జవాబులు  లేవు.

శాంతిమతాలుగా చెప్పుకునే క్రైస్తవమూ ఇస్లాముల వల్ల ద్వేషాలూ, అల్లర్లూ, గొడవలూ, హింసా, రక్తపాతమూ తప్ప ఇంకేం జరుగుతున్నాయి? అవి నిజంగా శాంతిమతాలే  అయితే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని యుద్దాలెందుకు?

జవాబులు ఉండవు.

సైతాను, దేవుడు అనే భావనలు నిజాలైతే, చర్చిలో ఇలాంటి సంఘటనలెందుకు జరుగుతున్నాయి? అక్కడకూడా సైతాను ఉంటాడా? లోనికి రాగలడా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

ఇక మసీదులలో అయితే, వాళ్లలో వాళ్లే బాంబులు పెట్టుకుంటారు గనుక బయటనుండి సైతాను కొత్తగా లోపలి రావల్సిన అవసరం ఏమీ ఉండదు. వాళ్లలోనే ఉంటాడు.

నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని బైబిలు చెబుతోంది. మరి ఈక్వడార్ చర్చిలో ఆ సన్నిధి ఏమైంది? అంతమంది భక్తులు ప్రార్థిస్తున్న చోట దేవుని సన్నిధి ఎందుకు లేదు? ప్రార్థనను లీడ్ చేస్తున్న పాస్టరే ఆ విధంగా చనిపోవడమేంటి?

నిజాయితీ ఉన్నవారు ఆలోచించాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి.

కనుక లాజికల్ గా చూస్తే, ఈ సంఘటనలలో ఈ క్రింది కారణాలు మాత్రమే కనిపిస్తాయి.

మన నిర్లక్ష్యమూ, అజాగ్రత్తలవల్ల జరిగేవి కొన్ని. మనలో మానవత్వం మాయమై, రాక్షసత్వం పెరగడం వల్ల జరిగేవి కొన్ని. అంతా మంచిగా ఉన్నప్పటికీ, మన పరిధిని దాటి జరిగేవి మరికొన్ని.

ఇవి తప్ప, ఒకరు రక్షింపబడినా, మరొకరు శిక్షింపబడినా, ఇందులో దేవుడిపాత్ర ఏమీ లేదని నేనంటాను. ఉందని అనుకుంటున్నంతవరకూ మీకు కర్మరహస్యాలు, సృష్టిరహస్యాలు అర్ధం కాలేదని కూడా నేనంటాను.

వీటిని అర్ధం చేసుకోవడమంటే, యూట్యూబు వీడియోలూ, రీల్సూ చూసినంత సులభం కాదు.

హిందూమతంలో వీటికి అసలైన లాజికల్ వివరణలున్నప్పటికీ, అవి వేదాంతంలోకి తొంగిచూస్తే తప్ప, పురాణాలను పట్టుకుని కూచున్నవారికి ఏమాత్రమూ అర్ధంకావు. వేదాంతమంటే వేదంయొక్క జ్ఞానభాగమని వేరే చెప్పనక్కరలేదు కదా !

పురాణాలను దాటి, వేదాంతభాగంలో అడుగుపెట్టినవారికి మాత్రమే కర్మరహస్యాలూ, సృష్టిరహస్యాలూ, కనీసం మేధోపరంగానైనా, అర్ధమౌతాయి.

నిన్న ఈక్వడార్లో చనిపోయిన పాస్టర్ కూడా, స్వర్గానికి డైరెక్ట్ గా పోయాడని కేథలిక్కులంటుంటే, విగ్రహారాధన చేయడం వల్ల ప్రభువు శిక్షించాడని ప్రొటెస్టెంట్లూ, ఇతర డినామినేషన్లూ అంటున్నారు. రెండూ నిజాలు కావు. వీళ్ళ ఊహలు మాత్రమే.

దాడులలో చనిపోయిన టెర్రరిస్టులు కూడా డైరెక్టుగా స్వర్గానికే పోతారని ఇస్లామిక్ టెర్రరిస్టులంటారు. "ఘాజీ" అని వాళ్లకు బిరుదులిస్తారు. అదీ నిజం కాదు. ఊహ మాత్రమే.

మనం ఊహించిన ప్రతిదీ నిజం కావాలని  రూలేమీ ఎక్కడా లేదు.

అసలూ, సృష్టిలో ఎన్ని స్వర్గాలున్నాయి? ఎక్కడున్నాయి? అవి శాశ్వతాలా? అశాశ్వతాలా? కల్పితాలా? నిజాలా? ఎవరైనా చెప్పగలరా?

ఒక్క వేదాంతం తప్ప, వీటికి జవాబులను ఎవరూ చెప్పలేరు.

అసలు విషయమేంటంటే,  

కర్మరహస్యాలు అందరికీ  అర్ధమైపోతే సృష్టి నడిచేదెలా?

అందుకని, భక్షణలూ, శిక్షణలూ, రక్షణలూ అన్నీ జరుగుతూనే ఉండాలి. ఎవరిమటుకు వారు "ఇదంతా మా దేవుడే చేస్తున్నాడు" అనుకుంటూనే ఉండాలి. ఎవరి భ్రమలలో వాళ్ళు బ్రతుకుతూనే ఉండాలి. కొట్టుకుచస్తూనే ఉండాలి.

అప్పుడే ఈ ప్రపంచం నడుస్తూ ఉంటుంది.

ఎవరిష్టానుసారం వాళ్ళు ఇదేవిధంగా అనుకుంటూ  ఉండండి. ప్రపంచం మాత్రం మీ ఇష్టప్రకారం నడవదు. దాని సూత్రాలను అర్ధం చేసుకునే ప్రయత్నాన్ని, తెలివితో జీవించే ప్రయత్నాన్నీ కూడా ఎవరూ చేయకండి.

ఇలాగే ఉండండి. ఇలాగే ముందుకెళ్లండి. ఎటువెళ్ళినా చివరకొచ్చేది సముద్రమేగా !

హ్యాపీ విజయదశమి !