“Self service is the best service”

26, జూన్ 2017, సోమవారం

రెండవ అమెరికా యాత్ర -73 (Sanchin Kata)

శాంచిన్ కటా అనేది కరాటేలో చాలా ముఖ్యమైన డైనమిక్ మూమెంట్ కటా. దీనిలోని మూమెంట్స్ అన్నీ డైనమిక్ టెన్షన్ తో, డైనమిక్ బ్రీతింగ్ తో కూడి ఉంటాయి. ఇది వైట్ క్రేన్ కుంగ్ ఫూ నుంచి కరాటే లోకి వచ్చి స్థిరపడింది.

'శాంచిన్' అనే పదానికి అర్ధం 'Three Battles' అని. ఇది శరీరం, మనస్సు, ఆత్మల స్థాయిలో సాధకుడు చేసే యుద్ధానికి సూచిక. మాస్ ఒయామా వంటి గ్రాండ్ మాస్టర్స్ ఈ కటా ను ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవారు.

దీనిని "బోధిధర్మ" స్వయంగా డిజైన్ చేసి తన శిష్యులకు నేర్పించాడని అంటారు. రకరకాల కరాటే స్టైల్స్ లో ఇది కొన్ని కొన్ని భేదాలతో డిఫరెంట్ గా ఉంటుంది. దీనిలోని ముఖ్యమైన మూవ్స్ ను స్వీకరించి దీనిని నేను ఎలా ప్రాక్టీస్ చేస్తానో ఈ వీడియోలో చూడవచ్చు.