“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, ఆగస్టు 2015, శుక్రవారం

హోమియో అద్భుతాలు - మూడునెలల్లో నయమైన ఆటిజం కేసు

Organon of Medicine అనే తన గ్రంధంలో డా|| హన్నేమాన్ ఇలా అంటారు.

"నా విధానం బాగా నేర్చుకుంటే - దీనితో - ఇప్పటికి మానవాళికి తెలిసిన రోగాలే కాదు, తెలియని రోగాలనూ, ముందుముందు మానవజాతికి రాబోయే కొత్తకొత్త రోగాలనూ కూడా ఈ విధానంతో నయం చెయ్యవచ్చు".

ఇది అక్షరాలా నిజం అని నేను అనుభవంతో చెప్పగలను.

హోమియోలో నా గురువైన డా|| గోపాలరావు గారు ఇలా అనేవారు.

'డా||హన్నేమాన్ మామూలు మనిషి కాదు.ఆయనొక కారణజన్ముడు.ఏ చరకుడో శుశ్రుతుడో లేకపోతే ఏ అశ్వినీదేవతల అంశో ఆయన రూపంలో ఈ భూమ్మీద పుట్టింది. మన దేశంలో పుడితే అడుక్కోవడం తప్ప ఆరోజుల్లో ఏమీ చెయ్యలేడు గనుక జర్మనీలో ఆ ఆత్మ జన్మ తీసుకుంది.ఈ వైద్య విధానం జర్మనీలో పుట్టినాకానీ హోమియో వైద్యాన్ని ఎక్కువగా ఆదరిస్తున్నది మాత్రం మన దేశమే'.

ఇది అక్షరాలా నిజం.

ఎటువంటి దీర్ఘ రోగాన్నైనా హోమియోలో ఎలా ట్రీట్ చెయ్యవచ్చో ఒక ఉదాహరణ చూపిస్తాను.

4 ఏళ్ళ పాప కోసం ఆ పాప తల్లి నన్ను మూడునెలల క్రితం కన్సల్ట్ చేసింది.పాపకు ఇంతవరకూ మాటలు రాలేదు.Responses అన్నీ లేట్. చాలా స్థిరమైన అభిప్రాయాలున్నాయి. మొండితనం బాగా ఎక్కువ.కొన్ని రంగులు చూస్తే భయం.సైగలద్వారానే కావలసినవి చెబుతుంది.కాని మాట్లాడదు. మనం పక్కనే కూచుని పిలిచినా పలకదు.తన లోకంలో తను ఉంటుంది. అమెరికా స్కూల్లో టీచర్లు పాపలోని ఈ పోకడలు గమనించి తల్లితండ్రులను హెచ్చరించారు. ఈ పాపను ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ముందుముందు ఆటిజం కేసుగా మారిపోతుంది.భవిష్యత్తు అంధకారం అవుతుంది.జీవితాంతం తల్లిదండ్రులకు ఒక సమస్యగా మారుతుంది.

వాళ్ళమ్మ అమెరికానుంచి ఇండియాకు వచ్చినపుడు పాపను గుంటూరుకు తీసుకొచ్చి నన్ను కలిసింది.ఫేమిలీ హిస్టరీ అంతా తీసుకుని, పాపను బాగా పరిశీలించి, లక్షణాలన్నీ జాగ్రత్తగా రికార్డ్ చేసినమీదట మా అమ్మాయిని కేసు టేకప్ చెయ్యమని చెప్పాను.లక్షణాలన్నీ బాగా పరిశీలించి ఇవ్వవలసిన మందులు సెలక్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెట్టాము. నాతో డిస్కస్ చేస్తూ మా అమ్మాయి డా|| శ్రీభార్గవి ట్రీట్మెంట్ ఇస్తున్నది. 

ఒక వారంలోనే పాపలో స్పష్టమైన మార్పులు కనిపించడం మొదలైంది.ట్రీట్మెంట్ మొదలై ఇప్పటికి దాదాపు మూడు నెలలైంది.పాపలో వస్తున్నపాజిటివ్ మార్పులు చెబితే చదువరులు బిత్తరపోయి నోర్లు వెళ్ళబెట్టక తప్పదు.

ఒక్క నెలలోనే పాప 'అమ్మ' మొదలైన చిన్నచిన్న మాటలు పలకడం మొదలు పెట్టింది.ఇప్పుడు తనంతట తను sentences మాట్లాడగలుగుతోంది.తనకున్న భయాలు మొండితనం చాలావరకూ తగ్గిపోయాయి.ఇంతకుముందు పార్టీలకు తీసికెళితే చాలా రచ్చ చేసేది. ఇప్పుడు అదంతా తగ్గిపోయింది.కొన్ని కొన్ని రంగులు అంటే ఉన్న భయాలు తగ్గిపోయాయి.మూడీగా కూచుని ఉండటం తగ్గిపోయి తనే చొరవగా అందరినీ పలకరిస్తున్నది.Activeness పెరిగింది.

పాపలో వస్తున్న ఈ పాజిటివ్ మార్పులు చూచి తల్లిదండ్రులే కాక తెలిసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు.ఇండియా వెళ్లి వచ్చాక పాపలో ఇంత మార్పు ఎలా వస్తున్నది? ఏం చేశారు? ఏ డాక్టరుకు చూపించారు? అని వాళ్ళు అడుగుతున్నారని తల్లి అమెరికా నుంచి ఫోన్లో మా అమ్మాయితో చెప్పింది.

ఈ పాప పెరిగి పెద్దయ్యాక చిన్నప్పుడు ఇలా ఉండేది అని చెప్పినా ఎవరూ నమ్మనట్లుగా హోమియోపతి తనను మారుస్తుంది.అదే అల్లోపతీలో అయితే దీనికి వైద్యం లేదు.బిహేవియర్ థెరపీ చెయ్యడమూ, ప్రత్యేకమైన స్కూల్స్ లో చేర్చడమూ,జీవితాంతం జాగ్రత్తగా చూచుకుంటూ ఉండటం తప్ప అందులో ఈ సమస్యకు ట్రీట్మెంట్ లేదు.కానీ హోమియోపతి ట్రీట్మెంట్ ఒక్క మూడు నెలల్లో ఈ అద్భుతాన్ని చేసింది.పాప తల్లి మా 'పంచవటి గ్రూప్' సభ్యురాలే.తన కృతజ్ఞతను మాటల్లో చెప్పలేక ఆమె తబ్బిబ్బై పోతున్నది.

పాపలో వచ్చిన మార్పు విలువ ఏమిటో,నా పోస్టును చదువుతున్న మామూలు కాలక్షేప బ్లాగర్లకు అర్ధంకాదు.వారిలో ఎవరైనా డాక్టర్లు ఉంటే ఇది ఎంత అద్భుతమో - సంభవంగా మారిన అసంభవమో- వారికి కరెక్ట్ గా అర్ధమౌతుంది.

ఆటిజం కేసుల్లో కూడా హోమియోపతి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో నా కేస్ ఫైల్స్ ఉంచి ఈ కేసు ప్రత్యక్ష ఉదాహరణ.