“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

24, ఆగస్టు 2015, సోమవారం

ప్రాణశక్తితో జంతువులను కంట్రోల్ చెయ్యడం ఎలా?

మనుషుల కంటే జంతువులకు సెన్సిటివిటీ చాలా ఎక్కువ.ఎందుకంటే అది లేకపోతే వాటి జీవితం సాగదు.ఏ పక్కనుంచి ఏదోచ్చి చంపుతుందో అని అవి అనుక్షణం భయంతో చస్తూ బ్రతుకుతూ ఉంటాయి.ఆ భయం లేకుంటే అవి బ్రతకలేవు.అందుకే వాటికి సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.

ప్రాణశక్తి ప్రొజెక్షన్ ను జంతువులు వెంటనే పసిగడతాయి.మానవులలో ఈ శక్తి చాలా క్షీణించి ఉంటుంది.దానికి కారణం మన చుట్టూ మనం ఏర్పరచుకున్న సెక్యూరిటీ వ్యవస్థ.ఆటవిక మానవుడికి కూడా జంతువులకున్న సున్నితత్వం ఉండేది.క్రమేణా నాగరికత పెరిగేకొద్దీ అది మాయమౌతూ వచ్చింది.

మనిషికి ఇల్లూ వాకిలీ సెక్యూరిటీ వ్యవస్థా ఉన్నాయి గనుక అతనికి ఈ సున్నితత్వం బాగా క్షీణించింది.అందుకే చివరికి తనకు మూలమైన ప్రాణశక్తికూడా అసలు ఉందా లేదా అని యూనివర్సిటీలలో పరిశోధనలు చేసే స్థాయికి మనిషి దిగజారి పోయాడు.

ప్రాణశక్తి ప్రొజెక్షన్ ఎలా చెయ్యాలో తెలిస్తే దానితో జంతువులను వెంటనే ప్రభావితం చెయ్యవచ్చు.సరదాగా ఇలాంటి పనులు అప్పుడప్పుడు చేసినా, వాటికి హానికరమైన ప్రొజెక్షన్ మాత్రం చెయ్యకూడదు.అలాంటి పనులు చేస్తే ఈ శక్తి వెంటనే క్షీణిస్తుంది.

ఒక జపాన్ 'కి' మాస్టర్ తన ప్రాణశక్తి ప్రొజెక్షన్ తో జూ లోని జంతువులను ఎలా నిద్ర పుచ్చుతున్నాడో ఈ వీడియోలో చూడండి.