నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, ఆగస్టు 2015, ఆదివారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ - 1 (ఆడియో ప్రసంగం)




ఓమ్ నమ: ప్రణవార్ధాయ
శుద్ధ జ్ఞానైకమూర్తయే
నిర్మలాయ ప్రశాన్తాయ
దక్షిణామూర్తయే నమ:

పరమేశ్వరుని ఒక రూపమే దక్షిణామూర్తి.

ఆయన సమస్త లోకాలకు ఆదిగురువు. జగద్గురువు.గురువులకే గురువు.భగవంతుడే గురువైనప్పుడు ఆయన దక్షిణామూర్తి రూపంలో ప్రత్యక్షమౌతాడు.

ప్రపంచంలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ఇవ్వాలంటే ఆయనకే సాధ్యమౌతుంది.లోకంలోని ఏ గురువులకు ఏ విధమైన జ్ఞానం కలగాలన్నా అది ఆయన అనుగ్రహం వల్లనే సాధ్యం.

అటువంటి శుద్ధజ్ఞానస్వరూపుడైన పరమేశ్వరునిపై ఆదిశంకరులు రచించిన "దక్షిణామూర్తి స్తోత్రం" గురించి, 6-8-2015 న గుంటూరులో జరిగిన ఆధ్యాత్మిక సమ్మేళనంలో ఇచ్చిన ప్రసంగం  మొదటి భాగాన్ని వినండి.

దీనిని యూ ట్యూబ్ లో ఇక్కడ వినండి.
https://youtu.be/Pq7RnNywXE4