“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, జూన్ 2022, సోమవారం

నాలుగు నెలలపాటు శనీశ్వరుని వక్రత్వం - ఫలితాలు

కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడు వక్రించి, నాలుగో తేదీన మకరరాశిలోకి వచ్చాడు. ఈ గోచారం నాలుగో తేదీ రాత్రి పన్నెండు గంటలకు జరిగింది. మకరాశిలో ఆయన అక్టోబర్ 22 వరకూ ఉంటాడు. కనుక మళ్ళీ మనుషుల జీవితాలలో మార్పులు తప్పనిసరిగా వస్తాయి. మీమీ జీవితాలను గమనించుకోండి మీకే అర్ధమౌతుంది.

--------------------------------

మేషరాశి

పని వత్తిళ్లు మళ్ళీ ఎక్కువౌతాయి.

వృషభరాశి

పని తగ్గుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెద్దలకు మూడుతుంది.

మిథునం

మళ్ళీ చికాకులు, నష్టాలు, వేదన, గొడవలు మొదలౌతాయి.

కర్కాటకం

పని అధికం అవుతుంది. జీవితభాగస్వామి ఆరోగ్యం చెడుతుంది.

సింహం

ఉత్సాహం ధైర్యం పెరుగుతాయి. పంచాయితీలు, తీర్పులు తీరుస్తారు.

కన్య 

సంతానచింత మొదలౌతుంది. డిప్రెషన్ లో పడతారు. షేర్లలో నష్టపోతారు.

తుల

ఇంట్లో గొడవలు మొదలౌతాయి. అశాంతి ఎక్కువౌతుంది.

వృశ్చికం

ధైర్యం పెరుగుతుంది.

ధనుస్సు

ఇంటి వ్యవహారాలు అడ్డం తిరుగుతాయి. చికాకులు మొదలౌతాయి.

మకరం

కష్టాలు, చింతలు మొదలౌతాయి.

కుంభం

ఖర్చు పెరుగుతుంది. డబ్బులు పోగొట్టుకుంటారు. ఇతరులకు ఇస్తారు.

మీనం

లాభాలు కలుగుతాయి. స్నేహితులు, అనుచరులు పెరుగుతారు.

---------------------------------------------

ఉన్నట్టుండి నాలుగో తారీకు నుండి ఈ మార్పులు కలగడం మీ జీవితాలలో మీరే చూడవచ్చు. ఇలాంటప్పుడే నమ్మల్సొస్తుంది గ్రహప్రభావం నిజమే అని. ఆఫ్ కోర్స్ మీరు నమ్మినా నమ్మకపోయినా గ్రహాలకేమీ నష్టం లేదు. వాటి పని అవి చేస్తూనే ఉంటాయి.

ఈ గోచారం వల్ల బాగా నష్టపోయేది మిధునం, తుల, ధనూరాశులే. ఈ నాలుగు నెలలూ ఆయా రాశులవారు జాగ్రత్తగా ఉండండి మరి !