“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, డిసెంబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 74 (No Joy Christmas)

అమెరికాలో 2022 క్రిస్మస్ చాలా ఘోరంగా జరిగింది. కారణం? బాంబ్ సైక్లోన్ ప్రభావం. ఇటువంటి మంచుతుఫాన్ కొన్ని దశాబ్దాలుగా రాలేదని ఇక్కడ అంటున్నారు. దీనిదెబ్బకు కోట్లాదిమంది నానా ఇబ్బందులు పడ్డారు. పదివేలపైగా విమాన సర్వీసులు కేన్సిల్ అయ్యాయి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ ఆగిపోయాయి.  కోట్లాదిమంది ప్రయాణాలు మధ్యలో ఆగిపోయాయి. షెద్యూల్స్ అన్నీ తారుమారయ్యాయి. అంతా గందరగోళం అయిపొయింది.

నయాగరా ఫాల్స్ దగ్గర బఫెలో అనే సిటీ ఉంటుంది. అక్కడైతే రికార్డ్ స్థాయిలో, ఐదారడుగుల ఎత్తులో మంచు పేరుకుపోయింది. రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడకు వెళ్లలేనంత మంచు అక్కడుంది. మంచులో ఇరుక్కుపోయిన కార్లలోనుంచి శవాలను బయటకు తీస్తున్నారు. ఎన్నో ఇళ్ళు మంచులో కూరుకుపోయాయి. ఆ ఇళ్లలో వాళ్ళు అక్కడే చనిపోయారు. ఆ శవాలను కూడా బయటకు తీస్తున్నారు. 

కొన్నిచోట్ల ఇదే సమయంలో తీవ్రవర్షాలు కురిశాయి. మైనస్ డిగ్రీల చలికి అవి ఉన్నట్టుండి మంచు వర్షంగా మారిపోయాయి. నార్త్ లో అంతా మంచుమయం అయింది.

ఈ రోజుకీ అమెరికాలో పరిస్థితి అలాగే ఉంది. ఏమీ మార్పు లేదు. ఎవరూ ఇళ్లలోనుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం డెట్రాయిట్ లో మైనస్ 8 డిగ్రీల చలి ఉంది. తలుపులు వేసుకుని స్వెట్టర్లు తొడుక్కుని హీటర్లు పెట్టుకుని ఇంట్లో ఉండటమే తప్ప బయటకు పోయే పని లేదు.

డాలర్లలో చూస్తే ఎంత నష్టం జరిగిందో ఇంకా లెక్క తేలడం లేదు. కానీ ఇక్కడ న్యూస్ లో ఒకటే అంటున్నారు? ఇది నో జాయ్ క్రిస్మస్ అని. 

అదీ అసలు సంగతి. జాయ్ లేకుండా పోయింది. ఎంజాయ్ చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది అని అసలైన బాధ. జీసస్ ఎలా పోతే ఎవడిక్కావాలి? ఎప్పుడు పుడితే ఎవడిక్కావాలి? యూరప్లో ఉన్నంత మతపిచ్చి అమెరికాలో లేదు.

కింగ్ కౌంటీ, వాషింగ్ టన్ లో అయితే, క్రిస్మస్ స్టార్స్, క్రిస్మస్ ట్రీస్, కేండిల్స్ మొదలైన హంగామాను బ్యాన్ చేశారు. ఏమంటే, ఇతర మతస్తులకు ఇబ్బంది కలుగుతుందని. ఇది సియాటిల్ దగ్గర్లో ఉంది. అలా చేసినందుకు ఆ కౌంటీకి 'ఎబినేజర్ అవార్డు' అని ఒక అవార్డును కూడా ప్రకటించారు. 

అమెరికాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ బాహాటంగా చెయ్యకూడదని బ్యాన్ చేస్తున్నారు. ఇండియాలోనేమో పిచ్చి పుట్టినట్లు ఎక్కడ చూసినా క్రిస్మస్ స్టార్లు వెలుస్తున్నాయి. పిచ్చికి పరాకాష్ట ఇండియాలోనే ఉన్నట్టుంది చూస్తుంటే. 

అసలు జీసస్ డిసెంబర్ 25 న పుట్టనేలేదు అదొక పచ్చిఅబద్దం. మధ్యయుగాల చర్చి ఆధికారులు అల్లిన పెద్ద కట్టుకథ అది. దానిని గోబెల్స్ ప్రచారంతో ప్రపంచం చేత నమ్మించారు. కోట్లాది డాలర్ల వ్యాపారం చేసుకుంటున్నారు. అదే విధంగా, శాంటాక్లాస్ కూడా అబద్దమే. అలాంటివాడు ఎక్కడా లేడు. రాడు, కానీ లోకాన్ని నమ్మిస్తూ ఒక కట్టుకథ అల్లారు. దానిమీద కూడా కోట్లాది డాలర్ల వ్యాపారం నడుస్తున్నది.

పిచ్చిగొర్రెల లాంటి జనం నమ్ముతున్నారు. అనుసరిస్తున్నారు. పైగా వీళ్ళు రాముడు, కృష్ణుడు కల్పితాలంటారు. లక్షలాది ఏళ్లనుంచీ ఉన్న హిందూమతం అబద్దమంటారు. నిన్నగాక మొన్న పుట్టిన అబద్దాలపుట్ట క్రైస్తవం నిజమంటారు. కలిమాయ అంటే ఇదేనేమో?

సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా భ్రమింపజేయడమేగా కలిమాయ అంటే !

మరి అమెరికాలో ఇంత జరుగుతున్నా ప్రభువు ఉల్కలేదు, పలకలేదు. చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించే చర్చి ఫాదర్లు, ఆఫ్టరాల్ మంచు తుఫానును ఆపలేకపోయారు. హాయిగా త్రాగుతూ, మాంసం తింటూ, క్రిస్మస్ చక్కగా జరుపుకోలేకపోయారు. ఇంతమంది అమెరికన్ల చావులను ఆపలేకపోయారు. మరి ఏమైపోయింది దేవుని మహిమ?

పిచ్చిగొర్రెలని నమ్మించడం కాదు. ఇలాంటప్పుడు చూపిస్తే బాగుండేది కదా దేవుని మహిమ? కోట్లాదిమంది అమెరికన్లకు ఇబ్బందులు తప్పి ఉండేవి? వందల కోట్ల డాలర్లు మిగిలి ఉండేవి.

ఇప్పటికైనా అర్ధమౌతోందా, ప్రార్ధనతో మహిమలు జరగడం అనేది ఎంత బూటకమో? అదే నిజమైతే, ఈ క్రిస్మస్ 'నో జాయ్ క్రిస్మస్' ఎందుకైంది? అదికూడా క్రైస్తవులు ఎక్కువగా ఉన్న అమెరికాలో???