“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, డిసెంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 68 (తండ్రి - కుమార - పరిశుద్ధాత్మ దేవుని మహిమలు )

ఈరోజున అమెరికా న్యూస్ ఛానల్స్ లో ఒక వార్త గుప్పుమంది.

అదేంటంటే - పోప్ ఫ్రాన్సిస్ కు బాగా దగ్గరవాడైన ఒక స్లోవేనియా ఫాథర్, ఇద్దరు నన్స్ కు ప్రార్ధన చెయ్యడం ఎలాగో స్లోగా నేర్పించి, చివరకు ఒకరోజున 'మనం ముగ్గురం కలసి సెక్స్ చేసుకుందాం' అని  వారిని ఒప్పించాడు. ఇది 1990 లలో జరిగింది.

'ఇదేంటి? ఇదేమి ప్రార్ధనరా ఫాదరా?' అని ప్రశ్నించిన ఆ నన్స్ తో, 'ఇదే త్రియేక దేవుని మహిమ అంటే. నేను దేవుడిని, నువ్వు పరిశుద్దాత్మవు. నువ్వేమో జీసస్ వు. మన ముగ్గురం ఒకటైపోవడమే ఫాథర్, సన్, హొలీఘోస్ట్ లు ఒకటే అనడానికి నిదర్శనం' అని నచ్చజెప్పి వాళ్ళతో 'త్రీ సం' కార్యక్రమాన్ని జయప్రదంగా చాలాసార్లు జరిపాడట. 'త్రీ సం' అంటే ఏమిటో నేటి తరంవారికి నేను మళ్ళీ వివరించనక్కర లేదనుకుంటాను.

ఆ ప్రీస్ట్ పేరు 'ఫాథర్ మార్కో ఇవాన్ రుప్నిక్'. ఆయనకిప్పుడు 68 ఏళ్ళు. స్లొవేనియాలో ఉంటాడు. ఇదంతా ఇక్కడ 'న్యూయార్క్ పోస్ట్' మొదలైన పేపర్లలో గుప్పుమంటూ నేడు బయటకు వచ్చేసింది.

ఆ ఎపిసోడంతా ఇక్కడ చూడండి.

ఫాదర్ రుప్నిక్ అనే ఈ పెద్దాయన 1994 ప్రాంతాలలో, ఈ విధంగా దాదాపు 20 మందికి పైగా నన్స్ కి హొలీఘోస్ట్ దర్శనం చేయించాడట. నన్స్ అందరూ బిక్కచచ్చి భయపడిపోయి నోర్మూసుకుని ఊరుకున్నారు.

కానీ వీరిలో ఒక్క నన్ మాత్రం తెగించి బయటపడి 2004 లో కంప్లెయింట్ చేసింది. ఎవరికి? వాటికన్ కి. ఎందుకంటే, సదరు ప్రీస్ట్ గారు ఏకంగా పోప్ ప్రాన్సిస్ కే కుడిభుజం లాంటివాడు. క్రింద చర్చిలలో ఎవరికి కంప్లైంట్ చేసినా నన్ కే మాడు పగులుతుంది. దాని పోపే మాడిపోతుంది. అందికని, వాటికన్ కే మొత్తుకుంది నన్.

దీన్నంతా ఎంక్వైరీ చేసిన వాటికన్ ఫాదర్ల కమిటీ, మే 2020 లో, అంటే సరిగ్గా పదహారేళ్ళ తర్వాత ఇలా నిర్ధారించింది.

'ఫాదర్ చేసిన పనులు నిజమే. అయితే ఇప్పుడాయన్ని ఏమీ చెయ్యలేం. ఎందుకంటే అవన్నీ జరిగి చాలా ఏళ్లై పోయింది. ఆ పాపాలన్నీ ప్రతి ఆదివారం చేసుకునే కన్ఫెషన్ లో కడిగివేయబడి ఉంటాయి. ఒకవేళ అలా కడగబడకపోతే, ఆ తప్పు దేవుడిది గాని, ఫాదర్ ది కాదు.  దేవుడిని మనం శిక్షించలేం కాబట్టి, కేసు కొట్టివేయడమైనది'.

వాటికన్ ఇచ్చిన తీర్పు చాలా గొప్పగా ఉంది కదూ ! అంటే, ఇలాంటి నేరాలలో ఇలాంటి తీర్పులు వెలువరించడానికి కూడా పదహారేళ్లు పడతాయన్నమాట. మన ఇండియా కోర్టులే అనుకున్నాను, వాటికన్ కూడా ఇంతేనా?

బహుశా ఆ వాటికన్ ప్రీస్ట్ లందరూ శ్రీదేవిది 'పదహారేళ్ళ వయసు' సినిమా చూసిన ఆమె ఫాన్స్ అయి ఉంటారు ! లేదా దేనికైనా పదహారేళ్లు వస్తేగాని వారు రంగంలోకి దిగరేమో మరి?

ఎంత గొప్ప మతమో ! ఈ మాట ఎందుకన్నానంటే, ఇదేదో మారుమూల ఇండియా పల్లెలో, ఊరూపేరూ లేని చర్చిలో జరిగిన కధ కాదు. సాక్షాత్తు వాటికన్ లో జరిగింది. మరి వాటికన్ చేసిన న్యాయమేంటి? దీన్ని న్యాయమంటారా?

వాటికన్ లోనే ఉన్న రొచ్చుని చూస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని ఊరుకుంటున్నాడో?

ఇంకో ఐదురోజుల్లో క్రిస్మస్ రాబోతోంది. అందరం చక్కగా కలిసి కూడికపార్ధన చేసుకుందామని ప్లానేస్తుంటే ఇదేం న్యూసురా బాబు?

ఫాదర్, సన్, హొలీఘోస్ట్ ల మహిమలు వర్ధిల్లుగాక !

త్రియేక దేవుని లీలలు వర్ధిల్లుగాక.

ఆమెన్ తీసుకురండి ! వెంటనే !