“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, ఆగస్టు 2021, సోమవారం

ఈ అమావాస్య ఏమేం చేసింది?

గ్రీస్ కూడా తగలబడుతోంది. ధనూరాశి ఇంకా పాపార్గళం మధ్యలోనే చిక్కుకుని ఉంది. అలాగే మిధునం కూడా. కనుక అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ లకు మోక్షం అప్పుడే రాదు.

గ్రీస్ దేశంలోని రెండవ పెద్ద ద్వీపమైన ఈవా నుంచి 2000 మందిని వేరే ప్రాంతాలకు తరలించారు. యుగాంతం వచ్చిందా అంటూ జనం గగ్గోలు పెట్టె స్థాయిలో మంటలున్నాయి. వాటిని ఆర్పడానికి ప్రయత్నిస్తున్న ఒక విమానం కూడా కూలిపోయింది. ఈవా కాకుండా ఇంకా ఎన్నో చోట మంటలు వీరవిహారం చేస్తున్నాయి. గత 30 ఏళ్లలో ఎన్నడూ రాని వాతావరణ వేడి వల్ల ఈ మంటలు విజృంభిస్తున్నాయి. వాళ్లకు 45 C అంటే భరించలేని వేడి కావచ్చు, ఇది మనకు మామూలే. మనం 50 C ని చూచినవాళ్ళం కదా మరి.

బెంగుళూరులో బంగ్లాదేశీ అమ్మాయి గాంగ్ రేప్ కేసును NIA చేపట్టవలసిన స్థాయిలో ఇటువంటి  పెద్దయెత్తు కుట్రలు జరుగుతున్నాయి. ఈ ఉదంతం మే లో జరిగినా, ప్రస్తుత గ్రహప్రభావాల వల్ల ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  కాశ్మీర్ ను కట్టడి చేసేసరికి, బాంగ్లాదేశ్, బెంగాల్ లలో వాళ్ళ కుట్రలు సాగిస్తున్నారు పాకిస్తానీ ద్రోహులు. అయినా సరే, మోడీగారి పరిపాలన ముందు వాళ్ళ ఆటలు ఏమాత్రం సాగవు.

బాంగ్లాదేశ్ నటి పోరి మోని ఇంట్లో డ్రగ్స్, విదేశీ సారాయి తదితర వస్తువులు దొరికాయని ఆమెను అరెస్ట్ చేశారు. ఇదొక వింతా? ముంబాయి నటుల ఇళ్లల్లో ఎక్కడ చూచినా ఇవి ఉంటాయి. అసలు సంగతది కాదు. ఆ అమ్మాయిని ఎవడో రిసార్ట్ ఓనర్ రేప్ చేశాడని తను కేసు పెట్టింది. అదికూడా, ఏడాది తర్వాత. ఇదేంటమ్మా అంటే, ఏవో తేడాలొచ్చాయంటోంది. అతనేమో బాంగ్లాదేశ్ పోలీస్ చీఫ్ స్నేహితుడట. అయినాసరే, వాణ్ని జైల్లో పెట్టారు. ఇక వాళ్లేందుకు ఊరుకుంటారు? ఈ నేరం మీద ఈ అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు. నాకు రక్షణ లేదు. నన్ను చంపుతామంటున్నారు కాపాడండి అని ఆ నటి గగ్గోలు పెడుతోంది.

కేరళలో, ఒక లేడీ డాక్టర్ని ఇద్దరు మగ పేషంట్లు, బట్టలు చించి, తిట్టి నానా రచ్చ చేశారు. భార్యాభర్తల మధ్యనైనా సరే, ఇష్టం లేకుండా సెక్స్ జరిగితే, అది రేప్ అవుతుందని, దాని ఆధారంతో విడాకులు తీసుకోవచ్చని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.

సెక్స్, డ్రగ్స్ కేసులు, నేను ముందుగానే చెప్పినట్లు, వెలుగు చూస్తున్నాయా లేదా? ఇలా చాలా ఉన్నాయి. ఇవి చాల్లే ప్రస్తుతానికి. 

గురువు వక్రీకరించినందుకు, నాడీజ్యోతిష్య సూత్రాల ప్రకారం ఆయన మకరం లోకి వచ్చి, నీచత్వాన్ని పొందినట్లే అవుతుంది. ఈ కోణంలో ఏమేం జరిగాయో చూద్దాం.

పాకిస్తాన్లో గణేష్ ఆలయాన్ని ధ్వంసం చేశారు. మన దేశం రెండు ముక్కలైనప్పుడు పాకిస్తాన్ లో 1500 పైన హిందూ ఆలయాలుండేవి. ఇప్పుడవి పదో పదిహేనో అయ్యాయి. మరి, మన దేశంలో మసీదులో? నూటికి నూరు శాతం పెరిగాయి. ఎవరికుంది పరమత సహనం? ఇస్లాం అంటే నిజంగా శాంతేనా? కాకినడిగినా చెబుతుంది ఇది అబద్దమని. వాళ్ళున్న ఏ దేశమూ శాంతిగా లేదన్నది చేదువాస్తవం. లేటెస్ట్ గా  పాకిస్తాన్లో జరిగిన గణేష్ మందిర విధ్వంసం దీనిని మళ్ళీ రుజువు చేస్తున్నది.

కనీసం పాకిస్తాన్ జడ్జిలైనా కొంచం తెలివితో ఉన్నారు. ఒక పాకిస్తాన్ జడ్జి ఈ కేసులో ఇలా అన్నాడు 'ఇదే మీ మసీదును ధ్వంసం చేస్తే మీకెలా ఉంటుందో ఆలోచించారా?'

ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక గురుద్వారాలో, జెండాను తీసి పక్కనున్న చెట్టుకు కట్టించారు తాలిబాన్లు. ఇది సిక్కు మతం ప్రకారం చాలా ఘోరమైన పని. ఏ దేశంలోనైనా ఇస్లాం అధికారంలోకి వస్తే, అక్కడ ఇతర ఏ మతమూ బ్రతకదన్నది వాస్తవం. వాళ్ళ నీతులు చెప్పడం వరకే, పాటించడం మాత్రం ఉండదు.

ఆఫ్ఘనిస్తాన్ యుద్ధరంగమైంది. తాలిబాన్లు వరుసగా నగరాలను ఆక్రమిస్తూ, జనాన్ని చంపుతూ భీభత్సం సృష్టిస్తున్నారు. ఆఫ్ఘన్లు వేలాదిగా ఆఫ్ఘనిస్తాన్ విడిచి పారిపోతున్నారు. గత పదేళ్లుగా తాలిబాన్ తో యుద్ధంలో అమెరికా సైనికులకు సహాయం చేసిన ఆఫ్ఘన్లకు వీసాలిచ్చి అమెరికా ఆశ్రయం కల్పిస్తోంది. లేకుంటే, అమెరికా దళాలు వెళ్ళిపోయాక ఆఫ్ఘనిస్తాన్ల్లో వాళ్ళ పని  ఖాళీ అవుతుంది.

ఇంకోపక్కన, కరోనా డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. రెండు సార్లు వాక్సిన్ వేయించుకున్నా సరే నేనూరుకోను అంటోంది. ఇప్పుడు కొవాక్సిన్, కోవిషీల్డ్ రెండూ కలిపి  మళ్ళీ పొడిపించుకుంటే అప్పుడు వైరస్ నుంచి ఇంకా మంచిరక్షణ కలుగుతుందిట. ఈ చావుకబురు చల్లగా చెబుతున్నారు నిపుణులు. మరిప్పటికే పొడిపించుకున్నవాళ్ళ పరిస్థితేంటి? ఇలా ఎన్ని వాక్సిన్లు ఎన్నిసార్లు పొడిపించుకోవాలో మరి? ఇదొక అర్ధం కాని పరిస్థితి.

ఈ విధంగా, ఒకప్రక్కన భయంకర వాతావరణ మార్పులు, మరో ప్రక్కన కరోనా క్రొత్త రూపాలు లోకాన్ని అల్లాడిస్తుంటే, సందట్లో సడేమియా అన్నట్లు, ఇప్పుడే మత అల్లర్లు, అమ్మాయిల గొడవలు, రాజకీయ ఎత్తుగడలు, ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకోడాలు - ఏంటో ఈ లోకం? ఒకపక్కన చావు ముంచుకొస్తున్నా కూడా, మనుషులకు బుద్ధి ఏమాత్రమూ రాదా? ఇంకెప్పుడొస్తుందో?