నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

27, ఆగస్టు 2021, శుక్రవారం

నిజమౌతున్న జోస్యాలు

ప్రస్తుతం శుక్రుడు నీచస్థితిలో ఉన్నాడు. బుధుడు ఉచ్ఛస్థితిలోకి వచ్చాడు. ఇంకా నెలరోజులుంటుందని నేను చెప్పిన ట్రెండ్ బాగా కనిపిస్తోంది. చూడండి ! 

మైసూరులో యూపీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కు గురైంది. ఆ వివరాలన్నీ నేను వ్రాయను. న్యూస్ ఛానల్స్ చూసుకోండి. ఇన్నాళ్లూ ఉత్తరభారతంలోనే ఇలాంటి  నేరాలు ఘోరాలు, దక్షిణభారతం సురక్షితమని అనుకునేవాళ్లం. అది అబద్దమని అనిపిస్తోంది. దక్షిణాదిలో కూడా ఇలాంటి కేసులు తలెత్తుతున్నాయి. తగ్గుతున్న క్రమశిక్షణా, పెరుగుతున్న నెట్ కల్చరూ దీనిని కారణాలు. ఈ కేసులో ఇంతవరకూ ఏమీ క్లూస్ దొరకడంలేదు.

తుంకూరు లో ఒక పశువుల కాపరి రేప్ కు గురై చంపబడింది. ఇది కూడా కర్ణాటకలోని జరగడం గమనార్హం.

7-3-2018 న, ఉత్తరప్రదేశ్ లో, సమాజ్ వాదీ పార్టీకి చెందిన అతుల్ రాయ్ అనే MP తనను రేప్ చేశాడని ఒక 17 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టింది. అతన్ని అరెస్ట్ చేసి నైనీ జైల్లో పెట్టారు. అతని తమ్ముడు, అనుచరులు తమను వేధిస్తున్నారంటూ, ఈ అమ్మాయి, ఆమె స్నేహితుడు ఇద్దరూ పెట్రోల్ పోసుకుని  సుప్రీం కోర్ట్ ముందు ఆత్మాహుతి చేసుకున్నారు. తరువాత ఆస్పత్రిలో చనిపోయారు. యూపీ పోలీసులు, అధికారులు, చివరకు జడ్జీలు కూడా నేరస్తులకు కొమ్ము కాస్తున్నారని వీళ్ళు ఆరోపిస్తూ, ఆత్మహత్యను ఫెస్ బుక్ లైవ్ పెట్టి మరీ చనిపోయారు. ఇదీ సమాజవాద పార్టీ చేస్తున్న సమాజశ్రేయస్సు !  

ఇదిలా ఉంటే, కాబూల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి బాంబుదాడిలో 70 మంది దాకా హరీమన్నారు. వీళ్ళలో 15 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారట. ఇది కూడా జరుగుతుందని, 'తాలిబాన్ తో వ్యవహారం పులిమీది స్వారీ' అని ముందే వ్రాశాను. ఇప్పటికీ బుద్ధిరాకపోతే, ప్రపంచవినాశనమే. ముగించలేని యుద్ధాన్ని మొదలుపెట్టకూడదు అనే సూత్రాన్ని అమెరికా మరచిపోవడమే దీనికంతా కారణం.  పాకిస్తాన్ని ఇరవై ఏళ్లపాటు నమ్మడమే కారణం. ఇప్పుడు తెలుస్తోందా నొప్పి? బుద్ధి కర్మానుసారిణి ! పడండి !

చేసేటప్పుడు నవ్వుతూ చేసి, పడేటప్పుడు ఏడుస్తూ పడడమంటే ఇదే మరి !

గ్రహప్రభావం స్పష్టంగా ఉందా లేదా?