నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

రెండవ అమెరికా యాత్ర -15 (శ్రీచక్రాన్ని సాధించాం)



తెలుగులో రెండేళ్ల క్రితం వచ్చిన నా పుస్తకం "శ్రీవిద్యా రహస్యాన్ని" The secret of Sri Vidya  అనే పేరుతో ఇంగిలీషులోకి నేనే తర్జుమా చేశాను. నా ఉద్యోగాన్నీ నా పనులనూ హాబీలనూ సాధననూ బోధననూ కొనసాగిస్తూనే ఈ పనిని రోజుకు రెండు గంటల చొప్పున చేసుకుంటూ పూర్తి చేశాను. ఆ పుస్తకంలో నవావరణల బొమ్మలు వేద్దామని అనుకున్నాం. ఆ పనిని నా శిష్యురాళ్ళు అఖిల, పద్మజ తీసుకున్నారు. ఇద్దరూ చక్కగా బొమ్మలూ పెయింటింగ్స్ వెయ్యడం వచ్చిన వాళ్ళే గనుక ఆ పనిని  చక్కగా పూర్తి చేశారు. శ్రీ చక్రాన్ని మాత్రం వెయ్యడం చాలా కష్టమని, తప్పులు లేకుండా మీరు వెయ్యలేరని వారికి చెప్పాను. ఎందుకంటే ఆ కోణాలలో ఎక్కడ చిన్న తేడా వచ్చినా ఉండవలసిన వాటి కంటే ఎక్కువ త్రికోణాలు వచ్చేస్తాయి. అప్పుడు యంత్రం యొక్క శక్తి మారిపోతుంది.

చాలా కొలతలు లెక్కలతో వెయ్యవలసిన డ్రాయింగ్ అది. అయినా సరే వేస్తామని పద్మజ ముందుకొచ్చింది. ఆమెకు సహకారంగా మా అబ్బాయి మాధవ్ తయారయ్యాడు. ఇద్దరూ కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసిన వాళ్ళే గనుక జాగ్రత్తగా ఆలోచించి గూగులమ్మ సహాయం తీసుకుని శ్రీ యంత్రాన్ని బ్రహ్మాండంగా వేసేశారు. అఖిల పద్మజా మాధవ్ కలసి రంగులు కూడా చక్కగా వేసి ఆ యంత్రాన్ని అద్భుతంగా గీశారు. అదే ఈ చిత్రం. ఈ చిత్రం నా ఇంగ్లీషు పుస్తకం  The Secret of Sri Vidya లో ముఖచిత్రం గా వస్తుంది.

ఒక వారంలో E- Book గా రిలీజ్ కాబోతున్న ఆ పుస్తకంలోనుంచి కొంత భాగం ఇక్కడ చదవండి.


The original version of ‘Sri Vidya Rahasyam’ in Telugu language was published a couple of years back and was well received by Telugu people who are interested in spiritual literature. As time passed by, some of the readers themselves and the non-Telugu people who came to know about this book, started demanding for its English version. The idea to get the Telugu work translated into English has been haunting me for quite some time owing mainly to the wider reach of English language. However, the hurdles in this seemingly simple task are the Telugu poems, about 1400 in number, which needed the service of an expert English poet for the work of translation. I waited patiently for the command of Divine Mother and for the poet who is destined to do this work.

Meanwhile, I visited Michigan USA in April-May of 2016, to see my son and my disciples living in USA. During my stay in USA, I visited the Mother’s Trust Ashram located at Ganges Michigan. There, Rev.Gauri Vrata Ma, in whom we all met a most loving sweet mother asked me to get the Telugu book ‘Sri Vidya Rahasyam’ translated into English for the benefit of English readers. I took this as a divine command and soon after, commenced the work of translation.

Originally, I thought of entrusting the work of translating the Telugu poems of the original work into English to a person who is good at such a work, but desisted from doing so, for fear of losing the original flavor of Telugu poems. Later I abandoned the idea totally because..... 

నిజానికి నేను స్వచ్ఛమైన తెలుగునూ వ్రాయగలను మంచి చిక్కటి విక్టోరియన్ ఇంగిలీషునూ వ్రాయగలను. అయితే మాతృభాష మీద అభిమానంతో తెలుగు బ్లాగుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటాను.

37 అధ్యాయాలతో ఒక వారంలో రిలీజ్ కాబోతున్న ఈ ఇంగిలీషు పుస్తకం ఎన్నో దేశాలలో సంచలనాన్ని సృష్టించాలని, మరెంతో మంది విదేశీయులను నా సాధనా మార్గంలోకి నా శిష్యులుగా తేవాలని ఆశిద్దామా మరి !!