'ఇవాళేంటి ఇన్ని పోస్టులు టకాటకా రాస్తున్నారు?'కామెంటాడు ఒక శిష్యుడు వాట్సప్ లో.
'జ్యోతిష్యమంటే నీకు నమ్మకం కలిగిద్దామని' అన్నాను.
'అంటే?' అడిగాడు.
'ఇవాళ గ్రహస్థితులు చూడు అలా ఉన్నాయి మరి. అందరూ అతలాకుతలం అవుతారు. ఇరాన్ యుద్ధం చాలా ఊపందుకుంటుంది ఇవాళ' అన్నాను.
'ఏయే గ్రహాలు అలా ఉన్నాయి?' అడిగాడు.
'చంద్రుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, గురువు అందరూ ఇవాళ విలక్షణంగానే ఉన్నారు' అన్నాను.
'మరి శనిగ్రహాన్ని వదిలేశారేం?' అడిగాడు కించిత్ ఎగతాళిగా.
'నీరూపంలో తగులుకుందిగా. ఎక్కడ వదలగలిగాను?' అని ముగించాను.