“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, మార్చి 2023, శుక్రవారం

పిచ్చిదాని పాండీయాత్ర




మూడేళ్ళ క్రితం ఒక పిచ్చిదానితో వచ్చాను

మూడ్రోజుల క్రితం నచ్చినవాళ్ళతో వచ్చాను 

పిచ్చిది చుక్కలు చూపించింది.

వీళ్ళు చుక్కలు దాటిస్తున్నారు


చికాగో పిచ్చిది చిత్రాలు చేసింది 

మైసూరు పిచ్చిది మంత్రాలు చదివింది

డెట్రాయిట్ పిచ్చిది డేంజర్లో పడేసింది 

తణుకు పిచ్చిది తమాషాలు చూపించింది


ఆధ్యాత్మికులందరూ పిచ్చివాళ్లే గాని

పిచ్చివాళ్ళందరూ ఆధ్యాత్మికులు కాలేరు

పిచ్చి ముదిరితే ఉన్మాదం అవుతుంది గాని ఆధ్యాత్మికం అవదు 

పిచ్చివాళ్లకు ఆస్పత్రులు అవసరం గాని ఆధ్యాత్మికం ఎందుకు?