వక్రత్వం వల్ల గత అయిదు నెలలుగా మకరరాశిలో సంచరిస్తున్న శనిభగవానుడు మళ్ళీ కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంఘటన రెండు రోజులలో జరుగబోతోంది.
అమెరికాలో అయితే, ఈస్టర్న్ టైం ప్రకారం జనవరి 16 రాత్రి (తెల్లవారితే 17), రెండున్నర గంటల ప్రాంతంలో జరుగుతుంది. ఇండియాలో అయితే, జనవరి 17 మధ్యాన్నం ఒంటిగంట ప్రాంతంలో జరుగుతుంది.
దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.
మేషరాశి
ఉద్యోగపరంగా ఎదురౌతున్న చిక్కులు తొలగిపోతాయి. అన్నింటా లాభం కనిపిస్తుంది.
వృషభరాశి
ఉద్యోగంలో పనివత్తిడి ఎక్కువౌతుంది. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటుంది.
మిథునరాశి
దూరప్రాంతాలకు ప్రయాణిస్తారు. గురుసమానులు, పెద్దలకు కష్టకాలం.
కర్కాటకరాశి
నష్టాలు, చికాకులు, ఆరోగ్యసమస్యలు ఎక్కువౌతాయి.
సింహరాశి
సమాజంతో, పార్ట్ నర్స్ తో వ్యవహారాలు ఎక్కువౌతాయి. జీవితభాగస్వామికి కష్టకాలం మొదలౌతుంది.
కన్యారాశి
మానసిక చికాకులు తగ్గి మంచికాలం మొదలౌతుంది.
తులారాశి
ఇంటిలో చికాకులు మాయమౌతాయి. అయితే, సంతానచింత ఉంటుంది.
వృశ్చికరాశి
ధైర్యం సన్నగిల్లుతుంది. గృహసౌఖ్యం లోపిస్తుంది.
ధనూరాశి
కష్టాలు మాయమౌతాయి. ధైర్యం పెరుగుతుంది.
మకర రాశి
ఆరోగ్య సమస్యలు పోతాయి. కుటుంబచికాకులు, డబ్బు ఇబ్బందులు కలుగుతాయి.
కుంభరాశి
ఖర్చులు తగ్గుతాయి. బద్ధకం పెరుగుతుంది. ఆరోగ్యం కుంటుపడుతుంది.
మీనరాశి
ఖర్చులు, ఆరోగ్యసమస్యలు పెరుగుతాయి.
ఈ ఫలితాలు కనిపించడం సూచనాప్రాయంగా మొదలైపోయి ఉంటుంది. గమనించుకోండి.