“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

21, మే 2018, సోమవారం

Ek Pyar Ka Nagma Hai - Lata Mangeshkar, Mukesh


Ek Pyar Ka Nagma Hai Moujon Ki Rawani Hai
Zindgi Aur Kuch Bhi Nahi Teri Meri Kahani Hai

అంటూ లతా మంగేష్కర్, ముకేష్ మాధుర్ మృదుమధురంగా ఆలపించిన ఈ గీతం 1972 లో వచ్చిన Shor అనే చిత్రంలోనిది. ఈ పాట చాలా అద్భుతమైన భావాన్ని కలిగి ఉంది. దీని రాగం కూడా ఎంతో శ్రావ్యమైనది. 46 ఏళ్ళ తర్వాత కూడా ఎంతో మందికి ఇది అభిమాన గీతంగా నిలిచి ఉంది. లతాజీ, ముకేష్ లు ఈ పాటను ఎంతో శ్రావ్యంగా ఆలపించారు. ఈ పాటలో మనోజ్ కుమార్, నందాలు నటించారు.

ఎన్నో బాధలు పడిన ఇద్దరు ప్రేమైక జీవులు గతించిన తమ జీవితాలలోని మధుర క్షణాలను తలచుకుంటూ జీవనసారాన్ని నెమరువేసుకునే పాట ఇది. ఈ పాటలో జీవితం అంటే ఏమిటో ఉంది. వైరాగ్యం ఉంది. వేదాంతం ఉంది. మూన్నాళ్ళ ముచ్చట లాంటి ఈ జీవితంలో ఏం చెయ్యాలో ఆ సందేశం ఉంది. అన్నీ ఉన్నాయి. ఇలాంటి మంచి పాటలు ఈనాడు ఏవీ?

జగ్జీత్ సింగ్ వంటి భావుకుడు తన Close to my Heart ప్రోగ్రాంలో తనదైన శ్రావ్యస్వరంలో ఈ గీతాన్ని ఆలపించాడంటే అర్ధం చేసుకోండి ఇదెంత మంచి పాటో? 

నా స్వరంలో కూడా ఈ అమరగీతాన్ని వినండి మరి !

Movie:-- Shor (1972)
Lyrics:--Santosh Anand
Music:-- Laxmikant Pyarelal
Singers:-- Latha Mangeshkar, Mukesh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------
Ik pyar ka nagma hai – Moujon ki rawani hai -2
Zindgi aur kuchbhi nahi – Teri meri kahani hai
Ik pyar ka nagma hai - Moujon ki rawani hai
Zindgi aur kuchbhi nahi – Teri meri kahani hai
Ik pyar ka nagma hai

Kuch pakar khona hai – Kuch khokar pana hai
Jeevan ka matlab tho – Ana aur jana hai
Do palke jeevan se – Ek umr churani hai
Zindgi aur kuchbhi nahi – Teri meri kahani hai
Ik pyar ka nagma hai

Tu dhaar hai nadiya ki – Mai teraa kinara hu
Tu mera sahara hai – Mai tera sahara hu
Akhon me samandar hai – Aashavonka pani hai
Zindgi aur kuchbhi nahi – Teri meri kahani hai
Ik pyar ka nagma hai

Toofan tho aana hai – Aakar chale jaana hai
Baadal haiye kuch palka – Chaakar dhal jana hai
Parchayiya reh jaati – Reh jaati nishani hai
Zindgi aur kuchbhi nahi – Teri meri kahani hai
Ik pyar ka nagma hai - Moujon ki rawani hai
Zindgi aur kuchbhi nahi – Teri meri kahani hai
Ik pyar ka nagma hai

Meaning

Life is a tale of love
Life is a flow of waves
Life is nothing but
a story of you and me

In gaining something, we lose something
In losing something, we gain something
The meaning of life is nothing but
coming and going
From two moments of our life
we must steal the treasure of a life time
Life is nothing but
a story of you and me
Life is a tale of love

You are the water flow of a river
I am your shore
You are my support, I am your support
In my eyes there is an ocean
which contains the waters of hope
Life is nothing but
a story of you and me
Life is a tale of love

Storms have to come
Then they will have to leave
The clouds remain for two minutes
Then they will melt away
But the shadows remain
and remain your signatures
Life is nothing but
a story of you and me
Life is a tale of love

తెలుగు స్వేచ్చానువాదం

జీవితం ఒక ప్రేమకావ్యం
జీవితం ఒక అలల ప్రవాహం
జీవితం అంటే మరేమిటో కాదు
అది మనిద్దరి కధ మాత్రమే

జీవితంలో కొన్ని పొందితే కొన్ని కోల్పోతాం
కొన్ని కోల్పోతే కొన్ని పొందుతాం
జీవితం యొక్క అర్ధం ఏంటో తెలుసా?
రావడం పోవడం - అంతే !
నశించిపోయే రెండు మధురక్షణాలలో నుంచి
ఒక జీవితకాలపు ఆనందాన్ని మనం సంగ్రహించాలి
జీవితమంటే ఇంతే !

నీవు నదీ ప్రవాహానివి
నేను నీ తీరాన్ని
నువ్వు నా ఆసరావి, నేను నీ ఆసరాని
నా కన్నులలో ఒక సముద్రం ఉంది
దానిలో ఆశాజలాలు నిండుగా ఉన్నాయి

జీవితంలో తుఫానులు వస్తాయి
కాసేపటికి వెళ్ళిపోతాయి
ఈ మేఘాలు కొద్ది సేపే ఉంటాయి
వర్షం కురిశాక అవి మాయమౌతాయి
కానీ మన నీడలు మిగిలిపోతాయి
మన వారసుల లాగానే

జీవితం ఒక ప్రేమకావ్యం
జీవితం ఒక అలల ప్రవాహం
జీవితం అంటే మరేమిటో కాదు
అది మనిద్దరి కధ మాత్రమే