“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, నవంబర్ 2014, గురువారం

Phir kahi koi phool khila - Manna Dey


మధుర గాయకుడు మన్నాడే స్వరంలో నుంచి జాలువారిన మరపురాని గీతం ఇది.నేను చాలా ఇష్టపడే గాయకులలో మన్నాడే ఒకరు.ఆయన స్వరంలో ఏదో తెలియని అతీతమాధుర్యం తొణికిసలాడుతూ ఉంటుంది. ఆయన పాడిన పాటలలో దేనికదే సాటి.అటువంటి ఆణిముత్యాలలో ఇది కూడా ఒకటి.

Movie:-Anubhav(1971)
Lyrics:-Kapil Kumar
Music:-Kanu roy
Singer:-Prabodh Chandra Dey (Manna Dey)
Karaoke singer:-Satya Narayana Sarma


హిందూస్తానీ రాగం 'దేశ్' లో ఈ పాట స్వరపరచబడింది.ఈ రాగాన్ని రాత్రి రెండవ ఝాములో(9-12 మధ్యలో) ఆలపించాలంటారు.అప్పుడు దీని సౌందర్యమూ మాధుర్యమూ ఏమిటో,అవి ఎంత సమ్మోహనంగా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.ఈ రాగాన్ని వానాకాలంలో వర్షం పడుతున్న సమయంలో, రాత్రిపూట వింటే కూడా,చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది.

ఈ రాగం శుద్ధస్వరాలతో కూడుకున్నది.మన జాతీయ గీతం 'వందేమాతరం' కూడా ఈ రాగంలోనే స్వరపరచబడింది.

ఏ పాటలైనా సరే, అవి క్లాసికల్ రాగాల ఆధారంగా స్వరపరచబడితేనే చిరకాలం నిలుస్తాయి.వినిన ప్రతిసారీ మళ్ళీ మళ్ళీ మాధుర్యాన్ని అందిస్తాయి.అంతేగాని,నేటి సినిమాలలో వస్తున్న కుప్పిగంతుల కోతిపాటలు వినిన మరుసటి క్షణమే అసహ్యాన్ని కలిగిస్తాయి.వాటిలో జీవం ఉండదు.ఇక నాలుగు రోజులపాటు అవెందుకు బ్రతుకుతాయి?

దాని భావం ఉన్నతంగా,రాగం సమ్మోహనంగా ఉన్నప్పుడే పాట అనేది జీవంతో తొణికిసలాడుతూ నిత్యనూతనంగా విరాజిల్లుతూ ఉంటుంది.పాత తరంలో అలాంటి భావాన్ని వ్రాయగల కవులూ ఉండేవారు.ఆ పాటను మధురమైన రాగంలో స్వరపరచగల సంగీత దర్శకులూ ఉండేవారు. ఇప్పుడు వీరిద్దరూ మరణించారు.ఇది నేటి సినిమా పాటల దుస్థితి.

దీనికి విరుద్ధంగా,ఇలాంటి పాటలు పుట్టి 40 ఏళ్ళు దాటినా కూడా ఇంకా నిత్యనూతనంగానే ఉంటాయి.నేటికీ వినిన ప్రతిసారీ మాధుర్యాన్ని చిందిస్తాయి.

Enjoy
-----------------------------------------

Phir kahee koyi phul khila, chahat naa kaho usko-2
Phir kahee koyi dip jala, manjil naa kaho usko
Phir kahee

Mann kaa samundar pyasa huwa, kyun kisi se mange duwa-2
Leharo kaa laga jo mela, toofa naa kaho usko
Phir kahee koyi phul khila, chahat naa kaho usko
Phir kahee

Dekhe kyu sab woh sapne, khud hi sajaye jo hamne-2
Dil unse bahel jayey toh, rahat naa kaho usko
Phir kahee

Meaning

Somewhere again a flower has bloomed,dont call it a desire
Somewhere again some one had lit a flame,dont call it a home
Somewhere again a flower has bloomed...

The sea of mind became thirsty,
Why should it pray someone for a blessing?
When the waves congregate together,dont call it a cyclone
Somewhere again a flower has bloomed...

Why everybody looks at a dream,that they decorate well?
And when the heart is cajoled by it,dont call it an escape
Somewhere again a flower has bloomed...