“Self service is the best service”

12, నవంబర్ 2014, బుధవారం

Telugu Melodies-PB Srinivas-వెన్నెలకేలా నాపై కోపం...



ఈ పాట ఇంకొక సుమధుర గీతం.

చిత్రం:--కానిస్టేబుల్ కూతురు(1962)
రచన:--ఆచార్య ఆత్రేయ
సంగీతం:--ఆర్.గోవర్ధన్
గానం:-- పీ.బీ.శ్రీనివాస్
కరావోకే గానం:--సత్యనారాయణ శర్మ

మొదటి రెండు చరణాలు సినిమాలో సందర్భానుసారం వ్రాసినవి.కనుక ఆ సన్నివేశపరంగా వాటిలో అర్ధం ఉండవచ్చేమో గాని,ఒక సార్వత్రిక భావగీతానికి ఉండవలసిన అందం వాటిలో లేదు.కనుక ఆ చరణాలు నాకంతగా నచ్చలేదు.

కానీ పల్లవి మాత్రం మంచిభావాన్ని కలిగి ఉన్నది.వెన్నెల,పూవులు ప్రకృతిలోవి.అవీ తనమీద కోపంగా ఉన్నాయి.ప్రేయసి కన్నులు,చూపులు కూడా తనమీద కోపంతో ఉన్నాయి.తానేమి తప్పు చేశానని అవి అలా కోపంగా ఉన్నాయో తెలియడం లేదన్న మంచి భావాన్ని ఆలపిస్తూ పాడే పాట.అందుకే పల్లవిలో ఉన్న అందం చరణాలలో లోపిస్తుంది.

పీబీ శ్రీనివాస్ గాత్రం ఖంగుమంటూ మ్రోగింది.పాటకు అందాన్నీ మాధుర్యాన్నీ తెచ్చింది.నా స్థాయిలో నేనూ ఆపాటను పాడే ప్రయత్నం చేశాను.కరవోకే ట్రాక్ లోని లోపాలవల్ల,రికార్డింగ్ లోపాలవల్లా అసలు పాటలోని మాధుర్యం ఇందులో లోపించవచ్చు.కొన్నికొన్ని చోట్ల PBS అనిన అప్స్ అండ్ డౌన్స్ నేను అనలేదు.

ఇది సిచుయేషనల్ సాంగ్.దీని లిరిక్స్ అంతగా నాకు నచ్చకపోయినా ఒక మధురగీతాన్ని ఆలపించానన్న తృప్తి కోసం పాడాను.ఈ రాగానికి నేను వ్రాసుకుని పాడిన భావగీతం ముందు ముందు అప్ లోడ్ చేస్తాను.

Enjoy

-----------------------------------
వెన్నెలకేలా నాపై కోపం - సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం - ముల్లై గుచ్చినదీ
కన్నులకేలా నాపై కోపం - కణకణలాడినవీ
నీ చూపులకేలా నాపై కోపం - తూపులు దూసినవీ

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినదీ

బులిపించు పైటా కలహించి అచటా తరిమినదెందులకో-2
నీ వలపులు చిందే పలుకుల విందే చేదుగా మారినదో
పీటలపైనా పెళ్లిదినానా మాటలు కరువైనా
నను ఓరచూపులా కోరికలూరా చూడవా నీవైనా

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినదీ

మరదలు పిల్లా జరిగినదెల్లా మరచుటే మేలుగదా
ఓ.ఓ.ఓ.. మరదలు పిల్లా జరిగినదెల్లా మరచుటే మేలుగదా
నిను కోరిన బావనూ కూరిమి తోడనూ చేరుటే పాడిగదా-2

వెన్నెలకేలా నాపై కోపం - సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం - ముల్లై గుచ్చినదీ