“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

4, సెప్టెంబర్ 2014, గురువారం

రోహిణీ శకట భేదనం-4 (శనీశ్వరుని తృతీయ దృష్టి-ఇదీ భయానకమే)

శనీశ్వరునికి తృతీయ దృష్టి కూడా ఉన్నది.

రోహిణీ నక్షత్రాన్ని ఆ దృష్టితో చూడాలంటే ఆయన మీనరాశిలో 17 వ డిగ్రీ మీద సంచారం చెయ్యవలసి ఉంటుంది.

ఆయా సమయాలు ఎప్పుడు వచ్చాయో,ఆ సమయాలలో ఏమేమి జరిగాయో గమనిద్దాం.

1) 1997-98 లో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించాడు.
  • సరిగ్గా 1997-98 లో ElNino Winter వచ్చింది.దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా మలేరియా,డెంగూ,MVE(Murray Valley Encephalitis), Rift Valley Fever,Kawasaki Disease మొదలైన వ్యాధులు విజ్రుంభించాయి.ఇండియా ఆస్ట్రేలియాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులూ మరికొన్ని దేశాలలో అతి వర్షాలూ వరదలూ కలిగాయి.ప్రపంచం మొత్తం మీద వాతావరణం మీద ఈ ఎల్ నినో ఎఫెక్ట్ అనేది తీవ్ర ప్రభావం చూపింది.
  • మన దేశంలో Uphaar Cinema Fire accident జరిగింది.డిల్లీలో ఉపహార్ అనే సినిమా హాలు తగలబడి ఆ పొగకు ఊపిరాడక లోపలున్న దాదాపు 60 మంది చచ్చారు.ఇంకొక 110 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.
  • 7-6-1997 న తంజావూర్ బృహదీశ్వరాలయంలో సంప్రోక్షణ సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం(Brihadeeswarar temple fire) లో 50 మంది చచ్చారు.ఇంకొక 200 మందికి ఆ తొక్కిసలాటలో తీవ్ర గాయాలయ్యాయి.
  • 16-4-1997 న మక్కా లో జరిగిన అగ్ని ప్రమాదం(Mecca fire of 1997) లో 217 మంది చచ్చారు.ఇంకొక 1300 మంది ఆ తొక్కిసలాటలో గాయపడ్డారు.
  • 1997 Indonesian Forest fires అనే అగ్నిప్రమాదాలలో ఇండోనేషియాలోని అడవులు తగలబడి 4.5 billion dollars నష్టం వాటిల్లింది.పర్యావరణం భయంకరంగా పాడయింది.ఇటువంటి ప్రమాదాలు ఇండోనేషియాలో గత 200 ఏళ్ళలో జరగలేదు.దీనివల్ల 1997 South East Asian Haze అనే పర్యావరణ కాలుష్యం తలెత్తింది.
  • 1996-97 Australian Bush fire season వల్ల ఆస్ట్రేలియాలో దాదాపు 13 ప్రాంతాలలో తీవ్ర అగ్నిప్రమాదాలు జరిగి వందల ఎకరాలు తగలబడ్డాయి.
  • 1997 Aisin fire అనే అగ్నిప్రమాదం వల్ల Toyota Car Company కి చెందిన ప్రొడక్షన్ యూనిట్ మూతబడే పరిస్థితి తలెత్తింది.
  • 11-3-1997 న Tokaimura Nuclear Accident అనేది జరిగింది.
  • ఆ సమయంలో వచ్చిన భూకంపాలు,వరదలు,తుఫాన్లకు అయితే లెక్కే లేదు.అన్ని ప్రకృతి భీభత్సాలు ఆ సమయంలో జరిగాయి.
  • 21-3-1997 న మన దేశంలో Sangrampora Massacre అనే ఉదంతం జరిగింది.ఇస్లాం తీవ్రవాదులు సంగ్రాంపూర్ అనే ఊరిలో కాశ్మీర్ పండిట్లను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు.
  • 23-2-1997 న అమెరికాలో Empire state building shootout జరిగింది.
  • రైల్వే,రోడ్డు,జలయాన ప్రమాదాలు లెక్కలేనన్ని జరిగాయి.
  • ఆగస్ట్ 1998 లో మన దేశంలో జరిగిన Malpa Landslide దుర్ఘటనలో ఆ ఊరు మొత్తం తుడిచి పెట్టుకుపోయింది.మానస సరోవర్ యాత్రకు వెళుతున్న 70 మంది యాత్రికులు ఆ లాండ్ స్లైడ్ లో చనిపోయారు. వీరిలో నర్తకి ప్రతిమా బేడీ కూడా ఒకరు.
  • అక్టోబర్ 1998 లో స్వీడన్లో జరిగిన Gothenberg Discotheque fire సంఘటనలో 63 మంది చచ్చారు.200 మంది గాయాల పాలయ్యారు.
  • డిసెంబర్ 1998 లో Linton Bushfire అనే అగ్నిప్రమాదం జరిగి 660 హెక్టేర్ల స్థలాన్ని తగలబెట్టింది.
  • జూన్ 1998 లో Oso Complex fire అనే అగ్ని ప్రమాదం జరిగి 5185 ఎకరాల అడవిని తగలబెట్టింది.
  • 2-9-1998 న Swissair flight 111 అనే విమానం అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయింది.అందులో ఉన్న 229 మంది ప్రయాణీకులు హరీమన్నారు.
  • 14-2-1998 న Yaounde' train explosion అనే సంఘటనలో కామెరూన్ లో రెండు ఆయిల్ ట్యాంకర్ రైళ్ళు గుద్దుకొని భయంకర అగ్నిప్రమాదం జరిగింది.
  • అదే సంవత్సరంలో మన దేశంలో జరిగిన కల్తీ ఆవనూనె (1998 Delhi Oil poisoning) సంఘటనలో 60 మంది చచ్చారు.3000 మంది ఆస్పత్రి పాలయ్యారు.ఆవనూనె రాహువుకు సూచిక అన్న విషయమూ అప్పుడు శనిరాహువులు షష్టాష్టక స్థితిలో ఉన్నారనీ మరచిపోరాదు.
  • అప్పుడే అమెరికాలో 1998 United States listeriosis outbreak అనే ఫుడ్ పాయిజనింగ్ సంఘటన జరిగింది.
  • జపాన్లో శీతాకాల ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో ఫ్లూ విజ్రుమ్భించి 1998 Winter olympics flu outbreak అనే సంఘటన జరిగింది.
  • మే 1998 లో స్పెయిన్లో Acerinox accident అనబడే రేడియో ధార్మిక కాలుష్య సంఘటన జరిగింది.
  • ఆస్ట్రేలియాలో Esso Longford gas explosion అనే సంఘటనలో గ్యాస్ ప్లాంట్ ఒకటి పేలిపోయింది.
  • నైజీరియాలో 1998 Jesse pipeline explosion అనే సంఘటన జరిగింది.ఆ ప్రమాదంలో దాదాపు 200 మంది చనిపోయారు.
  • మిన్నేసోటాలో 1998 St.Cloud explosion అనే దుర్ఘటన జరిగి నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పేలిపోయింది.
  • ఇక హరికేన్లూ,టోర్నడోలూ,తుఫాన్లూ,భూకంపాలూ ఎన్నెన్ని జరిగాయో లెక్కే లేదు.అవన్నీ వ్రాస్తే అవే ఒక పది పేజీలకు వచ్చేటన్ని ఉన్నాయి.
మొత్తం మీద 1997-98 మాత్రం ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన దుర్ఘటనలు చాలా చాలా జరిగిన సమయం అని ఇవన్నీ చూస్తుంటే అర్ధమౌతున్నది.

2) మళ్ళీ 1967-68 లో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించాడు.
  • బెల్జియం లో జరిగిన L'Innovation department store fire అనే అగ్ని ప్రమాదంలో 323 మంది చనిపోయారు.
  • కాలిఫోర్నియా లోని MGM Studio లో జరిగిన 1967 MGM Vault fire అనే అగ్నిప్రమాదంలో అనేక మూకీ సినిమాల రీళ్లు కాలిపోయాయి.
  • టాస్మానియా లో జరిగిన 1967 Tasmanian Fires అనే అగ్నిప్రమాదాలలో 62 మంది చచ్చారు.దాదాపు 1000 మందికి కాలిన గాయాలయ్యాయి.దాదాపు 7000 మంది ఇళ్ళు కాలిపోయి దిక్కులేనివాళ్ళయ్యారు.
  • న్యూజీలాండ్ లో Strongman Mine అనే బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు సంభవించింది.
  • యధావిధిగా భూకంపాలూ హరికేన్లూ టైఫూన్లూ చాలా జరిగాయి.
  • సముద్ర,భూ రవాణా ప్రమాదాలు లెక్కలేనన్ని జరిగాయి.
  • The inferno 1968 అనే సంఘటనలో గ్లెన్ పార్క్ అనే నైట్ క్లబ్ తగలబడిపోయింది.
  • స్కాట్లాండ్ లో జరిగిన James Watt Street fire అనే సంఘటనలో ఒక ఫర్నిచర్ ఫేక్టరీ తగలబడి పోయింది.
  • ఆగస్ట్ 1968 లో జరిగిన అగ్నిప్రమాదంలో గ్లాస్గో లోని Kelvinbridge Railway Station తగలబడి పోయింది.
  • మళ్ళీ యధావిధిగా హరికేన్లూ, టైఫూన్లూ, టోర్నడోలూ, వరదలూ, భూకంపాలూ లెక్క లేనన్ని జరిగాయి.
  • సముద్ర,రోడ్డు రవాణా ప్రమాదాలు లెక్కలేనన్ని జరిగాయి.
  • 4-4-1968 న మార్టిన్ లూథర్ కింగ్ హత్య చెయ్యబడ్డాడు.
  • 5-6-1968 న R.F.Kennedy హత్య చెయ్యబడ్డాడు.
3) మళ్ళీ 1937-38 లో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించాడు.
  • అమెరికాలో పిడుగు పడి 1937 Blackwater fire అనే దుర్ఘటనలో 1700 ఎకరాల అడవి తగలబడిపోయింది.ఇది నమ్మశక్యం గాని నిజం.
  • అమెరికాలో జరిగిన ఔషధ పాయిజనింగ్ కేసులలో ముఖ్యమైన Elixir Sulfanilamide poisoning అనేదానిలో100 మంది పైన చచ్చారు.
  • ఇంగ్లాండ్ లో జరిగిన  Holdich colliery disaster అనే దుర్ఘటనలో బొగ్గుగనిలో జరిగిన పేలుడులో 30 మంది చచ్చారు.
  • ఓహియోలో 1937 Anna Earthquake అనే అతిపెద్ద భూకంపం వచ్చింది.
  • మెక్సికోలో 1937 Orizaba Earthquake అనే భూకంపం వచ్చింది.
  • Ohio River flood అనే అతి పెద్ద వరదలో దాదాపు పది లక్షలమందికి ఇళ్ళు నాశనమయ్యాయి.500 million dollars నష్టం వాటిల్లింది.
  • యధావిధిగా సముద్ర రైల్వే ప్రమాదాలు లెక్కలేనన్ని జరిగాయి.
3) మళ్ళీ 1908-09 లో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించాడు.
  • అమెరికాలో జరిగిన Collinwood School fire అనే సంఘటనలో స్కూలు తగలబడి 175 మంది కాలిపోయి చనిపోయారు.
  • పెన్సిల్వేనియాలో జరిగిన Rhoads Opera House fire అనేది ఒక ఘోర దుర్ఘటన.ఒక చిన్న కిరోసిన్ దీపం దొర్లి ఒక మిషన్లో ఉన్న పెట్రోల్ అంటుకుని ఒపేరా హౌస్ మొత్తం తగలబడిపోయింది.ఫైనల్ డేస్టినేషన్ సినిమాలో జరిగిన సంఘటనల లాగా ఇది జరిగింది.ఈ దుర్ఘటనలో జరిగిన తొక్కిసలాటలో 171 మంది చనిపోయారు.
  • దక్షిణ ఇటలీలో వచ్చిన 1908 Messina Earthquake అనే భూకంపం అతి ఘోరమైన భూకంపాలలో ఒకటి.దీనిలో 1,23,000 మంది చనిపోయారు.
  • ఆ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 30 పైనే భూకంపాలు వచ్చాయి.
  • అమెరికాలో అప్పుడు వచ్చిన 1908 Dixie tornado outbreak చాలా ఘోరమైనది.మొత్తం అమెరికాలో 13 రాష్ట్రాలలో 29 టొర్నడో లు తలెత్తాయి.అనేకమంది చనిపోయారు.గాయపడ్డారు.ఇల్లూ వాకిలీ కోల్పోయారు.
  • మెక్సికో దేశ చరిత్రలోనే అతి పెద్ద బొగ్గు గని ప్రమాదం అప్పుడు జరిగింది.1908 Mina Rosita Vieja disaster అనే దీనిలో బొగ్గు గనిలో ఒక పేలుడు సంభవించి దాదాపు 200 మంది భూస్థాపితం అయి చనిపోయారు.
  • ఆస్ట్రేలియాలో జరిగిన 1908 Sunshine rail disaster లో 44 మంది చనిపోయారు.200 మంది గాయాలపాలయ్యారు.
  • ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 పెద్ద ఓడలు మునిగాయి.
  • 1909 లో పర్షియా లో వచ్చిన Borujerd Earthquake లో దాదాపు 8000 మంది చనిపోయారు.
  • అదే ఏడాది ఫ్రాన్స్ లో వచ్చిన Provence Earthquake లో 2000 ఇళ్ళు ధ్వంసం అయ్యాయి.
  • అమెరికా ఇండియానా స్టేట్ లో Wabash River Earthquake అనే భూకంపం వచ్చింది.
  • అమెరికాలో అదే సంవత్సరంలో వచ్చిన 1909 Tornado outbreak లో 37 టొర్నడోలు తలెత్తాయి.ఈ ప్రభావానికి మిసిసిపి టెన్నెస్ లు ఎక్కువగా గురయ్యాయి.
  • ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ 18 ఓడలు మునిగిపోయాయి.
4) మళ్ళీ 1878-79 లో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించాడు.
  • అమెరికాలోని కనెక్టికట్ లో వచ్చిన Wallingford Tornado ఆ టౌన్ మొత్తాన్నీ ధ్వంసం చేసింది.ఆ రాష్టాన్ని తాకిన అతి విధ్వంసకరమైన టొర్నడో లలో ఇదే అతి పెద్దది.
  • హంగేరీలో వచ్చిన The great flood of Miskolc అనే వరదలో ఆ సిటీ మొత్తం ధ్వంసమైంది.అక్కడ ఎన్నో వరదలు వచ్చినా,అన్నింటిలోకీ ఇదే అతి పెద్దది.ఎక్కువ ప్రాణనష్టం కూడా దీనిలోనే జరిగింది.
  • అమెరికాలో వచ్చిన Gale of 1878 అనే హరికేన్ క్యూబా నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకూ దాదాపు పదిహేను రాష్ట్రాలను అతలాకుతలం చేసింది.
  • మన దేశంలో ఆ సమయంలో అతి తీవ్రమైన కరువు వచ్చింది.దానిపేరే The great famine of 1876-78.అప్పటి మద్రాస్, మైసూరు, హైదరాబాద్,బాంబే ప్రాంతాలలో 7 లక్షల చరదపు కి.మీ పరిధిలో రెండేళ్లపాటు అది విలయం సృష్టించింది.దాదాపు 60 లక్షల మంది ఆ కరువు దెబ్బకు చనిపోయారు.
    5) మళ్ళీ 1848-50 లో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించాడు.
    • Great gale of 1848 అనే హరికేన్ దెబ్బకు Tampa Bay area మొత్తం అతలాకుతలం అయ్యింది.
    • 1848 Marlborough Earthquake అనే భూకంపం న్యూజీలాండ్ లో విధ్వంసం సృష్టించింది.
    • 1849 Sauve's Crevasse అనే జలప్రమాదంలో మిసిసిపి నదికి వరదలొచ్చి న్యూ ఆర్లియన్స్ ను ముంచేసింది.దాని తర్వాత ఇప్పటివరకూ మళ్ళీ అలాంటి వరద రాలేదు.
    6) మళ్ళీ 1820-21 లో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించాడు.

      • ఇంగ్లాండ్ లో Holmfirth Floods అనే వరదలోచ్చాయి.ఈ వరదలు 1821 లో ఒకసారి వచ్చి మళ్ళీ శనైశ్చరుడు మీనరాశిలోకి 30 ఏళ్ళ తర్వాత వచ్చినపుడు 1852 లో ఖచ్చితంగా మళ్ళీ వచ్చాయి.
      • 1821 Norfolk and Long island hurricane అనేది వచ్చి అమెరికాలో విలయం సృష్టించింది.
      • 1821 New England Tornado Outbreak అనే దుర్ఘటనలో 5 టొర్నాడోలు తలెత్తి అమెరికాలో విధ్వంసం సృష్టించాయి.
      --------------------------------------------------------------
      ఈ విధంగా శనీశ్చరుడు మీనరాశిలో సంచరించిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద పెద్ద దుర్ఘటనలు జరిగాయి.

      వీటిని క్రోడీకరించి చూడగా శనైశ్చరుడు మీనరాశిలో సంచరించిన ప్రతిసారీ ,ఈ క్రింది సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరిగినట్లు కనిపిస్తున్నాయి.
      • అగ్నిప్రమాదాలు,జల ప్రమాదాలు.
      • తుఫాన్లు,వరదలు.
      • రవాణా ప్రమాదాలు
      • భూకంపాలు
      • కరువు కాటకాలు
      • సహజ వాయువు,అణుసంబంధ ప్రమాదాలు.
      • ప్రముఖుల హత్యలు
      దీనివల్ల ఇంకొక విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.

      శనీశ్చరుని దశమదృష్టి కంటే తృతీయదృష్టి విధ్వంసకరమైనది.దీనికొక కారణం కనిపిస్తున్నది.దశమ దృష్టి ఆయన యొక్క వృత్తిపరమైన కారకత్వానికి దగ్గరగా ఉంటుంది.అందుకే ఆ సమయంలో దుర్ఘటనలు జరిగినా ఇంత పెద్ద మోతాదులో జరగలేదు.తృతీయ దృష్టి సమయంలో మాత్రం మళ్ళీ వృషభరాశి స్థితి,వృశ్చిక రాశి స్థితి అంత ఘోరంగా ఈ దుర్ఘటనలు జరిగాయి.

      మొత్తం మీద రోహిణీ శకటం ఇక్కడ కూడా ఋజువైంది.

      ఖగోళంలోని- వృషభం,సింహం,వృశ్చికం,మీనం-ఈ నాలుగు రాశులలో శనిసంచార సమయాల్లో ఇప్పటివరకూ మనం గమనించిన దుర్ఘటనలను క్రోడీకరించి తులనాత్మక పరిశీలన చేస్తూ ఏమేమి నిర్ణయాలకు రావచ్చో, ఏయే సూత్రాలను ప్రతిపాదించ వచ్చో,వచ్చే పోస్ట్ లో చూద్దాం.

      (ఇంకా ఉన్నది)