“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, సెప్టెంబర్ 2014, బుధవారం

రోహిణీ శకట భేదనం -3(శనిగ్రహ సప్తమ దృష్టి - భయంకర విధ్వంసం)

అన్ని గ్రహాలకున్నట్లే శనీశ్చరునకు కూడా సప్తమ దృష్టి ఉంటుంది.సప్తమ దృష్టి చాలా బలమైనది.కనుక ఆయన రోహిణీ నక్షత్రాన్ని తన సప్తమ దృష్టితో వీక్షించిన ప్రతిసారీ భూమ్మీద ఏఏ సంఘటనలు జరిగాయో చూద్దాం.

రోహిణీ నక్షత్రాన్ని అలా సప్తమ దృష్టితో వీక్షించాలంటే ఆయన వృశ్చికరాశి 3 డిగ్రీ నుంచి 20 డిగ్రీ దాకా సంచరించాలి.గతంలో అలాంటి సందర్భాలు ఎప్పుడు జరిగాయో గమనిద్దాం.

అదీగాక-- ఈ పరిశోధనకు ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది.

శనీశ్చరుడు ఇంకొక ఆరేడు నెలలలో అంటే 2015 లో వృశ్చికరాశిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రాంతంలోకి అడుగుపెట్ట బోతున్నాడు,అక్కడ నుంచి రోహిణీ నక్షత్రాన్ని వీక్షించబోతున్నాడు.కనుక ఇంకొక ఏడాదినుంచి రెండేళ్ళ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఘోరమైన విపత్తులు మళ్ళీ జరుగబోతున్నాయని ఖచ్చితంగా ఊహించవచ్చు.

అవి ఎలా ఉంటాయో, ఏ ఏ రకాలుగా ఆ విధ్వంసం జరుగనుందో గతాన్ని గమనిస్తే మనం చక్కగా అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడు మన పరిశోధన ప్రారంభిద్దాం.

1) 1985 నవంబర్ నుంచీ 1987 జనవరి వరకూ శనీశ్చరుడు సప్తమ దృష్టితో రోహిణీ నక్షత్రాన్ని వీక్షించాడు.
  • 26-4-1986 న ప్రపంచంలోనే అతి ఘోరమైన "చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్" జరిగింది.అతి వినాశకరమైన విధ్వంసాలలో ఇదొకటి.
  • అప్పుడు జరిగిన నూక్లియర్ రియాక్టర్ పేలుడులో అణు ధార్మిక రేణువులు రష్యా యూరప్ ల మీద విచ్చలవిడిగా వెదజల్లబడ్డాయి.
  • తత్ఫలితంగా ఆ దగ్గరలోనే ఉన్న 'ప్రిప్యాట్' అనే నగరం పూర్తిగా పాడుపెట్టబడింది.
  • అణుధార్మిక రేణువుల ఫలితంగా అక్కడి ప్రజలకు వచ్చిన థైరాయిడ్ కేన్సర్లూ ఇతర రోగాలూ లెక్కలేనన్ని ఉన్నాయి.ఆ వివరాలన్నీ నేను మళ్ళీ వ్రాయనవసరం లేదు.కావలసిన వారు ఇక్కడ చూడండి.
  • ఆ సమయంలో విచిత్రంగా,రకరకాల దేశాలలో కొన్ని హోటళ్ళు మాత్రమే తగలబడ్డాయి.
  • Dupont Plaza Hotel arson అనే హోటల్ అగ్నిప్రమాదం అప్పుడే జరిగింది.ఇది ప్యూర్టోరికా చరిత్ర లోనే అతి పెద్దది.
  • నార్వే లో Hotel Caledonian fire అనేది అప్పుడే జరిగింది.
  • స్విట్జర్లాండ్ లో Sandoz chemical spill అనబడే భయంకర పర్యావరణ ప్రమాదం జరిగింది.రసాయన ప్రమాదాలలో ఇది చెప్పుకోదగ్గ ప్రమాదం.
  • 1986 లో లెక్కలేనన్ని హరికేన్లూ,టైఫూన్లూ,భూకంపాలూ,వరదలూ వచ్చాయి.
  • 1987 Daxing'anling wildfire అనే అగ్నిప్రమాదం చైనాలో వచ్చి దాదాపు 25 లక్షల ఎకరాలను తగలబెట్టింది.ఆ మంటలు ఒక నెలపాటు అలా మండుతూనే ఉన్నాయి.
  • లండన్ అండర్ గ్రౌండ్ స్టేషన్లో జరిగిన King's cross fire అప్పుడే జరిగింది.
  • 1987 లో హర్యానాలో Punjab Killings జరిగాయి.రెండు బస్సులలో పోతున్న హిందువులను కిందకు దించి వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేశారు ఖలిస్తాన్ కమెండో ఫోర్స్ కు చెందిన తీవ్రవాదులు.
  • బ్రెజిల్ లో Goiania accident అనబడే రేడియో ధార్మిక విపత్తు జరిగింది.
  • న్యూజెర్సీ న్యూయార్క్ లలో The Syringe tide అనబడే విచిత్రమైన పర్యావరణ ప్రమాద సంఘటన అప్పుడే జరిగింది.ఆ సందర్భంలో,వాడిపారేసిన సిరెంజిలూ,మెడికల్ వేష్టూ,చెత్తా చెదారాలు సముద్రపు బీచ్ లలోకి కొట్టుకుని వస్తే,అట్లాంటిక్ బీచ్ లన్నింటినీ మూసివెయ్యవలసిన పరిస్థితి తలెత్తింది.
  • ఫిలిప్పైన్స్ ని వరుసగా మూడు టైఫూన్స్ ఎటాక్ చేశాయి.
  • న్యూయార్క్ రాష్ట్రంలో స్కోహారీ క్రీక్ బ్రిడ్జి అనే రోడ్డు రవాణా బ్రిడ్జి కూలిపోయింది.
  • ఇక మామూలుగా వచ్చే వరదలూ భూకంపాలూ వగైరాలు వ్రాయ దలుచుకోలేదు.అవి అమెరికాలోనే చాలా జరిగాయి.పెద్దపెద్ద ప్రమాదాలనే నేను లెక్కలోకి తీసుకున్నాను.చిన్నచిన్న వాటిని లెక్కలోకి తీసుకోలేదు.
2) మళ్ళీ 1956 -1957 లలో శనీశ్చరుడు వృశ్చిక రాశిలో సంచరిస్తూ తన సప్తమదృష్టితో రోహిణీ నక్షత్రాన్ని వీక్షించాడు.
  • నార్వే లో అతి పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది.దానిని Dalsenget fire అంటారు.ఒక ట్రాం డిపో మొత్తం తగలబడి అందులో ఉన్న ట్రాములు అన్నీ కాలిపోయాయి.
  •  టెక్సాస్ రాష్ట్రంలో McKee refinery fire అనే అగ్నిప్రమాదం జరిగింది.ఇది అమెరికాలో జరిగిన అతి పెద్ద అగ్ని ప్రమాదాలలో ఒకటి.ఇందులో విచిత్రం ఏమంటే అరమిలియన్ గ్యాలన్ల పెంటేన్ హేక్సేన్ వాయువులున్న ట్యాంకులు దీనిలో తగలబడిపోయాయి.
  • పాదరస విషప్రభావం వల్ల వచ్చే ఘోరమైన Minamata disease అనే రోగం జపాన్లో కనిపించింది.కెమికల్ ఫేక్టరీ లలోనుంచి వచ్చిన వేస్ట్ వాటర్ దగ్గరలోనే ఉన్న సముద్రంలో కలవడం వల్ల ఈ పొల్యూషన్ వ్యాపించి దాదాపు 36 ఏళ్ళ పాటు కుక్క,పిల్లి,పంది,మనిషి అందరినీ చంపుతూ వచ్చింది.పిల్లుల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉండేది.అందుకనే దానిని "డాన్సింగ్ కేట్ ఫీవర్" అనేవారు.
  • అట్లాంటిక్ పసిఫిక్ ప్రాంతాలలో మొత్తం 9 హరికేన్లూ టైఫూన్లూ వచ్చాయి.
  • గుజరాత్ లోని అంజార్ లోనూ,దక్షిణ లెబనాన్లో లోనూ, నికారాగ్వా లోనూ,బర్మా Sagaing లోనూ భూకంపాలు వచ్చాయి.వీటిలో బర్మా భూకంపం పెద్దది.
  • ఆస్ట్రేలియాలో Murray river flood అనేది వచ్చి మూడు రాష్ట్రాలలోని అనేక నగరాలను ముంచింది.
  • వీటన్నిటి కంటే కూడా అమెరికాలో వచ్చిన 1956 Tornado outbreak చాలా విధ్వంసకరమైనది.దీనిలో మొత్తం 47 టొర్నడోలు పుట్టి అమెరికా లో మహావిధ్వంసం సృష్టించాయి.
  • అలబామా రాష్ట్రంలో వచ్చిన 1956 Alabama tornado కూడా ఘోరమైనదే.
  • అదే 1957 ని "టొర్నడో సంవత్సరం" అని పిలవవచ్చు.ఆ సంవత్సరంలో అమెరికాని దాదాపు 203 టొర్నడోలు ఊపి పారేశాయి.
  • 1957 లో స్పెయిన్ లో Valencia flood అనేది వచ్చింది.
3) మళ్ళీ 1926 -1927 లలో శనీశ్చరుడు వృశ్చికరాశిలో సంచరిస్తూ తన సప్తమదృష్టితో రోహిణీ నక్షత్రాన్ని వీక్షించాడు.
  • 1926 ని భూకంపాల సంవత్సరం గా చెప్పుకోవచ్చు.ఆ ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80 భూకంపాలు వచ్చాయి.కానీ పెద్దగా జననష్టం జరగలేదు.ఇక్కడ గమనించవలసిన ఒక విచిత్రం ఏమంటే ఆ సంవత్సరంలో గురువు శనిక్షేత్రంలో నీచస్థితిలో ఉన్నాడు.కుజుడు వక్రస్తితిలో స్తంభనస్థితిలో మేషరాశిలో చాలాకాలం ఉన్నాడు.
  • 1926 లో Louisiana hurricane అనేది అమెరికాలో వచ్చి అక్కడి గల్ఫ్ కోస్ట్ లో చాలా విధ్వంసం చేసింది.
  • ఇక 1927 లో చూస్తే అప్పుడొచ్చిన The great Mississipi flood అనేది అమెరికా చరిత్రలోనే అతి పెద్ద వరద.అదోచ్చినప్పుడు 27,000 చదరపు మైళ్ళ మేర 30 అడుగుల నీటితో ముంచి పారేసింది.
  • మన దేశంలో 1927 Nagpur riots జరిగాయి.నాగపూర్లో లక్ష్మీపూజ సందర్భంగా హిందూ ముస్లిం గొడవలు తలెత్తి అది చిలికి చిలికి గాలివానగా మారింది.
4) మళ్ళీ 1897 -1898 లలో శనీశ్చరుడు వృశ్చికరాశిలో సంచరిస్తూ తన సప్తమదృష్టితో రోహిణీ నక్షత్రాన్ని వీక్షించాడు.
  • 1897 లో అస్సాంలో వచ్చిన భూకంపం(The great Assam Earthquake of 1897) మన దేశచరిత్రలోనే అతి పెద్దది.దాని విధ్వంసం చూస్తే దిగ్భ్రమ కలుగుతుంది.బర్మా నుంచి డిల్లీ వరకూ 6.5 లక్షల చదరపు కి.మీ పరిధిలో ఈ భయంకర భూకంపం వచ్చింది.ఇది చేసిన ఆస్తి నష్టానికి లెక్కే లేదు.
  • నార్త్ డకోటాలో Red river flood అనేది వచ్చింది.
  • చైనాలో Yellow river flood అనే అతి పెద్ద వరద వచ్చింది.
  • 1898 Fort Smith Arkansas Tornado అనేది సంభవించి అమెరికాలో అనేక ఇళ్ళను నేలమట్టం చేసింది.
  • Portland gale అనేది విజ్రుమ్భించి న్యూ ఇంగ్లాండ్ తీరాన్ని ధ్వంసం చేసింది.ఆ కార్యక్రమంలో SS Portland అనే ఓడను అది ముంచి పారేసింది. 
5) మళ్ళీ 1868 -1869 లలో శనీశ్చరుడు వృశ్చికరాశిలో సంచరిస్తూ తన సప్తమదృష్టితో రోహిణీ నక్షత్రాన్ని వీక్షించాడు.
  • 1868 Arica Earthquake అనేది పెరూ దేశంలో అప్పుడే సంభవించింది.దాని ప్రభావంతో పసిఫిక్ సముద్రంలో సునామీ వచ్చి హవాయ్,జపాన్, న్యూజీలాండ్ వరకూ దాని ప్రభావం చూపింది.
  • 1868 Equador Earthquakes అప్పుడే వచ్చాయి.వాటి ప్రభావంతో దాదాపు 70,000 మంది చనిపోయారు.
  • 1868 Hawaii Earthquake అనేది ఇప్పటివరకూ ఆ ద్వీపాల చరిత్రలోనే అతి పెద్ద భూకంపం.దాని ప్రభావం ఇప్పటికీ అక్కడనుంచి పోలేదంటే అదెంత భయంకరమైన భూకంపమో అర్ధం చేసుకోవచ్చు.
  • 1868 Hayward Earthquake (The Great San Francisco Earthquake) అనేది అప్పుడే వచ్చింది.హేవార్డ్ అనే టౌన్ ధ్వంసమైంది.
  • బ్రిటన్ లో Abergele rail disaster అనే రైల్వే ప్రమాదం అపుడే జరిగింది.అప్పట్లో బ్రిటన్లో అది అతిఘోరమైన రైలు ప్రమాదంగా రికార్డ్ చెయ్యబడింది.
  • 1869 లో The great fire of whitstable అనే భయంకర అగ్ని ప్రమాదం బ్రిటన్లో జరిగింది.
  • న్యూజీలాండ్ లో Christchurch Earthquake అనేది అప్పుడే వచ్చింది.
  • 1868-69 లలో జరిగిన సముద్ర ప్రమాదాలూ రవాణా ప్రమాదాలూ కావాలనే వ్రాయడం లేదు.అవి చాలా ఉన్నాయి.
  • 1868 లో మనదేశంలో అహమదాబాద్ లో భూకంపం వచ్చింది.
  • The great Rajputana famine of 1869 అనే భయంకర కరువు రాజస్థాన్ పంజాబ్ ప్రాంతాలలో తలెత్తి దాదాపు 5 కోట్ల మందిని హింసించింది.
6) మళ్ళీ 1838 -1839 లలో శనీశ్చరుడు వృశ్చికరాశిలో సంచరిస్తూ తన సప్తమదృష్టితో రోహిణీ నక్షత్రాన్ని వీక్షించాడు.
  • రోమానియా లో Vrancea Earthquake అనే భూకంపం వచ్చింది.
  • సముద్ర ప్రమాదాలాలలో రెండు యుద్ధనౌకలు మునిగిపోయాయి.
  • మన దేశంలో Agra famine of 1837-38 అనబడే భయంకరమైన కరువు వచ్చి దాదాపు 80 లక్షల మందిని హింసించింది.వారిలో దాదాపు 8 లక్షలమంది ఆకలితో మాడి చచ్చిపోయారంటే అదెంత భయంకరమైన కరువో అర్ధం చేసుకోవచ్చు.
  • 1839 లో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కళింగపట్నం ఓడరేవులో అతిపెద్ద భయంకర తుపాను విజ్రుమ్భించి దాదాపు 3 లక్షల మందిని కబళించింది.దీనినే 1839 Coringa Cyclone అంటారు.
ఇప్పటి వరకూ చూచిన సంఘటనలు చాలు.

ఇక వెనక్కు పోవడం అనవసరం.ఎందుకంటే,150 సంవత్సరాల పరిధిలో గనుక మనం గమనిస్తే ప్రతి 30 ఏళ్ళకొకసారి ఈ సంఘటనలు మళ్ళీ మళ్ళీ దర్శనం ఇస్తూనే ఉన్నాయి.

ఈ పరిశీలన వల్ల ఇంకొక విషయం స్పష్టంగా దర్శనం ఇస్తున్నది.

రోహిణీ నక్షత్రంలో శనైశ్చరుడు సంచరించినప్పుడు ఎంత విధ్వంసం జరిగిందో సరిగ్గా దానికి ఎదురుగా ఉన్న వృశ్చికరాశిలో సంచరించినప్పుడు కూడా అంతే విధ్వంసం జరిగింది.సప్తమదృష్టి చాలా బలమైనది అని ముందే చెప్పినాను. ఇది దృష్టి అయినా,స్థితి అంత బలంగా పని చేసింది.

సప్తమ దృష్టి పరంగా గమనించదగ్గ కొన్ని అంశాలు:--
  • రేడియో యాక్టివ్ అణుధార్మిక పదార్ధాలు,కెమికల్స్,గ్యాస్ మొదలైన వాటికి సంబంధించిన ప్రమాదాలు వీటిలో అధికంగా జరిగాయి.
  • తర్వాత స్థాయి భూకంపాలది.ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద భూకంపాలు ఆ సమయాలలో వచ్చాయి.
  • ఆ తర్వాత స్థాయి వరదలు తుఫాన్లది.ఈ తుఫాన్లలో ఎక్కువ శాతం అమెరికాలో వచ్చాయి.ఎక్కువగా నష్టపోయింది కూడా ఆ దేశమే.
  • ఆ తర్వాత స్థాయి కరువు కాటకాలది.ఇంతకు ముందు జరిగిన సంఘటనలలో కరువు కాటకాలు లేవు.కానీ శనైశ్చరుడు వృశ్చిక రాశిలో సంచరించిన సమయంలో అవి కనబడ్డాయి.అప్పట్లో మన దేశంలో పరిపాలన ఒక దారీ తెన్నూ లేకుండా ఉన్నది గనుక,ఆహారపధకాలూ ప్లానింగూ లేవు కనుక కరువులు వచ్చాయి.
మళ్ళీ మనకు అతి దగ్గరగా 2015-16 లలో శనీశ్చరుడు వృశ్చికరాశిలో సంచరించ బోతున్నాడు.ఆయా సంఘటనల ఋజువుల దృష్ట్యా, పైన వ్రాసిన వాటిలో కొన్నైనా ఈసారి కూడా ఖచ్చితంగా జరుగుతాయని ఊహించవచ్చు.

(ఇంకా ఉన్నది)