“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

9, మార్చి 2018, శుక్రవారం

Dil Jo Na Keh Saka - Mohammad Rafi


Dil Jo Na Keh Sakaa అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1965 లొ వచ్చిన Bheegi Raat అనే చిత్రంలోనిది. ఇది చాలా మధురమైన నిష్టుర గీతం. తనను ప్రేమించి ఇంకొకరిని చెసుకున్న ప్రియురాలిని ఉద్దేశించి పాడిన పాట ఇది. 1960 దశకంలో ఇలాంటి పాటలు చాలా వచ్చాయి. ఈ గీతంలో ప్రదీప్ కుమార్, మీనాకుమారి, అశోక్ కుమార్ నటించారు.

పాట పాడి చాలా రోజులైందని నా అభిమానులు చాలా గొడవ చేస్తున్నారు. అందుకే ఈ మధుర గీతాన్ని ఈ రోజు విడుదల చేస్తున్నాను. నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి !

Movie:-- Bheegi Raat (1965)
Lyrics:-- Majrooh Sultanpuri
Music:-- Roshan
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------
[Dil jo na kehesaka, vohi raaz-e-dil,
Kehene ki raat aayi..]-2
Dil jo na kehesaka

Naghma sa koi jaag utha badan mein,
Jhankar ki si thar-thari hai tan mein,(2)
Ooo.. mubarak tumhein,
Kisi ki larazti si bahon mein,
Rehne ki raat aayi..
Dil jo na kehesaka.

Touba yeh kisne anjuman sajake,
Tukde kiye hein guncha-e-wafa ke, (2)
Ooo.. uchalon gulon ke tukde,
Ke rangin fizavon mein,
Rehene ki raat aayi..
Dil jo na kehesaka.

Chaliye mubarak, jashn dosti ka,
Daaman tho thama, aapne kisi ka, (2)
Hamen tho khushi yahi hai,
Tumeh bhi kisi ko apna,
Kehene ki raat aayi..
Dil jo na kehesaka.

Saagar utavo, dil ka kisko gam hai,
Aaj dil ki queemat, jaam se bhi kam hai, (2)
Piyo chahe khoon-e-dil ho,
Ke pite pilaate hi,
Rehene ki raat aayi..

Dil jo na kehesaka, vohi raaz-e-dil,
Kehene ki raat aayi..
Dil jo na kehesaka.

Meaning

That which my heart could not utter
this night has come to reveal it now

A melody has opened its eyes in my soul
and a tingling sensation has quivered through my body
Congrats ! for the night has come for you
to spend your time in someone's quivering arms

Oh ! Who has arranged for this gathering !
and destroyed the flower bud of love
Now toss up the petals of that flower recklessly
For the night has come to spend your time 
in this colorful atmosphere

Congrats to you on this night of 
celebration of friendship
You have accepted the embrace of someone else
I am happy that the time has come for you
to call someone else as your own

Rise your wine glass
who cares for a wounded heart?
Tonight, the value of a heart is
less than that of a goblet
Drink the blood of my heart if you want
for the night of endless drinking and partying has come

That which my heart could not utter
this night has come to reveal it now

తెలుగు స్వేచ్చానువాదం

దేన్నయితే నా హృదయం చెప్పలేకపోయిందో
దాన్ని చెప్పే రాత్రి ఇప్పుడొచ్చింది

నా ఆత్మలో ఒక మధురరాగం కళ్ళు తెలుస్తోంది
నా ఒళ్లంతా జలదరింపుతో ఒణుకుతోంది
అందుకో నా శుభాకాంక్షలు !
ఇంకొకరి ఒణుకుతున్న చేతులలో
నీవీ రాత్రిని గడపబోతున్నందుకు

ఈ సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?
ఎవరు లేలేత ప్రేమమొగ్గను నలిపేశారు?
ఆ మొగ్గ రేకులకు నిర్లక్ష్యంగా గాల్లోకి విసిరేయ్
రంగురంగుల వాతావరణంలో నువ్వు గడిపే
ఈ రాత్రి వచ్చిందిగా?

స్నేహాన్ని సత్కరించే ఈ రాత్రికి నా కృతజ్ఞతలు
నువ్వు ఇంకొకరి కౌగిలిని స్వాగతిస్తున్నావు
అలాగే కానీయ్! నాకూ సంతోషంగానే ఉంది
ఇంకొకరిని నీవారుగా నీవు పిలుచుకునే రాత్రి వచ్చినందుకు

నీ మధుపాత్రను పైకెత్తు
ఈ హృదయం గాయపడితే నీకెందుకు?
ఈ రాత్రికి ఒక హృదయం విలువ ఎంతో తెలుసా?
ఒక మధుపాత్ర కంటే తక్కువ !
కావాలంటే నా హృదయపు రక్తాన్ని త్రాగు
ఎందుకంటే, తెంపులేకుండా త్రాగే ఈ రాత్రి వచ్చింది మరి !

దేన్నయితే నా హృదయం చెప్పలేకపోయిందో
దాన్ని చెప్పే రాత్రి ఇప్పుడొచ్చింది....