నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

13, ఏప్రిల్ 2016, బుధవారం

డబ్బుకు లోకం దాసోహం - నాటిక ఫోటోలు

నిన్న రైల్వే వీక్ ఉత్సవాలలో భాగంగా గుంటూర్ రైల్ మహల్ ఆడిటోరియం లో ఒక లఘు నాటికను ప్రదర్శించాము.ఈ నాటిక పేరు ' డబ్బుకు లోకం దాసోహం'. దీనిని నేనే వ్రాసి డైరెక్ట్ చేశాను.ఇదే నాటికను కొన్ని నెలల క్రితం సికింద్రాబాద్ లో ప్రదర్శించాము.దానినే కొద్దిగా మార్చి ఇక్కడ వేశాము.కానీ సికింద్రాబాద్ లో వేసినప్పుడు మాడా వేషం నేనే వేశాను.ఇప్పుడు నా శిష్యుడు ఒకడు ఈ వేషం వెయ్యాలని చాలా ముచ్చట పడుతుంటే అతనికి అవకాశం ఇచ్చి, నేను మ్యారేజ్ బ్యూరో ఓనర్ వేషం వేశాను.

డ్రామా సూపర్ హిట్ అయిందని వేరే చెప్పనవసరం లేదు కదా. దీనిని చూచిన ఒకరిద్దరైతే చాలాబాగుంది 'జబర్దస్త్' లో చెయ్యచ్చుగా అని అడిగారు.ఆ రొచ్చు మనకెందుకని నవ్వేసి ఊరుకున్నాను.

డ్రామా ఫోటోలు ఇక్కడ చూడండి.దీనిని ఫుల్ లెంగ్త్ వీడియో కూడా తీశాము.నిదానంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను.అప్పటివరకూ ఈ ఫోటోలు చూడండి.