“Self service is the best service”

1, ఏప్రిల్ 2016, శుక్రవారం

నువ్వే నాకొద్దు..

ఈ ఎడారి ప్రపంచంలో
నా ఒయాసిస్సు వైన
నువ్వే నన్ను మోసగిస్తే
నీ నీళ్ళే నాకొద్దు

ఈ యుగాల ఆకలిలో
ఎదురైన ఆహారం
అదే విషమైతే
ఈ ఆకలే నాకొద్దు

ఈ మండే ఎండల్లో
చల్లని చెట్టు నీడే
అగ్నిగుండంగా మారితే
ఆ నీడే నాకొద్దు

ఎంతెంతో ఆశగా
నే నమ్మిన హృదయమే
నను కాలరాస్తే
ఆ ఆశే నాకొద్దు

ఎంతగా చెప్పినా
నీ మనసుతో నువ్వు
వినలేకపోతే
నీ మనసే నాకొద్దు

నీకోసం చాచిన
ప్రేమహస్తాన్ని
నువ్వే ఖండిస్తే
నీ ప్రేమే నాకొద్దు

నీ కోసం వేచిన
పిచ్చి హృదయాన్ని
నువ్వే కత్తితో కోస్తే
నువ్వే నాకొద్దు

నీకోసం వెచ్చించిన
కాలం ఆవిరౌతూ
ననుచూచి నవ్వుతుంటే
అసలీ బ్రతుకే నాకొద్దు...