“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, జనవరి 2016, మంగళవారం

Bheegi Bheegi Raat Me - Mehdi Hasan




పాటను పాడుతూ...
సికింద్రాబాద్ లో మూడు రోజులు జరిగిన Sports and Cultural Meet - 2016 సందర్భంగా మొదటి రోజున నేను ఆలపించిన పాట ఇది. అక్కడున్న ఎవ్వరూ ఈ పాటను ఇంతకు ముందు వినలేదన్నారు. అది
బహుమతి అందుకుంటూ...
నిజమే.ఎందుకంటే ఇది మన సినిమా పాట కాదు. పాకిస్తానీ ఫిలిం గీతం. ఈ పాట 'వాదా' అనే పాకిస్తానీ సినిమాలోది. ఈ సినిమా 1957 లో వచ్చింది. అప్పట్లో ఇదొక పెద్ద మ్యూజికల్ హిట్ మూవీ. మీలో కూడా చాలామంది ఈ పాటను ఇప్పటి వరకూ విని ఉండకపోవచ్చు.

గాయకులలో మెహదీ హసన్ కు ఒక ప్రాముఖ్యత ఉన్నది.ఎన్నో తరాలుగా వారి పూర్వీకులు రాజాస్థానంలో గాయకులూ.మంచి సంగీత విద్వాంసులూనూ.సరస్వతీ కటాక్షం ఆయన రక్తంలోనే ఉన్నది.కానీ ఆయన పాతకాలపు గాయకుడు.ఆయన పాటలన్నీ హిందూస్తానీ శాస్త్రీయ రాగాల ఆధారంగానే ఉండేవి. ఆయన పాడిన ఘజల్స్ ను పక్కన ఉంచితే,లలిత సంగీత ఛాయలున్న ఆయన పాటలు మాత్రం సినిమాలలో మాత్రమె మనకు కనిపిస్తాయి.

మెహదీ హసన్ పాడిన రొమాంటిక్ సాంగ్స్ అరుదుగా ఉన్నాయి. నా వరకూ నాకు లలిత భావగీతాలూ, లలిత శృంగారగీతాలే నచ్చుతాయన్న సంగతి మీకందరికీ తెలిసిందే.పైగా ఇది వానపాట.ట్రాక్ కూడా చాలా మంచిది.వానలో తడుస్తున్న ప్రేమికులను వానజల్లు చెళ్ళున కొట్టిన ధ్వని కూడా ఈ ట్రాక్ లో రప్పించారు.

ఉర్దూ అనేది చాలా స్వీట్ లాంగ్వేజ్. అందులోని పదాలు చాలా మధురంగా ఉంటాయి.ఇది ఉర్దూ పాట గనుక భావసౌందర్యానికి శబ్దసౌందర్యం కూడా తోడై అద్భుతమైన ఫీల్ వస్తుంది.ఈ రెంటికీ మధురమైన రాగం కలిస్తే ఇక ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేం.ఈ పాట అలాంటి మరపురాని మధురగీతం. అయితే దీనిని ఆస్వాదించాలంటే భావుకత ఉండాలి.

భావాలలో,మధుర శృంగారభావాన్ని మించినది సృష్టిలో ఇంతవరకూ ఎక్కడా లేదు.ఉపాసనా మార్గాలలో కూడా మధురభావానికే ఎప్పుడూ పెద్దపీట వెయ్యబడుతుంది.

ఎందుకంటే దీనిలో యోగమూ, జ్ఞానమూ, భక్తీ, త్యాగమూ, ప్రేమా, వైరాగ్యమూ,ఆత్మసమర్పణా భావమూ అన్నీ కలసిమెలసి అత్యున్నతమైన స్థాయిలో విహరిస్తూ ఉంటాయి.మధురభావ సాధకుల మదిలో దైవం ఎంతో మనోహరంగా విరాజిల్లుతూ ఎల్లప్పుడూ నెలకొని ఉంటుంది.నేనెప్పుడూ నా శిష్యులతో చెబుతూ ఉంటాను - ప్రేయసీ ప్రియుల మధ్యన ఉన్న మధురమైన భావానికీ భక్తునికీ భగవంతునికీ మధ్య ఉన్న మధురభావానికీ స్థాయిలోనే భేదం తప్ప గుణంలో కాదని.ఒకటి తెలియని వాడు రెండవదానినీ తెలుసుకోలేడు.

అద్భుతమైన ప్రేమను హృదయంలో ఫీల్ అవలేనివాడు ప్రేమస్వరూపుడైన భగవంతుని ఎన్నటికీ చేరుకోలేడు.ఇది సత్యం.

నేనెన్నో పాటలను పాడుతున్నప్పటికీ వాటిలో నా హృదయానికి దగ్గరగా వచ్చే పాటలు చాలా కొన్నే ఉంటాయి.అలాంటి కొన్ని పాటల్లో ఇది నాకు చాలాచాలా ఇష్టమైన మధురగీతం. అందుకే మెహదీ హసన్ పాడిన ఈ మధుర శృంగార భావగీతాన్ని ఈ  Sports and Cultural Meet - 2016 లో నేను పాడాను.

శ్రోతల్లో ఉన్న సంగీతాభిమానులను ఈ పాత పాట చాలా అలరించిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరూ ఈ గీతాన్ని నా గళంలో ఒకసారి కాదు - మీకిష్టమైనన్ని సార్లు వినండి మరి.

Movie :-- Waada (1957)
Lyrics:--Saifuddin Saif
Music:--Rashid Attre
Singer:--Mehdi Hasan
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------
Bheegi bheegi raat me..

Bheegi bheegi raat me - Rimjim kee barsat me
aajaa mere saathi aa -- Pyaar ham kare
Bheegi raat me

Khuda kare ye ghataa - Aur too fikar barse - 2
Me dekhta hi rahoo - Aaj tujhko jee bharke
Dil ka rishta jodke - saari duniya chodke
Aaja mere saathi aa - Pyaar ham kare
Bheegi bheegi raat me

Nazar se choomne do aaj in sitaron ko - 2
Badan se lipte huye shabnam -E-Sharaaron ko
Rimjim ke is raag me - Thandi thandi aag me
Aaja mere saathi aa - Pyaar ham kare
Bheegi bheegi raat me

Hazaar raaton pe bhaaree ye raat ho jaaye - 2
Ke lab khile bhi nahi - Aur baat ho jaaye
Halchal ke armaan me - Masti ke toofaan me
Aaja mere saathi aa - Pyaar ham kare

Bheegi bheegi raat me - Rimjim kee barsat me
aajaa mere saathi aa -- Pyaar ham kare
Bheegi bheegi raat me....

Meaning:--

In this wet night,In this drizzling rain
come to me, my love !
Let us love each other
In this wet night,In this drizzling rain
come to me, my love !

These rainy clouds, made by God
are drenching us profusely
(His grace is descending on us in the form of rain)
I will remain like this till the end of time
watching your beautiful body
Joining your heart to mine
Leaving all your world of worries behind
come to me, my love, in this rainy night !
Let us love each other

These stars, these rain drops
that are sliding down your face
Let me kiss them with my eyes
and feel their softness and hardness
at the same time
In this melody of drizzle
in this cold fire of passion
come to me, my love, in this rainy night !
Let us love each other

Among a thousand nights
tonight will be the grandest one
though our lips may not blossom
Yet,most intimate conversation
will take place between us
In a stir of deepest passion
In a cyclone of intoxication
come to me, my love, in this rainy night !
Let us love each other

In this wet night,In this drizzling rain
come to me, my love !
Let us love each other
In this wet night,In this drizzling rain
come to me, my love !

తెలుగు స్వేచ్చానువాదం

ఈ తడుస్తున్న రాత్రిలో
జల్లుగా పడుతున్న వానలో
నా దగ్గరకు రా ప్రియా !
ప్రేమలో మనం మునిగిపోదాం

దైవం సృష్టించిన ఈ మేఘాలు
మనపైన ఈ వర్షం ద్వారా
తమ అనుగ్రహాన్ని కురిపిస్తున్నాయి
తడిసిన నీ సౌందర్యాన్ని చూస్తూ
ఒక జీవితకాలం ఇలాగే ఉండగలను నేను
ఈ తడుస్తున్న రాత్రిలో
జల్లుగా పడుతున్న వానలో
నా దగ్గరకు రా ప్రియా !
ప్రేమలో మనం మునిగిపోదాం

నీ మోము నుంచి జాలువారుతున్న
ఆ నీటి నక్షత్రాలనూ
వాటి సున్నితత్వాన్నీ
చల్లగా బాధిస్తున్న వాటి కఠోరత్వాన్నీ
నా చూపులతో చుంబించనీ
ఈ వాననీటి సంగీతాన్ని వింటూ
చలచల్లని ఈ అగ్నిలో కాలుతూ
నా దగ్గరకు రా ప్రియా !
ప్రేమలో మనం మునిగిపోదాం

ఈ తడుస్తున్న రాత్రిలో
జల్లుగా పడుతున్న వానలో
నా దగ్గరకు రా ప్రియా !

అనేక వేల రాత్రుల కంటే
నేటి ఈ రాత్రి మరపురానిదిగా మిగలాలి
మనం పెదవులు విప్పి మాట్లాడుకోక పోవచ్చు
కానీ ఎంతో సంభాషణ మన మధ్య జరుగుతుంది
కోరిక చేస్తున్న ఈ అలజడిలో
మత్తుతో నిండిన ఈ జడివానలో
నా దగ్గరకు రా ప్రియా !
ప్రేమలో మనం మునిగిపోదాం

ఈ తడుస్తున్న రాత్రిలో
జల్లుగా పడుతున్న వానలో
నా దగ్గరకు రా ప్రియా !
ప్రేమలో మనం మునిగిపోదాం

ఈ తడుస్తున్న రాత్రిలో
జల్లుగా పడుతున్న ఈ వానలో....