“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, ఆగస్టు 2009, ఆదివారం

శ్రీ కూర్మం-ఒక జ్యోతిష విచిత్రం

మొన్న 19 తేదీన పనిమీద విశాఖ పట్నం వెళ్ళటం జరిగింది. ఆరోజున సాయంత్రం వరకు పోయిన పని ముగించుకొని, చీకటి పడే వేళకు సింహాచల నరసింహ స్వామి దర్శనం చేసుకొని వద్దామని అందరం బయలుదేరాం. మా బృందంలోనేను,మిత్రులు సీనియర్ ఆఫీసర్ కృష్ణ శాస్త్రిగారు, వారి సతీమణి, ఇంకా ఇద్దరు సహచరులు ఉన్నాము. ఆలయంఖాళీగా ఉంది. బహుశా అమావాస్య ప్రభావం ఏమో అనుకున్నాను. ఆలయ E.O ఎదురొచ్చి సరాసరి గర్భ గుడిలోకితీసుకెళ్ళాడు. ఆలయంలో మేము తప్ప ఇంకొక నలుగురు భక్తులు ఉన్నారు అంతే. చక్కని దర్శనం జరిగింది.

దర్శనం అయిన తర్వాత గుడి ఆవరణలో ఉన్న కప్పు స్థంభాన్ని కౌగలించుకొని మనసులో కోరిక కోరుకుంటే అదితీరుతుంది అని ఒకచోట వ్రాశి ఉంది. కోరిక తీరితే మళ్ళీ వచ్చి కప్పం చెల్లించాలి కాబట్టి అది కప్పు స్తంభం అయిందిట. స్థంభం కింద సంతాన గోపాల యంత్రం ప్రతిష్ట చేయబడి ఉంది అని వ్రాశారు. సాధారణంగా సంతానం లేని దంపతులుఅక్కడకు వచ్చి అలా కోరుకుంటే వారికి సంతానం కలుగుతుంది అని పూజారులు చెప్పారు. ఎవరికైనా జరిగిందా అనినేను అడిగితే బోలెడన్ని కేసుల్లో అడ్రసులతో సహా నిదర్శనాలు ఉన్నాయి అని చెప్పారు.

నేను దర్శనం ముగించుకొని అదే రాత్రి బయలుదేరి వెనక్కు వచ్చేసాను. మరుసటి రోజున కృష్ణ శాస్త్రి గారు ఉదయాన్నేలేచి కుటుంబంతో కలిసి అరసవిల్లి సూర్య దేవాలయం చూద్దామని అక్కడికి వెళ్ళారుట. అక్కడ దర్శనం ముగించుకొనిబయలుదేరబోతుంటే డ్రైవరు-అక్కడికి దగ్గరలోనే శ్రీ కూర్మం ఉంది. అదికూడా చూడండి సార్ అని చెప్పగా సరే అని శ్రీకూర్మ క్షేత్రానికి వెళ్లి వచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. ఇక్కడే ఒక విశేషం జరిగింది.

శ్రీ కూర్మం లో పూజారి పూజ చేసిన తరువాత- అయ్యా మీ దంపతులలో ఒక్కరికైనా శని దశ గానీ ఏలినాటి శని గానీజరుగుతూ ఉంటుంది. లేకుంటే మీరు ఇక్కడికి రాలేరు. అరసవిల్లి వచ్చిన వారిలో ఎవరికైనా రెంటిలో ఒక్కటిజరుగుతున్నా శ్రీ కూర్మనాధునిచేత ఆకర్శింప బడి ఇక్కడికి వస్తారు. వింత నేను చాలా సార్లు గమనించాను. చూచుకోండి అని చెప్పాడుట. శాస్త్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పగా నేను వెంటనే ఆయన జాతకం చూచాను. నిజంగానేశాస్త్రి గారి జాతకంలో శని దశ చివరికి వచ్చింది. కొన్నాళ్ళలో అయిపోబోతున్నది. వారి శ్రీమతి గారికి ఏలినాటి శనిజరుగుతున్నది. నేను విషయం చెబితే కృష్ణ శాస్త్రి గారు ఆశ్చర్య పడ్డారు. నాకూ ఆశ్చర్యం కలిగింది. నేనుఅక్కడివరకూ వెళ్లి కూడా వెనక్కు వచ్చాను. కాని వారికి శని దశ జరుగుతూ ఉండటంతో అనుకోకుండా వెళ్లి దర్శనంచేసుకొని వచ్చారు. ఇలాంటి విచిత్రాలు చాలా ఉంటాయి. వీటి వెనుక ఉన్న సంబంధాలు మనకు అర్థం కావు.

శ్రీ కూర్మం క్షేత్రం లో విశేషాలు:
>దశావతారాలలో అన్నింటిలో దుష్ట శిక్షణ జరిగింది. కాని ఒక్క కూర్మావతారంలో అది లేదు. ఒక మంచి పనికిసహాయం మాత్రం చెయ్యటానికి అవతారం వచ్చింది.
>శని బాధలు పోగొట్టటంలో శ్రీ కూర్మ నాథుడు చాలా మహత్యాలు చూపిస్తాడు. ఎందుకనగా ఆయన శని గ్రహానికిఅధిష్టాన దేవత అని పూజారులు చెప్పారు.
>భారత దేశం మొత్తం మీద కూర్మావతారానికి ఉన్నా ఏకైక ఆలయం శ్రీ కూర్మం. ఇది మన రాష్ట్రంలోని శ్రీకాకుళంజిల్లాలోని ప్రాచీన దేవాలయం.
>ఇక్కడ ఉన్న కొలనులో పిండ ప్రదానాలు చేస్తే పిండాలు వెంటనే గడ్డలు కట్టి రాళ్ళు గా మారి కొలను అడుగుకుచేరుకోవటం కళ్ళారా చూడవచ్చు. బహుశా నీటిలో Calcium లేదా Flourine లు ఎక్కువగా ఉండటం వల్లరసాయనిక చర్యల వల్ల ఇలా జరుగుతుందో ఏమిటో మరి. ఎవరైనా పరిశోధన చేసి చూస్తె గాని తెలియదు.
>ఇక్కడ దేవాలయానికి ముందు వెనుక కూడా ధ్వజ స్థంబాలు ఉన్నాయి. కారణం ఏమనగా, శ్రీ కూర్మ నాథుడు దేవాలయం వెనుక వైపు చూస్తూ ఉంటాడు కనుక అటు కూడా ఒక ధ్వజ స్తంభం ఉన్నది అని చెప్పారు.
>ఇక్కడి విగ్రహం మనిషి చేసినది కాదు. స్వతహాగా తాబేలు ఆకారంలో ఏర్పడిన ఫాస్సిల్. ఇది అతి మహిమాన్వితమైన సాలగ్రామం గా చెబుతారు. మధ్వ సాంప్రదాయ వైష్ణవులు ఇక్కడ పూజాదికాలు చేస్తుంటారు.
>ఇంకా నాగరికత సోకి పాడు చెయ్యని వాతావరణం మధ్యలో ప్రశాంతంగా ఉన్న దేవాలయం.

దగ్గరిలో ఉన్నవారు వీలైతే వెళ్లి దర్శించుకోవలసిన మంచి పురాతనమైన పుణ్య క్షేత్రం ఇది.