“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

12, ఆగస్టు 2009, బుధవారం

వివేకానందస్వామి జాతకం-4

ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టి చూపే వర్గ చక్రం విమ్శాంశ. అంటేఇరవయ్యో వర్గ చక్రం. దానిలో ఏ ఏ విశేషాలు ఉన్నవోచూద్దాం. ఉడుంపట్టు వంటి పట్టుదలను చూపే మకర లగ్నం విమ్శాంశ లగ్నం అయ్యింది. అంటే పట్టుదలతో సాధన చేసి తన గమ్యాన్ని చేరుతాడు అని తెలుస్తున్నది. స్వామికి పద్దెనిమిది పందొమ్మిది ఏళ్ళ వయసులో శ్రీ రామకృష్ణునితో పరిచయం కలిగింది. ఇరవై మూడో ఏట ఆయనకునిర్వికల్ప సమాధి కలిగింది. అంటే మూడు నాలుగేళ్లసాధనతో ఆయన మామూలు మనుషులకు అనేక జన్మలు పట్టే సాధనను పూర్తి చెయ్య గలిగాడు. అంటే ఎంతటిపట్టుదలతో సాధన చేసాడో అర్థం చేసుకోవచ్చు. పరమ స్వతంత్రం అనే మోక్షగమ్యాన్ని చేరాలంటే ఎటువంటి శ్రద్ధ అవసరమో ఆయన మాటలలోనేవిందాము. "Live for an ideal, and that one ideal alone. Let it be so great, so strong, that there may be nothing else left in the mind; no place for anything else, no time for anything else".

"Take up one idea. Make that one idea your life—think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body, be full of that idea, and just leave every other idea alone. This is the way to success, and this is the way great spiritual giants are produced."

ఇక పోతే లగ్నాధిపతి అయిన శని సహజంగా ఆధ్యాత్మిక చింతనకూ, అంతర్ముఖత్వానికీ, ఏకాంత సాధనకూ కారకుడు. ఆయన మంత్ర స్థానం అయిన వృషభంలో ఉండి చంద్రునీ, లాభ స్థానం లోని ధర్మ స్థానాధిపతి అయిన బుధునీ, వాక్స్థానం లో ఉన్న రాహు కేతువులనూ చూస్తున్నాడు. కనుక చంద్రుని వల్ల ఆధ్యాత్మిక మైన మనస్సు, ధర్మ యుతమైనబుద్ధి, వాక్ స్థానంలో ఉన్న రాహు కేతువుల వల్ల, అనేక విషయాలపైన అనర్గళమైన లోతైన వాగ్ధాటి కలిగాయి. స్వామికి ఆధ్యాత్మిక విషయాలే కాక ప్రపంచ చరిత్ర, కళలు, మతాలు, తత్వ శాస్త్రాలు, సంస్కృతుల పైన అధికారిక మైనజ్ఞానం ఉండేది. దానికి కారణం ఈ గ్రహ స్తితేను. అష్టమ మోక్ష త్రికోణం అయిన సింహ రాశిలో కుజ శుక్రుల స్థితి వల్లఆయనలోని కామ వాసనలు పూర్తిగా నిర్మూలింప బడినాయి అని తెలుస్తున్నది. అష్టమ అధిపతి అయిన రవి ఉచ్ఛస్థితికి దగ్గరిగా ఉండి నవమ భావాన్ని చూస్తున్నాడు. ఇది ఆయనకు గల బలీయమైన ఆత్మ జ్ఞానాన్ని చూపుతున్నది. నవమాదిపతి యగు బుధుడు లాభ స్థానం లోఉండటం తో ఆయనకు దేవతా సాక్షాత్కారము, ధార్మిక జ్ఞానములు తేలికగా కలిగాయి అని చెప్ప వచ్చు.ఆత్మకారకుడగు రవి తృతీయ స్థానములో ఉండుట తో, అతి బలీయమైన ఆధ్యాత్మిక ప్రసంగాలు చెయ్య గలడనితెలుస్తున్నది. ఇదీ విమ్శాంశ చక్రం యొక్క విశ్లేషణ. ఇప్పుడు దశా విశేషాలు చూద్దాము. స్వామి జన్మించినది హస్తా నక్షత్రం మూడవ పాదం కనుక ఆయన పుట్టినపుడు చంద్ర మహా దశ జరుగుతున్నది. చంద్ర/శని/రాహు దశ జరుగుతున్నది. నవమ స్థానంలో చంద్ర శనుల యుతి మరియు ద్వాదశ స్థానంలో రాహు స్థితిగమనిస్తే ఈయన సామాన్య సాధకుడు కాదు, పుట్టుక తోనే ఒక మహా పురుషుడనే విషయం తెలుస్తూంది. బాలుడిగా స్వామి జీవితం కుజ దశలో జరిగింది. అందుకే ఎప్పుడూ చురుకుగా ఉండే అల్లరి పిల్లవాడు. కాని మంత్రస్థానంలో కుజ స్థితితో అతి పసి తనంలోనే శరీర స్పృహను దాటి పోయే అగాధ ధ్యానంలో కూర్చునేవాడు. ఆయనకుపసి తనం నుంచి నిద్రకు ఉపక్రమించినపుడు కళ్లు మూసుకుంటే నుదురు ప్రాంతం లో గుండ్రని బంతి వంటి వెలుగుకనిపించేది. ఆ వెలుగులో మునిగి నిద్ర పోయేవాడు. అది అందరికీ సహజం అనుకునేవాడు. అందుకనే శ్రీ రామకృష్ణుడుఒకనాడు నరేంద్రుని " నీకు భ్రూ మధ్యంలో వెలుగు కనిపిస్తుంది కదా?" అని అడిగినపుడు, ఆశ్చర్యపోయి, "అవును, అందులో వింత ఏముంది? అందరికీ కనిపించదా?" అని అమాయకంగా ప్రశ్నిస్తాడు. ఆయనకు పసి తనం నుంచే ఆజ్ఞాచక్రం జాగృతం చెంది ఉండేది అనటానికి ఇదే నిదర్శనం. ఇట్టి స్థితి రావాలంటే మామూలు మనుషులకు అనేక జన్మలసాధన అవసరం అవుతుంది. మామూలు మనుషులకు నిద్రా సమయంలో అంతచ్చేతన (Unconscious) మేలుకొంటుంది. కనుక మనము చీకటిలోతుల్లోకి జారిపోయి పిచ్చి పిచ్చి కలలు కంటాము. కాని స్వామి వంటి ఆజన్మ మహాయోగులు నిద్రలో ఊర్ధ్వ లోకాలతోసంధానితులై, వెలుగులో నిద్రిస్తారు. వారికి కలలు రావు. ఇదే మనకూ వారికీ తేడా. తరువాత స్వామి చిన్న తనం అంతా రాహు దశలో గడిచింది. అందుకనే అనేక మతాలు, తత్వ శాస్త్రాలు మొదలైనవిషయాలు తెలుసుకున్నాడు. అంతే కాదు, రాహు దశలోనే ఆయన ఒకనాడు తన గదిలో ధ్యానంలో ఉన్నపుడు, హఠాత్తుగా భగవాన్ బుద్ధుడు తేజోమయ శరీరంతో ఆయన ఎదురుగా శరీరంతో ప్రత్యక్షం అయ్యాడు. జ్యోతిర్విద్యలో రాహువు, బుద్ధ మతానికి ఇంకా ఇతర మతాలకు కారకుడనే విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అప్పుడు రాహు దశలో నే ఎందుకు ఆయనకు బుద్ధ దర్శనం కలిగింది అనే విషయం అర్థం అవుతుంది. అంతకు ముందే ఆయనలో జనించిన తీవ్ర తృష్ణతో, అనేకమంది సాధకులను, జ్ఞానులనబడే వారిని కలిశి దేవుని ఉనికినిజమేనా అని అడుగుతూ వచ్చాడు. దేవేంద్రనాథ్ టాగూర్ గొప్ప తపస్వి. ఆయన తన పడవలో గంగా నదిలో రోజంతాఉంటూ అందులోనే ధ్యానంలో ఉండేవాడు. ఒకనాడు నరేంద్రుడు గంగా నదిని ఈదుకుంటూ ఆ పడవ వద్దకు వెళ్లి దానినిఎక్కి, దేవేంద్రనాధ్ ను " మీరు దేవుని చూచారా" అని ప్రశ్నిస్తాడు. ఆయన దానికి జవాబు చెప్పకుండా, నరేంద్రుని తేరిపార చూచి " నీవి యోగులకు ఉండే నేత్రాలు. ఒకనాటికి నీ గమ్యాన్ని తప్పక చేరగలవు" అని మాత్రం చెబుతాడు. నరేంద్రుని అన్వేషణ శ్రీ రామకృష్ణుని దర్శనంతో పరి సమాప్తి అయ్యింది. దేవుని నేను చూచాను. నీకు చూపగలను అని ఆయన అధికారికంగా జవాబిస్తాడు. అంతే కాదు తానన్న మాటను రుజువు చేస్తూ, నరేంద్రుని సున్నితంగా హృదయ స్థానంలో తాకటం ద్వారా అతని మనస్సును ఇంద్రియాతీత, ప్రపంచాతీతo, సమాధి స్థితిలోకి పంపి సంభ్రమానికి గురి చేస్తాడు. శ్రీ రామకృష్ణుని దివ్య స్పర్శ తో, తన కళ్ళ ముందే సమస్త ప్రపంచం అదృశ్యం కావటం, చివరికి నేను అనే భావన కూడా ఎక్కడో లయం అయ్యి అనిర్వచనీయమైన స్థితిని నరేంద్రుడు అందుకొని నిర్ఘాంత పోతాడు. ఇదే విషయాన్ని స్వామి అభేదానంద తరువాత శ్రీ రామకృష్ణ స్తోత్రంలో " సంస్పర్శ మాత్రేణ నృణాం సమాధిం విహాయ సద్యో భువి రామకృష్ణ" అంటూ శ్రీ రామకృష్ణునికి ఉన్న అమానుష శక్తిని గురించి వ్రాశాడు. ఆయన కు శ్రీరామకృష్ణుని మొదటగా కలిశే మహాదృష్టం 1881 నవంబర్ లో కలిగింది. అప్పుడు ఆయనకు రాహు/ శని/రాహు జరుగుతున్నది. రాహువు, శనుల ప్రభావం ఇక్కడ స్పష్టం గా చూడ వచ్చు. రాహు శనుల కలయిక కాళికా మాతనుసూచిస్తుంది. కనుక జగన్మాత యొక్క అవతారం అయిన శ్రీ రామకృష్ణుని ఆ దశలో కలవటం జరిగింది. 1886 ఆగస్టు 15 రాత్రి శ్రీ రామకృష్ణుడు దేహాన్ని వదలి పెట్టి తన దివ్య ధామం చేరుకున్నాడు. మన దేశానికి అదే తేదీన స్వతంత్రం రావటం గమనించండి. ఆరోజు న రాహు/శుక్ర/రవి జరుగుతున్నది. రాహువు వ్యయంలోఉండటము, రవి- గురువును సూచించే నవమాదిపతి కావటమూ, శుక్రుడు నవమాత్ మారక స్థానం అయిన కన్యకు అధిపతి అయిన బుదునితో కలిశి లగ్నాత్ ద్వితీయ మారక స్థానంలో ఉండటం, నవమాత్ ఇది రోగ స్థానం అయిన షష్ఠం కావటం చూడవచ్చు. అక్కడ నుంచి 1893 లో రాహు దశ చివరి వరకూ పరివ్రాజక సన్యాసి గా దేశమంతాతిరుగుతూ దేశ ప్రజల స్థితిని ఆకళింపు చేసుకున్త్o గడిపాడు. రాహు దశ ఆయనను దేశమంతా తిప్పటమే కాక, విభిన్న మతాలు, జాతులు, వారి చరిత్రలు, సంస్కృతులపైన లోతైన విషయ పరిజ్ఞానాన్ని ఇచ్చింది. అందుకనే స్వామితో కొద్దిసేపు మాట్లాడి, ఆయన అంటే ఆకర్షితులు కాని వారు లేరు. 1893 లో గురు దశ ప్రారంభం కావటం తోనే కన్యాకుమారిలో మూడు రోజులపాటు సముద్రంలో ఉన్న రాళ్ళ గుట్టపైనధ్యాన సమాధిలో గడిపి తనకు కలిగిన శ్రీ రామకృష్ణుని దర్శనం తో విదేశాలకు పోయి భారత దేశపు మతం అయినసనాతన ధర్మాన్ని అక్కడ జరుగుతున్న సర్వ మత మహా సభలలో ప్రచారం చెయ్యాలి అనే నిశ్చయానికి వచ్చాడు. ఇంకొక్క విషయం-- ఆయన మొట్ట మొదటి సారిగా ఇచ్చిన పబ్లిక్ ఉపన్యాసం మన ఆంద్ర దేశంలోనే, అదికూడా సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజీలో అని తెలిస్తే ఆంధ్రులుగా మనకు గర్వ కారణం కాదూ? సంఘటన 1893 సంవత్సరంలో జరిగింది. కాని మన తెలుగు వారికి ఉన్న సహజ మైన తెగులు తో, దాన్ని నిర్లక్ష్యం గా తీసుకొని ఊరుకున్నాం. అదేబెంగాలీ సోదరులైతే ఆ పవిత్ర వేదికను ఇప్పటికి ఒక స్మారక చిహ్నం గా మార్చి ఉండేవారు. 1893 మే ముప్పై ఒకటిన బాంబే నుంచి ఓడలో బయలుదేరి కెనడాలోని వాంకోవర్ లో దిగి అక్కణ్ణించి చికాగో వచ్చి అష్టకష్టాలు పడుతూ చివరకు ఎలాగైతేనేమి విశ్వ మత మహాసభలో ఇచ్చిన ఒక్క ఉపన్యాసంతో సెలెబ్రిటీ గా మారిపోయితరువాత తూర్పు తీరం లో అంతటా ఉపన్యాసాలు ఇస్తూ, హార్వర్డ్ యూనివర్సిటీ లో ప్రసంగించి, తరువాత వేదాంతసొసైటీ అఫ్ న్యూ యార్క్ ను స్థాపించటంతో గురువు/గురువు దశ 1894 తో ముగిసింది. లాభ స్థానంలో బలంగాఎ ఉన్నటువంటి లగ్నాధిపతి గురు దశ ప్రారంభం కావటం తోనే ఎలా జీవితం లో మార్పులువచ్చాయో చూడండి. ఆ గురువు పంచమాదిపతి తనకు మిత్రుడూ అయిన కుజుని చిత్తా నక్షత్రం లో ఉంటూ, ఆ కుజునిచేత సప్తమ ద్రుష్టి తో బలం గా చూడ బడుతున్నాడు గమనించండి. 1895 లో గురువులో శని దశ మొదలు కావటం తోనే న్యూ యార్క్, న్యూ హెంప్ షైర్a లలో వేదాంత క్లాసులు మొదలుపెట్టటం జరిగింది. ఈ సమయం లోనే స్వామి జీవితంలో ఇంకొక ముఖ్య సంఘటన జరిగింది. న్యూ యార్క్ లో గలసెయింట్ లారెన్స్ నదీ తీరంలో గల థౌజండ్ ఐలాండ్ పార్కులో స్వామి తన క్లాసులు ఇస్తూ ఉన్నప్పుడు ఆయనకుఅమెరికాలో కూడా నిర్వికల్పn సమాధి మరొక్క సారి కలిగింది. ఒకరోజు విశాల మైన పచ్చిక బయళ్ళలో నదీ తీరం వెంట స్వామి ధ్యాన మగ్నుడై నిర్వికల్ప సమాధిని అందుకున్నాడు. ఎంతకీ ఆయన ఇంటికి తిరిగి రాక పోయేసరికి వెతుకుతూ ఆయన అమెరికన్ శిష్యులు వచ్చి చూచి, శిలా విగ్రహం లాబాహ్య స్పృహ లేనిa ఆయన్ను ఎంత కుదిపినా స్పృహలోకి రాకపోవటంతో, శరీరం చల్లగా ఉండటం, గుండె స్పందన మరియు నాడి లేక పోవటంతో, స్వామి మరణించాడని తలచి బిగ్గరగా ఏడవసాగారు. చాలా సేపటికి నిదానం గా జీవంతిరిగి వస్తున్న చిహ్నాలు ఆయన శరీరంలో కలిగాయి. కళ్లు తెరిచిన స్వామి చిరునవ్వు నవ్వుతూ అటువంటిy పరిస్తితిఎదురైతే అలా మనిషిని కుదప రాదనీ చెబుతూ ఏమి చెయ్యాలో వివరిస్తాడు. ఈ సంఘటన గురువులో/ శని దశలోజరిగింది. తరువాత పారిస్ లండన్ లలో ఉపన్యాసాలు ఇస్తూ, హార్వర్డ్ విశ్వ విద్యాలయం లో ఉపన్యాసం ఇచ్చినపుడు వారుముగ్ధులై విశ్వ విద్యాలయం లోని Eastern Philosophy Chair ను ఆయనకు ఇవ్వ జూపుతారు. ఆ పదవిని సున్నితంగా తిరస్కరించిన స్వామి, ఆక్స్ ఫోర్డ్ విశ్వ విద్యాలయం లో ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ను కలుసుకుంటాడు. స్వామి దివ్యమైన వ్యక్తిత్వానికి మాక్స్ ముల్లర్ ఆశ్చర్యపోయి ప్రణామాలు అర్పిస్తాడు. ఈ విధంగా జగన్మాత అనుగ్రహం తో ప్రపంచ జైత్ర యాత్ర ముగించుకొని 1897 జనవరి 15 న భారత మాత గర్వించదగిన ముద్దుబిడ్డ గా తిరిగి భారత దేశంలో అడుగు పెడతాడు. చేతిలో చిల్లి గవ్వ లేని బికారిగా దేశాన్ని వదలిన స్వామి అమెరికాయూరోప్ ఖండాలను పాదాక్రాంతం చేసుకొని, ప్రపంచ ప్రఖ్యాత తాత్వికుల చేత నీరాజనాలందుకొని, తర తరాల ఋషిఋణం తీర్చుకొని, భారత దేశాన్ని పునరుజ్జీవన పథంలో నిలిపి తిరిగి తన దేశానికి వస్తాడు. ఈ సంఘటనను గురించి వొళ్లు గగుర్పొడిచే మాటలలో మహా యోగి అరవిందులు ఏమన్నారో చూడండి. "The going forth of Vivekananda, marked out by the Master as the heroic soul destined to take the world between his two hands and change it, was the first visible sign to the world that India was awake not only to survive but to conquer." 1897 జనవరి లో కొలంబో చేరి అక్కడనుంచి మద్రాసు మీదుగా ప్రయాణిస్తూ ఫిబ్రవరి లో కలకత్తా చేరేవరకూ స్వామి దారిలో ఇచ్చిన దివ్యమైన ఉపన్యాసాలు "Lectures from Colombo to Almora" అనే పుస్తకంగా వచ్చాయి. ఆదివ్యమైన భాషనలలో స్వామి మన మతాన్ని గురించి వివరంగా ఉపన్యసించట కాక, మన దేశం తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకోవాలంటే చేయవలసిన పనులు, మార్చుకోవలసిన పద్ధతులు వివరంగా చెబుతాడు. ఆఉపన్యాసాలు చదివితే ఒళ్ళు పులకరించని మనిషి ఉంటాడంటే నేను నమ్మను. తరువాత వచ్చిన గాంధీ మొదలిన దేశ నాయకులూ, అంబేద్కర్ మొదలైన దళిత నాయకులూ, సంస్కర్తలూ వారికితెలిసో తెలియకో ఆభావాలలో కొంత భాగాన్ని మాత్రమె అనుసరించ గలిగారు. పూర్తిగా అనుసరించి ఉంటే ఈ నాడుమన దేశ పరిస్థితి భిన్నం గా ఉండేది. ఇక స్వతంత్రం వచ్చిన తరువాత వచ్చిన చీడపురుగు నాయకులు, భ్రస్టు పట్టినవారి స్వార్థ పూరిత విధానాలతో దేశాన్ని అధోగతికి తీసుకెళుతున్నారు. ఎంతటి మహనీయులు మనలో జన్మిస్తేనేమి?. సాక్షాత్తూ భగవంతుడే మన మధ్య ఎన్నో సార్లు జన్మించినా మనలో చలనం రాదుకదా? మన స్వార్థ పరతకు అంతులేదేమో అనిపిస్తుంది. 1897 మే ఒకటిన కలకత్తాలో శ్రీ రామకృష్ణా మిషన్ ను స్థాపించాడు. శ్రీ రామకృష్ణుడు యుగ యుగాల భారతీయఆత్మకు ప్రతిరూపం. ప్రాచీన ఋషుల అవతారాల సమస్త భావ రాశి ఆయనలో రూపు దాల్చి ఉంది. వేల సంవత్సరాలభారతీయుల సాధనా ఫలితంగా అట్టి దివ్య అవతారం మన మధ్య కలిగింది. అట్టి మహనీయుని ఆదర్శాలనుకొనసాగించే ఒక సంస్థ అవసరం అని తలచి దానికి ఒక రూపాన్నిచ్చాడు. 1898 ఆగస్టు లో తన విదేశీ శిష్యులతోఅమరనాథ యాత్ర చేసాడు. అమర్నాథ్ గుహలో స్వామికి అద్భుతమైన శివ దర్శనం కలిగింది. అక్కడే స్వామికి ఇచ్చామరణ వరం ( అనుకున్నపుడు శరీరాన్ని వదలి పెట్ట గలిగే శక్తి) శివానుగ్రహంతో వచ్చింది. అక్కడ కలిగిన శివ దర్శనంతో స్వామి తన్మయుడై తరువాత కొన్ని నెలలు పూర్తిగా అంతర్ముఖుడిగా ఉండిపోయాడు. ఆ సమయంలో స్వామి సమక్షంలో ఊరకే కూర్చున్నవారికి మనసు తేలికగా ఊర్ధ్వ భూమికలకు ఎగసి దుర్లభమైన బ్రహ్మ సాక్షాత్కారం దానంతట అదే కలిగేది అని ఆయన సాన్నిధ్యాన్ని ఆరోజులలో పొందిన అదృష్టవంతులైన స్వామీజీలు వ్రాశారు. 1899 మార్చి నెలలో స్వామి హిమాలయాలలోని కనఖాల్ లో అద్వైత ఆశ్రమాన్ని స్థాపనచేసాడు.అక్కడ పూర్తిగా అద్వైతమే అనుసరణీయం అని చెబుతూ, తన గురుదేవుడైన శ్రీ రామకృష్ణుని పూజఆరాధనలను కూడా అక్కడ నిషేధించాడు. స్వామి ఆదేశంతో ఈనాటికీ అద్వైత ఆశ్రమం లో ఎటువంటి పూజలు, ఆరాధనలూ ఉండవు. ఏ దేవీ దేవతల విగ్రహాలు కనిపించవు. పూర్తిగా శుద్ధ అద్వైతాన్నే అక్కడ పాటించటం జరుగుతుంది. నిరాకార నిశ్చల అద్వయము అఖండము కేవల చిత్స్వరూపము అయిన పరబ్రహ్మ తత్వాన్నే అక్కడ ఉపాసించటం ఈనాటికీ జరుగుతున్నది.