“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, ఆగస్టు 2009, బుధవారం

వర్షం కురిపించటం ఎలా?

పంచ ప్రాణాలు గా మన ప్రాచీన యోగ శాస్త్రాలలో చెప్ప బడినవె బాహ్యంగా ప్రకృతిలో పంచ భూతములు గా ఉన్నాయి. కనుక యోగి తన శరీరంలో ఉన్నటువంటి పంచ భూతములను వాటి వాటి సహజ అమరికలోకి తేగలిగితే దాని ప్రభావంఅతని చుట్టూ ఉన్న పంచ భూతముల మీద ఉంటుంది. అతని చుట్టూ ఉన్న వాతావరణం సహజ అమరికలోనికిమారుతుంది.

మన మానసిక ఆలోచనలు, ప్రాణిక స్థితులు మన చుట్టూ ఉన్న వాతావరణం మీద ప్రభావం చూపుతాయి. అలాగేవాతావరణం కూడా మన మనస్సు మీద ప్రభావం చూపుతుంది. కొంత సున్నిత మనస్సు ఉన్న వారికి ఇది తేలికగాఅర్థం అవుతుంది.ఇటువంటి Sensitivity ఉన్నవారు కొన్ని కొన్ని ప్రదేశాలలోని స్పందనలను తేలికగా "రుచి
చూచి" తెలుసుకోగలుగుతారు. ప్రదేశాలలో ఉన్న స్పందనలలోని తేడా తెలియాలంటే ఒక చిన్న ప్రయోగం చెయ్య వచ్చు. కిక్కిరిసి ఉన్న చవకబారు "బార్" లోకి వెళ్లి అక్కడి వాతావరణాన్ని "ఫీల్" అవ్వండి. అలాగే విశాల ప్రకృతిలో కొలువైవున్న ఒక ప్రశాంత దేవాలయానికి వెళ్లి అక్కడి వాతావరణాన్ని "ఫీల్" అవ్వండి. తేడా మనకే తెలుస్తూంది.

ఎప్పుడూ అరుచుకుంటూ, తిట్టుకుంటూ ఒకరంటే ఒకరికి పడని కుటుంబ సభ్యులు ఏళ్ళ తరబడి నివసించిన ఇంటిలోకివెళ్లితే ఆ వాతావరణల స్పందన లకు కాసేపు కూడా ఉండలేని పరిస్థితి కలుగుతుంది. అలాగే ప్రేమ మయ వాతావరణం
తో ఎప్పుడూ చక్కని హాస్యపూరిత మాటలతో ఉల్లాసంగా జీవితాన్ని గడిపే కుటుంబాలు ఉన్నటువంటి ఇళ్ళ యొక్కస్పందనలు భిన్నం గా ఉంటాయి.

మన ఆలోచనలు, ప్రాణిక స్థితి మన చుట్టూ ఒక రకమైన వాతావరణాన్ని కలుగజేస్తుంది. దాన్నే తెజోవలయం (aura) అంటారు. దీన్ని ధ్యానాభ్యాసంలో కొంత అనుభవం ఉన్నవారు ఫీల్ అవగలుగుతారు. ఇంకొంత పురోగమించినసాధకులు ఈ వలయాన్ని చూడ గలుగుతారు. మనిషికీ మనిషికీ ఉన్న తేజో వలయాలు పరస్పరం కలవకపోతే వారికిఅకారణ మానసిక ఎడం ఏర్పడుతుంది. అందుకే కొందరిని చూస్తె చెలిమి చేయాలని పిస్తుంది. కొందరిని చూస్తె దూరంపారిపోవాలనిపిస్తుంది. కొందరిని చూస్తె నిష్కారణంగా తన్నాలనిపిస్తుంది. కొందరిని చూస్తె చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. దీనికి ప్రత్యెక కారణాలు ఏమీ కనిపించవు.

మొత్తానికి చెప్పేదేమంటే మనిషి యొక్క మానసిక ప్రాణిక స్థితి, బయటి వాతావరణం ఈ రెండూ ఒకదానినొకటిపరస్పరం ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రాచీన మహర్షుల ఆశ్రమాలలో విరోధులైన జంతువులు కూడా చెలిమిగాఉండేవని చెబుతారు. పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో "అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధె వైరత్యాగః." అనిచెబుతూ ఎవరైతే ఆహింసలో చక్కగా ప్రతిష్టితులై ఉంటారో వారి సమక్షంలో వైరం ఉండదు. అంటాడు. అంటే వారి ప్రాణతేజో వలయం మొత్తం ఈ అహింసా తరంగాలతో నిండి ఉండి, తద్వారా ఆ ఆవరణలోకి వచ్చిన వారిని అది ప్రభావితంచేసి వారి మనసులలోనుంచి వైర భావాలు అదృశ్యం అయ్యేట్టు చేస్తుంది. బుద్ధుడు తన మీదికి చంపాలని వచ్చినమత్తెక్కిన మదపుటేనుగును మైత్రీ భావనా తరంగాలతో శాంత పరచి తన కాళ్ళ వద్ద కుక్క పిల్లలా పడుకునేటట్లుచేశాడు.

శ్రీ రామకృష్ణుని వల్ల విద్యా వంతులైన యువకులు వైరాగ్య భావ పూరితులై సంసారాన్ని వదలి సన్యాసులు గామారుతున్నారని కోపించిన ఒక శిష్యుని తండ్రి, శ్రీ రామకృష్ణుని చంపమని మన్మధ్ అనే ఒక కిరాయి హంతకునినియోగిస్తాడు. ఆ రోజు శ్రీ రామకృష్ణుడు ఒక శిష్యుని ఇంటికి వస్తాడని ముందుగానే తెలిసిన మన్మధ్ అక్కడ కాపుకాస్తాడు. శ్రీ రామకృష్ణుడు గుర్రపు బండి లోనుంచి దిగటం తోనే దాడి చేసి ఆయన్ను హత మార్చాలని మన్మధ్ పధకంవేసి అక్కడే జనం లో నిలబడి ఉంటాడు. చూస్తునడగానే శ్రీ రామకృష్ణుడు వస్తున్నా గుర్రపు బండి వచ్చి ఆగింది. శ్రీరామకృష్ణుడు బండి లోనుంచి దిగుతూ మన్మధ్ వైపు ఒక చూపు చూచి చిరునవ్వు నవ్వుతాడు. వెంటనే మన్మధ్ఒళ్ళు తెలీక నేలమీద పడి ఏడుస్తూ శ్రీ రామకృష్ణుని కాళ్ళు పట్టుకొని వదలటం లేదు. అక్కడి వారు ఏమైందో తెలియకఆశ్చర్య పోతారు. శ్రీ రామకృష్ణుడు కూడా ఏమీ జరగనట్లే ఉంటాడు. శ్రీ రామకృష్ణుని రూపంలో ఈ లోకానికి ఏ మహా శక్తిఅవతరించిందో ఆయనకే తెలుసు, కొద్ది మంది అంతరంగ శిష్యులకు తెలుసు.

ఆ రోజునుంచి మన్మధ్ లో అద్భుత మార్పు కలిగింది. క్రూరుడైన హంతకుడు మాయమై అతని స్థానంలో వైరాగ్యపూరితుడైన ఆలోచనా పరుడు జన్మించాడు. సంసార జీవితాన్ని త్యజించి ధ్యాన సాధనలో మునిగి చివరకు ఒక మహాయోగివలె శరీరాన్ని త్యజించాడు. ఈ సంఘటనా జరిగిన తరువాత కొన్నేళ్ళకు శ్రీ రామకృష్ణుని శిష్యుడొకాయనమన్మధ్ ఎలా ఉన్నాడో చూద్దామని అతన్ని వెతుక్కుంటూ వెళతాడు. మన్మధ్ ఒంటి మీద స్పృహ లేని స్థితిలోసూర్యుని వైపు తదేకంగా చూస్తూ ధారలుగా కన్నీరు కారుతుండగా శ్రీ రామకృష్ణుని నామాన్ని స్మరిస్తూ కనిపిస్తాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మానసిక శక్తి తో బాహ్య పరిస్థితులలో మార్పు తేవడం ఖచ్చితం గా సాధ్యంఅవుతుంది అన్న విషయాన్ని చెప్పటం కోసం ఇదంతా చెప్ప వలసి వచ్చింది.

తాయిచి విద్యలో అంతర్గత ప్రాణశక్తిని ప్రత్యేకమైన విధానాలతో సక్రమమైన స్థితిలో ఉంచటం జరుగుతుంది. కనుకతాయిచి మాస్టర్లు ఉన్న ఇల్లు సుభిక్షం గా ఉంటుంది. తాయిచి సిద్ధాంతాలు మరియు చైనీస్ వాస్తు అయిన ఫెంగ్శూయి సిద్ధాంతాలు ఒకటే. ఫెంగ్ శూయి వల్ల దిద్దబడిన ఇల్లు ఎలా చక్కని తరంగాలతో ఉండి సుభిక్షంగా ఉంటుందో, అలాగే తాయిచి అంతర్గత ధ్యాన విధానాల వల్ల దిద్దబడిన పంచ ప్రాణాలు కల శరీరం కూడా ప్రకృతితో సమ స్థితిలోఉంటుంది. అట్టి వ్యక్తి ఉన్న ప్రదేశం కూడా చక్కని సమ స్థితిలో ఉంటుంది. తాయిచి అనే వీర విద్య ప్రాచీన తావోయిష్టుఆచరణలపైన ఆధారపడినట్టి విద్య.
తావోయిస్టు సిద్ధాంతాలు మన యోగ సాంప్రదాయానికి ముఖ్యంగా కుండలినీ యోగానికి చాలా దగ్గరివి. దాదాపు ఒకటే అని చెప్పవచ్చు.

మన మానసిక, ప్రాణిక స్థితిని బట్టి మన చుట్టూ వాతావరణం ఉంటుంది అనే రహస్యం ప్రాచీనులకు తెలుసు. అందుకేమహాభారతంలో పాండవులు ఎక్కడ ఉంటే అక్కడ సుభిక్షం గా ఉంటుంది, కనుక ఏ రాజ్యంలో నైతే కరువు కాటకాలులేక సుభిక్షం గా ఉందొ అదే రాజ్యంలో వారు దాగి ఉన్నట్లు అని వారి అజ్ఞాత వాసంలో వారిని పట్టుకోవాలనే పథకంరచిస్తారు దుర్యోధనాదులు. అలాగే కరువుతో ఉన్న రాజ్యంలోకి రుష్య శృంగ ఋషి వస్తే మళ్ళీ వర్షాలు పడుతాయి అనిఆ ఋషిని తన రాజ్యానికి ఎలాగైనా రప్పిస్తాడు లోమపాద మహారాజు.

ఇరవయ్యో శతాబ్దం మొదట్లో చైనాలో మిషనరీ గా పని చేసిన రిచర్డ్ విల్హెల్మ్ తాను చూచిన ఒక సంఘటనను ప్రఖ్యాతమానసిక శాస్త్రవేత్త కార్ల్ జంగు కు చెప్పాడు. చైనాలో అతనున్న ప్రాంతంలో వానలు పడక కరువు వచ్చింది. అప్పుడుప్రజలంతా ఎవరి మత ప్రార్థనలు వారు చేసారు. కాని వాన పడలేదు. అప్పుడు పక్క ప్రావిన్సులో ఉన్న వర్షాకర్షక శక్తికల ఒక వృద్దున్ని పిలిపిస్తారు. అతను
(rain maker) వచ్చి ఏమో చేస్తాడని అంతా ఎదురు చూచారు. కాని అతనువచ్చి ఏ ప్రక్రియా చెయ్యకుండా తన కిచ్చిన ఇంటిలో మూడు రోజులు బయటకు రాకుండా ప్రశాంతం గా మౌనంగాకూర్చొని ఉన్నాడు. మూడో రోజునించి కుంభ వృష్టి పడి అంతా జలమయం అయ్యింది.

అపుడు విల్ హెల్మ్ ఆ వృద్ధుని వద్దకు వెళ్లి ఆ రహస్యం ఏమిటో చెప్పమని అడుగుతాడు. దానికి ఆ వృద్ధుడు వానపడటానికి తానేమీ చెయ్యలేదు అని చెబుతాడు. మరి మూడు రోజులూ ఇంటిలో ఏమి చేసావు అని రిచర్డ్ అడిగాడు. దానికి వృద్ధుడు ప్రశాంతం గా చెప్పాడు. నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ ప్రాంతపు అసమత్వ స్పందనలు నాలో కూడాప్రవేశించాయి. నాలో ప్రాణ శక్తి చెదిరి పోయింది. అందుకే మూడు రోజులు సాధన చేసి మళ్ళీ నా అంతర్గత ప్రాణం యొక్కసమ స్థితిని స్థిరపరిచాను. తద్వారా బాహ్య ప్రకృతిలో కూడా సమత్వం వచ్చింది. అందుకే వెంటనే వర్షం పడింది. ఇదే నారహస్యం అని చెబుతాడు. ఆ వృద్ధుడు ఒక తాయిచి ప్రక్రియను వాడాడు. అతడు టావోయిష్టు మాస్టర్ కనుక ఆ పనిచెయ్య గలిగాడు.

అందుకే మన పూర్వులు అనేవారు. ధర్మాత్ములు ఉన్న చోట వర్షాలు క్రమం తప్పక పడుతాయి అని. ఎందుకంటేధర్మాన్ని అనుసరించి నడిచేవారి అంతఃకరణ, మనసు, పంచ ప్రాణాలు ఎక్కడ ఉండవలసినవి అక్కడ చక్కని స్థితిలోఉంటాయి. కనుక ప్రకృతి కూడా దానికి తగినట్లే స్పందిస్తుంది. అధర్మ పరులకు అన్నీ వైకల్యం చెంది ఉంటాయి; వారిఅంతః ప్రకృతి చెడిపోయి ఉంటుంది. కనుక బాహ్య ప్రకృతి కూడా చెడిపోతుంది. వారు లోపలా తమను తాము పాడుచేసుకుంటారు. బాహ్యం గానూ ప్రకృతిని పాడు చేస్తారు. కనుక ప్రకృతి కూడా దానికి తగినట్లే స్పందిస్తుంది. వర్షాలు లేకకరువు కాటకాలు వస్తాయి.

ప్రకృతికీ మనకూ అవినాభావ సంబంధం ఉన్నది. అది బయటకు కనిపించక పోవచ్చు. కాని అది ఉన్నది. మనంఉండవలసిన తీరులో
ఉంటే ప్రక్రుతి చక్కగా ఉంటుంది. మనం చేతులారా మన మనస్సులనూ, ప్రాణ స్థితినీ పాడుచేసుకుంటున్నాం. తద్వారా ప్రకృతినీ పంచ భూతాలనూ అపవిత్రం, కలుషితం చేస్తున్నాం. అందుకే ప్రక్రుతికూడా చెడిపోతున్నది. తద్వారా మనకు వినాశం కలుగుతున్నది.

సైన్సు ద్వారా మనకెంతో తెలుసని విర్ర వీగుతూ, ఇంద్రియ దాస్యం పెరిగిపోయి మన వినాశనం మనమే కొనితెచ్చుకుంటున్నాం. సుఖాలు ఎక్కువ అయ్యాయి. భోగాలు ఎక్కువయ్యాయి. కాని స్వాస్థ్యం తగ్గి పోయింది. మనిషిలోపల సమత్వం, స్థిరత్వం, స్వాస్థ్యం తగ్గి పోయాయి. కనుకనే రోగాలు ఎక్కువైతున్నాయి. ఈరోజు రోగం లేని మనిషిలేడు అంటే వింత కాదు. చిన్న పిల్లలు కూడా బీ పీ తో బాధ పడుతున్నారంటే మనం ఎంత పురోగామించామోతెలుస్తున్నది. ఇంకొక పక్క ప్రకృతీ కోపిస్తున్నది. పూర్వ కాలం ఇన్ని రోగాలు లేవు, ఇంత ప్రకృతి వైపరీత్యాలూ లేవు. ఇంత అధర్మమూ లేదు.

విదేశీ వెర్రి వేషాలు తలకేక్కించుకొని అదే ఏదో గొప్ప గా భావిస్తూ విర్ర వీగుతూ పతనం వైపు పరుగేడుతున్నాం. ఈరోజులలో రాత్రి పదకొండు గంటలలోపు భోజనాలు చేసే కుటుంబాలు తగ్గిపోయాయి. పొద్దున్న లేచింది మొదలు TV లేకపోతే తోచక పిచ్చేక్కే జీవులు ఎన్నో. ఒక్క రోజు TV చానెళ్ళు అన్నీ ఆపితే దేశం మొత్తం మీద పిచ్చాసుపత్రుల్లో చేరేవారు లక్షల్లో ఉంటారు. ఇక పోతే అనేక కుటుంబాలలో నిద్రకుపక్ర మించేసరికి రాత్రి పన్నెండు ఒంటిగంట అవుతున్నది. తాగుడు సర్వ సాధారణం అయ్యింది. తిరుగుడు సహజం అయ్యింది. ఎక్కడ చూచినా స్వార్థం తాండవిస్తున్నది. ఇదిమానవుని అంతర్గత పరిస్థితి.

ఇక బయట చూద్దామంటే, రసాయనిక ఎరువులతో, ప్లాస్టిక్ వంటి చెత్త తో భూమిని కలుషితం చేస్తున్నాం, ఫేక్టరీ వ్యర్థపదార్థాలను, సిటీ డ్రైనేజీలను జీవ నదులలోకి వదులుతూ ప్రాణ హితమైన జలాన్ని విష తుల్యం గా మారుస్తున్నాం. నీళ్ళను కొనుక్కుని తాగుతూ అదేదో గొప్పగా భావిస్తూ ప్లాస్టిక్ సీసాలను ప్రకృతిలోకి వదులుతున్నాం. వాహనాలకలుషిత పొగనూ, ఫేక్టరీల పొగలనూ గాలిలోకి ఒదులుతూ, చెట్లను నరికి పారేస్తూ గాలిని కలుషితం చేసుకుంటున్నాం. aఆలోచనా రహిత మైనింగ్ చేస్తూ భూమిని డొల్లగా మారుస్తున్నాం. కొండల్ని కూడా తవ్వి పారేశి కంకరను కూడావదలకుండా అమ్ముకుంటూన్నాం. పాపం ఇంత చేసినా ప్రకృతి కరుణించి అప్పుడప్పుడూ వర్షాలు కురిపిస్తూ కరువులేకుండా కాపాడుతున్నదంటే అది మన గొప్ప కాదు. ప్రకృతి దయ.

వర్షాలు పడటమే కాదు. ఇతర ప్రకృతి విలయాలు కరువు, అంటు వ్యాధులు, ప్రకృతి భీభత్సాలు వగైరాలు లేకుండాఉండాలంటే మనిషి అంతర్గత సమత్వ స్థితిలోకి రావాలి. అట్టి మనిషి ప్రకృతిని పాడు చెయ్యడు. ప్రకృతిని ఆరాధిస్తాడు. మనవాళ్ళు చెట్లను కొండలను నదులనూ ఆరాధించిన రహస్యం ఇదే. భగవంతుని శక్తి వాటిలో ఉంటూ మనజీవితాలను పోషిస్తున్నది. అందుకే అవి ఆరాధనీయాలు అయ్యాయి. అంతే గాని అవి రాళ్ళు, చెట్లు పుట్టలు అనిమనకు తెలియక కాదు.

మనలను పోషిస్తున్న ప్రకృతిని తల్లిగా పూజించిన సంస్కృతి మనది. ఆ ప్రాచీన మూలాలనుతిరిగి అర్థం చేసుకొని ఆచరణలోకి తెచ్చినపుడే మనకు కళ్యాణ కారకమౌతుంది . లేదా ఇదే పిచ్చి ధోరణిలో ముందుకుపోతూ, మనం కూచుని ఉన్న కొమ్మలను మనమే నరుక్కుంటుంటే ఒక నాటికి విలయం తప్పదు.