“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, మార్చి 2009, మంగళవారం

పంచ తత్వ సిద్ధాంతంతో జనన కాల సంస్కరణ


పంచ తత్వ సిద్ధాంత రీత్యా, ఒక ఉదాహరణతో జనన కాల సంస్కరణ చేద్దాం.

జనన తేది: 5-1-1990 శుక్ర వారం ఒక పిల్లవాని జననం జరిగింది.

సమయం: 13.05 hours

Long 77 E 23; Lat 15 N 18.

సూర్యోదయం: 6-51 hours

సూర్యాస్తమయం: 17-59 hours

ఈ వివరాలతో లెక్క మొదలు పెడదాం.

దినమానం: 668 min

తత్వారోహణ సమయం: 668/8 = 83 min 30 sec
ఆరోహణ అవరోహనకు పట్టే సమయం: 2 hours 47 min.

ఈ రోజు శుక్రవారం గనుక జలతత్వం ప్రారంభం.

జలతత్వం: 24/90 x83.5 = 22 min 18 sec
అగ్నితత్త్వం: 18/90x83.5 = 16 min 42 sec
వాయు తత్త్వం: 12/90x83.5 = 11 min 8 sec
ఆకాశ తత్త్వం: 6/90x83.5 = 5 min 36 sec
భూ తత్త్వం: ౩౦/90x83.5 = 27 min 48 sec

సూర్యోదయం నుంచి 2 hours 47 min కి ఒక వృత్తం చొప్పున రెండు ఆవృత్తములు తిరిగి 12-25 PM కి మరలా జలతత్త్వం ఉదయిస్తూ ఉంటుంది.

జలతత్వం: 12.25+22.18= 12.47.18+16.42 (agni)= 1.04+11.8(vaayu) = 1.15.8

కనుక వాయు తత్వములో జన్మ జరిగింది.

దీనిలో అంతర్ తత్వములు:
వాయు తత్త్వం= 11.13 min
వాయు అంతరం: 11.13/83.5x11.13 = 1 min 30 sec
ఆకాశ అంతరం: 11.13/83.5x5.6 = 0 min 44 sec
భూ అంతరం: 11.13/83.5x27.28= 3 min 37 sec

జన్మ సమయం 13.05 hours
13.04+1.30(vaayu antar)= 13.5.౩౦

వాయు అంతరం కనుక స్త్రీ జన్మ జరగాలి. కాని పురుష జన్మ కనుక తిరిగి ఆకాశ అంతరం 44 sec కలుపగా
13.05.30+0.44= 13.06.14 ఇది ఆకాశ అంతరం కనుక పురుష జన్మ తో సరి పోతుంది.

కనుక జనన సమయం ఒక నిముషం ముందుకు జరపాలి. సవరించిన జన్మ సమయం 13. 06 Hours అనితీసుకోవచ్చు. ఇది చాలా ఖచ్చితంగా రికార్డు చెయ్య బడిన సమయం. అయినప్పటికీ తత్వ రీత్యా ఒక నిముషం సవరణ అవసరమైంది. దీనిని ఇతర విదానములతో cross check చేస్తే నాడీ అంశను నిర్థారించ వచ్చు.