“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, నవంబర్ 2020, బుధవారం

మకరరాశిలో గురుశనుల గోచార ప్రభావం - ఫలితాలు

మొదట్లో ఈ పోస్ట్ వ్రాయాలని అనుకోలేదు. కానీ, చాలామంది మెయిల్స్ లో అడుగుతున్నందున వ్రాస్తున్నాను.

గురువు, శని ఇద్దరూ కలసి మకరరాశిలో ఏప్రిల్ 3 వ తేదీవరకూ ఉంటారు. అంటే దాదాపుగా నాలుగునెలలపాటన్న మాట. వీరి కలయిక చాలా ముఖ్యమైన గ్రహయోగం అవుతుంది. పూర్వకర్మను అనుభవింపజెయ్యడంలో వీరు సిద్ధహస్తులు. ఈ నాలుగునెలలలో చాలామంది జీవితాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. అవి ఈ క్రింది ఫలితాలుగా ఉంటాయి. గమనించండి.

---------------------------------------------

మేషరాశి

ఆఫీసు పనుల ఒత్తిడి బాగా పెరుగుతుంది. అత్తగారికి, తల్లికి, తండ్రికి లేదా గురువుకు ఆరోగ్యం చెడుతుంది. వారితో మాట తేడా వస్తుంది. ఇంట్లో మనశ్శాంతి కరువౌతుంది.

వృషభరాశి

తండ్రితో లేదా గురువుతో విరోధం వస్తుంది. వారు గతించవచ్చు కూడా. దూరప్రాంతాలకు పోవలసి వస్తుంది. ప్రయాణాలు ఎక్కువౌతాయి. సోదరులకు చెడుకాలం. మంచిమాట మాట్లాడినా చెడుగా మారుతుంది. గతకర్మ పక్వానికి వస్తుంది.

మిధునరాశి

దీర్ఘరోగాలు తిరగబెడతాయి. ఆస్తి కలసి వస్తుంది. రహస్యవిద్యలు నేర్చుకుంటారు. కొత్త జీవితం మొదలౌతుంది. ఉద్యోగంలో శ్రమ కలుగుతుంది.

కర్కాటకరాశి

జీవితభాగస్వామి ఆరోగ్యం చెడుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో నష్టం వస్తుంది. పార్ట్ నర్స్ తో గొడవలౌతాయి. దూరప్రాంతాలలో కష్టాలు పడవలసి వస్తుంది.

సింహరాశి

శత్రుబాధ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో చిక్కులు మొదలౌతాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది.

కన్యారాశి

మనశ్శాంతి కరువౌతుంది. సంతానం వల్ల దెబ్బతింటారు. షేర్ మార్కెట్ లో నష్టాలోస్తాయి. ఆరోగ్యం చెడుతుంది.

తులారాశి

ఇంట్లో పరిస్థితులు తారుమారౌతాయి. చదువులో వెనుకపడతారు. యాక్సిడెంట్ అవుతుంది. తల్లికి, లేదా మామగారికి ఆరోగ్యం చెడుతుంది. వారు గతించవచ్చు కూడా.

వృశ్చికరాశి

కాలం ఎదురుతిరుగుతుంది. కుట్రలు కుతంత్రాలు చేస్తారు. మాట మాట్లాడితే తప్పౌతుంది. ధైర్యం సన్నగిల్లుతుంది. ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. సోదరులకు కష్టకాలం.

ధనూరాశి

కంటిచూపు దెబ్బతింటుంది లేదా కళ్ళకు ఆపరేషన్ అవుతుంది. మాట పట్టింపులు బాగా ఎక్కువౌతాయి. అజీర్ణరోగం పట్టుకుంటుంది. డబ్బు ఇబ్బందులు పడతారు.

మకరరాశి

ఆరోగ్యం దెబ్బతింటుంది. జీవితభాగస్వామికి చెడుకాలం. మానసికచింత పెరుగుతుంది. ఊహించని సంఘటనలు జరుగుతాయి.

కుంభరాశి

చిన్నకారణాలకు కూడా డిప్రెషన్ లో పడతారు. ఆరోగ్యంలో తేడా వస్తుంది. ఇంట్రావర్ట్ గా మారతారు. ఆస్పత్రిని సందర్శిస్తారు. జైల్లో పడతారు. 

మీనరాశి

అన్నలకు అక్కలకు చేటుకాలం. డబ్బుకు ఇబ్బంది. మానసికచింత, సంతానచిం,  భయం పట్టుకుంటాయి. ఆరోగ్యం చెడుతుంది.

-------------------------------------

లగ్నంనుంచి చంద్రుని నుంచి కలిపి చూసుకోండి. ఫలితాలు ఎక్కువగా సరిపోతాయి.

దైవబలం పెంచుకోవడం, స్వార్ధం తగ్గించుకోవడం, నలుగురితో మంచిగా ఉండటం, మాటలతో చేతలతో ఎదుటివారిని బాధపెట్టకుండా ఉండటం, చేతనైనంతలో ఇతరులకు సాయం చేయడం రెమెడీలు. చేతనైతే పాటించండి.