నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

15, జనవరి 2020, బుధవారం

మా క్రొత్తపుస్తకం 'మహా స్మృతిప్రస్థాన సూత్రము' ఈరోజు విడుదలైంది




'పంచవటిలో మేము నడిచే సాధనామార్గానికి బుద్ధభగవానుని మార్గం చాలావరకూ దగ్గరగా ఉంటుంది. నా చిన్నతనం నుంచీ  బుద్ధభగవానుని నేనారాధిస్తున్నాను. నిజమైన ఆధ్యాత్మికతకు మూలసాధనలు ఆయన బోధనలలో దాగి ఉన్నవని నా అంతరిక ప్రయాణంలో నాకర్ధమైంది. 'అనాత్మవాదంతప్ప శంకరాద్వైతానికీ బౌద్దానికీ ఏమీ భేదం లేదనీ నాకు తెలుసు. అలాగేపతంజలి మహర్షి వ్రాసిన 'యోగసూత్రాలుకూడా చాలావరకూ బుద్ధుని బోధనలకు కాపీనే అన్న విషయంరెంటినీ క్షుణ్ణంగా చదివిన తర్వాత నాకర్ధమైంది. చాలా ఉపనిషత్తులు కూడా బుద్ధుని బోధనలను కాపీ కొట్టాయి. చివరకు పరాయిమతం వాడైన జీసస్ క్రీస్తు కూడా అనేక బుద్ధుని బోధనలను స్వీకరించి అనుసరించాడు. పతంజలిమహర్షి కంటే, క్రీస్తు కంటే బుద్ధుడు కనీసం 500 ఏళ్ళు ప్రాచీనుడు. శంకరులకంటే ఇంకా ప్రాచీనుడు. ఈ విధంగా బుద్ధుని బోధనలను ఎవరిష్టం వచ్చినట్లు వారు వాడుకుని చివరకు ఆయన్ను దేశం నుంచి బయటకు నెట్టేశారు.

ఎన్నో దేశాలు ఆయన్ను అమితంగా గౌరవిస్తూ పూజిస్తూ ఉంటే, మనం మాత్రం ఆయన్ను కనీసం తలుచుకోవడం లేదు. ఇదీ బుద్ధునికి మనం ఇస్తున్న గౌరవం ! దశావతారాలలో బుద్ధుడు కూడా ఒకడని మనం నిజంగా నమ్ముతుంటే, మిగతా అవతారాలకున్నట్లుగా ఆయనకు దేవాలయాలు ఎందుకు లేవు? ఆయన్ని మనం ఎందుకు పూజించడం లేదు? దశావతారాలలో కూడా రాముడిని కృష్ణుడిని మాత్రమే మనం పూజిస్తాం. మిగతావారికి అంత పాపులారిటీ ఎందుకు లేదు? హిందూమతంలో ఏమిటీ హిపోక్రసీ?

అందుకనేసాంప్రదాయ హిందువులకు మా విధానం నచ్చినా నచ్చకపోయినామా 'పంచవటి పబ్లికేషన్స్నుండి ఆయన బోధనలను వరుసగా ప్రచురిస్తూ వస్తున్నాము. ఎందుకంటే, 'నీకు మనుషులు ముఖ్యమామతాలు ముఖ్యమాలేక సత్యం ముఖ్యమా?' అంటేనా ఓటు సత్యానికే పడుతుంది కాబట్టి.

ఈ క్రమంలో భాగంగాసూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్న ఈ సంక్రాంతిపండుగ రోజున బుద్ధభగవానుని మూలబోధనలలో అతి ముఖ్యమైనదైన 'మహాస్మృతిప్రస్థాన సూత్రమును ఈరోజు 'ఈ - బుక్గా విడుదల చేస్తున్నాము. అతిత్వరలో దీని ప్రింట్ పుస్తకం కూడా విడుదలౌతుంది. దానితోబాటే ఇంగ్లీష్ 'ఈ- బుక్' మరియు ప్రింట్ పుస్తకాలు విడుదలవుతాయి.

బుద్ధుని ధ్యానమార్గమైన 'విపశ్యాన ధ్యానమునకు ఇది ఒక గైడ్ బుక్ వంటిది. ఈ పుస్తకాన్ని శ్రద్ధగా చదివి అర్ధం చేసుకుంటేబుద్ధుని ధ్యానమార్గం చక్కగా అర్ధమౌతుంది. ఆయన చేసిన సాధన ఏమిటోఆయన నడచిన దారి ఏమిటోదానిలో మనం కూడా ఎలా నడవవచ్చో స్పష్టంగా అర్ధమౌతుంది.

మా ఇతర ప్రచురణల వలెనేఈ పుస్తకం కూడా మీ ఆదరణను పొందుతుందనిమీకు ఆధ్యాత్మికంగా గొప్ప మార్గదర్శి అవుతుందన్న విశ్వాసం మాకుంది.